breaking news
Vizianagaram District Latest News
-
భీమసింగి సుగర్స్ పరిరక్షణకు ఉద్యమం
● జీఓ 250 రద్దు చేయాలని పరిరక్షణ కమిటీ డిమాండ్ ● ఫ్యాక్టరీ ఆస్తుల పరిరక్షణకు న్యాయపోరాటానికి సిద్ధం గజపతినగరం రూరల్ (జామి): జామి మండలంలోని భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిరక్షణకు పోరాటాన్ని ఉధృతం చేయాలని ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. ఫ్యాక్టరీ లిక్విడేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 250ను తక్షణమే రద్దు చేసి, కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తులను సహకార రంగంలోనే పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. జామి మండల కేంద్రంలోని సీతారామ కల్యాణ మండపంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరును కమిటీ సభ్యులు తప్పుబట్టారు. కార్మికుల బకాయిల చెల్లింపును స్వాగతిస్తూనే, ఫ్యాక్టరీ ఆస్తుల విక్రయానికి దారితీసే చర్యలను వ్యతిరేకించారు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఫ్యాక్టరీని ఆధునీకరించి, సహకార రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రవికుమార్ మాట్లాడుతూ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా లిక్విడేషన్ చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. దీనివల్ల రైతులు, షేర్హోల్డర్లు, కార్మికులు నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. జీఓ 250ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు గులిపిల్లి జయపాల్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ లిక్విడేషన్ చర్యలను అడ్డుకునేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేపడతామని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ ఆస్తులు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. తాత్కాలిక పోరాట కమిటీ ఏర్పాటు... భీమసింగి సుగర్స్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం తాత్కాలిక పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా పాండ్రంకి సంజీవి, కో–కన్వీనర్లుగా బి.రాంబాబు, లగుడు దేవుడు, కోశాధికారిగా రాయవరపు సత్యం, సలహాదారుగా గులిపిల్లి జయపాల్‌ను ఎన్నుకున్నారు. అనంతరం పోరాట కమిటీ సభ్యులు శాసనమండలి విపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను కలిసి ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు కోరారు. ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కమిటీ చేపట్టే పోరాటానికి అవసరమైన సహకారం అందిస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మామిడి రైతుల సంఘం జిల్లా నాయకుడు లగుడు దేవుడు, మాజీ వైస్ ఎంపీపీ గేదెల వెంకట్రావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి, రైతు సంఘం గంట్యాడ మండలాధ్యక్షుడు కోడెల శ్రీను, వి.మల్లయ్య, విసినిగిరి మాజీ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛమున్సిపాలిటీగా రాజాం
రాజాం సిటీ: స్వచ్ఛత మున్సిపాలిటీల కేటగిరీలో రాజాం మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ ఎ.రామచంద్రారావు బుధవారం తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో 50వేల లోపు జనాభా కలిగిన మున్సిపాల్టీల విభాగంలో స్వచ్ఛమున్సిపాల్టీగా ప్రథమ స్థానం దక్కిందన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘనవ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం, మరుగుదొడ్లు నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం వంటి పనులకు అవార్డు వచ్చిందన్నారు. ఇది ఉద్యోగులు, ప్రజల సమష్టికృషికి వచ్చిన అవార్డుగా పేర్కొన్నారు. రబీ సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయండి విజయనగరం ఫోర్ట్: రబీలో 91,021 హెక్టార్లలో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో సాగుకాని భూముల్లో పంటల సాగుతో పాటు రబీలో అధిక విస్తీర్ణంలో పంటల సాగయ్యేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ నెల 29నాటికి ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,15,580 హెక్టార్లకు చేరిందన్నారు. వరి కోతల అనంతరం పొలాల్లో తేమ ఉన్నప్పుడే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులను చైతన్యపరచాలన్నారు. సోలార్ లక్ష్యాలు పూర్తి చేయాలి విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున మొత్తం 15 వేల సోలార్ విద్యుత్ యూనిట్ల స్థాపన లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఏపీఈపీడీసీఎల్ అధికారులు, కాంట్రాక్టర్లకు బుధవారం సూచించారు. ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు మొదటి విడతలో 15వేల అగ్రిమెంట్లకు గాను 8,089 యూనిట్లు అమర్చినట్టు ఎస్ఈ లక్ష్మణరావు తెలిపారు. ● జిల్లాలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు మరియు ప్రోత్సాహక కమిటీ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో అందిన 43 దరఖాస్తుల్లో 27 ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌తో ఆరోగ్యం చిత్తు -
కేజీబీవీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి డిమాండ్
విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లు, బోధనేతర సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కేజీబీవీ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. విజయనగరం జిల్లా కేంద్రానికి బుధవారం వచ్చిన కేజీబీవీ రాష్ట్ర సెక్రటరీ దేవానంద్రెడ్డికి ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి, రాష్ట్ర కార్యదర్శి కె.రమాదేవి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 352 కేజీబీవీల్లో 5,700 మంది బోధనా సిబ్బంది 2005 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ అమలుచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి, ఇతర ప్రభుత్వ పాఠశాలల సిబ్బందితో సమానంగా సేవాప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. -
నిరుద్యోగులకు తీరని అన్యాయం
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో జిల్లాల విభజన నేపథ్యంలో నూతన జోన్లు, జిల్లాల పేరుతో 90 శాతం నుంచి 95 శాతం వరకు స్థానిక రిజర్వేషన్లు విధించడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుబడిన ప్రాంతాల అభ్యర్థులు, నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ చూపే అవకాశాలు కోల్పోతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీజీఈఏ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కంటోన్మెంట్‌లోని యూత్ హాస్టల్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన నేపథ్యంలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, వాటి అమలును ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొచ్చిన ఆర్టికల్ 371(డి) పరిధిని మించి, ప్రస్తుత పరిస్థితులకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో సర్వీసులో చేరి ఇప్పటికే సీనియారిటీ, పదోన్నతులు పొందిన ఉద్యోగులపై ఈ నూతన నిబంధనలను వెనుకటి తేదీల నుంచి (రెట్రాస్పెక్టివ్‌గా) అమలు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయ సమీక్ష కోరనున్నట్లు వెల్లడించారు. సమాజంలో, ఉద్యోగుల్లో విస్తృత చైతన్యం తెచ్చేందుకు దసరా శరన్నవరాత్రుల ప్రారంభ రోజైన అక్టోబర్ 12 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేధావులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలతో కలిసి జాగో ఆంధ్ర పేరిట చర్చా వేదికలు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కూనపురెడ్డి శ్రీనివాస్, యుగంధర్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్రరావు, జిల్లా శాఖ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విభజన ప్రాతిపదిక రిజర్వేషన్లతో నష్టం రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తాం ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ వెల్లడి -
రెవెన్యూ లీలలు
గుర్ల: ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 22 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుల పేరున ఆన్‌లైన్‌చేసి.. వన్‌బీ జారీ చేసిన ఘటన గుర్ల మండలం పాలవలసలో కలకలం రేపుతోంది. గ్రామస్తుల్లో వివాదానికి దారి తీసింది. రెవెన్యూ అధికారుల పని తీరును ఆక్షేపిస్తోంది. పాలవలసకు చెందిన టీడీపీ నాయకుడు గేదేల అప్పలనాయుడు తల్లి గేదేల సరస్వతి పేరున సుమారుగా 22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్లైన్ చేశారు. కొంతమంది రైతులకు చెందిన రెండు ఎకరాల భూమిని కూడా ఆన్లైన్ చేసినట్లు పాలవలస రైతులు చెబుతున్నారు. సాధారణ రైతులు అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తమ పేరిట భూములు ఆన్లైన్ చేసేందుకు వెనుకంజవేసే రెవెన్యూ అధికారులు... అధికార పార్టీకి చెందిన కుటుంబ సభ్యుల పేరున ప్రభుత్వ భూమిని నమోదుచేయడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమిని ఎలా ఆన్లైన్ చేస్తారని స్థానిక టీడీపీ నాయకులే రెవెన్యూ అధికారులను నిలదీయడంతో పాటు ఎమ్మెల్యే కళా వెంకటరావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీని వెనుక అధికార పార్టీకి చెందిన బడానేత హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడికి సెంటు భూమి లేకపోయినా ఆయన భార్య పేరిట 1.80 ఎకరాల భూమిని ఆన్లైన్ చేశారు. దీనికి సంబంధించిన వన్‌బీ ఆధారంగా ఆ నాయకుడు బ్యాంకులో పంట రుణం తీసుకున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గుర్ల తహసీల్దార్ ఆదిలక్ష్మి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పాలవలసలో ప్రభుత్వ భూమి ఆ గ్రామ నోషనల్ ఖాతాలో ఉన్నప్పటికీ వ్యక్తి పేరిట వచ్చింది. టెక్నికల్ టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుల పేరున ప్రభుత్వ భూమి 22 ఎకరాల ప్రభుత్వ భూమిటీడీపీ నేత పేరున ఆన్లైన్ రెవెన్యూ అధికారుల తీరుపై పాలవలస రైతుల ఆగ్రహం సమస్య వల్ల ఇలా జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. -
పోలీస్ జులుంపై న్యాయవాదుల ఆగ్రహం
● విజయనగరంలో విధుల బహిష్కరణ ● జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద ఆందోళన విజయనగరం లీగల్: విజయవాడలో న్యాయవాదులపై పోలీసుల దాడి ఘటనకు నిరసనగా విజయనగరంలో న్యాయవాదులు తమ విధులను బుధవారం బహిష్కరించారు. కోర్టు ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. పోలీసుల చర్యలను ఖండించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న న్యాయవాదులపై పోలీసులు కర్కశంగా లాఠీలు ఝుళిపించడంపై నిరసన తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దాడికి నిరసనగా బుధవారం, గురువారం తమ విధులు బహిష్కరించాలని ఏకగ్రీవం తీర్మానం చేసినట్లు తెలిపారు. నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ పాల్గొని ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ ఉపాధ్యక్షుడు పి.బ్రాహ్మజీ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
సేవచేసేవారికే సున్నం
కరోనా వంటి కష్టకాలంలో ప్రజలకు విశేషసేవలందించాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేశాం. కేవలం నెలకు రూ.5వేలకు పనిచేసిన వారిని తొలగించి ఇప్పుడు సోషల్ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ప్రభుత్వ పనితీరును ప్రచారం చేసుకునేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదు. మంచి పనులు చేస్తే ప్రచారం ఎందుకు చేసుకోవాలి. – గవిడి భీమేశ్వరరావు, మాజీ వలంటీర్, పోరలి, దత్తిరాజేరు మండలం అంతా మోసమే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చ లేదు. ఆడబిడ్డనిధి ఇస్తా మని చెప్పి పైసా కూడా ఇవ్వలేదు. గతంలో వలంటీర్లుగా పనిచేసి నెలకు రూ.5 వేలు లబ్ధిపొందేవారం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచేసింది. ఇప్పుడేమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రజాధనం చెల్లించేందుకు సిద్ధపడింది. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు. – తాడ్డి సునీత, లక్ష్మీపురం, రాజాం మండలం -
కొత్త పింఛన్లు మంజూరు కాలేదు..
జిల్లాలో అన్ని కేటగిరీల పింఛన్లకు సంబంధించి 52,090 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5 వేలు వరకు అర్హతలేని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అక్టోబర్ నెలకు సంబంధించి కొత్తగా ఎవరికీ పింఛన్లు మంజూరు కాలేదు. – శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్డీఏహామీలు ఇవ్వడం.. జనాన్ని నమ్మించడం.. అవసరం తీరాక మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన అర్హులందరికీ పింఛన్లు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ఓట్లు దండుకున్నాక రెండున్నరేళ్లుగా మొఖం చాటేశారు. 60 ఏళ్ల వయస్సు పైబడిన వారికి సైతం పింఛన్లు మంజూరు చేయలేదు. స్థానిక ఎన్నికల వేళ... మళ్లీ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రచారం చేశారు. అక్టోబర్ నెల నుంచి పింఛన్లు ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. తీరా... తూచ్ అనడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
జిల్లా స్థాయి రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
బొండపల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి రగ్బీ క్రీడాకారుల ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా 350 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు నిర్వాహకుడు, స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు గెద్ద గురునాయుడు తెలిపారు. అండర్ 14,17,19 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలలు నుంచి భారీగా బాలబాలికలు హాజరయ్యారని పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం ఉమామహేశ్వర్రావు, నిర్వాహకులు వడ్డాది శ్రీనివాసరావు, రాంజీ, శేఖర్, సతీష్, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపువీరఘట్టం/పాలకొండరూరల్/పాలకొండ: వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామానికి చెందిన పాలకొండ సుబ్చారావు కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సుబ్బారావు మంగళవారం రాత్రి పడవ నుంచి పడి నదిలో కొట్టుకుపోయిన విషయం విదితమే.. దీనిపై సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడి నదిలో గాలింపు చేపట్టారు. మంగళాపురం గ్రామం వద్ద బుధవారం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న అన్ని వనరులు వినియోగించి గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టాలని పేర్కొన్నారు. ఆయనతో పాటు పాలకొండ, వీరఘట్టం మండల రెవెన్యూ అధికారులు ఉన్నారు. మోసం చేసిన పోస్ట్ మాస్టర్ అరెస్టుశృంగవరపుకోట: డిపాజిట్‌దారులను మోసం చేసి సొమ్ము కాజేసిన పోస్టుమాస్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి చెప్పారు. ఈ మేరకు పట్టణానికి చెందిన బొమ్మిరెడ్డి పల్లి ప్రసాద్ ఎస్.కోట మండలం, టి.బొడ్డవర బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కొంత మంది ఖాతాదారుల నుంచి మంత్లీ డిపాజిట్స్ కింద అమౌంట్ సేకరించారు. వారికి నకిలీ ఖాతా పుస్తకాలు ఇచ్చి విడతల వారీగా వారి దగ్గర అమౌంట్ సేకరించి, ఆ నగదును వారి పోస్టల్ ఖాతాలో జమ చేయకుండా, తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుని సొమ్ము స్వాహా చేశాడు. తాము మోసపోయినట్లు గ్రహించిన ఖాతాదారులు ఎస్.కోట పోస్టల్ ఇన్స్పెక్టర్కు, ఎస్.కోట పోలీస్‌స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. వివాహిత ఆత్మహత్యనెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలో గల జూట్ మిల్లులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఎస్సై జి.గోపాలరావు అందించిన వివరాల ప్రకారం..స్థానిక గాంధీనగర్ కాలనీకి చెందిన నడిపిల్లి గీత (42) మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లో ఉరివేసుకోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గీత సుమారు 20 ఏళ్లుగా జూట్ మిల్లులో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త శంకర్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె (8వ తరగతి), ఒక కుమారుడు (4వ తరగతి) ఉన్నారు. తల్లి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్సై గోపాలరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
రక్తదానం అలవాటు..
ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అలవాటుగా మారింది. ఇప్పటి వరకు శిబిరాల ద్వారా, స్వచ్చందంగా 60 సార్లు రక్తదానం చేశాను. ఆపదలో ఉన్నవారికి ఇలా ఉపయోగపడడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఎవరికై నా ఏ సమయంలో అవసరమైనా రక్తం ఇచ్చేందుకు నేను సిద్దం. శనపతి రాము, రక్తదాత, పొగిరి యువత అపోహలు వీడాలి..రక్త నిల్వలు పూర్తిగా తగ్గుముఖం పట్టకుండా ఉండాలంటే యువ త అపోహలువీడి స్వ చ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేయా లి. రక్తం అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో యువతకు అవగాహన కల్పించి శిబిరా లు నిర్వహిస్తున్నాం. రక్తదానం కుటుంబ సంప్రదాయంలా మారాలి.పెంకి చైతన్యకుమార్, రెడ్‌క్రాస్ సభ్యుడు, రాజాం. -
యువత ముందుకు రావాలి
రక్తదానం చేయడం వల్ల ఏదో అయిపోతుందనే అపోహలు వీడాలి. ఆరోగ్యవంతంగా ఉండి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. ప్రస్తుత తరుణంలో యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంత యువత అపోహలువీడి ఎక్కువగా రక్తదానానికి ముందుకు రావాలి. అప్పుడే రక్తం కొరతను నివారించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తం ఉత్పత్తి అయి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కొత్తా సాయిప్రశాంత్‌కుమార్, రెడ్‌క్రాస్ అధ్యక్షుడు, రాజాం -
ఫార్మా పరిశ్రమ ఉద్యోగి ఆకస్మిక మృతి
విశాఖ: జేఎన్ ఫార్మాసిటీలోని వసుధా ఫార్మా యూనిట్–3లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కలిశెట్టి రమేష్(36) బుధవారం మధ్యాహ్నం విధుల్లో ఉండగా ఆకస్మికంగా మృతి చెందాడు. పరవాడ సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలం గొలగాం గ్రామానికి చెందిన రమేష్ గాజువాకలో నివాసం ఉంటున్నాడు. బుధవారం బి షిఫ్ట్ విధులకు హాజరైన రమేష్ షిఫ్ట్ మారే సమయంలో తల తిరుగుతోందని చెప్పి కుప్పకూలాడు. వెంటనే పరిశ్రమలోని ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అగనంపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. రమేష్‌కు తీవ్రంగా చెమటలు పట్టడంతోపాటు వాంతులు కూడా వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారని సీఐ పేర్కొన్నారు. గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని వైద్యులు అనుమానించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రమేష్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. -
హక్కులు అడిగితే అక్రమ కేసులా?
మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన అమానుషం సెప్టెంబర్ 27న విజయవాడ ధర్నా చౌక్‌లో మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్లలోకి నెట్టారు. సచివాలయాల్లో అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారు. మీడియాలోనూ, ఇతరులు నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించడం దారుణం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సమయంలో ముందుండి సేవలదించిన తమ పట్ల ప్రభుత్వం, అధికారులు కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. – సీహెచ్.రమాదేవి, ఎస్జీఎస్డబ్ల్యూ ఐక్యవేదిక జిల్లా మహిళా ప్రతినిధిటీవీ5 సాంబశివరావు బహిరంగ క్షమాపణ చెప్పాలిటీవీ5 సాంబశివరావు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఏదో పొరపాటున నోరుజారానని విత్‌డ్రా అని ఊరుకుంటే సరిపోదని, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు ఆయన తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన నాయకులపై పెట్టిన సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలన్నారు. గతంలో విద్యా వలంటీర్లకు జీవో 69 ద్వారా, ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారని, సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడానికి నిబంధనలు లేవనడం సరికాదన్నారు. తాము కోరుతున్న ఏఏస్, నోషనల్ ఇంక్రిమెంట్ల వల్ల ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.2వేల లోపు మాత్రమే భారం పడుతుందని స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు కల్పించాలని, మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని కోరారు. – బి.శ ంకరరావు, ఎస్జీఎస్డబ్ల్యూ ఐక్యవేదిక జిల్లా ప్రతినిధి -
బ్లేడ్ బ్యాచ్ ముద్ర వేస్తారా?
ఎంతో కష్టపడి రాతపరీక్ష రాసి అర్హత సాధించిన ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేయడం దారుణం. టీవీ5 వంటి ప్రసార మాధ్యమాల్లో సచివాలయ ఉద్యోగులను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ నీచంగా కించపరచడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు ఉంటే ఆధారాలతో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్ప వ్యవస్థ మొత్తాన్ని నిందించవద్దు. గుండెపోటుతో మరణించిన సీఐ ఆలీ మృతిని ఉద్యోగులపై రుద్దడం బాధాకరం. ధర్నా చౌక్‌కు రాకుండానే స్టేషన్లలో అదుపులోకి తీసుకున్న 46 మందిపై పెట్టిన అక్రమ ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలి. బి.శ్రీనివాసరావు, ఎస్జీఎస్డబ్ల్యూ ఐక్యవేదిక జిల్లా ప్రతినిధి -
సర్కారు డప్పు
–8లోజనం డబ్బు హక్కులు అడిగితే అక్రమ కేసులా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ, కక్షసాధింపు వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చిన వలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. నెలకు రూ.5వేలుకు పనిచేస్తే దండగంటూ అభాండాలు మోపింది. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు వలంటీర్లకు నెలకు రూ.10వేలు ఇస్తామంటూ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను రద్దుచేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేసింది ఏమీ లేకపోయినా ప్రచారం చేసుకునేందుకు సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో టీడీపీ కార్యకర్తలకు రూ.లక్షలు ప్రజాధనం దోచిపెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. వెన్నుపోటు పాలనను ఎత్తిచూపుతున్నారు. – దత్తిరాజేరు/రాజాం -
చెరువులో పడి యువకుడి మృతి
కొత్తవలస: మండలంలోని పెదరావుపల్లి గ్రామం సమీపంలో గల కొత్తచెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పెంట గ్రామానికి చెందిన జామి వేణు (33) బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, సీఐ టీవీ విజయకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేణు తన స్నేహితులతో కలిసి వారి గ్రామం నుంచి కొత్తవలస మండలంలోని హోల్‌సేల్ ఐరన్ షాపువద్దకు సామగ్రి కొనేందుకు బుధవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పెదరావుపల్లి గ్రామం సమీపంలో గల కొత్తచెరువు వద్దకు వచ్చే సరికి బహిర్భూమికని బండి ఆపి వెళ్లాడు. మిగిలిన స్నేహితులు రోడ్డుపై వేచి ఉన్నారు. వేణు ఎంతకీ రాకపోవడంతో చెరువు వద్దకు వెళ్లి చూడగా చెప్పులు, బట్టలు ఒడ్డున పడి ఉండడం గమనించి చెరువులో పడిపోయాడని నిర్ధారణకు వచ్చారు. వెంటనే పెదరావుపల్లి, పెంట గ్రామస్తులకు తెలిపి చెరువులోకి దిగి వెతకడం ప్రారంభించారు. ఈ చెరువులో గ్రావెల్ తవ్వకాలు జరగడంతో లోతు అధికంగా ఉండి వేణు ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు వేణు మృతదేహం లభ్యమవడంతో కుటుంబసభ్యులు భోరున విలపించారు. మృతుడికి భార్య దేవి (26), పాప కనిష్క (7), బాబుజోశ్విక్(1) ఉన్నారు. వేణు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో భార్య దేవి రోదన అక్కడ ఉన్నవారిని కంటితడి పెట్టించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ టీవీ విజయకుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. మృతుడు విశాఖ జిల్లా వాసిగా గుర్తింపు -
జాతీయ తైక్వాండో పోటీలకు విజయనగరం క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్ జూనియర్, జూనియర్ కేటగిరీల్లో స్వర్ణ పతకాలు సాధించిన వీరు, జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 4 వరకు 40వ సబ్ జూనియర్, 43వ జూనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో విజయనగరం జిల్లా నుంచి సబ్ జూనియర్ విభాగంలో 11 మంది, జూనియర్ విభాగంలో ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటున్నారని జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్. వేణుగోపాలరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలోనూ క్రీడాకారులు తమ సత్తా చాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, చివరి వరకు క్రీడాస్ఫూర్తితో పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఎంపికై న క్రీడాకారులకు కోచ్‌లు సీహెచ్. యశస్విని, కిరణ్, రమేష్‌లతో పాటు పలువురు క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. -
మన్యం అభివృద్ధికి సమన్వయంతో ముందుకు
● అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందాలి ● దిశ సమావేశంలో ఎంపీ తనూజా రాణిపార్వతీపురం: గిరిజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ (జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశంలో ఎంపీ తనూజారాణి, కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి వివిధ శాఖల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మౌలిక వసతులు, ఉపాధి హామీ పనులు, తాగునీరు, రహదారుల నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశాలలో లక్ష్యాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. దిశ సమావేశం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించే వేదికగా ఉండాలని, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన మార్పులు, మెరుగైన సూచనలను అధికారుల సమక్షంలో చర్చించాలని సూచించారు. పార్లమెంట్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిని కూడా ఎంపీ సమీక్షించారు. రద్దయిన లేదా పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించిన నిధులను ఇతర అవసరమైన పనులకు కేటాయించే అవకాశాలను పరిశీలించి నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో అభివృద్ధి పనులను ఎక్కడా నిలిపివేయకుండా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 15 రోజులకోసారి పనుల పురోగతిపై సమీక్ష కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల, పైప్‌లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థల సమస్యలను ముందుగానే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు పనుల పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. ‘మా ఊరు మలేరియా రహితం’ కార్యక్రమంలో లార్వా నివారణ చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైతే ఏఐ సాంకేతికతను వినియోగించే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాలలో పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, కొత్తగా గుర్తించిన జలపాతాలు, హోమ్ స్టేల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాలతో పాటు వ్యవసాయం, పశుసంవర్థక, ఉపాధిహామీ, గృహనిర్మాణం, మహిళా సంక్షేమ పథకాల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ సొత్తుతో పట్టుబడిన తల్లీకూతుళ్లు
● నిందితుల అరెస్టు, బంగారం, వెండి స్వాధీనం లక్కవరపుకోట: చోరీ చేసిన సొత్తును కొత్తవలస మండల కేంద్రంలో గల ఒక బంగారం షాపులో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న తల్లీ కూతుళ్లను ఎల్.కోట ఎస్సై జె.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని భీమాళి గ్రామంలో ఈ నెల 19వ తేదీన నత్తల రవి ఇంట్లో దొంగలు చొరబడి బీరువాను పగలకొట్టి కొంత బంగారం, వెండి వస్తువులతో పాటు రూ.20వేలు నగదు దోచుకుపోయారు. ఈ మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి చాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.సీసీ ఫుటేజ్‌ల పరిశీలనతో పాటు అనుమానం ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేశారు. కాగా ఆదే గ్రామానికి చెందిన గొటివాడ లక్ష్మి (42) ఆమె కుమార్తె (17) (మైనర్) కలిసి కొత్తవలస జంక్షన్ సమీపంలో ఒక బంగారు షాపు వద్ద అనుమానంగా తిరుగుతుండగా పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 30.270 గ్రాముల బంగారం, 16.720 వెండి ఆభరణాలను గుర్తించారు. పోలీసులు తనదైన శైలిలో మరింతగా ప్రశ్నించగా భీమాళి గ్రామంలో దొంగతనం చేసింది తామేనని ఒప్పకున్నారు. దీంతో వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఆరెస్టు చేసి కొత్తవలస న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలిక జల్సాలకు అలవాటు పడడంతో ఖర్చులకు డబ్బులు లేక ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్సై చెప్పారు. -
సాఫ్ట్‌బాల్ జాతీయ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు జయకేతనం
బొబ్బిలి: 39వ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు జయకేతనం ఎగురవేసింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాష్ట్ర జట్టును ఎంపిక చేసి ఇక్కడి పారాది జెడ్పీ హైస్కూల్లో సాఫ్ట్‌బాల్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో కోచింగ్ ఇచ్చారు. ఇటవల మహారాష్ట్ర లోని శంభాజీ నగర్లో పోటీలకు రాష్ట్ర జట్టు వెళ్లింది. ఈ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు అలవోకగా ఫైనల్స్‌కు చేరి కేరళ జట్టుపై 4–3 రన్స్ తేడాతో గెలుపొందింది. ఎమ్మెల్యే బేబీ నాయన, సాఫ్ట్ బాల్ సంఘ కార్యవర్గం సుంకరి సాయిరమేష్, అల్లాడ భాస్కర రావులు క్యాంప్‌ను నిర్వహించారు. బుధవారం జరిగిన పోటీలో ఆంధ్రజట్టు గెలవడంతో అందరూ జట్టు సభ్యులకు, పీడీలకు అభినందనలు తెలిపారు. కాగా బాలుర జట్టు సెమీఫైనల్స్‌లో రాజస్థాన్ జట్టుపై ఓటమి చెంది నాలుగో స్థానంతో సరిపెట్టుకుందని పీడీ ఎన్.వెంకటనాయుడు విలేకరులకు తెలిపారు. సాఫ్ట్‌బాల్ రాష్ట్ర జట్లను ఎంపిక చేయడమే కాకుండా వారి కి మంచి తర్ఫీదునిచ్చినందుకు పీడీని, నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు. -
వ్యాధి ప్రాణాంతకం అని తెలిసినా..!
అవగాహన కల్పిస్తున్నాం హెచ్ఐవీపై కళాశాలలు, గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. హెచ్ఐవీ ఏ విధంగా సోకుతుంది, సోకకుండా ఏవిధమైన జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై తెలియజేస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించి జీవితాలను నాశనం చేసుకోకూడదు. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్, క్షయ, కుష్ఠు నివారణ అధికారివిజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడికి కొద్ది నెలల క్రితం వివాహమైంది. ఒంట్లో బాగాలేదని ఆస్పత్రికి వెళ్తే ఆ యువకుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పెళ్లయిన కొద్ది నెలలకే భర్తకు హెచ్ఐవీ సోకడంతో ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నెల్లిమర్లమండలానికి చెందిన 25 ఏళ్ల యువకుడి జ్వరం వస్తోందని ఆస్పత్రికి వెళ్తే నిర్వహించిన వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ యువకుడికి ఇంకా వివాహం కూడా కాలేదు. దీంతో ఆ యువకుడితో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ ఇద్దరు యువకులే కాదు అనేకమంది అలసత్వం కారణంగా.. కొంతమంది అవగాహన లేక హెచ్ఐవీ బారిన పడుతున్నారు. హెచ్ఐవీ బారిన పడితే జీవితం అంధకారం అవుతుందని తెలిసినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెడు సావాసాలు, సురక్షితం కాని లైంగిక అలవాట్లతో యువత ఎక్కువగా ఎయిడ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. నిర్లక్షరాస్యుల కంటే అక్షరాస్యులే వ్యాధిబారిన పడినవారిలో అధికశాతంమంది ఉంటున్నారు. 15 నుంచి 35 ఏళ్ల వయసు మధ్య వయసు గల వారు హెచ్ఐవీ బారిన పడిన వారిలో ఎక్కువగా ఉండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. హెచ్ఐవీ సోకిన వారిలో సహజంగానే వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. వ్యాధి బారిన పడిన వారు ఏఆర్టీ కేంద్రం నుంచి తీసుకున్న మందులు వాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకుంటే జీవితకాలం పెంచుకోవచ్చు. అయితే కొందరు మానసికంగా కుంగిపోయి ప్రాణాలు విడుస్తున్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐదు నెలల్లో 153 మందికి హెచ్ఐవీ వ్యాప్తి ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలవరకు జిల్లాలో 153 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. వారిలో 149 మంది సాధారణ వ్యక్తులు కాగా, నలుగురు గర్భిణులు ఉన్నారు. 2025 –26 లో 307 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. అదేవిధంగా 10 మంది గర్భిణులకు కూడా హెచ్ఐవీ సోకింది. ఏఆర్టీ కేంద్రంలో రిజిస్టర్ అయిన రోగులు 6857 మంది హెచ్ఐవీ సోకిన రోగులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఏఆర్టీ కేంద్రంలో నమోదు చేసుకుంటారు. అలా రిజిస్టర్ చేసుకున్న వారు జిల్లాలో 6857 మంది ఉన్నారు. వారిలో పురుషులు 2,989 మంది, మహిళలు 3862 మంది, ట్రాన్స్‌జెండర్స్ ఆరుగురు ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు 43 మంది ఉన్నారు. వారిలో పురుషులు 23 మంది, మహిళలు 20 మంది. 15 నుంచి 35 ఏళ్ల లోపు వారు 1125 మంది ఉన్నారు. వారిలో పురుషులు 507 మంది, మహిళలు 614 మంది, ట్రాన్స్‌జెండర్స్ నలుగురు ఉన్నారు. 35 ఏళ్లు, అపైన వయసుగలవారు 5689 మంది ఉన్నారు. వారిలో పురుషులు 2459 మంది, మహిళలు 3228 మంది, ట్రాన్స్‌జెండర్స్ ఇద్దరు ఉన్నారు. నిర్లక్ష్యం వీడని యువత హెచ్ఐవీ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువత జిల్లాలో 6857మంది రోగులు -
వరదలకు ఇసుక అక్రమ రీచ్‌లే కారణం
● ఎమ్మెల్యే కోండ్రు మురళీని నిలదీసిన రైతులు ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన రాజాం: రేగిడి మండలం ఖండ్యాం, సంతకవిటి మండలం జావాం గ్రామాల మధ్య నాగావళి నదిలో నిర్వహిస్తున్న ఇసుక అక్రమ రీచ్‌ల వల్లే తమ పంటపొలాలు వరద ముంపునకు గురయ్యాయని ఖండ్యాం గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈనెల 28న రేగిడి మండలం ఖండ్యాం వద్ద ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ను నిలదీసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంటలు ముంపునకు గురికావడం, ఖండ్యాం రోడ్డు కొట్టుకుపోవడానికి నదిలోని ఇసుక తరలింపునకు వేసిన రోడ్డే కారణమని రైతులు వాపోయారు. రీచ్‌లను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేయగా, ఎమ్మెల్యే అక్కడ నుంచి జారుకున్నారు. పంటల పరిశీలనకు ఏ ఒక్క అధికారి రాలేదని రైతులు ఆరోపించగా, అధికారులకు చెబుతానులే అంటూ అక్కడి నుంచి ఎమ్మెల్యే నిష్క్రమించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో సాగుతున్న ఇసుక అక్రమ రీచ్‌లపై స్థానికుల ఆగ్రహాన్ని బయటపెట్టింది. -
ఏఓబీ గ్రామాల్లో ఎకై ్సజ్‌శాఖ విస్తృత దాడులు
కురుపాం: ఆంధ్రాఒడిశా సరిహద్దు(ఏఓబీ) గ్రామాల్లో సారా తయారీ కేంద్రాల పై ఒడిశా పోలీసుల సహకారంతో సంయుక్త దాడులు నిర్వహించామని కురుపాం ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో గల సారా తయారీ స్థావరాలు కలిగిన దాబాగూడ గ్రామంలో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 3,200 లీటర్ల పులిసిన బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం.వి.గోపాలకృష్ణ, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వి.వి.ఎస్.శేఖర్ బాబు, కురుపాం ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ జె.రాజశేఖర్, సీతారగరం, రామన్నగూడ పోలీస్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. 3,200 లీటర్ల పులిసిన బెల్లం ఊట ధ్వంసం -
పరిహారం అందేనా?
విజయనగరం ఫోర్ట్: అందరికీ అన్నం పెట్టే రైతన్న ఏటా ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతిని నష్టపోతున్నాడు. ఆపద కాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. 2025 అక్టోబర్ నెలలో సంభవించిన మోంఽథా తుఫాన్ వల్ల జిల్లాలో వరి, మొక్కజొన్న, చెరకు, ఉలవ, పత్తి, శనగ, మినుము, తదితర 776.978 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. దీనికి పరిహారంగా రూ.1.93 కోట్ల ఇన్‌పుడ్ సబ్సిడీ రైతులకు చెల్లించాలని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. గత ఐదు రోజుల కిందట కురిసిన తుఫాన్ వర్షాలకు 189.83 హెక్టార్లలో అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అరటి 129.11 హెక్టార్లు, బొప్పాయి 57.72 హెక్టార్లు, కూరగాయలకు 3 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. సుమారు 5.69 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. బొబ్బిలి, చీపురుపల్లి, డెంకాడ, గంట్యాడ, గరివిడి, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, రామభద్రపురం, రేగిడి ఆమదాలవలస, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు నమోదుచేశారు. అధికారులు గుర్తించినా పరిహారం అందుతుందో లేదోనన్న బెంగ రైతులను వెంటాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోయింది. మరోవైపు ఆదుకోవాలంటూ వరి పంట నష్టపోయిన నదీ తీర గ్రామాల రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో పరిహారం అందజేయాలని కోరుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పథకం అమలుతో పాటు పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు సకాలంలో జమయ్యేదని, ఇప్పుడు రైతులను ఆదుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. పరిహారం విడుదల కాలేదు.. 2025 అక్టోబర్‌లో సంభవించిన మోంథా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.1.93 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఆ నిధులు విడుదల కాలేదు. – ఎం.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి రైతులను వెంటాడుతున్న విపత్తులు పట్టించుకోని చంద్రబాబు సర్కారు మోంథా తుఫాన్ నష్టపరిహారం రూ.1.93 కోట్లు విడుదలకాని వైనం ఇటీవల కురిసిన తుఫాన్ వర్షాలకు 189 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం రూ.5.69 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా ఆవేదనలో రైతాంగం -
మాకు నచ్చలేదు.. ఎన్నిక రద్దు చేయండి..
చీపురుపల్లి: చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ఎంపీ ఎన్నిక మంగళవారం సజావుగా జరిగిపోయింది. పాఠశాలలో 19 మంది డైరెక్టర్లను విద్యార్థులు తల్లిదండ్రులు స్వయంగా ఎన్నుకున్నారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో కూటమి పార్టీ మద్దతుదారులకు విద్యార్థులు తల్లిదండ్రులు నుంచి మద్దతు లభించకపోవడంతో మధ్యాహ్నం జరగాల్సిన ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. తాము అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఎలా గెలుస్తారనే అక్కసుతో ఎన్నికల అధికారులపై వేధింపులకు దిగారు. తల్లిదండ్రులకు అవగాహన లేదు.. మాకు నచ్చలేదు.. మీకు నచ్చినట్లు ఎన్నిక జరిపించారు.. అందుకనే ఎన్నిక జరగనట్టుగా చూపించి వాయిదా వేసేయండి అంటూ హెచ్ఎం ఉమామహేశ్వరిపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక జరిగిందని హెచ్ఎం వివరించినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కళావెంకటరావుతో ఫోన్ చేయించి ఒత్తిడి పెంచడంతో ఎస్ఎంసీ ఎన్నిక హైడ్రామా రాత్రి 8 గంటల వరకు నడిచింది. ఇదీ కారణం.. తల్లిదండ్రులు ఎన్నుకున్న 19 మంది డైరెక్టర్లలో 13 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులని, చైర్మన్, వైఎస్‌చైర్మన్ పదవులు ఆ పార్టీ మద్దతుదారులకే వెళ్తాయంటూ కూటమి నేతలు రాద్ధాంతానికి దిగారు. ఎన్నిక రద్దుచేయాలని ఒత్తిడి పెంచారు. నిబంధనల ప్రకారం జరిగిన ఎన్నిక ఎలా రద్దుచేస్తాంటూ వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన విభా గం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ అధికారులను నిలదీశారు. వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ కూడా పాఠశాలకు చేరుకుని చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక ఎందుకు నిర్వహించడంలేదంటూ హెచ్ఎంను ప్రశ్నించారు. 19 మంది డైరెక్టర్లను ఎన్నుకున్న నేపథ్యంలో వారి పేర్లుతో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో రాత్రి 8 గంటలు సమయంలో హెచ్ఎం ఉమామహేశ్వరి 19 డైరెక్టర్లు ఎన్నిక జరిగిందని లిఖిత పూర్వకంగా రాసి సభ్యులకు అందజేశారు. శాంతిభద్రతల నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్టు హెచ్ఎం ప్రకటించారు. ఎన్నికను రద్దు చేయాలంటూ పాఠశాల హెచ్ఎం చుట్టూ కూర్చుని ఒత్తిడి చేస్తున్న కూటమి నాయకులు -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
● రాష్ట్ర కంటింజెంట్ వర్కర్ల సంఘం అధ్యక్షుడు దుర్గారావు విజయనగరం ఫోర్ట్: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఆప్కాస్, పార్ట్ టైమ్, గెస్ట్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర కంటింజెంట్ వర్కర్ల సంఘం అధ్యక్షుడు పి.దుర్గారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆక్టోబర్ 2 న విశాఖపట్నంలో నిర్వహించే సత్యాగ్రహదీక్షకు సంబంధించిన పోస్టర్స్‌ను స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 కంటే ముందు చేరిన వారి అందరిని రెగ్యులర్ చేయాలని, 2014 తర్వాత జాయిన్ వారిని 3 లేదా 5 ఏళ్లు సర్వీస్ పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ చేసే విధానాన్ని ప్రకటించాలన్నారు. పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రమాదబీమా, ఆరోగ్య బీమా, కారుణ్య నియామకాలు వర్తింప జేయాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష తదితర పథకాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాయామంతోనే ఆరోగ్యంవిజయనగరం టౌన్: ఒత్తిడిలేని జీవితం, మితాహారం, శారీరక వ్యాయామంతోనే గుండెజబ్బులు దూరమవుతాయని, సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మంగళవారం కోట జంక్షన్ నుంచి తిరుమల మెడికవ ర్ ఆస్పత్రి వరకూ 2కె హ్యాకథాన్ నిర్వహించా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ముందుగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. దారిపొడవునా ర్యాలీలో పాల్గొన్న యు వతతో మమేకమై గంజాయి, మత్తుపదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరా రు. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబ స భ్యులు కూడా ఆనందంగా ఉంటారన్నారు. ఆ రోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయాయమంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, అటువంటి జీవనవిధానాన్ని ప్రతి ఒక్కరూ అలవా టుగా మార్చుకోవాలని యువతను ఎస్పీ కోరా రు. ర్యాలీలో తిరుమల మెడికవర్ ఎం.డి డాక్ట ర్ కె.తిరుమల ప్రసాద్, మాన్సాస్ కరస్పాండెంట్ కేవీఎల్పీ.రాజు, పలు ఆసుపత్రుల వైద్యులు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. -
90 శాతం పనులైన ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం అన్యాయం
● ఎనిమిదో రోజుకు చేరిన జంజావతి సాధన సమితి దీక్షలుపార్వతీపురం రూరల్: జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధన కోసం చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 22న ప్రారంభమైన ఈ దీక్షలకు మద్దతు పెరుగుతోంది. ఎనిమిదో రోజు దీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన రైతులు, మహిళలు, స్థానికులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ దీక్షా శిబిరానికి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రముఖ సామాజిక వేత్త యాళ్ల మల్లేష్ విచ్చేసి సంఘీభావం ప్రకటించారు. జంఝావతి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర మొత్తానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయకపోవడం మన్యం జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. ఇందులో భాగంగా ఏడో రోజున కలెక్టర్‌కు పీజీఆర్ఎస్ ద్వారా వినతిపత్రం అందజేశామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా ప్రజల భవిష్యత్తు, తాగు, సాగునీటి అవసరాలు జంఝావతి ప్రాజెక్టు పైనే ఆధారపడి ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. -
సీటీయూలో ఘనంగా హిందీ పక్షోత్సవాల ముగింపు
విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారు ఏపీ కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో హిందీ పక్షోత్సవాల ముగింపు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమర్ కంటక్ ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం డీన్ హిందీ విభాగం ఆచార్యులు రేణు సింగ్ మాట్లాడుతూ వైవిధ్యం దేశ సమృద్ధి సాంస్కృతిక వారసత్వానికి దేశభాష ప్రతీక అని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంభాషణ సాంస్కృతిక పరస్పర మార్పిడిని ప్రోత్సహించడంలో హిందీ భాష ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు హిందీ భాషతో పాటు హిందీ సాహిత్యాన్ని అధ్యయనం చేసి తన జ్ఞానం ఆలోచన పరిధిని విస్తరించుకోవాలని పిలుపునిచ్చారు. సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులు ప్రజలను అనుసంధానించే ముఖ్య వారధి అని అన్నారు విద్యార్థులు దేశంలోని అన్ని భాషలను గౌరవిస్తూ వాటి పరిరక్షణ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. భాషా నైపుణ్యంతో పాటు సాహిత్య సాంస్కృతిక అభిరుచులు పెంపొందించుకోవడం విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ రాజభాషగా హిందీని ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులు హిందీ సాహిత్యం సంస్కృతితో అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అనిరుద్ధ కుమార్ గ్రంథాలయ అధికారి కె.శంకర్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు ఆచార్యులు పరిశోధకులు విద్యార్థులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
సేవలందించాం... నిందలు మోశాం
గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు నిస్వార్థంగా వలంటీర్‌గా ప్రజలకు సేవలందించాం. కరోనా వంటి కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వ విధులు నిర్వహించాం. నిస్వార్ధ సేవకు చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ మకిరి అంటించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేవారిని నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. ఉపాధిని దూరం చేసింది. ఇప్పుడు ప్రజాసేవకు అర్ధం తెలియని ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు సిద్ధపడింది. సేవ కంటే ప్రచారానికే పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారు. – కర్రి సతీష్‌కుమార్, చింతాడ, బొబ్బిలి మండలం -
పారా స్విమ్మింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు 11 మంది ఎంపిక
విజయనగరం: పారా రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల కోసం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికలకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పారా స్విమ్మర్లు హాజరయ్యారు. ఒక్కో కేటగిరికి ఒక్కొక్కరే హాజరు కావడంతో 11 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. వారంతా అక్టోబర్ 5 న విజయవాడలోని సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8 వ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్–2026 లో పాల్గొంటారని తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారుడు కొత్తింటి పైడిరాము, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పి. కళ్యాణి, ప్రదీప్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎస్ఎంసీ ఎన్నిక వాయిదాపై తల్లిదండ్రుల ఆందోళన
● కోరం ఉంటే ఎన్నికల ఎలా వాయిదా వేస్తారంటూ నిలదీత ● పాఠశాల గేటువద్ద బైఠాయింపు రామభద్రపురం: మండలంలోని రొంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో కోరం ఉన్నా ఎంఈఓ ఎన్నిక వాయిదా వేయడంపై తల్లిదండ్రులు భగ్గుమన్నారు. ఇక్కడి పాఠశాలలో 57 మంది పిల్లలు చదువుతున్నారు. ఎస్ఎంసీ ఎన్నిక కోసం 57 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉదయం 12 గంటల వరకు 12 మంది డైరెక్టర్లకు ఏడుగురిని ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నారు. 8వ డైరెక్టర్ ఎన్నిక సమయంలో అధికార పార్టీ నాయకులు రాద్ధాంతం చేశారు. దీంతో హెచ్ఎం జేపీడీ రాజుతో సంప్రదించకుండానే ఎంఈఓ తిరుమలప్రసాద్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 30 మంది పైబడి ఉన్నా ఎన్నిక ఎలా వాయిదా వేస్తారంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎన్నిక నిర్వహించకపోతే పిల్లలకు టీసీలు ఇచ్చేయాలంటూ స్కూల్ గేటు ముందు బైఠాయించారు. ఎంఈవో ఓ టీడీపీ నాయుకుడిలా వ్యవహరిస్తూ ఎన్నిక వాయిదా వేశారని ఆరోపించారు. మాకు న్యాయం చేయకపోతే ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. విషయాన్ని హెచ్ఎం రాజు డీఈఓకు తెలియజేశారు. ఎంఈఓ తీరువల్ల ఇరుక్కుపోయానంటూ కన్నీరుపెట్టారు. -
రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్‌లో విజయనగరం సత్తా
విజయనగరం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 37వ ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్న్షిప్లో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలను సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. పతకాలు సాధించిన క్రీడాకారుల్లో కె. లలితాదిత్య 21 కేజీల విభాగంలో కాంస్య పతకం, ఎం.ఎసిక 33 కేజీల విభాగంలో వెండి పతకం, జి. కాత్యాయని– 35 కేజీల విభాగంలో కాంస్య పతకం, డి. మాధవ్–52 కేజీల విభాగంలో వెండిపతకం, కె.ఆదర్శ్–74 కేజీల విభాగంలో వెండి పతకం, హర్షిణి వర్మ – 30 కేజీల విభాగంలో వెండి పతకం దక్కించుకున్నారు. ఈ క్రీడాకారులకు కోచ్ కె. మోహిత్ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ చాంషియన్షిప్లో పతకాలు సాధించి విజయనగరం జిల్లాకు పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్ కౌశిక్ అభినందించారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పేరును రాష్ట్ర, జాతీయస్థాయిలో నిలబెట్టాలని ఆయన అభిలషించారు. -
ప్రచారానికి పారితోషికం
–8లోవ్యాధి ప్రాణాంతకం అని తెలిసినా..! విజయనగరం జిల్లాలో హెచ్ఐవీ చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలు గతంలో ప్రజలకు సేవలందించేందుకు నెలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 5 వేలు గౌరవవేతనం ఇస్తే ప్రజాధనం వృథాచేస్తున్నారని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఏడ్చారు. ఎన్నికల సమయంలో వలంటీర్లు అంటే మాకు శత్రువులు కాదు...మేం మిమ్మల్ని తీసేయం... నెలకు రూ.10వేలు చొప్పున జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్యాయంగా తీసేశారు. రూ. 5 వేల వేతనానికి పింఛన్ పంపిణీ దగ్గర నుంచి కోవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి, ఇంటింటికీ నిత్యవసర సరుకులను అందించాం. అలాంటిది మమ్మల్ని పక్కన పెట్టి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇస్తాం... మా గురించి ప్రచారం చేయండని ప్రభుత్వం జీఓలు తీసుకురావడం బాధాకరం. – బెండు లక్ష్మణరావు, బొద్దాం, రాజాం మండలం -
అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలి
● రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మంత్రి కొండపల్లి విజయనగరం టౌన్: ఎపీఎస్పీ విభాగంలో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్‌గా ఎంపికై , జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలల కఠోర శిక్షణ మీ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు. అన్నిరంగాల్లోనూ సుశిక్షితులైన పోలీసు కానిస్టేబుళ్లుగా విధులను నిర్వహించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. అసాంఘిక శక్తులతో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్పీ ఏఆర్.దామోదర్ మాట్లాడుతూ పరిపూర్ణమైన పోలీసులుగా రాష్ట్ర పోలీసుశాఖలో విధులు నిర్వహించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల పాత్ర తగ్గినప్పటికీ, పోలీసుశాఖకు సైబర్ నేరాల రూపంలో మరో సవాల్ ఎదురవుతోందన్నారు. కార్యక్రమంలో డీపీటీసీ ప్రిన్సిపాల్, ఎస్పీ అడ్మిన్ పి.సౌమ్యలత, ఐదో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి.మాధవ్‌రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘువర్మ, కావలి గ్రీష్మ, గాదె శ్రీనివాసులునాయుడు, 16వ బెటాలియన్ కమాండెంట్ అనిల్‌కుమార్ పులిపాటి, మైరెన్ ఎస్పీ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మీడియాకు నో ఎంట్రీ మీడియాకు ఇన్విటేషన్ ఇచ్చిన జిల్లా పోలీసుశాఖ తీరా పరేడ్ గ్రౌండ్లో ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ కూర్చుని కవరేజ్ చేయాలని ఆదేశించారు. చుట్టూ ఎస్ఐ స్ధాయి అధికారులతో పాటూ మహిళా పోలీసులను నిలువరించి కవరేజ్ చేయడానికి వీలుగా లేకుండా చేయడం పట్ల జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమాచార శాఖ అధికారులకు ఇదే పరిస్థితి ఎదురుకావడంతో వారు చేసేదిలేక వెనుదిరిగారు. -
సురక్షిత ఔషధాలపై అవగాహన అవసరం
నెల్లిమర్ల రూరల్: ప్రజలకు సురక్షితమైన ఔషధాలను అందించాల్సిన బాధ్యత వైద్యులు, ఫార్మసిస్టులపై ఉందని సెంచూరియన్ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి అన్నారు. ఈ మేరకు మండలంలోని టెక్కలి సెంచూరియన్‌లో ప్రపంచ ఫార్మసీ వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైద్యుల సూచన లేకుండా మందులను వినియోగించడం, మోతాదు కు మించి ఔషధాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బొబ్బిలి జోన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ లావణ్య కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టుల సాధికారిత అంశాన్ని ఈ ఏడాది వారోత్సవాల ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నామన్నారు. ప్రజలకు మందుల వినియోగంపై ఫార్మసిస్టులు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ చందన్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. సెంచూరియన్ వీసీ ప్రశాంత్ కుమార్ -
జిల్లాలో ముందుగానే సర్ పూర్తి
● ఎన్నికల జాబితా పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ ● అక్టోబర్ 9న ఓటర్ల తుది జాబితా విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నిర్ణీత గడువుకంటే ముందుగా పూర్తిచేయడంపై జిల్లా ఎన్నికల జాబితా పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టరేట్లో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మ్యాపింగ్ కాని 1,93,735 మందికి నోటీసులు ఇచ్చి, వారి వివరణ తీసుకున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. వీరిలో కేవలం 3012 మంది మాత్రమే వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించామని, మిగిలిన 1,90,724 మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చామన్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని స్పష్టంచేశారు. కొద్ది రోజుల్లోనే సుమారు 14వేల మంది యువ ఓటర్లను చేర్చడాన్ని గోపాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఎక్కువ ఓట్లు చేరిక, తొలగింపులు జరిగిన చోట కనీసం 20 పోలింగ్ కేంద్రాలను ఈఆర్ఓలు వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థి మృతిపై విచారణసాక్షి, పార్వతీపురం మన్యం: ఇటీవల అనసభద్ర ఏకలవ్య పాఠశాల విద్యార్థి సవర అర్పిత్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ కోసం గురుకులం (ఏపీటీబ్ల్యూఆర్ఈఐ సొసైటీ) జాయింట్ సెక్రటరీని నియమించినట్లు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. విద్యార్థి మృతి ఘటన నేపథ్యంలో ప్రిన్సిపాల్, వార్డెన్లను సస్పెండ్ చేసిన విషయం విదితమే. దీనివల్ల బాధిత కుటుంబానికి ఏ ఉపయోగమూ లేదని, రూ.20 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ఇదే విషయమై పీజీఆర్‌ఎస్‌లోనూ గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ తదితరులు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
గృహ సర్వే లోపాలు సరిదిద్దండి
విజయనగరం గంటస్తంభం: హౌస్‌హోల్డ్ సర్వే వివరాల నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, విద్యుత్, బస్సు సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ, సర్వే లాగిన్‌లో తప్పుగా నమోదు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులైన వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు, చార్జ్ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో 6,158 వ్యత్యాసాలు రాగా, ఇప్పటివరకు 2,193 మాత్రమే పరిష్కారయ్యాయని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీ లోగా మిగిలిన అన్ని సవరణలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించిన అనంతరమే అప్రూవల్ ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి -
సేవ చేసిన వారిని అవమానించి.. ప్రచారానికి కోట్లు
కోవిడ్ కష్ట కాలంలో సొంత కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ప్రాణాలకు తెగించి సేవ చేశాం. నాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మమ్మల్ని డేటా చోరులని, అప్పనంగా ప్రభుత్వ డబ్బు తింటున్నారని తీవ్రంగా అవమానించారు. మేము చేసింది ప్రజాసేవ. ఇప్పుడు ఎన్నికల వాగ్దానాలైన సూపర్ సిక్స్ అమలు చేయలేక, తమ వైఫల్యాలను దాచడానికి ఇన్ఫ్లూయెన్సర్లకు ప్రజాధనాన్ని పంచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. వలంటీర్ల కడుపు కొట్టిన ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతాం. – బుచ్చ శ్రీనివాస్, విజయనగరం -
ఆర్చరీ విజేతలకు సత్కారం
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడో రోజైన మంగళవారం 50 మీటర్ల కాంపౌండ్ విభాగంలో మహిళలు పురుషులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎన్సీఎస్ ట్రస్టీలు నారాయణ శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారి రవ్వ శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. రామనారాయణాన్ని సందర్శించిన సినీ టీవీ నటుడు బాలాజీ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణన్ని టీవీ సినీ నటుడు బాలాజీ మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ప్రతినిధులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
బల్లంకిలో గణపతి లడ్డూ రూ.1.55లక్షలు
వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామ న్యూ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూ వేలంపాటను సోమవారం రాత్రి నిర్వహించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బల్లంకి వరలక్ష్మికనకరాజు రూ.1,55,000కు లడ్డూను సొంతం చేసుకున్నారు. తెడ్డుకోసం నదిలో దూకిన వ్యక్తి గల్లంతు వీరఘట్టం: మండలంలోని పనసనందివాడ వద్ద నాగావళి నదిలో పడవ నడుపుతున్న పాలకొండ సుబ్బారావు (55) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. ఆయన ప్రతిరోజు పనసనందివాడ నుంచి రేగిడి మండలం కందిస గ్రామాలకు మధ్య నాగావళి నదిలో పడవ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కందిస గ్రామానికి పడవలో తీసుకెళ్లాలని ఓ ముగ్గురు వ్యక్తులు సుబ్బారావును కోరారు. వెంటనే సుబ్బారావు తన మిత్రడు నాగుడు సహాయంతో పడవను తీయగా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. దీంతో తెడ్డులతో నాగావళి నదిలో పడవను నడుపుతూ ప్రయాణికులను కందిస తీరానికి చేర్చాడు. ఇంతలో తన చేతిలో ఉన్న తెడ్డు నదిలో జారి పడి కొట్టుకు పోయింది. వెంటనే తెడ్డు కోసం సుబ్బారావు నదిలోకి దూకాడు. తెడ్డుతో పాటు సుబ్బారావు కూడా కనిపించకుండా పోయాడు. ఎస్సై షణ్ముఖరావు ఆర్ఐ వి.రవితేజ పనసనందివాడ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. -
రాష్ట్ర రెవెన్యూ సంఘం సహాధ్యక్షుడికి సన్మానం
పార్వతీపురం రూరల్: రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సహాధ్యక్షుడిగా ఎన్నికై న పార్వతీపురం మన్యం జిల్లా సంఘం అధ్యక్షుడు గొట్టాపు శ్రీరామమూర్తికి స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానం జరిగింది. మన్యం ప్రాంత ఉద్యోగుల గొంతుకకు రాష్ట్రస్థాయిలో సరైన ప్రాతినిధ్యం దక్కడం పట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సీహెచ్.కృష్ణమూర్తి, తనను ప్రతిపాదించిన జోన్న్–1 నాయకత్వం, సహకరించిన సీసీఎల్ఏ యూనిట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి శాయశక్తులా కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, పరిపాలనాధికారి పి.రమేష్ కుమార్, ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిషోర్, జిల్లా కోశాధికారి పీఎస్ఎల్ కుమార్, సహాధ్యక్షుడు సీహెచ్ రాధాకృష్ణమూర్తి, సెక్రటరీ రాజేష్, కలెక్టరేట్– డివిజన్ యూనిట్ అధ్యక్షుడు బాలమురళీకృష్ణ, చంద్రమౌళి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు, వివిధ మండలాల తహసీల్దార్లు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు మనోరాభాయ్, అప్పలరాజు, సత్యారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
స్వార్థపరులే పార్టీ మారుతున్నారు..
విజయనగరం: స్వార్థపరులే పార్టీ మారుతున్నారని, ఎక్కడ అధికారం, లాభం ఉంటే అటువైపు వెళ్లే ఒకరిద్దరి వల్ల పార్టీకి కలిగే నష్టం ఏమీ ఉండదని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీయేనని, ఇప్పుడు వలసలు వెళ్లిన వారు బాధపడే పరిస్థితి వస్తుందన్నారు. మొన్నటి వరకు దుర్మార్గుడన్న నాయకుడిని నేడు దేవుడిగా వాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి తన కుమార్తె పోటీ చేస్తుందని ఏనాడు ప్రకటించలేదని, అవకాశం వస్తే పోటీలో ఉంచుతానన్న మాటే చెప్పానన్నారు. కొందరు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమి లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించినా అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు చేశారన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ విషయం ప్రజలకు తెలుసని, ఇచ్చిన హమీలు అమలు చేయకుండా అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్న వారికి తగిన బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. -
హృదయం పదిలమని..!
జీవన శైలిలో మార్పులే కారణం గతంలో కంటే ప్రస్తుతం మానవుల జీవన శైలిలో మార్పుల వల్లే తక్కువ వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ధూమపానం కొకై న్, డ్రగ్స్, ఖైనీ, గుట్కా, వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయమం లేకపోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల గుండె పోటు వస్తుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉండాలి. – డాక్టర్ ఆదిత్య నుషేన్, కార్డియాలజిస్టువిజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన రమేష్ అనే 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుకు గురికావడంతో బంధువులు వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● ఎస్.కోట మండలానికి చెందిన కిశోర్ అనే 50 ఏళ్లవ్యక్తికి ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు గుండె జబ్బుల బారిన పడుతుండడం గమనార్హం. గతంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు గుండెపోటుకు గురయ్యేవారు. ప్రస్తుతం 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాస్ట్ఫుడ్స్, జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. లిపిడ్ ప్రొపెల్ వైద్య పరీక్షల్లో 35 శాతం మందికి ట్రెగిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇవి గుండెకు అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరిక వివాహం వంటి కారణాలతో పుట్టుకతో గుండె జబ్బులతో జన్మించే పిల్లలు ఇటీవల ఎక్కువయ్యారు. గుండెను చేతితో పట్టుకుని 35 ఏళ్ల లోపు వారే అధికంగా వస్తున్నారు. జిల్లాలో నెలకు 10 వేల మంది వరకు ఈసీజీలు, వెయ్యిమందికి పైగా 2డీఈకో పరీక్షలు, 100 మంది వరకు యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. గుండె నొప్పి లక్షణాలు గుండెపోటుకు గురైన సమయంలో ఛాతీలో నొప్పి విపరీతంగా ఉంటుంది. విపరీతమైన చెమటపడుతుంది. వాంతివచ్చే భావన ఉంటుంది. ఒక్కోసారివాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లు చేతులు చల్లబడతాయి. గుండె ఆగిఆగి కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఛాతీలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువు ఛాతీపై పెట్టినట్లు అనిపిస్తున్నా శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండెపోటు సూచనగా భావించాలి. ఛాతీలో నొప్పి వచ్చి అది ఎడమచేయి భుజంలోకి పాకుతున్నా, విపరీతంగా చెమటలు పడుతున్నా గుండె పోటుగా అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా అనుమానంతో వైద్యులను సంప్రదించడం మంచిది. గుండె పరిరక్షణ ఇలా పిల్లలను జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉంచాలి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కనీసం అరగంట పాటు వ్యాయమం చేయాలి. చికెన్ లెగ్స్, అధిక కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలి. గుండెను పరిరక్షించుకోవాలి నేడు ప్రపంచ గుండె దినోత్సవం అధికంగా గుండె జబ్బుల బారిన పడిన వారి సంఖ్య హైబీపీ, ఊబకాయం కారణమంటున్న వైద్యులు -
ప్రారంభమైన క్రీడా సందడి
● రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక విజయనగరం: విజయనగరం జిల్లాలో క్రీడా సందడి ప్రారంభమైంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలకు మొదటి రోజు సోమవారం మంచి స్పందన లభించింది. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం ప్రాతిపదికన నిర్వహించిన ఎంపిక పోటీలకు క్రీడాకారులు తరలివచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో అండర్–17,19 విభాగాల్లో బాల, బాలికలకు, అండర్ –14 విభాగంలో బాలురకు బాక్సింగ్ క్రీడాంశంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–17 బాల, బాలికల విభాగంలో డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిటీ క్లబ్ ప్రాంగంణంలో అండర్–14,17,19 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు లాన్‌టెన్నిస్ క్రీడాంశంలో ఎంపికలు చేపట్టారు. నగర శివారులోని విజ్జీ స్టేడియంలో అండర్–19 విభాగంలో బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఇక్కడ ప్రతిభ చూపినవారు రాష్ట్ర స్థాయి పోటీలకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు ఆర్.వాణిశ్రీ, బి.శ్రీనివాసరావు తెలిపారు. -
మడ్డువలస గేట్లు మూసివేత
వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం గేట్లు మూసివేశారు. ప్రాజెక్టు వద్ద 64.46 మీటర్ల నీటిమట్టం నమోదైంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 2,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని, అవుట్ ఫ్లో పూర్తిగా నిలిపివేసినట్టు డీఈ పి.అర్జున్ తెలిపారు. రేబీస్‌పై అవగాహన అవసరం ● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: కుక్కల నుంచి సంక్రమించే రేబీస్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కుక్క కరవడం వల్లనే కాదు, ప్రేమతో నాకినా చర్మంపై గీతలు, గాయాలు ఉంటే రేబీస్ సోకే ప్రమా దం ఉందన్నారు. వీధి, పెంపుడు కుక్కలకు యాంటీరేబీస్ వ్యాక్సినేషన్ వేయించడం తప్పనిసరన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎన్.సూర్యనారాయణ, డీఎన్‌ఎంఓ ఎ.అర్చనాదేవి, డీఎస్ఓ రఘువంశీ, ఎపిడిమాలజిస్ట్ లలిత, తదితరులు పాల్గొన్నారు. 30న యువజనోత్సవ పోటీలు ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: విజయనగరం మహారాజా అటానామస్ కళాశాలలో ఈ నెల 30న ఉద యం 9 గంటలకు సెట్విజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. జానపద నత్యం (గ్రూప్), జానపద గీతం (గ్రూప్), నుక్కడ్ నాటక్/వీధి నాటకం (గ్రూప్), కవితా రచన, పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటీలకు ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి 2027 జనవరి 12న జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని కలెక్టర్ వివరించారు. నేటి నుంచి పల్లె పండగ 3.0 విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగ 3.0 కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వివిధ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమన్వయసమావేశంలో సూచించారు. వచ్చేనెల 3న చెరకు రైతుల నిరసన ర్యాలీ రేగిడి: సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం పరిరక్షణ కోసం వచ్చేనెల 3న సంకిలి శివాల యం నుంచి వందలాది మంది రైతులతో ర్యాలీ నిర్వహిస్తామని ఏపీ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రేగిడిలో సోమవారం ఆవిష్కరించారు. ర్యాలీలో చెరకు రైతులందరూ పాల్గొనా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతులు కె.రవిశంకర్, ఎం.వేణుగోపాలనాయుడు, జి.సూరపునాయుడు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
● కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీ ఆర్.వైశాలి, ఎస్డీసీ ధర్మారావు, డీఆర్డీఏ పీడీ సీహెచ్ ప్రభావతితో కలిసి ప్రజల నుంచి 108 వినతులను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన అర్జీల్లో 25 రెవెన్యూకు సంబంధించినవి కాగా మిగిలిన 83 సాధారణ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గదువులోగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. చినబొండపల్లిలో శిథిలావస్థకు చేరిన ఆర్సీఎం చర్చి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎమ్మార్నగరంలో అనుమతులు లేకుండా జరుగుతున్న ఇంటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, అర్హులకు అంత్యోదయ రేషన్‌కార్డులు మంజూరు చేయాలని వినతులు సమర్పించారు. గరుగుబిల్లి మండలం చిలకాం రెవెన్యూ పరిధిలోని కారివలసలో పట్టావాని చెరువు భూముల ఆక్రమణకు గురవుతున్నాయని, ఆక్రమణలను తొలగించి చెరువును పునరుద్ధరించాలని గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. నిర్దేశిత గడువులోగా ఫిర్యాదుల పరిష్కారం: ఎస్పీ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. కుటుంబ, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు సంబంధించి ఈ కార్యక్రమంలో మొత్తం 8 ఫిర్యాదులు అందాయి. అర్జీదారుల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఎస్పీ అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ జరిపి, నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సైలు అశోక్ చక్రవర్తి, శిరీష, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 24 వినతులు సీతంపేట: ఐటీడీఏలో పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 24 వినతులు వచ్చాయి. చిన్నకింగ గ్రామానికి రైస్‌కార్డులు, విద్యుత్ సదుపాయం కల్పించాలని సవర పబిత్ర కోరారు. మణిగ గ్రామంలో కమ్యూనిటీ సోక్ పిట్ బిల్లులు మంజూరు చేయాలని కె.చంటి వినతి ఇచ్చారు. జన్నోడుగూడకు అంతర్గత సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. ఎగువముల్లెలగూడకు రచ్చబండ నిర్మించాలని సవర రాజేషు కోరారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, జీసీసీ డీఎం కృష్ణ, పీహెచ్‌వో ఎస్.వి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఆర్చరీ పోటీలు
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండో రోజు సోమవారం మహిళలు, పురుషులకు వేర్వేరుగా 30 మీటర్ల ఇండియన్ రౌండ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఏపీ ఆర్చరీ అసోసియేషన్, రామనారా యణం తరఫున మెడల్, ప్రశంసాపత్రం, స్వామి వారి వస్త్రాలు, పుస్తకం అందజేశారు. కార్యక్రమంలో అప్పా చైర్మన్ సత్యనారాయణ, ఎన్సీఎస్ ట్రస్టీలు నారాయణం మృదుల, నీరజా శ్రీని వాస్, చంద్రకళ, సిబ్బంది పాల్గొన్నారు. చెస్ పోటీల జిల్లా జట్టుకు 10 మంది ఎంపికగంట్యాడ: మండలంలోని లక్కిడాం జెడ్పీహెచ్ఎస్లో సోమవారం అండర్–19 చెస్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు ఎం.జి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 1,2 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో జరిగే పోటీల్లో వీరు జిల్లా తరఫున పోటీల్లో పాల్గొంటారని పీడీ జి.తవిటయ్య తెలిపారు. వచ్చే నెల 4న అండర్ – 14 క్రికెట్ జట్టు ఎంపికవిజయనగరం: వచ్చే అక్టోబర్ నెల 4న అండర్–14 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసొసియేషన్ ట్రెజరర్ ఎంఎస్ఎన్ వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు అక్టోబర్ 3న ఫారం–5లో క్యూఆర్ కోడ్ ఉన్న ఒరిజనల్ జనన ధ్రువీకరణ పత్రం, ముందు రోజు డౌన్లోడ్ చేసిన ఒరిజినల్ ఆధార్‌కార్డు, మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్‌తోపాటు వాటి జిరాక్స్ కాపీలను అందజేయాలన్నారు. క్రీడాకారులు అందజేసిన పత్రాలను పరిశీలించి, అర్హులైన వారిని ఎంపిక పోటీలకు పిలవనున్నట్లు, అక్టోబర్ 4న ఉదయం 8 గంటలకు విజ్జి స్టేడియంలో నిర్వహించే ఎంపిక పోటీలకు క్రీడాకారులు తెలుపుదుస్తులు ధరించి రావాలని, అలాగే సొంత కిట్టుతో హాజరు కావాలని స్పష్టం చేశారు. వట్టిగెడ్డలో ప్రమాదవశాత్తు ఎద్దు మృతి వీరఘట్టం: మండలంలోని దశుమంతపురం వద్ద గల వట్టిగెడ్డలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు ఒక ఎద్దు మృతి చెందింది.తన ఇంటి పనుల కోసం ఇసుకను నాటుబండిలో తెచ్చుకునేందుకు చలివేంద్రి గ్రామానికి చెందిన రైతు ఎన్.నాగభూషణరావు ఎద్దుల బండితో గెడ్డకు వెళ్లాడు. గెడ్డలోని తిరుగుడు గుమ్మిలోకి ఎద్దుల బండి వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఆ బండి కొంత దూరం కొట్టుకుపోయింది.అందులో ఒక ఎద్దును ప్రమాదం నుంచి తప్పించగా, మరో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్దార్ జి,ప్రసాదరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. -
తండ్రి పెద్దకర్మ రోజే..కొడుకు మృతి
● అప్పుల బాధతో జలాశయంలో దూకిన వ్యక్తి ● రెండు రోజుల గాలింపు తర్వాత మృతదేహం వెలికితీతపాచిపెంట: ఇంట్లో తండ్రి పెద్దకర్మ జరుగుతున్న వేళ.. కుటుంబానికి అండగా ఉండాల్సిన వ్యక్తి ఇక లేడన్న వార్త ఆ ఇంటిని కన్నీటిలో ముంచేసింది. ఒకవైపు తండ్రి జ్ఞాపకాలతో కుటుంబసభ్యులు విషాదంలో ఉండగానే..మరోవైపు కొడుకు మృతదేహం జలాశయం నుంచి వెలికితీయడం కొత్తవలస గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పుల పాలయ్యానని, ఆ బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పాచిపెంట మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన చిత్త వీర్రాజు (44)లేఖ రాసి ఆదివారం పెద్దగెడ్డ జలాశయంలో దూకేసిన నేపథ్యంలో సమాచారం మేరకు ఎస్సై లాలం అర్జున్ ఆధ్వర్యంలో స్థానిక గజ ఈతగాళ్లతో రెండు రోజుల పాటు గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం వీర్రాజు మృతదేహం జలాశయంలో లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లల జీవితాలు నిలదొక్కుకుంటున్న వేళ.. వీర్రాజుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు గతేడాది వివాహం జరిగింది. కుమారుడు అగ్నివీర్‌కు ఎంపికై ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలిద్దరూ జీవితంలో ఓ దారిని ఏర్పరుచుకుంటున్న సమయంలో.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వీర్రాజు దూరం కావడం బంధువులను, గ్రామస్తులను కలిచివేసింది. ఒకే రోజు రెండు విషాదాలు.. వీర్రాజు తండ్రి పెద్దకర్మ సోమవారమే జరిగింది. తండ్రి పెద్దకర్మ కార్యక్రమం జరుగుతున్న రోజే వీర్రాజు మృతదేహం జలాశయం నుంచి వెలికితీయడం కుటుంబసభ్యులకు మరింత విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో ఒకే రోజు సంభవించిన వరుస విషాదాలతో కొత్తవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి... -
వరద తగ్గింది.. బురద మిగిలింది..
రాజాం/వంగర/రేగిడి/సంతకవిటి: ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నాగావళి నదితో పాటు వాగులు, కాలువలు పొంగి ప్రవహించాయి. తీర గ్రామాలను వరద ముంచెత్తింది. ఎక్కడికక్కడే కాలువలకు గండ్లు పడ్డాయి. పంటలు నీటమునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల కోతకుగురయ్యాయి. వరద తగ్గుతున్నకొద్దీ రైతులు, ప్రజలను బురద కష్టాలు వెంటాడుతున్నాయి. పంటలు పూర్తిగా పాడైనా పట్టించుకునేవారే లేకపోవడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. వరద ముంపు భారిన పడిన పొలాలను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇంటిల్లిపాదీ పంట సస్యరక్షణలో నిమగ్నమవుతున్నారు. తీర గ్రామాల్లో పెరుగుతున్న సమస్యలు రాజాం నియోజకవర్గంలోని వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో నాగావళి నదీ తీరం విస్తరించి ఉంది. వంగరలో కోతులగుమ్మడ గ్రామం నుంచి సంగాం వరకూ, రేగిడిలో సరసనాపల్లి గ్రామం నుంచి ఖండ్యాం వరకూ, సంతకవిటిలో జావాం నుంచి కావలి వరకూ నాగావళి నది ప్రవహిస్తుంది. ఈ తీర గ్రామాల్లో వంగర మండలంలో కోతులగుమ్మడ, వీవీఆర్‌పేట, పెదరాజులగుమ్మడ, చిన్నరాజులగుమ్మడ, రుషింగి, తలగాం, శివ్వాం, ఓనె అగ్రహారం, ఓనె మగ్గూరు, సంగాం గ్రామాల్లోనూ, రేగిడి మండలంలో సరసనాపల్లి, తునివాడ, సంకిలి, పుర్లి, దేవుదళ, ఖండ్యాం, కొమెర, వెంకటాపురం, ఆడవరం, గ్రామాలు వద్ద నదిలో ప్రవాహంపెరిగితే ఆందోళన తప్పడం లేదు. సంతకవిటి మండలంలో జావాం, కేఆర్‌పురం, పోతులజగ్గుపేట గ్రామాల వద్ద కూడా ఇదే పరిస్థితి. ● నదీ తీరంలో వరి, చెరకు పంటలన్నీ వరదల సమయంలో ముంపునకు గురవుతున్నాయి. మూడు రోజుల కిందట తుఫాన్ వర్షాలకు ఇదే పరిస్థితి. ఇప్పటికీ చెరకు, వరి పంటలు నీటిలోనే కనిపిస్తున్నాయి. నాగావళి ఓపెన్ హెడ్ సాయన్నచానల్ ఈ ఏడాది తుఫాన్ వరదలకు మొత్తం కొట్టుకుపోయింది. రేగిడి మండలం సంకిలి నుంచి సంతకవిటి మండలం వాల్తేరు వరకు ఈ కాలువ ఆయకట్టు పరిధిలో సెంటు భూమిలో కూడా వరి, చెరకు పంటలు నిలవలేదు. రాజాం నియోజకవర్గంలోని నదీతీర ప్రాంతాలు, కాలువల ఆయకట్టులో 15 వేల ఎకరాల్లో పంటలు ముంపునకుగురైనట్టు రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు రైతులను ఆదుకునే అధికారిక ప్రకటనలు, పరిశీలనలు లేకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నాగావళి నదీ తీర గ్రామాల్లోని రైతులకు అష్టకష్టాలు పాడైన పంటను చూసి కన్నీరు కోతకు గురైన రోడ్లు కొట్టుకుపోయిన కాలువలు మునిగిన పంటలు ఎక్కడ చూసినా బురదకష్టాలే.. పట్టించుకోని ప్రభుత్వం ఆవేదనలో రైతాంగం వరద కష్టాలు వీడలేదు.. ఇప్పటికీ కొమెర, వెంకటాపురం, ఖండ్యాం తదితర గ్రామాల్లో వరద నీరు పొలాల్లోనే కనిపిస్తోంది. ఏ అధికారి రాలేదు. ఎటువంటి భరోసాను ఇవ్వలేదు. రోడ్లు పాడైపోయాయి. ఆటోలు వంటివి ఊర్లోకి రావడం లేదు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ఇంతవరకూ పునరుద్ధరించలేదు. పోయిన పంటలకు పెట్టుబడి డబ్బులైనా ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియడం లేదు. మాది ఐదెకరాల వరి పంట పోయింది. గ్రామంలో 600 ఎకరాల వరి పంటలో బురదమేటలు ఉన్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే మా పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోతుంది. – కర్నేన శరత్‌కుమార్, రైతు, ఆడవరం, రేగిడి మండలం వరి పంట మొత్తం పోయింది మేం ఈ ఏడాది వేసిన రెండెకరాల వరి పంట తుఫాన్ వర్షాలకు కొట్టుకుపోయింది. నారాయణపురం కుడి కాలువ, సాయన్నచానల్ కాలువల నీటితో పంట ముంపునకు గురైంది. పంటపొలాల్లో నీరు సముద్రంలా కనిపిస్తోంది. పొలాల్లో నీరు తగ్గినచోట బురద, ఇసుకమేటలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉంది. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు. పరిహారం అందజేసి ఆదుకోవాలి. – వై.పద్మావతి, రామారాయపురం, సంతకవిటి మండలం కష్టాల తీరం.. రైతన్నకు అండగా నిలిచే నదీ తీరం ఇప్పుడు కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో రూ.కోట్ల ఆర్జనే లక్ష్యంగా ఇష్టానుసారంగా సాగుతున్న ఇసుకరీచ్‌ల నిర్వహణతో నాగావళిలో నీటి ప్రవాహం దిశ మారుతోంది. తీర గ్రామాలను వరద ముంచెత్తుతోంది. భారీ లోడులతో ఇసుక లారీలు తిరగడంతో రోడ్లు, కాలువలు, చెరువు గట్లు అధ్వానంగా తయారవుతున్నాయి. వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతున్నాయి. తుఫాన్ వస్తే చాలు తీర గ్రామాల ప్రజల్లో వణుకుపుడుతోంది. పంటలు ముంపునకు గురై రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. రోడ్డు అలానే ఉంది వర్షాలు వచ్చి నాలుగైదురోజులు గడిచింది. సాయన్నచానల్ వరదలకు జావాం–శంకరపేట గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. ఇంతవరకూ ఈ రోడ్డును కనీసం చదునుచేయలేదు. ఆటోలు పూర్తిగా రావడం లేదు. గ్రామంలో ఏదైనా అత్యవసరమైతే ఎలా వెళ్లాలో తెలియడం లేదు. సాయన్నచానల్ ఆయకట్టులోని వేలాది ఎకరాలు వరి, చెరకు పంటలు పోయాయి. నదీతీరాన ఉన్న చెరకు మొత్తం నదిలో కొట్టుకుపోయింది. రైతులను ఆదుకునే చర్యలు కానరావడంలేదు. – బోనెల ప్రసాదరావు, మాజీ సర్పంచ్, జావాం, సంతకవిటి మండలం నాగావళి నదిలో 24 గంటలు, 365 రోజులు భారీ ఇసుకరీచ్‌లు నడుపుతున్నారు. ఇందులో అక్రమ రీచ్‌ల నిర్వహణ తీర గ్రామాల ప్రజలకు వరద ముప్పును తెచ్చిపెట్టింది. ఇసుక లారీల రాకపోకలతో నదీ తీర గ్రామాల్లోని రోడ్లు, గట్లు అధ్వానంగా మారడం, బలహీనం కావడంతో వరదల సమయంలో కొట్టుకుపోయాయి. పంటల ముంపుతో పాటు ప్రజలకు కష్టాలు తెచ్చాయి. పంటలు బురదలోనే దర్శనమిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పరిహారం అందించేవారు కరువయ్యారని రైతులు చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు ఫొటోలకు ఫోజులిస్తున్నారే తప్ప పరిహారం కోసం మాట్లాడేవారే లేరని విమర్శిస్తున్నారు. రాకపోకలు నిలిచిపోయినా కాజ్‌వేలు, రోడ్లు బాగుకు తక్షణ చర్యలు కానరాకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. -
గిరిజన వర్సిటీని సందర్శించిన జర్నలిస్టుల బృందం
విజయనగరం రూరల్: కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ జర్నలిస్టుల బృందం జిల్లాలోని ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సోమవారం సందర్శించింది. వర్సిటీ ఉపకులపతి టి.శ్రీనివాసన్, రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా, ఫైనాన్స్ అధికారి ఎం.శరత్చంద్రబాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందంతో పాత్రికేయుల బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. వర్సిటీ స్థాపన, లక్ష్యాలు, పనితీరు, విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యావకాశాలు, ప్రాంతీయ ప్రజల అభ్యున్నతికి సంస్థ చేపడుతున్న విద్యా, పరిశోధనా పురోగతిని జర్నలిస్టులకు వీసీ వివరించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న అకడమిక్, సహపాఠ్య కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభ, సాధించిన విజయాలు, విశ్వవిద్యాలయ ప్రగతికి సంబంధించిన అంశాలను వివరించారు. కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగధిపతి డాక్టర్ ఇప్పిలి తారకేశ్వరరావు సమన్వయం చేశారు. సమావేశంలో ఫైనాన్స్ అధికారి శరత్చంద్రబాబు, లైబ్రేరియన్ శంకర్‌రెడ్డి, పరీక్షల అధికారి సురేష్‌బాబు, ఏఓ ఎన్వీఎస్ సూర్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
విపత్తు నిర్వహణ వ్యవస్థ పటిష్టం
● రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ● ఐదు అగ్నిమాపక కేంద్రాలు ప్రారంభంవిజయనగరం టౌన్: అగ్నిమాపకశాఖలో పనిచేసే ఫైర్మెన్లకు అత్యాధునిక శిక్షణతో పాటు ఆధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె సోమవారం ప్రారంభించి, అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. పూసపాటిరేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను ఇక్కడ నుంచే వర్చువల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్, ఏఐఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని, పనిచేసే విధంగా ఫైర్‌సిబ్బందికి ఆధునిక శిక్షణ ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంపూర్ణంగా వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరసలో ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్ట ర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు ఆర్‌విఎస్‌కెకె.రంగారావు, లోకం నాగమాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, అగ్నిమాపకశాఖ డిజీ పీవీ.రమణ, ఏడి జి.శ్రీనివాస్, జి ల్లా అగ్నిమాపకశాఖ అధికారి పీవీ.రాజేష్, ఎడిఎఫ్ఓ సోమేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
బాధ్యతతో ముందుకు సాగాలి ● మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ● విజయనగరం పీటీసీలో శిక్షణ పూర్తిచేసుకున్న 473 మంది మహిళా కానిస్టేబుళ్లు ● పాల్గొన్న హోంమంత్రి అనిత డెంకాడ: పోలీస్ యూనిఫాం కేవలం కఠినత్వానికి ప్రతీక కాదని, దాని వెనుక కరుణ, మానవత్వం, తీవ్రమైన బాధ్యత ఉంటాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలసలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్న్ పరేడ్ మైదానంలో 191 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సంధ్యారాణి పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. శిక్షణ కాలంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టుబుళ్లు డి.నాగదుర్గా ప్రసాద్, పి.గణనసాయి, పి. ఏసు రత్నంకు మెడల్స్ అందజేశారు. 5వ బెటాలియనన్ కమాండెంట్ వై. రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, 9 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 191 మంది శిక్షణార్థులలో 15 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 125 మంది గ్రాడ్యుయేట్లు, 23 మంది ఇంజినీరింగ్, 68 మంది సాంకేతిక విద్యార్హతలు ఉన్నవారు ఉన్నారని తెలిపారు. నూతన కానిస్టేబుళ్లను శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రకాశం, చిత్తూరు బెటాలియన్లకు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, బెటాలియన్ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకున్న 473 మంది 2025–26 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కళాశాల మైదానంలో సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్ వెన్నెముకగా పేర్కొన్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు. తొమ్మిది నెలల కఠిన శిక్షణ జీవితానికి పునాదిలాంటిదన్నారు. పోలీస్ ఉద్యోగమంటేనే ఎంతో బాధ్యతతో కూడినదని, సమాజంలో ఎంతో ప్రభావంతమైనదని పేర్కొన్నారు. ముందుగా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభ చూపిన కేడెట్స్‌కు జ్ఞాపిలు అందజేశారు. పీటీసీలో నూతనంగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజల ధనమానప్రాణాలను రక్షించే కీలక బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, ఇందుకూరి రఘురాజు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పీటీసీ ప్రిన్సిపాల్ దంతులూరి రామచంద్రరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కోటేశ్వరబాబు, అడిషనల్ ఎస్పీలు సీహెచ్ శ్రీకాంత్, ఎస్.వాసుదేవ్, డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులు, కేడెట్స్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. సరిపడా టెంట్లు వేయకపోవడంతో పోలీస్ కానిస్టేబుళ్ల తల్లిదండ్రులు ఎండలోనే తమ పిల్లల డ్రిల్‌ను తిలకించారు. -
అర్జీ వస్తే.. పరిష్కారం కావాల్సిందే
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ● పీజీఆర్ఎస్కు 183 వినతులువిజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహంచిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి 183 వినతులు స్వీకరించారు. వాటిలో 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావ డం గమనార్హం. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి ఎలాంటి జాప్యం లేకుంబా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాలు, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట అధికా రులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఫిర్యాదుదారుతో మాట్లాడిన అనంతరం మాత్రమే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమో దు చేయాలన్నారు. పరిష్కరించిన వివరాలను ఫిర్యాదుదారులకు తెలియాజేయాలని సూచించా రు. 1100 టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శాఖల పరంగా..వినతులు రెవెన్యూ–78, పంచాయతీరాజ్–16, డీఆర్డీఏ–9, విద్యుత్–4, గృహ నిర్మాణం–1, గ్రామ సచివాలయం–9, విద్య–13, మున్సిపల్–6, డీఎంహెచ్‌వో–3, డీసీహెచ్ఎస్–1, ఇతర శాఖలు–43 వినతులు నమోదయ్యాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, జిల్లా స్పషల్ డిప్యూటీ కలెక్టర్లు అరుణకుమారి, వెంకటరెడ్డి, ఆర్డీవో లు సుధారాణి, సుధాసాగర్,జగన్నాథరావు, సీపీవో బాలజీ, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్,జిల్లా భూ సర్వే రికార్డ్స్ శాఖ సహాయ సంచాలకుడు ఆర్.విజయ్‌కుమార్, డీపీవో మల్లికార్జున్, డీఈఓ మణిక్యంనాయుడు,వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో దేవీప్రసాద్, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బాధితుల న్యాయపరమైన సమస్యలకు తక్షణమే పరిష్కారం విజయనగరం టౌన్: బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి 25 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి మూడు, మోసాలకు పాల్పడినట్లు మూడు, ఇతర అంశాలకు సంబంధించి 11 ఫిర్యాదులు అందాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలపై చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేయవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలపై పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను కూడా తెలి యజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా పీజీఆర్ఎస్ సేవలను మరింత మెరుగు పరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడంతో పాటు క్యూఆర్ కోడ్ సదుపాయా న్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. విజయనగరం గంటస్తంభం: జీఓ నంబర్ 255 ను రద్దు చేసి సహకార రంగాన్ని పరిరక్షించాల ని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. విజయనగరంలోని ఎల్బీజీ భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. భీమసింగి సహా చక్కెర కర్మాగారాల్లో రైతులు, కార్మికులు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించా లని డిమాండ్ చేశారు. భీమసింగి ఫ్యాక్టరీలో రూ.40.23 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలి పారు. జిల్లాలో తుఫాన్ కారణంగా పంటలకు సుమారు రూ.10 కోట్ల నష్టం జరిగిందని, సమ గ్రంగా అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు. విజయనగరం ఫోర్ట్: ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురష్కరించుకొని సోమవారం స్థానిక బహుళార్ధ పశు వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పశు సంవర్ధక శా ఖ జేడీ డాక్టర్ ఎస్.మన్మధరావు తెలిపారు. పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయడంతో పాటు వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. రేబిస్ ప్రాణంతకమైన వ్యాధి అయినప్పటకీ పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా దీనిని నివారించవచ్చని పేర్కొన్నారు. పూసపాటిరేగ : భోగాపురం మండల కేంద్రంలోని ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ వై.శ్రీనువాసు చౌదరి, జిల్లా ఎకై ్సజ్ ప్రోహిబిషన్ అధికారి శ్రీనాధుడు కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోగాపురం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వైన్‌షాపుల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఐదు షాపులకు ఎంత మంది టెండరు దాఖలు చేసింది.. తదితర విషయాలపై సీఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎకై ్సజ్ సీఐ ఎం.రవికుమార్, ఎస్ఐలు చంద్రమోహన్, సురేష్ తదితరులు ఉన్నారు. పాలకొండ రూరల్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 11 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ ఈఓ వీవీ సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నుంచి అమ్మవారి మూలవిరాట్ తెరచాటుకు వెళ్లనున్నట్లు ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 10న ఉదయం 8 గంటలకు అమ్మవారి నిజరూప దర్శనంతో నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నట్లు వివరించారు. -
అవార్డు గ్రహీత గోపీనాథ్ పట్నాయక్‌కు సత్కారం
విజయనగరం: నగరానికి చెందిన పక్కి గోపీనాథ్ పట్నాయక్ హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభలో వంశీ ఏఎన్ఆర్ కామధేను జాతీయ పురస్కారాన్ని అందుకోవడం విజయనగరం జిల్లాకు గర్వకారణం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవా సాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో గోపీనాథ్ పట్నాయక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఉత్తమ ప్రజా సంబంధాల వ్యక్తిగత కేటగిరీలో మన విజయనగరానికి చెందిన గోపీనాథ్ పట్నాయక్ కు హైదరాబాద్ వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, తెలంగాణ తెలుగు అకాడమీ అధ్యక్షుడు కూరపాటి వంశీ రామరాజు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. గోపీనాథ్ పట్నాయక్ పట్టణంలోని రాజకీయ పార్టీల నాయకులతో, అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటారని అటువంటి వ్యక్తికి అవార్డు రావడం సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచుతుందని, భవిష్యత్తులో ఇటువంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
తోటపల్లి నీటి ప్రవాహం తగ్గుముఖం
గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు నాగావళినదికి ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటి ప్రవాహం కాస్త తగ్గుముఖం పడుతూ స్థిరంగా ప్రవహిస్తోంది. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద ఆదివారం సాయంత్రానికి 105 మీటర్ల లెవెల్కుగాను 104.20 మీటర్ల లెవెల్లో నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం నదిపై భాగం నుంచి ప్రాజెక్టుకు 9,654ల క్యూసెక్కుల నీరు రాగా అధికారులు స్పిల్‌వే నుంచి 9,982 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. కాలువల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 2.53 టీఎంసీలకుగాను 2.026 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఏఈ కిషోర్ పర్యవేక్షిస్తున్నారు. -
బైక్ ప్రమాదంలో ఒకరి మృతి
● మరో ఇద్దరికి గాయాలుపాచిపెంట: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం..పెయింటింగ్ పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు చిన్నారులను పోషిస్తున్నాడు. రోజూ మాదిరిగానే వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లి తిరిగి వస్తున్న ఆ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో భార్యాపిల్లలకు తీరని శోకం మిగిలింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన బొబ్బిలి ఈశ్వరరావు (38) అలాగే తులసినాయుడు వీధికి చెందిన రౌతు రాజా, కేసలి గ్రామానికి చెందిన గాది తవిటిరాజు శనివారం వ్యక్తిగత పనుల నిమిత్తం రామభద్రపురం వెళ్లారు. పనులు ముగించుకుని రాత్రి సుమారు 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై పాచిపెంటకు వారు ముగ్గురూ తిరుగు ప్రయాణమయ్యారు. సాలూరు బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డు సమీపంలో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న బొబ్బిలి ఈశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన రౌతు రాజాను స్థానికులు సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాది తవిటిరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈశ్వరరావుకు భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గతంలో వలంటీర్‌గా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరం కావడంతో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. ఇంటిని నడిపే వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం.. రహదారి ప్రమాదంలో ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆదివారం ఉదయం సాలూరు ఏరియా ఆస్పత్రికి వెళ్లి మార్చురీలో ఉన్న మతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అండగా ఉంటున్న ధైర్యం చెప్పారు.. ఈశ్వరరావు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కేంద్రంలో బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ)గా పనిచేస్తున్నాడు. -
ఇండక్షన్‌తో కొత్త కష్టాలు!
రామభద్రపురం: అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్ స్టౌలతో అంగన్వాడీల పరిస్థితి పొయ్యిలో నుంచి పెనం మీద పడినట్లుగా తయారైంది. ఇండక్షన్ స్టౌలు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. అంగన్వాడీ సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఆర్భాటాలు చేస్తూనే ఇబ్బందుల్లోకి నెడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడడాన్ని సాకుగా చూపుతూ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపేసి ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టౌలను పంపిణీ చేసింది. వండుతున్న సమయంలో కరెంటు పోతే ఇండక్షన్ స్టౌ పని చేయకపోవడంతో వంటకు ఆటంకం ఏర్పడి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.అలాగే విద్యుత్ బిల్లులు తడిసి మోపెడయ్యే ప్రమాదం లేకపోలేద ని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రూ.7 వేలు విలువ చేసే ఇండక్షన్ స్టౌతో పాటు 4 రకాల వంట పాత్రలు పంపిణీ చేశారు. ఇకపై వి ద్యుత్ ఆధారిత స్టౌలపైన వంట చేసి చిన్నారులకు పోషకాహారం వడ్డించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటుంది. దీంతో సకాలంలో పిల్లలకు భోజనాలు వడ్డించలేక అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండక్షన్ స్టౌల వాడకంపై అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి ఏ మాత్రం అవగాహన లేదు. ఈ సామ గ్రి సరఫరా చేసిన కొత్తలో కేంద్రాల కార్యకర్తలకు సూచనప్రాయంగా చెప్పారంతే. వీటిని వినియోగించే ఆయాలకు అవగాహన కల్పించలేదు. గ్యాస్ స్టౌపై అయితే ఏ పాత్రలైనా పని చేస్తాయి. ఇండక్షన్ స్టౌపై అన్ని పాత్రలు పని చేయవు. ఇండక్షన్ బేస్ లేదా అడుగు భాగంలో కాపర్ ఉన్న పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. గ్యాస్ స్టౌపై ఎంత పెద్ద పాత్రలైనా పెట్టి వంట చేసేవారు. ఇండక్షన్ స్టౌలపై భారీ పాత్రలు పెట్టి వంట చేసే పరిస్థితి లేకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండక్షన్ స్టౌపై వంట చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే మళ్లీ కట్టెల పొయ్యిపై కుస్తీపట్టాల్సిందేనని అంగన్వాడీలు వాపోతున్నారు. ఇండక్షన్ స్టౌ పంపిణీ చేసిన తర్వాత ప్రతి అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ బిల్లులు కోసం ప్రభుత్వం రూ. 500 చొప్పున్న ఇస్తున్నట్టు అధికారిక సమాచారం. అయితే గతంలో అద్దె భవనాల్లో నిర్వహించిన కేంద్రాలకు అద్దెతో పాటు విద్యుత్ బిల్లులు ఇచ్చేవారు. ప్రభుత్వ భవనాల్లో నిర్వహించిన కేంద్రాలకు ఆయా అంగన్వాడీలు బిల్లులు సబ్మిట్ చేస్తే ఆ బిల్లులు ఇచ్చేవారు. ఆ బిల్లులు ఒక్కో కేంద్రానికి ఒక ఫ్యాన్, ట్యూబ్‌లైట్ ఉంటే విద్యుత్ వినియోగాన్ని బట్టి నెలకు కనీసం సుమారు.రూ.300 నుంచి రూ.450 వరకు బిల్లు వస్తుంది. ఇప్పుడు విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టౌలు పంపిణీ చేసిన తర్వాత అన్ని కేంద్రాలకు నెలకు రూ.500 చొప్పున్న బిల్లులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండక్షన్ స్టౌపై వంట చేస్తే రోజుకు కనీసం అరగంట పాటు వినియోగిస్తే విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతాయని వాటిని చెల్లించుకోవాలంటే కష్టతరమవుతుందని అంగన్వాడీలు వాపోతున్నారు. పలు కేంద్రాల్లో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు స్టౌల వినియోగం తెలియకపోవడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండడంతో గ్యాస్ సిలిండర్లతో వంట చేస్తున్నారని సమాచారం. ఇండక్షన్ స్టౌలు వినియోగంపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించాం. విద్యుత్ బిల్లులు కోసం ఒక్కో కేంద్రానికి నెలకు రూ.500 చొప్పున్న ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒక్కో కేంద్రంలో విద్యుత్ వినియోగానికి నెలకు రూ.300 మాత్రమే అవుతుంది తప్ప ఎక్కువ కాదు. ఆ రూ.500ల్లో దాదాపు రూ.200 వరకు మిగులుతుంది. ఆ డబ్బులతో గ్యాస్ సిలిండర్ తీసుకుని విద్యుత్ సరఫరా నిలిచిపోతే వంట చేయాలి. అయినా పూర్తిగా సమాచారం నాక్కూడా తెలియదు, తెలుసుకుని ఏం చేయాలో చెబుతాను. – కేవీ బాలామణి, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం -
చంపావతిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గుర్ల: మండలంలోని కోటగండ్రేడు గ్రామం వద్ద గల చంపావతి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. కోటగండ్రేడు పంప్‌హౌస్ వద్ద నదిలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. మృతి చెందిన వ్యక్తి రెండు రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి 40 ఏళ్లు ఉంటాయని, ఎరుపు రంగు బనియన్, బిస్కెట్ కలర్ చొక్కా మోకాళ్ల వరకు ఉండే జీన్స్‌ను ధరించినట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి ఆత్మహత్యగజపతినగరం రూరల్: మండలంలోని డోలపాలెం గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి వాసా దేవి కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానికురాలు అయిన వాసా చిలకమ్మ చిన్న కుమార్తె దేవి. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో కడుపునొప్పి తట్టుకోలేక ఈ నెల 25న మోతాదుకు మించి ఐరన్ మాత్రలు మింగేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవి పరిస్థితి విషమించడంతో ఈ నెల 26న సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై ఆదివారం ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యపూసపాటిరేగ: భోగాపురం మండలంలోని సవరవిల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గండిబోయిన రాంబాబు(35) అనే వ్యక్తి కుమారుడు గండిబోయిన సాయిగణేష్కి కేన్సర్ సోకడంతో బాధను తట్టుకోలేక ఉరివేసుకున్నట్లు తెలియవచ్చింది. కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడడంతో ఆ బాధను తట్టుకోలేక గ్రామం సమీపంలో గల పీఎస్ఎన్ మూర్తికి చెందిన తోటలో నైలాన్ తాడుతో చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడు తోటలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య సన్యాసమ్మ, కుమారుడు ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందర పేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పతకాల పంట
విజయనగరం: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం జరిగిన 37వ ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌న్‌షిప్ పోటీలలో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ పోటీలలో 21 కేజీల విభాగంలో కె. లలితాదీత్య కాంస్య పతకం సాధించగా, 30 కేజీల విభాగంలో హర్షిణి వర్మ, 33 కేజీల విభాగంలో ఎం. హసిక రజత పతకాలను గెలుపొందారు. అలాగే 35 కేజీల విభాగంలో జి. కాత్యాయని కాంస్య పతకం పొందగా, 52 కేజీల కేటగిరీలో డి.మాధవ్, 74 కేజీల కేటగిరీలో కె.ఆదర్శ్ రజత పతకాలతో మెరిశారు. కోచ్ కె.మోహిత్ ఆధ్వర్యంలో విజయనగరం కె–వన్ వ్యవస్థాపకుడు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఎం.కూర్మారావు క్రీడాకారులకు నిరంతర శిక్షణ అందించి తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తెచ్చిన విజేతలను, వారిని ప్రోత్సహించిన శిక్షకులను ఎం.కూర్మారావు, నిర్వాహకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. -
నాగావళిలో తగ్గిన నీటిమట్టం
పాలకొండ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతోపాటు ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నాగావళి నదిలో మూడు రోజులుగా వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో మండలంలోని తీరప్రాంతం వెంబడిగల యరకారాయపురం, చిన మంగళాపురం, గొట్ట మంగళాపురం, గోపాలపురం, అన్నవరం, అంపిలి గ్రామాలతో పాటు పాలకొండ పట్టణంలో వడమ, ప్రధాన రహదారిలో కొంత భాగం నీటమునిగిన విషయం విదితమే. రెండు రోజలుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నీరు నెమ్మదించింది. ఆదివారానికి నదిలో నీటి ప్రవాహ ఉధృతి సాధారణ స్థితికి చేరడంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు రోజుల వరకూ అక్కడి పల్లెవాసులు, సమీప రైతులు నదీ సంబంధిత అవసరాలకు దూరంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్, ఆగ్నిమాపక అధికారులు స్పష్టం చేస్తున్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింతకురుపాం: అక్రమంగా వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు తెలుసుకున్న సమాచారం కురుపాం ఎస్సై నారాయణరావు, సిబ్బంది మండల కేంద్రంలో ఆదివారం సబ్‌స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టి లగేజీ వాహనంలో ఆరు పశువులు తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ పశువులను భామిని గ్రామం నుంచి నవగాం గ్రామానికి వధ నిమిత్తం తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పాలకొండ మండలం జంపరకోట పంచాయతీలోని బడ్డుమాసింగి గ్రామానికి చెందిన పొట్నూరు శంకరరావుపై కేసు నమోదు చేశారు. 22 పశువులు స్వాధీనంసాలూరు రూరల్/సాలూరు: పట్టణ పరిధిలోని మామిడిపల్లి బస్టాండ్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 22 పశువులను పట్టణ పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. దీనిపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం..ఐదు వాహనాల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టి వాహనాలను పట్టుకున్నారు. బీసీ రోడ్డులో వ్యక్తి మృతి అక్కిరెడ్డిపాలెం(విశాఖ): గాజువాక బీసీ రోడ్డు నీటి ఏనుగు జంక్షన్ సమీపంలో సులభ్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం రాత్రి లక్కోజు కృష్ట (50) అనే వ్యక్తి మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. విజయనగరం జిల్లా మెంటాడకు చెందిన కృష్ణ గత ఐదేళ్లుగా నగరంలోని ఓ వితంతు మహిళతో సహజీవనం చేసేవాడు. సుమారు మూడు నెలల క్రితం ఆమె మృతి చెందడంతో, మనస్థాపానికి గురై తీవ్రంగా మద్యం సేవిస్తున్నట్లు ఉన్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సులభ్ కాంప్లెక్స్ వద్ద మృతి చెంది కనిపించగా, సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వరుస తుఫాన్లతో మత్స్యకారుల విలవిల
చికెన్పూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న మత్స్యకారులను ప్రకృతి వైపరీత్యాలు కుంగదీస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు అనుకున్న విధంగా పడకపోయినా అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి గాలులతో వేట సాగక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌తో వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో వేట సాగకపోయినా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వేట లేని సమయంలో మత్స్యకారులను ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం తమను విస్మరించిందని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట లేని సమయంలో బియ్యం, నగదు సాయం చేయాలని కోరుతున్నారు. జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలో 19 మత్స్యకార గ్రామాల్లో 20 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో వేటపై ప్రత్యక్షంగా 5 వేల మంది, పరోక్షంగా 15వేల మంది మత్స్యకారులు ఆధారపడి ఉన్నారు. పూసపాటిరేగ మండలంలో చింతపల్లి, నీలగెడ్డపేట, చింతపల్లి బర్రిపేట, చింతపల్లి పెద్దూరు, పతివాడ బర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, పులిగెడ్డ, కోనాడ, బొడ్డుగురయ్యపేట, బొడ్డు వెంకటేషుపేట, భోగాపురం మండలంలో చేపలకంచేరు, ముక్కాం, కొండ్రాజుపాలెం, చోడిపల్లిపేట, ఎర్రముసలయ్యపాలెం తదితర గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల పరిధిలో మత్స్యకారులు వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెండు మండలాల్లో 885 బోట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి.వేటలేని సమయంలో మత్స్యకారులను ఆదుకోవాలి వేట లేని సమయంలో మత్స్యకారులను పభుత్వం ఆదుకోవాలి.ప్రకృతి వ్యపరీత్యాలు సంభవించినప్పుడు మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గడిచిన నాలుగు రోజులుగా తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది పడ్డాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. వేట లేని సమయంలో బియ్యంతో పాటు నగదు అందించి మత్స్యకారులను ఆదుకోవాలి. – బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సొసైటీ మాజీ అధ్యక్షుడు, విజయనగరం ప్రతికూల వాతావరణంతో జీవనోపాధికి గండి ప్రభుత్వం నుంచి సాయం అందక అవస్థలు ఇబ్బంది పడుతున్న సుమారు 20 వేల మంది మత్స్యకారులు -
‘కన్నీటి సంద్రం – కళింగాంధ్ర’ ఆవిష్కరణ
● కళింగ ప్రజల ఆవేదనకు అక్షర రూపం ● ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాజాం సిటీ: కళింగ ప్రజల ఆవేదనకు అక్షర రూప మే ‘కన్నీటి సంద్రం–కళింగాంధ్ర’ కవితా సంపుటని ప్రముఖ కవి, సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరె డ్డి అన్నారు. ఇందులో కవి గార రంగనాథం ప్రజల కష్టాలు, కన్నీళ్లు, వలసల నేపథ్యాన్ని కళ్లకు కట్టిన ట్లు కవిత్వీకరించారని తెలిపారు. ఆదివారం ఓ జూనియర్ కళాశాలలో రాజాం రచయితల వేదిక 140వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కన్నీటి సంద్రం–కళింగాంధ్ర’ కవితా సంపుటిని ఆవిష్కరించిన అనంతర ప్రసంగించారు. కళింగాంధ్ర పేరుతో వచ్చిన తొలి కవితా సంపుటి ఈ గ్రంథమని, కళింగ ప్రజల ఆవేదనకు అక్షర రూపమని అన్నారు. ఇక్కడి కవులు, రచయితలు, కళాకారు లు, కళింగాంధ్ర అస్తిత్వాన్ని నిర్మించవలసిన అవస రం ఎంతైనా ఉందని, అప్పుడే ఈ నేల అభివృద్ధికి నోచుకుంటుందని తెలంగాణ ఉద్యమ కవిగా కోరా రు. తెలంగాణకు, కళింగాంధ్రకు పేదరికంలోనూ, అణచివేతలోను చాలా సామ్యాలు ఉన్నాయని అన్నా రు. కళింగాంధ్ర ప్రకృతి వనరులు అధికంగా ఉన్న నేలని ప్రశంసించారు. పిల్లా తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరా వు, వేదిక సభ్యులు గార రంగనాథం, వెలుగు రామినాయుడు, గట్టి పాపారావు పాల్గొన్నారు. -
నవంబర్10న శ్రీమతి విజయనగరం పోటీలు
విజయనగరం క్రైమ్: విజయనగరంలోని ఎస్వీఎన్ వేదికగా శ్రీమతి విజయనగరం పోటీలను నవంబర్ 10 న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు రాజు తెలిపారు. ఈ మేరకు స్థానిక అంబటి సత్రం ప్రెస్‌క్లబ్‌లో పద్మ హస్పిటల్ అఽధినేత డా.వెంకటేశ్వరరావుతో సంయుక్తంగా ఆయన ఆదివారం మాట్లాడారు. కళలకు పుట్టినిల్లు, సాంస్కృతిక రాజధాని అయిన విజయనగరంలో మగువల ప్రతిభను వెలికి తీసేందుకు తొలిసారిగా శ్రీమతి విజయనగరం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 30 వ తేదీన ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ మేనేజర్ రాజు తెలిపారు. సంప్రదాయ బద్ధంగా పాశ్చాత్య ధోరణికి అస్సలు తావు ఇవ్వకుండా చీర కట్టుతోనే ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల మహిళామణులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని అక్టోబర్ 30వ తేదీన ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్‌లో ఆడిషన్స్ జరుగుతాయని పేర్కొన్నారు. కళలకు కాణాచి అయిన విజయనగరంలో సీ్త్రలలో దాగి ఉన్న , ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియ చెప్పేందుకే శ్రీమతి విజయనగరం పోటీలను నిర్వహిస్తున్నామని వెంకటపద్మ హాస్పిటల్ ఓనర్ డా.వెంకటరావు తెలిపారు. అదే రోజున మూడు లాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న తమ హాస్పిటల్ అధునికీకరణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేస్తున్నామన్నారు. -
రేబిస్‌ను అంతం చేద్దాం
● వేపాడ పశువైద్యాధికారిణి డా.గాయత్రి ● నేడు ప్రపంచ రేబిస్ నివారణ దినోత్సవంవేపాడ: రేబిస్ వ్యాధి సోకిన జంతువుల కాటు, గీతల వల్ల వ్యాపించే ప్రాణాంతక వైరస్ రేబిస్ వ్యాధి. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన జంతువుల లాలాజలంలో వైరస్ ఉంటుంది. వైరస్ సోకిన జంతువు కరవడం, గీరడం వల్ల మానవులకు, జంతువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదముందని వేపాడ పశువైద్యాధికారిణి డా.గాయత్రి తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 28న వరల్డ్ రేబిస్ డే నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వ్యాధి లక్షనాలు, నివారణపై అవగాహన కల్పిస్తున్నట్లు డాక్టర్ గాయత్రి తెలిపారు. రేబిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం, కుక్కలు ఇతర జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సాధారణంగా రేబిస్ వ్యాధి సోకిన కుక్కలు, పిల్లులు, ఇతర జంతువుల లాలాజలం ద్వారా, ముఖ్యంగా కాటు లేదా గీతల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు ప్రారంభమైన తర్వాత రేబిస్ ప్రాణాంతకంగా మారుతుంది. రేబిస్ లక్షణాలు ఇవే.. రేబిస్ వ్యాధి సోకితే ప్రారంభంలో ప్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. జ్వరం, అనారోగ్యంగా ఉంటుంది. జంతువు కాటు, గీరిన చోట తిమ్మిరి, జలదరించడం, ఆందోళన గందరగోళం, మతిమరుపు వంటి భ్రాంతులు కనిపించడం మింగడంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పక్షవాతం లాంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి నివారణ ఇలా.. రేబిస్ సోకిన జంతువు కాటు వేసినా గీరినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్ టీకాలు, ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వడం ద్వారా వ్యాధి నివారించవచ్చు. – డా.కోరాడ గాయత్రి పశువైద్యాధికారిణి, వేపాడ -
అక్టోబర్ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు
● 11 వేదికల్లో ఘనంగా నిర్వహణ ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం గంటస్తంభం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అక్టోబర్ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు – 2026 ను అత్యంత వైభంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. పట్ట ణంలోని 11 వేదికల్లో రెండు రోజుల పాటు సాంస్కృతిక, క్రీడా, సంగీత, సాహిత్య, జానపద కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఫెస్టివల్, సైన్స్ ఫెయిర్, సర్కస్, ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల సమన్వయ అధికారిగా జేసీ ఎస్.సేతుమాధవన్ వ్యవహరిస్తారని, ఒక్కో వేదికకు జిల్లా స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పైడితల్లి ఆలయం వద్ద శోభాయాత్ర, చరిత్ర క బొంకులదిబ్బ వద్ద ప్రారంభోత్సవం, అయోధ్య మైదానంలో మెగా మ్యూజికల్ నైట్, పెట్ షో, కోటలో లేబర్ షో, ఫొటో ఎగ్జిబిషన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం, వైద్యం, భద్రత తదితర సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
ఆర్చరీ పోటీలు ప్రారంభం
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో 46వ జూనియర్ రిజర్వ్ కాంపౌండ్ అండ్ ఇండియన్ రౌండ్ చాంపియన్‌షిప్ ఆర్చరీ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్‌కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి మేలు చేస్తాయని, ఆర్చరీ పోటీలు ఏకాగ్రత సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. 70 మీటర్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో వెంకటేశ్వరరావు, ఎన్సీఎస్ ట్రస్టీలు నారాయణం చలమయ్య, మృదుల, నీరజా శ్రీనివాస్, చంద్రకళ, పలువురు ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
గుంతల రహదారికి యువకుడి బలి
బొబ్బిలి: గుంతల రహదారి ఉన్నతమైన భవిష్యత్తున్న ఓ యువకుడ్ని బలి తీసుకుంది. పట్టణంలోని గొల్లపల్లికి చెందిన బీటెక్ విద్యార్థి గొల్లపల్లి సాయి కృష్ణ(సిద్ధు)తన స్నేహితుడితో కలిసి రామభద్రపురం కూరగాయల మార్కెట్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా అక్కడున్న పెద్ద పెద్ద గుంతలు గుర్తించలేక బోల్తా పడ్డారు. ఈ ప్రమాదంలో సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గొల్లపల్లిలో సోమవారం వినాయక అనుపోత్సవాల సందర్భంగా అన్నసమారాధన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న యువతలో సాయికృష్ణ, వర్రి నానిలు కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలు కోసం అడ్వాన్సులు ఇచ్చేసి రావడానికి వెళ్లారు. అన్ని మాటలూ అయ్యాక తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గొర్లె సీతారామపురం పెట్రోల్ బంక్ నుంచి మెట్టవలస వెళ్లే వరకూ గల సుమారు 300 మీటర్ల రాయగడ వెళ్లే రహదారిలో ఉన్న గుంతలు గుర్తించలేక పోయారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో ఈ గుంతల్లో పడిపోయారు.సాయికృష్ణ మృతి చెందగా స్నేహితుడు వర్రి నాని గాయాలపాలయ్యాడు. సాయి కృష్ణ తండ్రి రామారావు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగి. తల్లి దాడెమ్మ గృహిణి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బొబ్బిలి సీఐ కే నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన చెకుముకి సైన్స్ సంబరాలు
విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఉత్సాహభరితంగా జరిగా యి. స్థానిక సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన సంబరాల్లో జిల్లా వాప్తంగా వివిధ పట్టణాలు, మండలాల నుంచి 39 జట్ల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయు లు, విశాఖపట్నం సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జోగా చంద్రశేఖర్, ఉపాధ్యాయులు బి.వెంకటరావు, శ్రీనివాసరావు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని వివరించారు. ‘ప్రశ్న అనేది శాస్త్ర విజ్ఞానానికి ప్రాణం’ అనే సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో విజయనగరం మండలం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల జట్టు, ప్రైవేటు పాఠశాలల విభాగంలో విజయనగరంలోని ది నేషనల్ స్కూల్ విద్యార్థుల జట్టు జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్లు నవంబర్‌లో భీమవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించను న్నాయి. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.రాజగోపాల్, రాష్ట్ర సమతా కన్వీనర్ నిర్మల, జిల్లా అధ్యక్షుడు ఎంవీఎన్ వెంకటరావు, ప్రధాన కార్యదర్శి వి.రమణ ప్రభాత్, ఉపాధ్యక్షుడు వి.సత్యంనాయుడు అధ్వర్యంలో జిల్లా, నగర కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
● పంట ముంపుపై రైతుల ఆందోళన ● పూడ్చివేత చర్యలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి
మెంటాడ: ఆండ్ర రిజర్వాయరు కుడి కాలువ పరిధిలోని 2ఎల్ ఎడమ కాలువకు భారీ గండి పడడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నుంచి నీరు ఉధృతంగా బయటకు ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న వరి పంటలు నీట మునిగాయి. ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలువ కింద సుమారు 250 ఎకరాల ఆయకట్టు సాగు భూమి ఆధారపడి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి పూడ్చివేత చర్యలు చేపట్టకపోతే గండి మరింత పెద్దదై తీవ్ర నష్టం వా టిల్లే సూచనలు కనిపిస్తున్నాయని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే మేల్కొని గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చే పట్టి తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు. -
అందని ద్రాక్షే..!
●ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అంజి సీతన్నదొర. ఇతనిది మెంటాడ మండలం కొండపర్తి బాడవ. ఆయాసం, కాలు వాపులు రావడంతో ఈ నెల 25న డోలీపై వారి బంధువులు లోతుగెడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్‌లో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఈసీజీ, ఎక్సరే మందులు ఇచ్చి పంపించారు. గజపతినగరం ఆస్పత్రి నుంచి ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోనే మృతి చెందాడు. ●బలిజిపేట మండలం రాజా అనే పదకొండేళ్ల బాలుడికి గొంతు నొప్పి రావడంతో రాజాం ఏరియా ఆస్పత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు టాన్సిల్స్ ఆపరేషన్ చేయాలని గుర్తించారు. ఆపరేషన్ చేస్తుండగా కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో బాలుడు మృతి చెందాడు. -
ఈత సరదాతో చెరువులో దిగిన ముగ్గురు చిన్నారులను మృత్యువుకాటేసింది. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. రైతు కూలీ కుటుంబాల్లో చీకట్లను నింపింది. మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదం గ్రామస్తులను విషాదంలో నింపింది.
బుధరాయవలస చెరువులో ఈత కోసం వెళ్లి మృతిచెందిన చిన్నారులు హేమచంద్రరావు, వెంకటేష్, చంద్రశేఖర్ మెరకముడిదాం: బడి నుంచి సరదాగా సాయంత్రం ఇంటికి చేరుకున్నారు.. గబగబా బ్యాగులు ఇంటిలో పెట్టి వీధిలోకి వెళ్లారు... ఏడుగురు పిల్లలు కలిసి ఈత కొట్టేందుకు ఊరి సమీపంలోని శివాలయం పక్కన ఉన్న చిన్నచెరువుకు వెళ్లారు. అంతే.. అక్కడే కాపుకాసి ఉన్న మృత్యు కోరలకు ముగ్గురు చిన్నారులు బలయ్యారు. చెరువులో దిగిన చిన్నారులు మునిగిపోయి క్షణాల్లో ప్రాణాలు విడిచారు. ఈ విషాదకర ఘటనతో మెరకముడిదాం మండలం బుధరాయవలస ఘొల్లుమంది. నానా లేవండిరా... ఆడుకుంటామని వెళ్లి మృత్యు ఒడికి చేరిపోయారా.. జట్టుగానే మా నుంచి దూరంగా వెళ్లిపోయారా అంటూ తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... బుధరాయవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల హేమచంద్రరావు(10) 5వ తరగతి, సరిది చంద్రశేఖర్ (9), శంకరాపు వెంకటేష్ (9) నాలుగో తరగతి చదువుతున్నారు. శనివారం సాయంత్రం బడి విడిచిపెట్టాక జట్టుగా ఇంటికి చేరుకున్నారు. పుస్తకాలు ఇంటివద్ద పెట్టి ఆడుకునేందుకు వీధిలోకి వెళ్లారు. అక్కడ మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈతకొట్టేందుకు ఊరి శివారున శివాలయం పక్కన ఉన్న చిన్నచెరువుకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండుగా నీరు చేరింది. ముందుగా దిగిన ముగ్గురు చిన్నారులు ఈతరాక మునిగిపోవడంతో మిగిలినవారు భయాందోళనతో కేకలు వేశారు. దీంతో గ్రామస్తులు పరుగున వచ్చి చెరువులో దిగివెతికినా ఫలితం లేకపోయింది. కాసేపటికి ముగ్గురు మృతదేహాలు నీటిపై తేలడంతో ఘొల్లుమన్నారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు చెరువు వద్దకు చేరుకుని పిల్లల మృతదేహాలను చూసి కన్నీరుపెట్టారు. సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ శంకరరావు, బుధరాయవలస ఎస్ఐ జె.లోకేశ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాలకు శవపంచనామా జరిపి పోస్టుమార్టం కోసం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ● ఒక్కగానొక్కకొడుకు మృతితో... సరిది గోవిందరావు, భారతికి ఇద్దరు పిల్లలు. వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలు చంద్రశేఖర్, రాజేశ్వరిని సాకుతున్నారు. పిల్లలను చదివిస్తే ప్రయోజకులవుతారని, కష్టాలు తీరుతా యని ఆశపడ్డారు. ఇంతలో కుమారుడు చంద్రశేఖర్‌ను చెరువు రూపంలో మృత్యువు కాటేయడంతో కన్నీరుపెడుతున్నారు. కుమారుడు మృతదేహాన్ని పట్టుకుని భారతి విలపించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. ● మండల గౌరీ, త్రినాథరావు దంపతులకు హేమచంద్రరావు (హేమచందు)తో పాటు మరో బాబు ఉన్నారు. ప్రమాదంలో హేమచందు మృతితో విలపిస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే కుమారుడు మృతితో విషాదంలో మునిగిపోయారు. ● శంకరాపు అప్పలనాయుడు, లక్ష్మిలకు ఇద్దరు బాబులు. వెంకటేష్ 4వ తరగతి చదువుతుండగా, పెద్దబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్నబాబు మృతితో కన్నీ రు పెడుతున్నారు. ఒకే తరగతికి చెందిన చంద్రశేఖర్, వెంకటేష్ మంచి స్నేహితులు. మృత్యువులోనూ స్నేహం వీడలేదంటూ గ్రామస్తులు విలపించారు. ప్రాణం తీసిన ఈత సరదా చెరువులో దిగిన ముగ్గురు చిన్నారులు మృతి శోకసంద్రంలో తల్లిదండ్రులు బుధరాయవలసలో విషాదం -
విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి
అగనంపూడి: అగనంపూడి సమీపంలో విద్యుదాఘాతానికి గొర్రెల కాపరితో పాటు 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అగనంపూడిలో ఓ ప్రైవేట్ లేఅవుట్లో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కిత్తన్నపేటకు చెందిన ఉప్పిలి బంగారయ్య (30) కొంతమంది గొర్రెల కాపరులతో కలిసి 800 గొర్రెల మందను తీసుకుని మూడు నెలల కిందట ఇంటి నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో అగనంపూడి సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో గొర్రెలను మేపుతున్నారు. శనివారం చీకటి పడటంతో మందను తిరిగి తీసుకెళ్లేందుకు వెళ్లారు. 15 గొర్రెలు ఒకేచోట ఉండటంతో వాటిని తోలుకొచ్చేందుకు బంగారయ్య వెళ్లాడు. అక్కడ విద్యుత్ వైరు తెగిపడి ఉండడాన్ని గమనించక దానిని తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే తీగను తాకిన 15 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె నిత్య, కుమారుడు చరణ్ ఉన్నారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బంగారయ్య మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 గొర్రెలు కూడా.. -
బైక్ దొంగల అరెస్ట్
బాడంగి: విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన బైక్ దొంగతనాలకు పాల్పడిన దొంగతో పాటు అతనికి సహకరిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బొబ్బిలి రూరల్ సీఐ మల్లికార్జునరావు, బాడంగి ఎస్సై సూర్యకుమారి, సిబ్బంది గణేష్, రమేష్ బృందం దొంగలను అదుపులోకి తీసుకోవడం పాటు 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగల వివరాలను డీఎస్పీ బి. గోవిందరావు బాడంగి పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బైక్‌లను దొంగలిస్తున్న సాలూరు మండలం బాగువలసకు చెందిన కందుకూరి అనిల్ (దావీద్)తో పాటు అతనికి సహకరిస్తున్న సాలూరు దాసరివీధికి చెందిన అన్నదమ్ములు ఎం.వెంకటరమణ, ప్రవీణ్‌లను పోలీసులు రామభద్రపురం మండలం కొట్టక్కి సమీపంలో పట్టుకున్నారు. వీరికి సహకరిస్తున్న ఒక మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించగా.. విశాఖకు చెందిన శ్రీరామ్, ప్రసన్న అనే ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా బాడంగి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, విజయనగరం రూరల్‌లో–1, టౌన్లో–2, విశాఖ మహారాణిపేటలో–4, పీఎంపాలెంలో–2, భీమిలి, పద్మనాభంలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 13 బైక్‌లను చోరీ చేశారు. ఇందులో 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బొబ్బిలి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
పరేడ్ గ్రౌండ్ వీడి ప్రజా రక్షణకు..
నిరంతర కఠోర శ్రమ.. ఎన్నో ఒడిదుడుకులు.. శిక్షణ సమయంలో కన్నీటిగాథలు.. కుటుంబానికి దూరమై, అకుంఠిత దీక్షతో తొమ్మిది నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాసేవకు వస్తున్నారు మహిళా కానిస్టేబుళ్లు. విజయనగరం పీటీసీలో శిక్షణ పూర్తయిన నేపథ్యంలో, సోమవారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణకు నడుం బిగిస్తున్న మహిళామణులకు సెల్యూట్..తొమ్మిది నెలల శిక్షణే అంకురార్పణ.. నా పేరు దాట్ల నీలిమ. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. మా తండ్రి వ్యవసాయం చేస్తుంటారు. తల్లి గృహిణి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్‌ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ, అన్నయ్య సహకారంతో ఇంట్లోనే ఉంటూ పోలీస్ ఉద్యోగానికి ప్రిపరేషన్ ప్రారంభించాను. ఇదే నోటిఫికేషన్లో మా ఇద్దరం ఉద్యోగం సాధించాం. ఎస్సై ఉద్యోగం సాధించాలనేది లక్ష్యం. పీటీసీలో ప్రిన్సిపల్ ఎంతో ధైర్యాన్నిచ్చారు. తొమ్మిది నెలల పాటు మీరు చేసిన సాధనే, రాబోయే 40 ఏళ్ల సేవకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పడం మాలో ధైర్యాన్నింపింది. – దాట్ల నీలిమ, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం నాన్న బాటలోనే.. నా పేరు తగరంపూడి ధరణి అపర్ణ, మాది రాజమండ్రి. పోలీస్ ఉద్యోగమంటే చిన్నప్పటి నుంచి ఓ కల. నాన్న రాజమండ్రిలో హెచ్‌సీగా, కోర్టు లైజన్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన 2018లో మరణించారు. మేము ముగ్గురు అక్కాచెల్లెళ్లు. పెద్దక్క కానిస్టేబుల్, రెండో అక్క జీఎస్టీలో జూనియర్ అసిస్టెంట్. నేను జేఎన్టీయూలో పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ చదివాను. రెండేళ్ల పాటూ టీసీఎస్‌లో వర్క్ చేశాను. ఎంతో కష్టపడి ప్రిపేర్ అయి, ఉద్యోగం సాధించాను. పీటీసీలో ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. – తగరంపూడి ధరణి అపర్ణ, రాజమండ్రి, తల్లిదండ్రుల కల నిజం చేశా.. మాది ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామం. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. మా గ్రామానికి బస్సు లేకపోవడంతో డిగ్రీ చదివే రోజుల్లో ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుని చదువు పూర్తి చేశాను. పోలీసు కావాలనే తల్లిదండ్రుల కలని నిజం చేయాలనుకున్నాను. కానీ స్తోమత లేకపోవడంతో ఎటువంటి కోచింగ్ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఫిట్నెస్ పాఠాలు నేర్చుకుని, ఓపెన్ క్యాటగిరీలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. పోలీస్‌శాఖకు మంచిపేరు తీసుకుకొచ్చేలా ప్రజాసేవలో తరిస్తాను. – టి.కల్పన, ప్రకాశం జిల్లా ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం.. నా పేరు అండ్రాజు మౌనిక. మాది గుంటూరు జిల్లా, కంచర్లపాలెం గ్రామం. మా నాన్న లారీ డ్రైవర్ కాగా అమ్మ శివకుమారి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలం కావడం వల్ల మేమంతా ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకొనసాగించాం. తొలుత మత్స్యశాఖలో అవుట్‌సోర్సింగ్‌లో జాబ్ వచ్చింది. అదిచేస్తూ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాను. అదే సమయంలో పీజీ పూర్తిచేశాను. ఎంతో కష్టపడి కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అయి, ఉద్యోగం సాధించాను. మహిళలు మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో, శారీరకంగా కూడా అంతే దృఢంగా ఉండాలి. సాధారణ మహిళలుగా వచ్చిన తమను శివంగిల్లా తీర్చిదిద్దిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – ఎ.మౌనిక, గుంటూరు జిల్లా కఠినమైన శారీరక శిక్షణ, సమగ్ర న్యాయ విద్య, ఆచరణాత్మక క్షేత్రస్థాయి అభ్యాసాలు, నైతిక విలువలు పెంపొదించడంలో పీటీసీ నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాం. పోలీస్ దళ నిర్మాణానికి పునాదిగా పీటీసీని తీర్చిదిద్దాం. నిరంతర సవాళ్లను దీటుగా ఎదుర్కోనేలా శిక్షణ ఇవ్వడం పీటీసీ ప్రత్యేకత. 473 మంది మహిళా శిక్షణార్థులు తొమ్మిది నెలల పాటూ అద్భుతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – దంతులూరు రామచంద్రరాజు, పీటీసీ ప్రిన్సిపాల్, విజయనగరం పోలీసు దళ నిర్మాణానికి పునాదిగా పీటీసీ.. -
మడ్డువలసకు తగ్గిన ఇన్‌ఫ్లో
వంగర: మడ్డువలస ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 30వేల క్యూసెక్కుల నుంచి 20వేల క్యూసెక్కులకు తగ్గింది. ఆ మేరకు ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో సైతం శనివారం 20వేల క్యూసెక్కులకు తగ్గినట్టు డీఈఈ పి.అర్జున్ తెలిపారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 64.45 మీటర్ల మేర నీరు నిల్వ ఉందన్నారు. నేటి నుంచి అంతర్ జిల్లాల ఆర్చరీ పోటీలు విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 27 నుంచి 29 వరకు అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియన్ పోటీలు జరగనున్నట్టు ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్, ఏపీ స్పోర్ట్స్ ఆథారిటీ, జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి, తదుపరి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. పోటీల ఆహ్వానప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. రేపు అండర్–19 చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ అండర్–19 చెస్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 28న నిర్వహించనున్నట్టు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు ఆర్.వాణిశ్రీ, బి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు లక్కిడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని, జిల్లా స్థాయిలో ప్రతిభకనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ జి.తవిటయ్య సెల్ నంబర్ 94925 90864ను సంప్రదించాలని సూచించారు. -
పత్తి పంటకు నష్టం
పత్తి కాయ విచ్చుకుంటున్న సమయంలో వర్షాలు కురవడంతో పంటకు నష్టం వాటిల్లింది. నాణ్యత తగ్గింది. కొన్నిచోట్ల చేను చనిపోతుండడం వాస్తవమే. దీని నివారణకు పొలంలో నీరు లేకుండా చేయాలి. వ్యవసాయాధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ఎం మధుసూదనరావు, వ్యవసాయశాఖ ఏడీఏనష్టపోయాం.. నేను ఒక ఎకరా పొలం కౌలుకు తీసుకుని పత్తిపంట వేశాను. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షం పంటను ముంచేసింది. ఒక్కో చెట్టుకు 30 నుంచి 40 కాయలు వరకు కుళ్లిపోయాయి. పత్తి దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత తగ్గిపోతోంది. ఎకరాకు రూ.20 వేలు వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. పెట్టుబడి కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడంలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చొక్కాపు నారాయణరావు, పత్తి రైతు, రామభద్రపురం -
అమ్మకానికి భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ..
విజయనగరం ఫోర్ట్: ‘ఏరుదాటే వరకు ఏరు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చంద్రంగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు. అధికారంలోకి రావడం కోసం జామి మండలంలోని భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం... చెరకు రైతులను ఆదుకుంటాం.. యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రస్తుత సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఊరూరా ప్రచారం చేశారు. ఓట్లు దండుకున్నారు. తీరా... అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో జిల్లాకు ఒక్క పరిశ్రమను తెచ్చిన దాఖలాలేవు. ఇప్పుడు భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఏకంగా అమ్మకానికి పెట్టేసింది. వచ్చిన డబ్బులతో రైతులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు జీఓ 250ను జారీచేసింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపించి రైతులకు మేలు చేయాల్సింది పోయి అమ్మకానికి పెట్టడం పట్ల రైతులు మండి పడుతున్నారు. జిల్లాలో ఉన్న మంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఫ్యాక్టరీలో వేలాది మంది రైతులు షేర్ హోల్డర్స్‌గా ఉన్నారు. ఒకవేళ సుగర్ ఫ్యాక్టరీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహాజన సభ ఏర్పాటు చేసి రైతులందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలి. కాని చంద్రబాబు సర్కార్ రైతుల ఆమోదం లేకుండా, ఏకపక్షంగా అమ్మకానికి పెట్టేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అన్యాయం.. ప్రభుత్వం సుగర్ ఫ్యాక్టరీని, భూమిని, ఇతర ఆస్తులను అమ్మకానికి పెట్టడం అన్యాయం. చక్కెర కర్మాగారాలు నష్టాల్లో ఉన్నాయనే సాకును చూపి అమ్మే యడం సరికాదు. వాటిని ఆధునీకరించి, పరిపాలనా లోపాలను సరిచేయాలి. నిధులు వెచ్చించి ఫ్యాక్టరీ తెరిపించే ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఉన్న 29 ఫ్యాక్టరీల్లో 27 మూతపడ్డాయి. పరిశ్రమలు అమ్మకానికి పెట్టడం దారుణం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం. – బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ.. ఇప్పుడు ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి అప్పులు తీర్చేందుకు సర్కారు నిర్ణయం స్పందించని మంత్రి ఆవేదనలో రైతాంగం -
పర్యాటకులను ప్రోత్సహిస్తున్నాం
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పాచిపెంట: ‘సాహసం చేయాలంటే పారమ్మకొండకు రండి’ అనే నినాదంతో పర్యాటకులను ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పారమ్మకొండ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా పారమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారమ్మకొండతో పాటు జిల్లాలోని జలపాతాలు, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అధికారులు, ప్రజాప్రతినిధలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి బ్యాంకుల సమ్మె
విజయనగరం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరంలోని అమర్‌భవన్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించి, సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకంలో (పీఎల్ఐ) ఉద్యోగులు, అధికారులకు న్యాయం చేయడం, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ మురళీశ్రీనివాస్, కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు బీవీ ప్రసాద్, ఎస్బీఐ జోనల్ కార్యదర్శి రమేష్, వివిధ బ్యాంకుల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పైడితల్లిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
విజయనగరం టౌన్/ క్రైమ్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారిని హైకోర్టు జడ్జి సుజాత శనివారం దర్శించుకున్నారు. చదురుగుడికి వచ్చిన జడ్జికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి పూజ అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి విశిష్టత, సిరిమానోత్సవ వైభవాన్ని తెలియజేశారు. ● విజయనగరం కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించే జ్యుడీషియల్ అధికారుల కాన్ఫరెన్స్, వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి వి.సుజాతను ఎస్పీ ఏఆర్ దామోదర్ మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష
విజయనగరం టౌన్/పార్వతీపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలనపై విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టీ రేంజ్ పరిధిలో ఉన్న ఎస్పీలతో శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ కేసులు, సైబర్ క్రైమ్ అంశాలపై జిల్లాల వారీగా ఆరా తీశారు. శాంతిభద్రతల పరిస్థితి, గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక భద్రతా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఎన్నికల భద్రతను ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. మన్యం జిల్లాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని, అక్రమార్కుల ఆస్తుల జప్తుతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు ఏఎస్పీ, పోలవరం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు కె.చక్రవర్తి, తుహిన్ సిన్హా, ఏఆర్.దామోదర్, మాధవ్ రెడ్డి, కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పత్తి రైతు చిత్తు
–8లోపరేడ్ గ్రౌండ్ వీడి ప్రజా రక్షణకు.. మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. పోలీస్ ఉద్యోగం శిక్షణ పూర్తిచేసుకుని ప్రజా రక్షణ విధులకు సిద్ధమవుతున్నారు. రామభద్రపురం: పత్తి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. మొన్నటివరకు ఎల్‌నినో ప్రభావం సాగుపై చూపింది. నీటి వసతి ఉన్నచోట సాగుచేసిన పత్తి పంటను ఇప్పుడు తుఫాన్ ఊడ్చుకుపోయింది. పత్తికాయలు తడవడంతో కుళ్లిపోతున్నాయి. వర్షపు నీరు తగ్గుతున్నకొద్దీ పత్తి మొక్కలు చనిపోతుండడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు. పెట్టుబడి అంతా వర్షార్పణం అయ్యిందని, ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతామంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ● ఇదీ పరిస్థితి... ఈ ఏడాది జిల్లాలో 2,291 హెక్టార్లలో పత్తిపంటను రైతులు సాగుచేశారు. రామభద్రపురం మండలంలోనే 1320 ఎకరాల్లో పత్తిపంట సాగులో ఉంది. మరికొన్నిచోట్ల వరికి ప్రత్యామ్నాయంగా పత్తిని సాగుచేశారు. వర్షాభావంతో పంట కాస్త దెబ్బతిన్నా... ఉన్న పంట చేతికొస్తే పెట్టుబడి వస్తుందని రైతులు ఆశించారు. కాయ పక్వానికి, విచ్చుకునే దశలో కురిసిన తుఫాన్ వర్షాలు పంటను నాశనం చేశాయి. పగిలిన కాయల్లో నీరు చేరడంతో నల్లబడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో యివకపట్టడంతో పత్తి మొక్కలు చచ్చిపోతున్నాయి. చేతికందిన పత్తి కూడా తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంటంతా పాడైందని, అప్పులు ఎలా తీర్చాలో తెలియడంలేదంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఆదుకోండయ్యా.. చిత్రంలో చనిపోతున్న పత్తి మొక్కలు చూపుతున్న రైతు పేరు చొక్కాపు రాములు. రామభద్రపురం గ్రామం. ఈయన ఈ ఏడాది రూ.25 వేలు పైబడి పెట్టుబడి పెట్టి ఎకరం విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేశాడు. ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావంతో కొంత మేర పంట దెబ్బతింది. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ తీవ్రతకు 75 శాతంపైగా నీట మునిగింది. భూమిలో నీరు ఆరుతున్న కొద్దీ మొక్క వేరు కుళ్లిపోవడంతో పాటు ఆకు పూర్తిగా రాలిపోయి చనిపోతోంది. పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం లేదంటూ లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. నిన్నటి వరకు ఎల్‌నినో.. ఇప్పుడు తుఫాన్ వర్షాలతో పంటకు నష్టం వర్షానికి తడిసి ముద్దయిన కాయలు, పత్తి వరదనీరు నిల్వతో చనిపోతున్న చేను ఆవేదనలో రైతులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -
జాతీయస్థాయి పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయులు
సీతంపేట: ఇటీవల తణుకులో జరిగిన 44వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు ఐదుగురు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో ఆయా ఉపాధ్యాయులను పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ శనివారం అభినందించారు. జావెలిన్ త్రో, డిస్క్ త్రో, 5 కిలోమీటర్ల వాక్, షాట్‌ఫుట్, హైజంప్, తదితర పోటీల్లో 17 పతకాలు సాధించారు. వచ్చేనెలలో కోయంబత్తూరులో జరగబోయే జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో కూడా ప్రతిభ కనబరచాలని పీఓ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: ఆడపిల్లల రక్షణపై సమాజంలో అవగాహన పెంచే లక్ష్యంతో జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 11న నిర్వహించనున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భ్రూణ హత్యలను నిరోధిద్దాం – ఆడపిల్లను కాపాడుకుందాం’ అనే ఇతివృత్తంతో పాటు ‘పీసీ అండ్ పీఎన్డీటీ’ చట్టంపై ఈ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూనే, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఈ పోటీలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో విజేతలను ఎంపిక చేసి, బాలికా దినోత్సవం రోజున కలెక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. విజయనగరం టౌన్: అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి టూటౌన్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కుమిలి గెడ్డవీధికి చెందిన చుక్క అప్పన్న (41) మద్యానికి బానిసై, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల కిందట భార్యతో గొడవ పడడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి విజయవాడ వెళ్లిపోయింది. దీంతో మరింతగా తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అప్పన్న తిరిగి ఇంటికి చేరుకోలేదు. స్థానిక కోట్లమాదప్ప వీధి సందు వద్ద మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. అతిగా మద్యం సేవించడంతో పాటు ఫిట్స్ రావడం వల్ల మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
ఆవు మృతితో రైతు గగ్గోలు
జియ్యమ్మవలస రూరల్: మండలలలోని చింతల బెలగాం గ్రామానికి చెందిన గంట జగ్గారావు అనే గిరిజన రైతుకు చెందిన ఆవు శనివారం ఉదయం గ్రామ సమీపంలోకి మేతకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆవు మృతి చెందడంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ‘చలో విజయవాడ’కు అనుమతి లేదు విజయనగరం టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం జిల్లాలో పనిచేస్తున్న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగస్తులు సెప్టెంబర్ 27న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల భద్రత, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు, అత్యవసర సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించలేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పార్వతీపురం రూరల్: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతుల్లేవని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతి లేని ఆందోళన కార్యక్రమాలకు ఉద్యోగులు వెళ్లకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
ఎంఆర్ కళాశాల అధికారులు, వలంటీర్లకు అవార్డులు
విజయనగరం అర్బన్: మహరాజా అటానమస్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్–2, యూనిట్–3 ప్రోగ్రాం అధికారులు సీహెచ్ చిన్నం నాయుడు, డాక్టర్ పీఎన్బీఆర్ఎస్ఎస్ శర్మలతో పాటు వలంటీర్లు టి.వేణు, పి.హర్షవర్ధన్, జి.కార్తీక్, పి.సాహిత్ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ స్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ ఎన్ఎస్ఎస్ అవార్డులను కై వసం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు తెలిపారు. ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా గురువారం ఆంధ్ర విద్యాలయంలో ఇటీవల నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డి.సింహాచలం, రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ సుధాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నారని తెలియజేశారు. -
కాలువలో పడి వ్యక్తి మృతి
చికెన్మక్కువ: మండలంలోని నక్కల వీధికి చెందిన మర్రి పెద భాస్కరరావు(58) వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. భాస్కరరావు ఈ నెల 23వ తేదీన సాయంత్రం డబ్బులు అవసరమని తన భార్య జయమ్మను అడిగి తీసుకొని ఇంటి నుంచి బయటకి వెళ్లి తిరికి ఇంటికి చేరుకోలేదు. భాస్కరరావుకు పిట్స్ ఉండటంతో, ఎక్కడైనా పడిపోయాడేమోనని గత మూడు రోజులుగా, ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. భాస్కరరావు మూకవలస వెళ్లే మార్గంలో ఒక పామాయిల్ తోటలో పని చేస్తుంటాడు. ఆ తోటకి వెళ్లే దారిలో వెంగళరాయసాగర్ కుడి కాలువలో శుక్రవారం విగతజీవుడిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య జయమ్మ సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎం.వెంకటరమణ తెలిపారు. పంచనామా జరిపించేందుకు సాలూరు ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
సాయం చేద్దామని వచ్చి.. శవమైపోయాడు...
● విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి ● కన్నీరుమున్నీరవుతున్న భార్య, పిల్లలు తెర్లాం: గ్రామానికి సంబంధించిన విద్యుత్ పునరుద్ధరణ పనులకు సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై శవమైపోయాడు. మండలంలోని అప్పలంపేట గ్రామానికి చెందిన కాబోతుల పోలిరాజు(37) శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ బి.సాగర్‌బాబు, స్థానికులు తెలిపిన వివరాలు.. అప్పలంపేట గ్రామానికి చెందిన కాబోతుల పోలిరాజు శుక్రవారం ఉదయం చేపలు పట్టడానికి వెళ్తానని భార్య హైమకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రెండు రోజులుగా అప్పలంపేట గ్రామానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో గొలుగువలస వద్ద సంబంధిత అధికారులు విద్యుత్ పునర్ధురణ పనులు చేపడుతున్నారు. గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి విద్యుత్ పునరుద్ధరణ పనులకు సాయం చేసేందుకు పోలిరాజు కూడా వెళ్లాడు. విద్యుత్ పునరుద్ధరణ పనులు చేస్తుండగా ఓ విద్యుత్ స్తంభం విరిగిపోయి పనులు చేస్తున్న వైర్లుపై పడిపోయింది. విరిగి పడిపోయిన విద్యుత్ స్తంభం వైర్లకు విద్యుత్ సరఫరా ఉండడంతో కొత్తగా పనులు చేస్తున్న వైరుకు విద్యుత్ సరఫరా జరిగి పోలిరాజు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే విషయం గ్రామస్తుల ద్వారా పోలిరాజు భార్య హైమకు, కుమార్తెలకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా సంఘటనా స్ధలానికి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతి చెందిన పోలిరాజుకు భార్య హైమ, భార్గవి, భావన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కును కోల్పోడంతో తమకు ఇక దిక్కెవరంటూ మృతుని భార్య, కుమార్తెలు విలపిస్తున్న తీరును చూసి పలువురు కంటడిపెట్టారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు సంబంధిత విద్యుత్ లైన్‌మేన్ ఎల్సీ తీసుకోకుండా, విద్యుత్ సరఫరా నిలుపుదల చేయకుండా పనులు చేస్తుండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఓ నిండు ప్రాణం బలైపోయిందని అప్పలంపేట మండిపడుతున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనతో అప్పలంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుని భార్య హైమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లాలని, మధ్యవర్తిత్వ ప్రక్రియ చాలా సులువైనది, ఖర్చులేనిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.బబిత అన్నారు. మధ్యవర్తిత్వంపై శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 90 రోజుల పాటు ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా మనోవర్తి కేసులు, ప్రమాద బీమా, గృహ హింస, చెక్ బౌన్స్ కేసులు సులువుగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. అనంతరం మధ్యవర్తిత్వంపై ప్రజలలో అవగాహన పెంచడానికి జిల్లా కోర్టు ఆవరణలో ‘మధ్యవర్తిత్యం –దేశం కోసం‘ అనే స్టాల్‌ని ఏర్పాటు చేసి కక్షిదారులకు అవగాహన కల్పించారు. మధ్యవర్తిత్వం కోసం ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర స్టాల్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
అక్టోబర్ 26, 27 తేదీల్లో..పైడితల్లి పండగ
● 25,26తేదీల్లో విజయనగరం ఉత్సవాలు● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం క్రైమ్ : అక్టోబర్ 26, 27 తేదీల్లో పైడితల్లి అమ్మవారి పండగ, 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి వెల్లడించారు. 11 వేదికలు ఏర్పాటు చేసి వైభవంగా విజయనగరం ఉత్సవాలు జరపనున్నట్టు పేర్కొన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం పైడితల్లి ఉత్సవం, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైడితల్లి ఉత్సవాలకు సంబంధించి సాధారణ భక్తులు ఇబ్బంది పడని విధంగా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ విస్తరణ పనులు ఇటీవలె పూర్తయ్యాయని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని, అందుకు తగ్గట్టుగా నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని సిద్ధం చేయాలన్నారు. ఏర్పాట్లలో అమ్మవారి స్ఫూర్తి కనిపించాలన్నారు. లైవ్ స్క్రీనింగ్ కోసం నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. భక్తులకు క్యూలైన్లలో నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. విజయనగరం ఉత్సవాలకు అక్టోబరు 25న ప్రారంభోత్సవ ర్యాలీతో శ్రీకారం చుడతామన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ భక్తుల రాకకు తగ్గట్టుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఆరు జిల్లాల నుంచి పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లాకు రప్పిస్తామని చెప్పారు. పటిష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రైవేటు హుండీలు ఎక్కడా ఏర్పాటు చేయకుండా చూడాలని సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓ సుధాసాగర్, పైడితల్లి అమ్మవారి ఆలయ ఈఓ శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, కమిటీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకం
● సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ విజయనగరం ఫోర్ట్: రోగులకు నాణ్యమైన ఔషధ సేవలను అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేసి వేడుకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సేవల వ్యవస్థలో ఫార్మసిస్టుల ముఖ్యమైన భాగస్వాములన్నారు. వారి అంకితభావం, సేవాతత్పరత, క్రమశిక్షణ అభినందనీయని తెలిపారు. కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ బి.నరసింగ్‌రావు, కళ్యాణ్ ,శ్రీను, కోటమ్మ, ప్రతీ, కల్పన, ఫృద్వీ తదితరులు పాల్గొన్నారు. పోలమాంబ అమ్మవారికి వెండి కిరీటం మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారికి శుక్రవారం శంబర గ్రామానికి చెందిన అర్నిపల్లి పోలిరాజు దంపతులు కిలో వెండి కిరీటాన్ని బహుకరించారు. పోలిరాజు కుమారుడు ఇటీవల గ్రూప్స్‌లో ఉద్యోగం సాధించాడు. ఈ శుభ సందర్భంగా అమ్మవారికి కానుకగా కిలో వెండి కిరీటాన్ని తయారు చేయించి చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారికి మొక్కుగా చెల్లించుకున్నారు. అమ్మవారికి వెండి కిరీటాన్ని అలంకరించి అమ్మవారికి పోలిరాజు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి కిరీటాన్ని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నైదాన తిరుపతిరావుకు అందజేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం గుర్ల: మండలంలోని పాలవలసలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఇల్లు కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. పాలవలసకు చెందిన బక్కురు రాము ఇంట్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ వైర్లు తడిచిపోవడంతో షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎలక్ట్రికల్ వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు పరామర్శించారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో రూ.20 వేలు జరిమానా వీరఘట్టం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసి పాలకొండ కోర్టులో శుక్రవారం ప్రవేశపెట్టినట్లు ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ కేసును విచారించిన పాలకొండ కోర్టు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సి.హెచ్.హరిప్రియ వీరిలో నలుగురుకు రూ.2500 చొప్పున మొత్తం రూ.10 వేలు, మరో వ్యక్తికి రూ.10 వేలు మొత్తం వీరందరికీ రూ.20 వేలు జరిమానాను విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఈవీఎం గోదాముల తనిఖీ
నెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. గోదాముల షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను తెరిపించి, లోపలి గదులను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుప్రక్కల పరిస్థితులను పరిశీలించారు. అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆర్డీఓ సుధాసాగర్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సముద్రపు రామారావు, అప్పికొండ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచేసిన వరద
● పొంగి పొర్లుతున్న నాగావళి ● సాయన్న గెడ్డ ఉగ్రరూపం ● ముంపునకు గురైన పంటలు సంతకవిటి: గోళ్లవలస వద్ద నీట మునిగిన పంట పొలాలు సంతకవిటి/వంగర/రాజాం: విజయనగరం జిల్లా వాసులకు వాన గండం తప్పింది. శుక్రవారం ఉదయం అక్కడక్కడ చిరుజల్లులు మినహా భారీ వర్షాలు కురవలేదు. అయితే, ఒడిశాలో కురిసిన వర్షాలకు వరద నీరు నదులకు పోటెత్తింది. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉగ్రరూపం దాల్చడంతో తీర గ్రామాలతో పాటు వేలాది ఎకరాల్లోని పంట నీటమునిగింది. మొన్నటివరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అనుకూలించలేదు. ఇప్పుడు వరద పంటలను ముంచెత్తడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు. ● నాగావళి నది, సాయన్న గెడ్డలు ఉగ్రరూపం దాల్చడంతో సంతకవిటి మండంలోని జావాం, కొత్తూరు, రామచంద్రాపురం, రంగారాయపురం, పోతులజగ్గుపేట, వాసుదేవపట్నం గ్రామాల ప్రజల జనజీవనం స్తంభించింది. మాధవరాయపురం, కొండగూడేం, గోళ్లవలస, ఎస్.అగ్రహారం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. 1991లో వచ్చినట్టుగా ఈ సారి వరద చుట్టుముట్టిందంటూ తీర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరద గ్రామాల్లో చిక్కుకున్న అధికారులు నాగావళి నది పొంగి పొర్లడంతో తహసీల్దార్ సుదర్శనరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డీటీ మధు, ఎస్సై ఆర్ గోపాలరావు వరద గ్రామాల్లోనే చిక్కుకున్నారు. ఎంపీడీఓ కారు జావాం గ్రామ సమీపంలో వరదలో ఉండి పోవడంతో స్థానికులు వరదకు కొట్టుకు పోకుండా తాళ్ల సహాయంతో స్తంభానికి కట్టారు. నారాయణపురం కుడి ప్రధాన కాలువకు గండ్లు వరద నీరు ఎటూ వెళ్లేందుకు వీలు లేక పోవడంతో రంగారాయపురం వద్ద నుంచి ప్రారంభమైన నారాయణపురం కుడి ప్రధాన కాలువ ఇరువైపుల గట్లకు రంగారాయపురం, వాసుదేవపట్నం సమీపంలో అనేక చోట్ల గండ్లు పడ్డాయి. దీనితో ఒక్కసారిగా వరద నీరు కుడి ప్రధాన కాలువను దాటి రెండో వైపుకు ప్రవహించడంతో వాసుదేవపట్నం గ్రామాన్ని ఒక్కసారి వరద నీరు ముంచెత్తింది. జావాం గ్రామంలోని కర్నేన లక్ష్మీనారాయణమ్మ గుడిసిలోకి వరద నీరు చేరడంతో ఆమెను గ్రామస్థులు గమనించి బయటకు తీసుకు వచ్చి రక్షించారు. అదే గ్రామానికి చెందిన కొమరిపురి సీతారాం పూరిల్లు గోడ కూలింది. చిన్నయ్యపేట, వాసుదేవపట్నం, మందరాడ, కాకరాపల్లి, షాలీపేట, రామారాయపురం, చిత్తారిపురం, మేడమర్తి, తమరాం, మంతిన, బూరాడపేట, పోడలి తదితర గ్రామాల పరిధిలోని 6వేల ఎకరాలకుపైగా వరిపంటపొలాలు నీట మునిగిపోయాయి. వరదనీరు తగ్గాలంటూ ఎస్.అగ్రహారం గ్రామ మహిళలు గంగమ్మతల్లికి పూజలు చేశారు. మడ్డువలసకు పోటెత్తిన నీరువంగర మండల పరిధిలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి వరదనీరు ప్రాజెక్ట్‌కు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైంది. రెండు నదులు నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు ఏడుగేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నారు. నదీతీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు డీఈఈ పి.అర్జున్ వెల్లడించారు. వరదనీరు పోటెత్తడంతో వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆల యం నీటమునిగింది. -
ఎస్టీఓ సస్పెన్షన్
● నూతన ఎస్టీఓగా నూకరాజు బొబ్బిలి: బొబ్బిలి ఉపఖజానాధికారి పీవీ పద్మనాభంపై సస్పెన్షన్వేటు పడింది. పలు ఉపా ధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్టీఓ పనితీరు సక్రమంగా లేదని, లంచాలు అడుగుతున్నారని ఖజానా శాఖ జిల్లా అధికారికి, డైరెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడినట్టు జిల్లా ఖజానాధికారి నాగమహేష్ తెలిపారు. ఆయన స్థానంలో జిల్లాకేంద్రం నుంచి ఎం.నూకరాజును ఉన్నతాధికారులు నియమించారు. దీంతో ఆయన శుక్రవారం విధుల్లో చేరారు. ఆయనకు వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు కురమాన జోగారావు, ఎస్.శ్రీనివాసరావు, సీహెచ్ సురేష్, పి.సింహాచలం, తిరుపతిరావు, తదితరులు స్వాగతం పలికారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ మౌన ప్రదర్శన విజయనగరం క్రైమ్: ఆర్టీసీ సంస్థ నిబంధనలను తుంగలోకి తొక్కి.. సంస్థకు నష్టం చేకూర్చుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) శుక్రవారం ఆందోళన చేసింది. విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించింది. నచ్చిన వారికే ప్రత్యేక డ్యూటీ లు వేస్తున్నారని ఆరోపించింది. నిరసన ప్రదర్శనలో ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు లక్ష్మి, చంద్రయ్య, పద్మావతి, బి.ఎస్.రావు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం ● వంగర తహసీల్దార్‌తో పాటు ఇద్దరు రెవెన్యూ సిబ్బందిపై వేటు వంగర: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించడంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అలసత్వం వహించడంపై కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముంపు ప్రాంతాల్లో సకాలంలో పర్యటించి, వరద బాధితులకు సాయం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులుగా వంగర తహసీల్దార్ పిన్నింటి రామారావుతో పాటు సంగాం వీఆర్వో ఉప్పాడ రామచంద్రరావు, వంగర వీఆర్ఏ కొప్పర ఉదయ్‌కిరణ్‌లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సువర్ణముఖి నది నుంచి భారీగా వరదనీరు రావడంతో కొండచాకరాపల్లి, కొప్పర, గీతనాపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. విషయాన్ని తహసీల్దార్‌కు తెలియజేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన చర్యలు తీసుకున్నారు. వంగర రీసర్వే డీటీగా పనిచేస్తున్న రుంకాన శ్రీనివాసరావును ప్రస్తుతం వంగర ఎఫ్ఏసీ తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. చట్టాలపై అవగాహన అవసరం ● జిల్లా అడిషినల్ సెషన్స్ జడ్జి అప్పలస్వామి చీపురుపల్లి: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా అడిషినల్ సెషన్స్ జడ్జి బి.అప్పలస్వామి అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించకూడదన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు ఉచిత న్యాయసేవాధికార సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వివాదాలజోలికి వెళ్లి కాలాన్ని వృథా చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి ఎ.కృష్ణప్రసాద్, చీపురుపల్లి కోర్టు సివిల్ జడ్జి పి.బుజ్జి, తహసీల్దార్ సంతోష్, సీఐ జి.శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ పరిశుభ్రం
రామభద్రపురం: జిల్లాలో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్ అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. చిన్నపాటి చినుకులకే బురదమయంగా మారింది. ఆసీలు రూపంలో ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా కూడా పంచాయతీ అధికారులు మార్కెట్ నిర్వహణను పట్టించుకోలేదు. మార్కెట్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం, కుళ్లిన కూరగాయల వ్యర్ధాలే దర్శనమిస్తున్నాయి. దీనిపై ‘ఆదాయం ఘనం,.సౌకర్యాలు శూన్యం’ అన్న శీర్షికన ఈ నెల 24వ తేదీన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన మేజర్ పంచాయతీ ఈఓ శ్రీనావాసరావు శుక్రవారం కూరగాయల మార్కెట్లో పరిశుభ్రత పనులు చేపట్టారు. జేసీబీతో మార్కెట్ ఆవరణలోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా చెత్తశుద్ధి కేంద్రానికి తలరించారు. స్వీపర్లతో మార్కెట్లోని చెత్తను పూర్తిగా తొలగించారు. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
● అక్టోబర్ 1 వరకు గడువు.. 5న లాటరీ. ●సిండికేట్లకు చెక్.. : జిల్లా ఎకై ్సజ్ అధికారి కె.సహదేవపార్వతీపురం రూరల్ : జిల్లాలో పునరుద్ధరణకు నోచుకోని తొమ్మిది మద్యం దుకాణాలకు కలెక్టర్ ఆమోదంతో తాజా నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సహదేవ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 56 దుకాణాలకుగాను 47 పాత లైసెన్సీలకే రెన్యువల్ కాగా, మిగిలిన 9 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 3, పార్వతీపురం మున్సిపాలిటీలో 2, పాలకొండ రూరల్, సాలూరు రూరల్, పార్వతీపురం రూరల్, సీతానగరం మండలాల్లో ఒక్కో దుకాణం చొప్పున ఖాళీ ఉన్నాయన్నారు. ఔత్సాహికులు రూ.3 లక్షల దరఖాస్తు రుసుము, రూ.1000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి అక్టోబర్ 1లోగా ఆన్‌న్‌లైన్, ఆఫ్లైన్న్ లేదా హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఎవరైనా, ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, అక్టోబర్ 5న కలెక్టరేట్లో డ్రా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడే అవకాశం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. సాలూరు మున్సిపాలిటీలోని 3 దుకాణాలకు లైసెన్‌న్స్ ఫీజు రూ.60.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలు కాగా.. మిగిలిన ఆరు దుకాణాలకు లైసెన్స్ ఫీజు రూ.71.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.50 లక్షలుగా నిర్ణయించారు. లాటరీలో ఎంపికై న వారు తొలి రోజే మొదటి వాయిదా చెల్లించాలన్నారు. ఎంఆర్పీకే మద్యం విక్రయించేలా దుకాణాల్లో స్కానర్లు, యూపీఐ యంత్రాలు తప్పనిసరి చేశామన్నారు. బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెలలో ఇప్పటికే 40 కేసులు నమోదు చేశామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఏఈఎస్ సంతోష్ కుమార్, సీఐలు వెంకటరాజు, నరసింహమూర్తి, శేఖర్ బాబు పాల్గొన్నారు. -
రిపీట్
చోరీ జైలు బెయిలు పోలీసులకు దొరికిన 110 చోరీల రాంబాబు శ్రీకాకుళం క్రైమ్ : ఒకటి కాదు రెండు కాదు దాదాపు 110 చోరీలకు పాల్పడిన వున్నా రాంబాబు మళ్లీ జిల్లా పోలీసులకు పట్టుబట్టాడు. ఇతడి స్వస్థలం విజయనగరం జిల్లా చీపురుపల్లి. విజయవాడ సిటీ, కృష్ణా, విశాఖపట్నం సిటీ, అనకాపల్లి, విజయనగరంలోనే కాక మన జిల్లాలో ఇతనిపై ఇప్పటికే 110 చోరీలకు సంబంధించి పాత కేసులు నమోదై ఉన్నాయి. జి.సిగడాంకు చెందిన గిడిజాల కోటేశ్వరరావుతో కలసి 32 చోరీల్లో 112 తులాల (కేజీపావు) బంగారాన్ని దోచేసి గత ఏడాది జనవరి 18న జేఆర్ పురం సీఐ ఎం.అవతారం బృందానికి పట్టుబడి జైలుకు వెళ్లాడు. తాజాగా జిల్లాలో మరో 10 చోరీ కేసుల్లో పాల్గొని అదే సీఐ అవతారం బృందానికి శుక్రవారం పట్టుబడటంతో అరెస్టయ్యి కటకటాల పాలయ్యాడు. నిందితుడైన రాంబాబు నుంచి రూ. 41,50,000 లు విలువ చేసే 1.29 కిలోల వెండి, 300 గ్రాముల బంగారం, రూ.2,62,000 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గూనపాలెం సమీప సబ్‌డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద దీనికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఆగస్టు 28న జి.సిగడాంకు చెందిన టంకాల సత్యనారాయణ తన భార్యతో కలసి బంధువుల ఫంక్షన్‌కు విజయవాడ వెళ్లగా ఆయన ఇంటిలో చోరీ జరిగింది. సీఐ ఎం.అవతారం దర్యాప్తు చేపట్టి ఈనెల 24న జి.సిగడాం మండలం నడిమివలస జంక్షన్ వద్ద ఎస్ఐ అప్పలసూరి, సిబ్బందికి రాంబాబు చిక్కడంతో అదుపులోకి తీసుకున్నారు. సీఐ అవతారం విచారణ చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి. రాంబాబు రూటే సెపరేటు.. పగటి పూట తాళం వేసిన ఇళ్లను రాంబాబు టార్గెట్ చేస్తాడు. ఇంటి వద్ద దాచే తాళాలనే తీసి ఇంట్లోకి చొరబడతాడు. ఇంట్లో వారికి అనుమానం రాకుండా ఒకటి రెండు వస్తువులకు (నాలుగైదు తులాలకు) మించి చోరీ చేయడు. ఇంటి దొంగ చేసిన పనిగా క్రియేట్ చేసి వారిలో వారే కొట్టుకునేటట్లు చేస్తాడు. ఎక్కడా వేలి ముద్రలు పడకుండా జాగ్రత్త పడతాడు. క్రికెట్ మోసానికి గురై.. ఇంటర్ వరకు చదివిన రాంబాబుకు మొబైల్ అప్లికేషన్లు, హార్డ్‌వేర్ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యముంది. చిన్నప్పటినుంచి క్రికెట్‌పై మక్కువ ఉండటంతో విజయవాడలో తన అత్తగారింటి వద్దనున్నప్పుడు అక్కడి కోచ్ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. రంజీ జట్టు ఎంపిక విషయంలో కోచ్ మోసం చేయడంతో తట్టుకోలేక వ్యసనాల బాట పట్టాడు. క్రికెట్ బెట్టింగ్ కోసం డబ్బులు దుబారాగా ఖర్చుపెట్టేవాడు. చోరీ చేసిన ఆభరణాలను తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అబద్ధాలు చెప్పి స్నేహితులకు చెప్పి వారి ద్వారా బ్యాంకుల్లోనూ, ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టుపెట్టి డబ్బును పొందేవాడు. జైలుకు వెళ్లడం.. బెయిల్‌పై రావడం 2018 జనవరి 18న కోటేశ్వరరావుతో కలిసి పట్టుబడి అరైస్టె జైలుకు వెళ్లిన రాంబాబు బెయిల్‌పై విడుదలైన కొన్ని నెలలకే విజయవాడ సిటీ పరిధిలో జరిగిన చోరీల కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. మళ్లీ బెయిల్‌పై విడుదలై విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో చోరీల కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడా బెయిల్ పొంది విజయనగరం బొబ్బిలి పోలీసులకు చోరీల కేసులో పట్టుబడి చివరిసారిగా జైలుకెళ్లాడు. ఈ ఏడాది జులైలో విడుదలైన రాంబాబు మళ్లీ చోరీల బాట పట్టి సీఐ అవతారం సమక్షంలోని జె.ఆర్.పురం, సిగడాం పోలీసులకు పట్టుబడ్డాడని, నిందితున్ని రిమాండ్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. తాజా కేసులివే.. జి.సిగడాం 2 కేసులు, జె.ఆర్.పురం 3, కోట బొమ్మాళి 2, సారవకోట, ఆర్.ఎ.వలస (విజయనగరం), నరసన్నపేటల్లో ఒక్కొక్కటి చొప్పున కేసుల్లో నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పూర్తిస్థాయిలో సొత్తును రికవరీ చేయడం విశేషం. -
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం
చీపురుపల్లి: ‘రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. పంటల సాగుకు సంబంధించి కనీస అంచనాలు సర్కారు వద్ద లేవు. దీంతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింద’ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. చీపురుపల్లి మండలంలోని పేరిపి, పీకే.పాలవలస, పత్తికాయవలస గ్రామాల్లో పర్యటించారు. అక్కడ నష్టపోయిన అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ‘ఎల్లో’నినో ప్రభావంతో సాగుకు దూరం.. ‘ఎల్లో’నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఖరీఫ్ చివరి దశలో ఏదోలా పంటల సాగుకు ముందుకెళ్లిన రైతులకు తుపా ను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకుని రైతులను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ విధానం వైపు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందని’ని సర్కారు తీరుపై బెల్లాన మండిపడ్డారు. కరువు జిల్లాగా ప్రకటించాలి.. ‘తుపాను కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అందుకనే జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. అరటి పంటకు రూ.2 లక్షలు, బొప్పాయికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించాల’ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టాల ఊబిలోకి రైతులు.. ‘ప్రకృతి వైపరీత్యాలు, చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు సాగు చేసిన పంటలకు పెట్టుబడి కూడా పరిస్థితి నెలకొంది. దీంతో వారు ఆదాయం కోల్పోయి అప్పులు పాలై, నష్టాల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. కూటమి ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేసింది. సర్కారు చెల్లించాల్సిన ప్రీమియం వాటా విడుదల చేయకపోవడంతో ఇటు రాష్ట్రంతోపాటు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బీమా రాకుండా పోయింది. కనీసం రైతులు బీమా ప్రీమియం చెల్లించాలని అనుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేశార’ని చంద్రబాబు ప్రభుత్వాన్ని బెల్లాన దుయ్యబట్టారు. తాగునీటి తంటాలు.. ‘మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక చాలా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక అవసరాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కూటమి ప్రభుత్వంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజా శ్రేయస్సును పట్టించుకునే వారే లేరు. రాష్ట్రంలో అరెస్టులు, వేధింపులు తప్ప పరిపాలన లేదు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించేంత వరకు రైతులు తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంద’ని బెల్లాన చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, మండలాద్యక్షుడు మీసాల వరహాలనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ దన్నాన జనార్దనరావు, గవిడి సురేష్, కోరాడ పృధ్వి, మీసాల రమణ, రెల్లి శివ, రెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తుపాను కారణంగా జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం అరటికి ఎకరాకు రూ.2 లక్షలు, బొప్పాయికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలి పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది తుపాను నష్టాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘బెల్లాన’ -
గంజాయి కేసులో నిందితుడిపై పీడీయాక్ట్
విజయనగరం టౌన్: గంజాయికి సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా, రౌడీషీటర్‌గా ఉన్న గాబు దుర్గారావుపై పీడీయాక్ట్ ప్రయోగించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాబు దుర్గారావుపై గంజాయికి సంబంధించి పలు కేసులు ప్రస్తుతం పలు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని, అలాగే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉందన్నారు. గడిచిన ఏడాది కాలంలో 17 మందిపై పీడీయాక్ట్ ప్రయోగించి, ఏడాదిపాటు బెయిల్‌పై విడుదల కాకుండా జైలుకు పంపించామన్నారు. చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం రెడ్డికంచేరుకు చెందిన గాబు దుర్గారావు (37)పై పీడీ యాక్ట్ ప్రయోగించి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, ఏడాది పాటు బెయిల్ మంజూరుకాకుండా చేసి, విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామన్నారు. నిందితులు నేర ప్రవృత్తిని విడనాడాలని, చట్టాన్ని గౌరవిస్తూ, సత్ప్రవర్తనతో జీవించాలని, లేకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. లారీని ఢీకొన్న టిప్పర్: టిప్పర్ క్లీనర్ మృతి● టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు దత్తిరాజేరు: మండలంలోని పెదమనాపురంలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో గురువారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై కొత్తగా ప్రారంభించిన వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, టిప్పర్ ఢీకొనడంతో టిప్పర్ క్లీనర్ పడాల లక్షు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై కళాధర్ తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి నుంచి వైజాగ్ వెళ్తున్న టిప్పర్ గజపతినగరం నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న లారీ ఢీకొనడంతో గుర్ల మండలంలోని పెదబంటుపల్లి గ్రామానికి చెందిన టిప్పర్ క్లీనర్ పడాల లక్ష్ము(60)మృతి చెందగా గుర్ల మండలం లవిడాంకు చెందిన టిప్పర్ డ్రైవర్ వై.తిరుపతికి తీవ్ర గాయాల పాలడంతో విజయనగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మృతుడి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళాధర్ చెప్పారు. -
నీరు మోసిన ఏకలవ్య విద్యార్థులు
భామిని: స్థానిక ఏకలవ్య మోడల్ స్కూల్(ఈఎంఆర్ఎస్) విద్యార్థులు నీరు మోసే కూలీలుగా గురువారం మారారు. ఈఎంఆర్ఎస్ నుంచి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలోని ఏపీజీవీ బ్యాంక్ ఎదురుగా ఉన్న చేతిపంపులోని నీరు కొట్టి, క్యాన్లతో ఆటోలో ఎక్కించే పనిలో తలమునకలయ్యారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక పోవడంతో మంచినీటి కోసం విద్యార్థులను తెచ్చామని సిబ్బంది సర్ది చెప్పి దబాయించారు. ఏకలవ్య విద్యార్థులు నీరు కొడుతుంటే స్థానికులు ఆసక్తిగా తిలకించారు.కనీసం ఏకలవ్య స్కూల్లో తాగునీరు వసతి లేక పోవడం, కాంట్రాక్టర్ నీటి సరఫరా కూడా చేయక పోవడంపై విమర్శలు వచ్చాయి. -
విద్యుత్ శాఖకు షాక్..!
విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. గడిచిన రెండు రోజులుగా వీచిన ఈదురుగాలులతో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ వైర్లపై చెట్లు పడడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరం జిల్లా కేంద్రంలో అదే తరహా పరిస్థితి నెలకొనడంతో గురువారం ఉదయం సరఫరాను పునరుద్ధరించారు. వాయుగుండం ప్రభావంతో విద్యుత్ శాఖకు రూ.10.25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని విజయనగరం, ఎస్.కోట, గంట్యాడ, జామి, గజపతినగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, బొబ్బిలి, మెంటాడ తదితర ప్రాంతాలలో ఈదురుగాలుతో కూడిన వర్షాలతో తాటి, సరుగుడు వంటి చెట్లు పడిపోవడం, చెట్ల కొమ్మలు విరగడం కారణంగా సుమారు 129 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 31 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. ఒక్కో స్తంభానికి రూ.5వేలు, ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు రూ.15వేలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా 33కేవీ, 11కేవీ లైన్లలో మొత్తం 499 ఫీడర్లకు గాను 56 ఫీడర్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, పాడైన ట్రాన్స్ఫార్మర్లు మార్పు చేసేందుకు 863 మంది కాంట్రాక్ట్ సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. వాయుగుండం ఎఫెక్ట్‌తో రూ.10.25 లక్షల నష్టం ఈదురుగాలులతో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న విద్యుత శాఖ విజయనగరం, బొబ్బిలి కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుమంచినీటికి ఇబ్బందులు ఇదిలా ఉండగా సుమారు 24 గంటల పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో బోరుబావులను ఆశ్రయించారు. గురువారం సాయంత్రానికి అన్ని ప్రాంతాలకు సరఫరాను పునరుద్ధరిస్తామని, వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సంబంధించి సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎక్కడ అయినా విద్యుత్ స్తంభాలు పడిపోయినా, తీగలు తెగి పడి ఉన్నా , ఎటువంటి సరఫరా అంతరాయాలు ఏర్పడినా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సెంట్రల్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1912కి గానీ విజయనగరం సర్కిల్ కార్యాలయంలో గల కంట్రోల్ రూమ్ నంబర్లు 9490610102, 9490610103కు బొబ్బిలి డివిజన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9490610123ను సంప్రదించి విద్యుత్ అంతరాయంలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఎస్ఈ లక్ష్మణరావు కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ వినియోగదారులను కోరారు. -
జాతీయ పోటీలకు పయనం
బొబ్బిలి: మహారాష్ట్రలో ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న 13వ సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి పోటీలకు రాష్ట్ర జట్టు గురువారం బొబ్బిలిలో బయలుదేరింది. ఈ పోటీల కోసం ఇప్పటికే మండలంలోని పారాది జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోచింగ్ క్యాంపు నిర్వహించారు. వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేసిన జట్టుకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆర్థిక సహాయం చేశారని నిర్వాహకులు తెలిపారు. సాఫ్ట్‌బాల్ అభివృద్ధి సంఘ ఉపాధ్యక్షుడు సుంకరి సాయిరమేష్, అల్లాడ భాస్కర రావు, పీడీ నల్ల వెంకటనాయుడు, కోచ్ బద్రి దుర్గాప్రసాద్ తదితరులు జట్టుకు బెస్టాఫ్ లక్ తెలిపి సాగనంపారు. -
వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం
విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమైనది. వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం వారిదే. రోగి వ్యాధి తగ్గించడంలో వైద్యుడి పాత్ర ఎంత ఉంటుందో, ఫార్మసిస్టు పాత్ర అంతే ఉంటుంది. రోగిని పరీక్షంచిన వైద్యుడు వ్యాధి తగ్గడానికి అవసరమైన మందులు రాసి ఇస్తారు. వైద్యుడు సూచించిన మందులను చూసి మార్చకుండా కచ్చితమైన మందులు అందిచేది ఫార్మసిస్టులే. శుక్రవారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కధనం. రోగికి మందులు అందించడం ద్వారా ఫార్మసిస్టులు వ్యాధిని తగ్గిస్తారు. అయితే మందులు అందించడంలో ఫార్మసిస్టులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వైద్యులు సూచించిన మందులు ఒకదానికి బదులు ఇంకొకటి ఇచ్చినా కాలపరిమితి దాటిన మందులు అందించినా రోగుల ప్రాణాల మీదికి వస్తుంది. కోవిడ్ సమయంలో ఫార్మసిస్టులు వైద్యులతో సమానంగా వారితో కలిసి కోవిడ్ బారిన పడిన వారికి మందులు అందించారు. ప్రపంచంలో మొదటిసారి 2009 సెప్టెంబర్ 25న ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారత దేశంలో 2013లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్‌లో పార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 2014 సెప్టెంబర్ 25నుంచి మన దేశంలో ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫార్మసిస్టులు చేసే పనులు మందులు నిల్వ చేస్తారు. అదేవిధంగా వ్యాక్సిన్‌ను నిర్దేశించిన ఉష్ణోగ్రత లో నిల్వ చేయడం, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో పనిచేసే ఫార్మసిస్టులు పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసే ఫార్మసిస్టులు వైద్యులు రాసి ఇచ్చిన చీటీ ప్రకారం రోగులకు మందులు అందిస్తారు. అదేవిధంగా ఆయా ఆస్పత్రులకు ఎన్ని రకాల మందులు కావాలి, ఎంతకావాలో ఆన్లైన్లో ఇండెంట్ పెడతారు. మందులు ఇచ్చే ముందు రోగులకు ఫార్మసిస్టులు కౌన్సెలింగ్ ఇస్తారు. ఏరకం మందు ఏసమయంలో ఎంత మోతాదులో వేసుకోవాలో వివరంగా తెలియజేస్తారు. జిల్లాలో 1500 మందికి పైగా ఫార్మసిస్టులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, మందులు దుకాణాలు అనేకం ఉన్నాయి. పీహెచ్‌సీలు 50, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 18, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు ఏడు, బోధనాస్పత్రి, ఘోషా ఆస్పత్రి చెరొకటి ఉన్నాయి. 800 వరకు మందుల దుకాణాలు ఉన్నాయి. 200 నుంచి 300 వరకు క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. వాటిలో 1500 మందికి పైగా ఫార్మసిస్టులు పనిచేస్తున్నారు. నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవంరోగులకు అర్థం అయ్యే విధంగా చెప్పాలి జిల్లా ఆస్పత్రికి, బోధనాస్పత్రికి రోగులు ప్రతి రోజూ వేలాది మంది వస్తారు. అయితే తొందరగా వెళ్లిపోవాలనే అలోచనతో వారు మందులు త్వరగా ఇవ్వాలని అడుగుతుంటారు. అటువంటి వారి పట్ల చిరాకు పడడం, విసుక్కోవడం చేయకూడదు. ఓపిగ్గా వారికి అర్థమయ్యే విధంగా అవి ఏ విధంగావాడాలో చెప్పాలి. వృద్ధులు, దివ్యాంగులకు త్వరగా మందులు అందించాలి. ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో మూలస్తంభం లాంటి వారు. మందులు అందించడం ద్వారా ప్రజలకు సేవచేసే అదృష్టాన్ని భగవంతుడు తమకు ఇచ్చిన వరంగా ప్రతి ఫార్మసిస్టు భావించాలి. బమ్మిడి నరసింగరావు, ఫార్మసీ ఆఫీసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
విడాకుల పత్రం లేక.. పింఛన్‌కు దూరం
● 25 ఏళ్లుగా భర్తకు దూరంగా.. కూలి పనులతో జీవనం ● దరఖాస్తుల గడువు ముగియడంతో బాధితురాలి ఆవేదన నెల్లిమర్ల రూరల్: భర్తకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్న తనకు పింఛన్ మంజూరు చేయాలని నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామానికి చెందిన 54 ఏళ్ల కల్లూరి లక్ష్మి కోరుతోంది. నిబంధనల పేరుతో ఎదురవుతున్న సమస్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుమారు 25 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నప్పటికీ, కోర్టు నుంచి విడాకుల ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో పింఛన్ దరఖాస్తు తిరస్కరణకు గురైందని వాపోయింది. ప్రస్తుతం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు పింఛన్ ఒక్కటే ఆసరాగా ఉంటుందని ఆశపడ్డానని తెలిపింది. సుమారు 25 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో భర్తతో ఆమె విడిపోయింది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. తల్లిదండ్రులు కూడా 2023లో మృతి చెందడంతో ప్రస్తుతం ఆమెకు అండగా ఎవరూ లేరు. వయస్సు పెరుగుతున్న కొద్దీ కూలి పనులు చేయడం కష్టంగా మారుతోందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే పింఛన్ తనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. పింఛన్ దరఖాస్తులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా పూర్తయిందని, అయినప్పటికీ తనలాంటి అర్హుల సమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిశీలించాలని ఆమె కోరుతోంది. ఈ సమస్యపై ఇప్పటికే తహసీల్దార్‌ను ఆశ్రయించడంతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలోనూ ఫిర్యాదు చేసినట్లు లక్ష్మి తెలిపింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంపడాం విద్యార్థులు
పూసపాటిరేగ: కర్నూలు జిల్లా ఆదోనిలో అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు విజయనగరం జిల్లా తరఫున పూసపాటిరేగ మండలంలోని వెంపడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 20న విజయనగరం అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో వెంపడాం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎ.గణేష్ కుమార్ తెలిపారు. ఈ పోటీలలో అండర్ 14 ‘ఎ’ విభాగంలో మిరప ఆదిత్య ప్రథమ స్థానం, అండర్–14 ‘బి’ విభాగంలో మహంతి అరవింద్ ప్రథమ స్థానం, అండర్ 14 ‘ఎ’ విభాగంలో మహంతి యమున ప్రథమ స్థానం సాధించగా, అండర్–16 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో వల్లె కీర్తన ద్వితీయస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను మండల విద్యాశాఖాధికారి–2 బి.లచ్చన్న, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం
● అధ్వానంగా రామభద్రపురం అంతర్రాష్ట్ర మార్కెట్ ● చిన్నిపాటి చినుకులకే బురదమయం ● ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారాలు ● పరిశుభ్రత పట్టించుకోని పంచాయతీ అధికారులు ● రైతులకు తప్పని ఇక్కట్లు రామభద్రపురం: జిల్లాలో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన రామభద్రపురం అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు మూలకేంద్రమైన ఈ మార్కెట్ నిర్వహణ రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఆశీల రూపంలో ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. రైతులని చిన్నచూపో.. లేక మట్టి మనుషులని అలుసో.. కానీ పంచాయతీ యంత్రాంగం రైతన్నలకు కనీ సదుపాయాలు కల్పించలేక విఫలమవుతోంది. మార్కెట్లో ఎక్కడ చూసినా చెత్తా,చెదారాలు, కుళ్లిన కూరగాయల వ్యర్థాలే దర్శనిమిస్తున్నాయి. మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలను విక్రయిస్తున్న రైతులతో పాటు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు సైతం వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడే పారబోస్తున్నారు. ప్రతిరోజూ శుభ్రం చేయాల్సిన పంచాయతీ కార్మికులు నెలల కొద్దీ తొలగించకపోవడంతో మార్కెట్ ఆవరణలో అపరిశుభ్రంగా మారుతోంది. దీంతో రైతులు కూరగాయల తట్ట కిందకు దించలేక.. తలపై ఉంచలేక నానా అవస్థలు పడుతున్నారు. అలాగే కూరగాయలు కొనేందుకు వచ్చిన వ్యాపారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు, మొక్కజొన్న కంకులు తీసుకొచ్చిన రైతులు అవి చెల్లకపోవడంతో అక్కడే వారాల కొద్ది వదిలేసి వెళ్లిపోతున్నారు. అలాగే మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు కూడా పాడైన కూరగాయలు అక్కడే పారబోస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వ్యర్థాలు పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. అలాగే ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. ఏడాదికి రూ.40 లక్షల ఆదాయం.. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో ప్రతిరోజూ సుమారుగా రూ.20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే రోజూ సుమారు 2 వేల నుంచి 3 వేల మంది రైతులు.. చిన్న, పెద్ద వ్యాపారులు సుమారుగా 100 మంది నిత్యం కూరగాయలు క్రయ, విక్రయాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మార్కెట్ ద్వారా ఆశీల రూపంలో ఏడాదికి పంచాయతీకి రూ.40 లక్షల ఆదాయం వస్తున్నప్పటికీ పరిశుభ్రత పాటించడంలోనూ, కనీస సౌకర్యలు కల్పించడంలో పంచాయతీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది పంచాయతీ పాలకులు సుమారు రూ.20 లక్షల పంచాయతీ నిధులతో సిమెంట్ గచ్చు నిర్మించారు. ఆ గచ్చు కూడా కూరగాయల వ్యర్ధాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ ఆకులతో అధ్వానంగా మారింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్‌ను శుభ్రపరిచి, కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.ఇబ్బందిగా ఉంది.. మార్కెట్ అంతా కుళ్లిన వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉడడంతో తలపై ఉన్న కూరగాయల తట్ట నేలపై దించడానికే ఇబ్బందిగా ఉంటోంది. పంచాయతీ అధికారులు రోజువారీ నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మార్కెట్ అధ్వానంగా మారింది. ఆశీల వసూలుపై ఉన్న శ్రద్ధ శుభ్రపరచడంలో లేదు. – కోట చిన్నమ్మతల్లి, కూరగాయల రైతు దుర్వాసనతో ఉండలేకపోతున్నాం.. కూరగాయల వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. మార్కెట్లో రోజంతా కూర్చొని కూరగాయలు అమ్ముకోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. విషయాన్ని ఈఓ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఈగలు, దోమలు విజృంభిస్తుండడంతో రోగాలు ప్రబలుతున్నాయి. కన్నమ్మ, చిరు వ్యాపారి -
తోటపల్లి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
సీతానగరం: మండలంలోని ఏగోటివలస వద్ద తోటపల్లి కాలువలో గల్లంతైన కృష్ణా జిల్లా లెంక గ్రామానికి చెందిన మధుకోటి హేమంత్ కృష్ణ (39) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. హేమంత్ కృష్ణ ఓ శుభకార్యం నిమిత్తం మండలంలోని ఏగోటివలస బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు స్నేహితులు ఎస్. పోలినాయుడు, తదితరులతో కలిసి కాలువ వద్దకు వచ్చిన హేమంత్ కృష్ణ ప్రమాదవశాత్తూ నీటిలో పడి గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న తహసీల్దార్ కె. ప్రసన్నకుమార్ పోలీసులు, అగ్నిమాపక, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆయా శాఖల పర్యవేక్షణలో మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పాటు చీకటి నెలకొనడంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా.. బురదలో కూరుకుపోయిన హేమంత్ కృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. విజయవాడ నుంచి వచ్చిన హేమంత్‌కృష్ణ బంధువుల సమక్షంలో శవ పంచనామ చేపట్టి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీటిలో పడి వ్యక్తి.. శృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన మజ్జి మహేష్ (38) అనే వ్యక్తి నీటిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్.కోట పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరమణపేటకు చెందిన మజ్జి మహేష్ ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తుంటాడు. ప్రతిరోజూలాగే సోమవారం ఉదయం కూడా డ్రైవింగ్‌కు వెళ్తానని వాళ్ల అమ్మకు చెప్పిన బయటకు వెళ్లిన మహేష్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఇదిలా ఉంటే వెంకటరమణపేట జంక్షన్‌లోని శివాలయం దగ్గరలో ఉన్న కోనేరులో మృతదేహం తేలి ఉండడాన్ని బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మజ్జి మహేష్‌గా గుర్తించారు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ కోనేరులో పడి చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి భార్య మజ్జి అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాలువలో పడి యువకుడు..చీపురుపల్లి రూరల్ (గరివిడి): కాలువలో పడి యవకుడు మృతి చెందిన సంఘటన గరివిడి పట్టణంలోని కొండపాలెం ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జమ్ము కల్యాణ్ (20) ఇంటి సమీపంలోని కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు.. కల్యాణ్ మద్యం మత్తులో కాలువలో పడిపోయినట్లు సమాచారం. ముఖం కాలువలోకి, కాళ్లు బయటకు ఉన్న స్థితిలో యువకుడ్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడ్ని బయటకు తీసి చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి తల్లి జ్యోతి ఒక్కరే ఉన్నారు. ఆదుకోవాల్సిన కుమారుడి మృతితో తల్లి కన్నీరమున్నీరుగా విలపిస్తున్నారు. గడ్డిమందు తాగి.. వంగర: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కొత్తపల్లి గణపతి (52) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 22న గడ్డి మందు తాగేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న గణపతిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై యందవ పైడితల్లి తెలిపారు. మృతుడి భార్య పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు బతికితేనే ప్రజలకు తిండి..
పార్వతీపురం రూరల్: ఆరుగాలం శ్రమించి జగతికి అన్నంపెట్టే కర్షకుడు కన్నీరుపెడితే కంచంలోకి కూడు రాదని.. రైతు బతికితేనే ప్రజలకు కడుపునిండా తిండి దొరుకుతుందని జంఝావతి సాధన సమితి రైతులు స్పష్టంచేశారు. జంఝావతి ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో సాధించుకునేందుకు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తినాయుడు ఆధ్వర్యంలో సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు నేతృత్వంలో సాగుతున్న ఈ దీక్షల్లో బాలగుడబ, వెంకటరాయుడిపేట, తదితర గ్రామాల అన్నదాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా జంఝావతి ప్రాజెక్ట్ కేవలం ఎన్నికల వాగ్దానాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తంచేశారు. సాగునీరు అందక రైతులు వ్యవసాయాన్ని వీడి వలసబాట పడుతున్నారని వాపోయారు. వెంటనే పాలకులు స్పందించి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జట్టు వ్యవస్థాపకుడు డాక్టర్ డొల్లు పారినాయుడు, న్యాయవాదులు తిరుపతిరావు పట్నాయక్, పూసర్ల సురేశ్ కుమార్, తదితరులు నిరసన శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు వంగల దాలినాయుడు, పల్లి రాజు, పాలక రంజిత్, సంబంగి రమేష్, తెర్లి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. జంఝావతి సాధన సమితి సభ్యులు -
ప్రతి ఒక్కరూ అప్రమత్తం..
విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. బుధవారం రాత్రి జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాంసుదర్‌రెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో 24 గంటల పాటు సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రజలు తెలియజేసిన సమస్యలను ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. లోతట్టు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి ప్రవాహలకు ఉన్న అడ్డంకులు తొలగించి నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు పడిపోయిన చెట్లను తొలగించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. నారాయణపురం ఆనకట్టకు పోటెత్తిన వరద నీరు సంతకవిటి: మండలంలోని రంగారాయపురం వద్దనున్న నారాయణపురం ఆనకట్టకు వరద నీరు పోటెత్తుతోందని డీఈ వై. రవీంద్రనాయు డు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇన్ ఫ్లో పెరగడంతో షట్టర్ల నుంచి వరదనీరు విడిచిపెడుతున్నట్లు చెప్పారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన విజయనగరం టౌన్: జిల్లా కేంద్రంలోని వివిధ సంస్థల్లో అగ్నిమాపక సిబ్బంది బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హోటల్స్, హాస్పిటల్స్, షాపులు, తదితర ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ వి.సోమేశ్వరరావు, లీడింగ్ ఫైర్‌మెన్ నాగరాజు, సత్యారావు, గౌరీ, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: ఎస్.కోట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020 ఫిబ్రవరిలో నమోదైన గంజాయి కేసులో అరెస్టయిన ముగ్గురు ముద్దాయిలకు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ. 10 వేలు చొప్పున జరిమాన విధిస్తూ విజయనగరం ఫస్ట్‌క్లాస్ ఏడీజే కమ్ స్పెషల్ జడ్జి కె.విజయకల్యాణి బుధవారం తీర్పు చెప్పారని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కంచుమర్రు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (ఏ1) హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ, గంజాయికి అలవాటు పడ్డాడు. అరకులో గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చి ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ వంతల సీతారాం (ఏ2), వంతల జీనబంధు (ఏ3)లను సంప్రదించి, వారి వద్ద మూడు కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. ఈక్రమంలో గంజాయిని హైదరాబాద్ తీసుకెళ్తూ ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎస్సై కె.నీలకంఠం, పోలీస్ సిబ్బందికి నిందితులు పట్టుబడ్డారు. దీంతో అప్పటి ఎస్.కోట సీఐ బి. శ్రీనివాసరావు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు జైలు శిక్షతో పాటు జరిమాన విధించారు. ఏపీపీ కేఈ స్వర్ణలత భాను పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. కారును ఢీ కొట్టిన ఆటో పూసపాటిరేగ: భోగాపురం మండలం మహారాజుపేట సమీపంలో కారు నిర్లక్ష్యంగా ఆపడంతో వెనుక వస్తున్న ఆటో కారును ఢీ కొట్టింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంనకు చెందిన మల్లేటి దుర్గాభవాని హైదరాబాద్ వెళ్లేందుకు భోగాపురం ఏఎస్ఆర్ ఎయిర్‌పోర్టుకు ఆటోలో బయలు దేరారు. మహారాజుపేట సమీపంలో ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా కారు సడన్‌గా బ్రేక్ వేయడంతో.. ఆటో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు దుర్గాభవానీకి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్ర తీర ప్రజలు మరింత అప్రమత్తం
● ఎస్పీ ఏఆర్ దామోదర్పూసపాటిరేగ: తుఫాన్ కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి 60–70 కి.మీ.లకు పైబడి గాలులు వీస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. భారీ వర్షాలతో ప్రభావితమైన భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీరప్రాంత గ్రామాలను బుధవారం ఎస్పీ సందర్శించి, ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప తుఫాన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నందున అధికారుల సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు. పోలీసుశాఖ పరంగా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. తీర ప్రాంత గ్రామాలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, విపత్తులను ఎదుర్కొనేందుకు మైరెన్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని, ఎవరూ అభద్రతాభావానికి గురికావాల్సిన పని లేదన్న భరోసాను ప్రజలకు ఎస్పీ కల్పించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాల ప్రభావం రెండు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తమ విలువైన వస్తువులను భద్రపర్చుకోవాలని ఎస్పీ సూచించారు. ముందుగా ఎస్పీ దామోదర్ డెంకాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్సైలతో సమావేశమై, వర్షాల వల్ల తీరప్రాంత గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు, పోలీసుశాఖ చేపట్టిన రక్షణ చర్యలను సమీక్షించారు. అనంతరం ఇతర పోలీసు అధికారులతో కలిసి పూసపాటిరేగ మండలంలోని తమ్మయ్యపాలెం గ్రామం, భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామాలతోపాటు మరికొన్ని తీరప్రాంత గ్రామాలను సందర్శించి, భారీ వర్షాల ప్రభావాన్ని పరిశీలించి, స్థానిక ప్రజలు, మత్స్యకారులతో మమేకమయ్యారు. ఆయన వెంట డీఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, పలువురు ఎస్సైలు, ఇతర పోలీస్ అధికారులు, మైరెన్ పోలీసులు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ పోస్టుల భర్తీ ఎప్పుడు?
సిబ్బంది కొరతతో అరకొర సేవలుఅంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అరకొరగా అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ పోస్టులు భర్తీ చేసింది లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలంలోని ఓ గ్రామంలో ఏడాది కాలంగా అంగన్ వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆయా, కార్యకర్త విధులు కార్యకర్తే నిర్వహిస్తోంది. ● విజయనగరం పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గత కొద్ది నెలలు నెలలుగా ఆయా పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు అ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో కార్యకర్తే ఈ సెంటర్‌కు దిక్కుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ప్రతి మీటింగ్‌లోనూ అధికారంలోకి వస్తే ఏటా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఊరురా గొప్పగా ప్రచారం చేసుకున్నారు.పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతం భర్తీ చేయకుండా తీవ్ర జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సీ్త్ర,శిశు సంక్షేమశాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అధిక సంఖ్యలో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో నిరుద్యోగ మహిళలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అధికారంలోవస్తే ఏటా పోస్టులు భర్తీ చేస్తామన్న చంద్రబాబు వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 112 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 2387 మెయిన్అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిపరిధిలో గర్భిణులు 7,300 మంది, బాలింతలు 7,077 మంది, ఆరు నెలల లోపు పిల్లలు 6509మంది ఉన్నారు. 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలు 35,208 మంది, 3 ఏళ్ల నుంచి 6 సంవత్సరాల పిల్లలు 15,897మంది ఉన్నారు. ఖాళీగా 351పోస్టులు అంగన్వాడీ కేంద్రాల్లో 351 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 317 ఆయా (హెల్పర్ ) పోస్టులు, 30 వర్కర్ (కార్యకర్త) పోస్టులు, 4 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయకుండా టీడీపీ సర్కార్ జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. దీని వల్ల సిబ్బంది కొరత ఉండేది కాదు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సేవలు అందేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయా, కార్యకర్తల్లో ఒక్కరే దిక్కుకార్యకర్త, ఆయా పోస్టుల్లో ఎవరో ఒక్కరే అంగన్వాడీ కేంద్రాలకు దిక్కుగా నిలుస్తున్నారు. కార్యకర్త, ఆయా సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ పోస్టులు భర్తీ చేయక పోవడం వల్ల కార్యకర్త లేని చోట పిల్లలకు బోధన చెప్పువారే కరువుతున్నారు. ఆయా లేని చోట పిల్లలకు రుచికరమైన భోజనం పెట్టే వారు కరువుతున్నారు. పోస్టుల భర్తీకి చర్యలు జిల్లాలో 351 ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడేషన్ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నాం. – కేవీ.బాలామణి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిణి కార్యకర్త, ఆయాల్లో ఒక్కరే అంగన్వాడీ కేంద్రాలకు దిక్కు లబ్ధిదారులకు అరకొరగా సేవలు -
ప్రజల తరఫున పోరాడండి..
సాలూరు/మక్కువ: ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రజల తరఫున నిలబడి సమస్యలపై పోరాటం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూచించారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర.. పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకుడు, మక్కువ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసరావు.. వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మవుడి రంగునాయుడు తాడేపలిల్లో జగన్ మోహన్‌రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. పాలకపక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని జగన్ మోహన్‌రెడ్డి సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలవాలన్నారు. -
లూజుగా సార్టెక్స్ బియ్యం సరఫరా
● స్పందించిన సివిల్ సప్లైస్ అధికారులు విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు విటమిన్స్, మినరల్స్ కలిపిన సార్టెక్స్ బియ్యం గత రెండు నెలలుగా నిలిచిపోయాయనే అనే అంశంపై బుధవారం సాక్షిలో అంగన్వాడీ లబ్ధిదారులకు నిలిచిన సార్టెక్స్ బియ్యం శీర్షికన ప్రచురించిన కథనానికి సివిల్ సప్లైస్ డీఎం బి. శాంతి స్పందించారు. గత రెండు నెలలుగా సార్టెక్స్ బియ్యం ప్రత్యేకప్యాకింగ్ ద్వారా సరఫరా నిలిచిపోయిందన్నారు. అయితే సార్టెక్స్ బియ్యమే లూజు గా సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
పక్కాగా ఆపరేషన్ త్రిశూల్
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ రెడ్డి పార్వతీపురం: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, ప్రజా భద్రత, రహదారి ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న ఆపరేషన్ త్రిశూల్‌ను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ త్రిశూల్’ను ఫొటోలు, సమావేశాలకే పరిమితం చేయకుండా.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి రవాణా జరిగే 29 మార్గాలలో నిఘా, ర్యాండమ్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. 1908 టోల్ ఫ్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. అలాగే బాల్యవివాహల నియంత్రణ, మహిళా భద్రత, మెడికల్ షాపుల తనిఖీలు, రహదారి ప్రమాదాల నివారణకు ఆయా శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో విద్య, వైద్య, రవాణా, పోలీస్, ఎకై ్సజ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
139 మద్యం దుకాణాలు రెన్యువల్
విజయనగరం రూరల్: జిల్లాలోని ఏ– 4 మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియలో భాగంగా 139 దుకాణాలకు రెన్యువల్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎకై ్సజ్ అధికారి బమ్మిడి శ్రీనాథుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాల మేరకు.. 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ ఈ నెల 21తో ముగిసినప్పటికీ.. సుమారు 40 మద్యం దుకాణాలను రెన్యువల్ చేయడానికి యజమానులు ఆసక్తి చూపలేదు. అయితే ప్రభుత్వం మరో రెండు రోజుల గడువు పొడిగించడంతో బుధవారం నాటికి మరో 10 మద్యం దుకాణాలను రెన్యువల్ చేసుకునేందుకు యజమానులు ముందుకువచ్చారు. చీపురుపల్లి ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 19 మద్యం దుకాణాలకు గాను 9 దుకాణాలకే రెన్యువల్ జరగగా, 10 దుకాణాలు రెన్యువల్ కాకుండా మిగిలిపోయాయి. కొత్తవలస, ఎస్.కోట స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం దుకాణాలను యజమానులు రెన్యువల్ చేయగా.. నెల్లిమర్ల పరిధిలో ఒకటి రెన్యువల్ కాకుండా మిగిలిపోయింది. అలాగే భోగాపురం సర్కిల్ పరిధిలో 5, విజయనగరం 1, 2, గజపతినగరం, రాజాం సర్కిళ్ల పరిధిలో మూడేసి దుకాణాలకు రెన్యువల్ కాలేదు. బొబ్బిలి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో రెండు మద్యం దుకాణాలకు రెన్యువల్ కాలేదు. అయితే దుకాణాల రెన్యువల్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 35 కోట్ల మేర ఆదాయం సమకూరింది. రెన్యువల్ ద్వారా కేటాయింపు పొందని 30 మద్యం దుకాణాలను లాటరీ ప్రక్రియ ద్వారా ఇతరులకు కేటాయించనున్నారు. -
మడ్డువలసలో పెరుగుతున్న నీటిమట్టం
● 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ● అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆర్డీవో సుధారాణివంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరుగుతోంది. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు వద్ద 63.60 మీటర్ల లెవెల్ నీటిమట్టం బుధవారం నమోదైంది. ప్రాజెక్టు వద్ద డీఈ పి.అర్జునరావు, ఏఈ నితిన్‌లు నీటి హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు. నదీతీర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాల్లో ఇప్పటికే దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి తెలిపారు. ఈఈ గోవిందరావుతో కలిసి మడ్డువలస ప్రాజెక్టును బుధవారం ఆమె సందర్శించారు. నదుల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో, ప్రాజెక్టులో నీటినిల్వ, పూర్తి స్థాయి సామర్ధ్యం తదితర అంశాలపై ఆర్డీవో ఆరా తీశారు. ప్రాజెక్టు తీర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగితే దిగువ గ్రామాలను అప్రమత్తం చేసి గేట్లు ఎత్తివేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పిన్నింటి రామారావు, డీఈ పి.అర్జున్, ఏఈ నితిన్‌తోపాటు ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి..
గజపతినగరం రూరల్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాతబగ్గాం రైల్వేగేట్ సమీపంలో ఈ నెల 20న గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతను రైలు నుంచి జారిపడడంతో ప్రమాదం జరిగిందా, లేక పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చికిత్స సమయంలో కూడా మాట్లాడలేకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసినవారు 92475 85742, 83099 01038 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
ఆ నలుగురి రాజీడ్రామా..!
● చివరిరోజు పార్టీకి, పదవులకు రాజీనామా ● నవ్వుకుంటున్న ప్రజలు సాక్షి ప్రతినిధి,విజయనగరం: ఓ నలుగురు జెడ్పీటీసీలు తమ పదవీకాలం ముగుస్తున్న చివరి క్షణంలో రాజీనామాలు చేయడం చూస్తున్న ప్రజలు విస్తుపోతున్నారు. బుధవారంతో జిల్లాలోని మండల పరిషత్ చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు సారథ్యంలోని జిల్లా పరిషత్ కాల పరిమితి గురువారం ముగుస్తోంది. అయితే జెడ్పీటీసీల్లో గార తవుడు (గజపతినగరం) వలిరెడ్డి శిరీష (చీపురుపల్లి), వర్రి నరసింహ మూర్తి(గంట్యాడ), నెక్కల శ్రీదేవి(కొత్తవలస) తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే అన్నట్లుగా వీరు రాజీనామా చేసినా, చేయకున్నా మరో పూటలో వారి పదవీ కాలం ముగుస్తోంది. ఎలాగూ మాజీలు కాక తప్పదు..మరి అలాంటప్పుడు రాజీనామా పేరిట రాజీ డ్రామాలు ఎందుకు అనే ప్రశ్నలు ప్రజలనుంచి వస్తున్నాయి. తమను తాము మార్కెటింగ్ చేసుకోవడానికి, తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఇలా ప్రజలను మభ్యపెడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ నలుగురు జెడ్పీటీసీలు ప్రజాబలం, సొంత బలంతో గెలిచారనే దానికన్నా వైఎస్సారే కాంగ్రెస్ పార్టీ మద్దతు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌తోనే గెలిచారన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక తమ నిజరూపం చూపించుకుకున్నారని, అవకాశవాదంతో రాజీనామాలు చేస్తున్నారని ప్రజలే విమర్శిస్తున్నారు. అధికా రం ఉన్నన్నాళ్లు ఇక్కడ.. అవకాశం దొరకగానే అక్కడ అన్నట్లుగా వ్యవహరిస్తున్న వీళ్ల తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఖరీఫ్‌లో శతశాతం సాగయ్యేలా చూడాలి● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్‌లో ఎక్కడా సాగు విస్తీర్ణం తగ్గకుండా చూడాలని, వరిస్థానంలో ఉద్యాన పంటలు, కూరగాయాలు లేదా అపరాలు తదితర పంటలు శతశాతం సాగయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆన్లైన్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడా పంట లేకుండా భూమిని ఖాళీగా ఉంచకూడదన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలకు ఎంతో అనుకూలత ఉందని దానిని వినియోగించుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై దృష్టి పెట్టాలన్నారు. ఖరీఫ్‌కు, రబీకి మధ్య సాగు విస్తీర్ణంలో తేడా ఎక్కువగా ఉంటుందని, వచ్చే రబీలో ఈతేడా తగ్గించి ప్రకృతి సేద్యం ద్వారా ఖరీఫ్‌కు దీటుగా సాగు జరిగేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలోజిల్లా వ్యవసాయ అధికారి ఎం. రామారావు, పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ మన్మథరావు, ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్లైవుడ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
పూసపాటిరేగ: మండలంలోని గైతులచోడవరం సమీపంలో గల సబూరి ప్లైవుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. చింతపల్లి గొల్లపేటకు చెందిన గజ్జి సుబ్బలక్ష్మి (38) సబూరి ఫ్యాక్టరీలో ప్లే డివిజన్లో పని చేస్తోంది. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ కోర్బేల్ మీద పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను విజయనగరం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందింది. ఆమెకు భర్త రాములప్పడు, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఎస్సై వి.అరుణ్‌కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతి -
పోగొట్టుకున్న బ్యాగ్ బాధితుడికి అప్పగింత
రాజాం సిటీ: తాను ప్రయాణిస్తున్న బస్సులో బంగారం, నగదుతో ఉన్న బ్యాగు పోయిన విషయాన్ని గుర్తించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోయిన బ్యాగును సీసీ కెమెరాల ఆధారంగా రికవరీ చేసిన రాజాం పోలీసులు బాధితుడికి మంగళవారం అప్పగించారు. దీనిపై టౌన్ సీఐ డి.నవీన్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన గిరడ సుధాకర్ వినాయక చవితి సందర్భంగా కుటుంబసభ్యులతోపాటు ఈ నెల 12న విశాఖపట్నం నుంచి స్వగ్రామం బస్సులో బయల్దేరాడు. తన బట్టల బ్యాగులో సుమారు రూ.లక్ష విలువచేసే ఏడు గ్రాముల చెవిదిద్దులు, బంగారు ఉంగరం, రూ.2,200 నగదు ఉంచాడు. ఆ బ్యాగును తన సీటుపైన ఉన్న సెల్ఫ్‌లో పెట్టి ప్రయాణిస్తున్నాడు. రాజాం మండలం గురవాం సమీపంలోకి వెళ్లేసరికి బ్యాగు చూడగా కనిపించకపోవడంతో ఆందోళనకు గురై వెంటనే అక్కడి నుంచి రాజాం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీ టీవీల ఆధారంగా బ్యాగు పట్టుకుపోయిన వ్యక్తిని గుర్తించి బ్యాగుతోపాటు అందులోని బంగారం, డబ్బులు రికవరీ చేసి సంబంధిత బాధితునికి మంగళవారం అప్పగించామని సీఐ తెలిపారు. -
చేతబడి నెపంతో దారుణం
● దంపతులపై పొరిగింటి వారి దాడి ● మక్కువ మండలం పెద్దగేశీలలో ఘటన ● ఆస్పత్రికి బాధితుల తరలింపుపార్వతీపురం రూరల్ /మక్కువ: మూఢనమ్మకం పెనుభూతమై ఓ వృద్ధ జంటపై పడగవిప్పింది. ‘చేతబడి’ చేస్తున్నారనే నెపంతో పచ్చని పల్లెలో పగలు బుసకొట్టాయి. మక్కువ మండలం పెద్దగేశీలలో దంపతులపై పొరుగున ఉండే రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కానిక జయమ్మ, అప్పలస్వామి దంపతులపై..అదే వీధికి చెందిన దుంపే, రాయిపిల్లి కుటుంబస్తులు తమకు చిల్లంగి (చేతబడి) చేస్తున్నారనే అనుమానంతో తరచూ కయ్యానికి దిగేవారు. ఈ క్రమంలోనే తాజాగా దంపతులిద్దరిపై ఏడుగురు కలిసి మంగళవారం మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో జయమ్మ తలకు తీవ్ర గాయమై ఏడు కుట్లు పడగా, అప్పలస్వామి తల, ఛాతీ, మోకాళ్లపై బలమైన దెబ్బలు తగిలాయి. దాడిలో గాయాలపాలైన తన తల్లిదండ్రులను చూసి చలించిపోయిన వారి కుమార్తె..హుటాహుటిన మక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. గతంలోనూ మాటువేసి దెబ్బతీశారని, ఆ రెండు కుటుంబాల నుంచి తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని వెల్లడించింది. ఐదేళ్లుగా నరకం: బాధితుల కుమార్తె ఇందిర చేతబడి నెపంతో గత ఐదేళ్లుగా కొందరు వ్యక్తులు తమ తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుల కుమార్తె ఇందిర ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇంట్లో లేని సమ యం చూసి.. ఇంటి నుంచి బయటకు లాగి, కరల్రు, రాళ్లు, గిన్నెలతో అత్యంత దారుణంగా దాడి చేసేవా రని వాపోయింది. 2021లో కూడా ఈ వివాదం సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లగా.. నిందితులు బతిమి లాడడంతో అప్పట్లో వదిలేశామని, అదే ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఘటనలో ఏకంగా వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేశారని వెల్లడించింది. ప్రాణభయంతో నేరుగా మక్కువ పోలీస్ స్టేషనన్‌కు పరుగెత్తి ఫిర్యాదు చేశామని..పోలీసులే స్పందించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి పంపించారని వివరించింది. స్థల వివాదమే నేపథ్యం.. ఈ దాడి ఘటనపై మక్కువ ఎస్సై వెంకటరమణ మాట్లాడుతూ.. మార్కొండపుట్టి పంచాయతీ పరిధి లోని పెదగైశీల గ్రామానికి చెందిన డోనక జయమ్మ, అప్పలస్వామి కుటుంబానికి, నిందితులకు మధ్య గతంలో స్థల వివాదం ఉందన్నారు. ఆ గొడవల నేపథ్యంలో అప్పట్లోనే ఇరు పక్షాలపై శ్రీబైండోవర్శ్రీ కేసులు కూడా నమోదు చేశామని స్పష్టం చేశారు. తాజా దాడిలో బాధితులు స్టేషన్‌న్‌కు రాగానే తక్షణమే స్పందించి పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. -
ముగియనున్న పదవీకాలం
విజయనగరం రూరల్: స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ఒకటి రెండు రోజుల్లో ముగియనుండడంతో జిల్లా పరిషత్‌తో సహా మండల పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసి సుమారు 6 నెలలు గడిచిపోయి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నెల 23న మండల పరిషత్ పాలకవర్గాల (ఎంపీపీ, ఎంపీటీసీలు) పదవీకాలం ముగియనుండగా, ఈ నెల 24న జెడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తికానుంది. 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తొలుత పంచాయతీలకు మార్చిలో ఎన్నికలు నిర్వహించగా, సెప్టెంబర్ నెలలో మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. దీంతో 5 ఏళ్ల అనంతరం స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. చంద్రబాబు సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించడం, ఆ దిశగా ఎన్నికల కమిషన్ అధికారులకు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు గడిచిన రెండు నెలలుగా ఈ ప్రక్రియపై కసరత్తు పూర్తి చేశారు. అయితే ఒకవైపు సర్ ప్రక్రియ కొనసాగుతుండగా, మరోపక్క 2021 ఓటర్ల జాబితాను అనుసరించి ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడంతో ఈసారైనా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగుతాయా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించిన దాఖలాలు ఎప్పుడూ లేవని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జెడ్పీగా విజయనగరం గత ఐదేళ్ల నుంచి పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలోని 34 మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలతో ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గంగా ఉన్న విజయనగరం జిల్లా పరిషత్ ఈ నెల 25 నుంచి 27 మండలాలతో కొనసాగనుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 27 మండలాల నుంచి ఎన్నికై న జెడ్పీటీసీలు, ఎంపీపీలు సభ్యులు జిల్లా పరిషత్‌లో సభ్యులు కానున్నారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు గురువారం నుంచి తాజా మాజీలు కానుండగా, జెడ్పీ చైర్మన్‌తోపాటు జెడ్పీటీసీ సభ్యులు ఈ నెల 25 నుంచి తాజా మాజీలు కానున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఈనెల ఐదో తేదీనే ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, ఈ నెల 25 నుంచి కొత్త జెడ్పీల కార్యకలాపాలు ప్రారంభించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విజయనగరం జిల్లాలో 27 మండలాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాలు 449 ఉండగా, గ్రామ పంచాయతీలు 777 ఉన్నాయి. ఓటర్లు 12 లక్షల 85 వేల 704 మంది ఉన్నారు. -
విద్యుదాఘాతానికి ఒకరి బలి
గజపతినగరం రూరల్ (జామి): జామి మండలంలోని అలమండ గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం, అలమండ గ్రామంలోని వినాయక మంటపం వద్ద విద్యుత్ పనులు చేస్తున్న ఎలక్ట్రీషియన్ ఎస్.గౌరునాయుడు (35) విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. మృతుడు గౌరు నాయుడుకి భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొటానిక్స్ మేనేజర్‌పై కేసు నమోదుపూసపాటిరేగ: భోగాపురం మండలం అక్కివరం జంక్షన్ సమీపంలో గల బొటానిక్స్ కంపెనీ మేనేజర్‌పై యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్ తెలియజేశారు. కంపెనీలో మేనేజరుగా పని చేసిన చోడవరపు ధనుంజయ ఆగస్టు 31 వ తేదీన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, కొంత నగదు పట్టుకుని చెప్పకుండా వెళ్లిపోయి యాజమాన్యానికి నష్టం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలియజేశారు. దీనిపై విచారణ చేసిన భోగాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తోటపల్లి కాలువలో వ్యక్తి గల్లంతు ● కొనసాగుతున్న గాలింపుసీతానగరం: మండలంలోని ఏగోటివలసలో గల తోటపల్లి కాలువలో పడి కృష్ణాజిల్లా ఉయ్యూరు దరి లెంక గ్రామానికి చెంది మధుకోటి హేమంత్ కృష్ణ మంగళవారం గల్లంతయ్యాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాల ప్రకారం..ఏగోటివలస గ్రామానికి చెందిన ఎస్.పోలినాయుడు, గల్లంతైన హేమంత్ కృష్ణ స్నేహితులు. వారిద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నారు. మంగళవారం పోలినాయుడు ఇంట్లో కుమార్తె బాలసారె కార్యక్రమానికి హేమంత్ కృష్ణను ఆహ్వానించాడు. సోమవారం రాత్రి ఏగోటివలస గ్రామానికి చేరుకున్న హేమంత్ కృష్ణ మంగళవారం ఉదయం బహిర్భూమితో పాటు స్నానం కోసం గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటపల్లి కాలువ దగ్గరకు వచ్చాడు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటుండగా హేమంత్ కృష్ణ(39) ప్రమాదవ శాత్తు కాలువలో జారిపడి గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్తులు కాలువలో దిగి గల్లంతైన వ్యక్తిని వెతకడం ప్రారంభించారు. అప్పటికే ఎడతెరిపి లేని వర్షం పడుతుండడంతో వెతకడం కష్టంగా మారింది. అనంతరం పోలీసులు, ఫైర్‌సిబ్బంది కాలువలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ ఎం.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, ఎస్సై ఎం.హేమలత చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని గల్లంతైన వ్యక్తిని గుర్తించడానికి చర్యలు చేపట్టారు.కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె కుమారవర్మ, ఆర్ఐ ఎన్ శ్రీనివాసరావు వీఆర్వో ఆనందరావు పాల్గొన్నారు. ఇంకా గాలింపు సాగుతోంది. -
రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి
● మరో డ్రైవర్, ఇద్దరు క్లీనర్లకు గాయాలుదత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి–మరడాం మధ్యలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్ల వారు జామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో బిహార్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ రవీంద్రకుమార్ యాదవ్ లారీ క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పెదమానాపురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గజపతినగరం నుంచి రామభద్రపురం వైపు యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీని బొబ్బిలి నుంచి గజపతినగరం వైపు వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో బిహార్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ రవీంద్రకుమార్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. బిహర్‌కు చెందిన టిప్పర్ క్లీనర్ బబ్లూ కుమార్‌గౌడ, విశాఖ జిల్లా వేపగుంటకు చెందిన లారీ డ్రైవర్ రాయి వెంకటేష్, విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన లారీ క్లీనర్ ముత్యాలనాయుడులకు గాయాలయ్యాయి, గాయాల పాలైన వారిని గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం మహరాజా ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్సీ గోవిందరావు, గజపతినగరం సీఐ సన్యాశినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి ట్రాఫిక్ దగ్గరుండి క్లియర్ చేసి గాయ పడ్డవారిని చికిత్స కోసం తరలించారు.మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై చెప్పారు. -
ఓటు హక్కు పరిరక్షణకు ఐక్య పోరాటం
● ఓట్ల తొలగింపుపై సీపీఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు ధ్వజంవిజయనగరం గంటస్తంభం: ప్రజాస్వామ్యంలో పౌరుడికి అత్యంత విలువైన ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులంతా ఐక్య కార్యాచరణతో ముందుకు రావాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక డీఎన్ఆర్ అమర్ భవన్లో జిల్లా సీపీఐ కార్యదర్శి ఒమ్మి రమణ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ముసుగులో దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల ఓట్లను తొలగించారని, మరో 42 లక్షల మందికి చిన్నపాటి అక్షర దోషాల పేరిట నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. విజయనగరం జిల్లాలోనే ఏకంగా 1,93,735 ఓట్లను తొలగించడం శోచనీయమన్నారు. కేంద్రంలోని బీజేపీ, కూటమి వర్గాలు ప్రతిపక్షాలను, మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని గల్లంతు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం చనిపోయినవారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను మాత్రమే మినహాయించి, మిగిలిన అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పష్టతనివ్వాలని కోరారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, సీపీఐ సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, ప్రజా సంఘాల నేతలు కె.స్రవంతి, ఖండిపల్లి భీముడు, పురం అప్పారావు, యు.నీలకంఠేశ్వర యాదవ్, సుమన్, రామచంద్రరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విస్తరణకు మార్గం సుగమం
రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగాయి గతంలో తారాపురం వద్ద అర్ధాంతరంగా నిలిచిన రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు తొలగాయి.బాధితులతో పలుమార్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జాతీయ రోడ్డు పక్కన ఉండి ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం రూ.5.54 కోట్లు పరిహారం విడుదల చేసింది.బాధితుల ఖాతాలకు జమచేసేందుకు వారి వివరాలు సేకరించాం.త్వరలో బాధితుల ఖాతాలకు పరిహారం జమకానుంది. – అజూ రఫీజాన్, తహసీల్దార్, రామభద్రపురం భారీ వాహనాల రాకపోకలు ఈ జాతీయ రహదారి మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలకు సంబంధించిన లోడులతో పెద్దపెద్ద భారీ వాహనాలు ఈ జాతీయ రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో గడిచిన కొన్నేళ్లుగా రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆగిన తారాపురం వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా తయారవడంతో పలు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో మనుషులు, పశువులు, జంతువులు మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. అలాగే ఎంతో మంది క్షతగ్రాత్రులుగా మారారు. ఇప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారి కావడం, రోడ్డు వెడల్పు తక్కువ ఉండటంతో పాటు అస్తవ్యస్తంగా ఉండడం, అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల అత్యవసరాలకోసం సమీపంలోని పట్టణ కేంద్రాలకు చేరాలంటే ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కొన్నేళ్ల తర్వాత తారాపురం వద్ద విస్తరణ పనులకు అడ్డంకులు తొలగాయని ఇప్పటికై నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని పలువురు ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు. రామభద్రపురం: ఆరేళ్ల క్రితం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ, రాష్ట్ర రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణాలతో పాటు విస్తరించి ప్రజలు, వాహనచోదకుల రవాణా కష్టాలు తొలగించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా రామభద్రపురం మండలం కొట్టక్కి నుంచి గజపతినగరం వరకు కేంద్ర ప్రభుత్వం ఏన్యువల్ ప్లాన్ కింద రూ.221.40 కోట్ల నిధులతో 26వ నంబరు జాతీయ రహదారి సుమారు 35 కిలో మీటర్ల మేర టూ లేన్ విత్ పావ్డ్ షోల్డర్స్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. రోడ్డు నిర్మాణంతో పాటు కొట్టక్కి నుంచి గజపతినగరం వరకు మధ్యలో ఉన్న 70 నుంచి 80 కల్వర్టులు,3 మైనర్ బ్రిడ్జిలు, గజపతినగరం వద్ద మేజర్ బ్రిడ్జి అధునికీకరించారు. దాదాపు గజపతినగరం కోర్టు దగ్గర నుంచి కొట్టక్కి మీదుగా సాలూరు వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని నిర్మించనున్న సాలూరు బైపాస్కు ఈ రోడ్డు నిర్మాణాన్ని లింక్ చేశారు. అయితే అప్పట్లో జాతీయ రహదారి పక్కన ఉన్న తారాపురం గ్రామం వద్ద సుమారు 300 అడుగుల వరకు రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.విస్తరణ వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలు కోల్పోతున్న నివాసాల యజమానులు విస్తరణ పనులు అడ్డుకున్నారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి విస్తరణ వల్ల భవనాలు కోలోతున్న బాధితులతో పాటు గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామంటూ రాజీ యత్నం చేశారు. అయితే బాధితులు మాత్రం అధిక మొత్తంలో నష్టనరిహారం చెల్లించి, ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ఇరు పక్షాలకు పొంతన కుదరకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో మళ్లీ అధికారులు రంగంలోకి దిగి బాధితులతో చర్చలు జరిపారు. తాము చాలా నష్టపోతున్నామని, రూ.లక్షలు విలువ చేసే ఇళ్లకు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.వేలల్లో ఇస్తామంటే ఎలా అని బాధితులు ప్రశ్నించారు.రోడ్డుకు ఇరువైపులా కొంత మంది వ్యాపారాలు చేస్తూ దశాబ్దాల కాలంగా ఉంటున్న తమకు సంబంధించిన భవనాలను కూల్చివేస్తే జీవనాధారం కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని తమ డిమాండ్‌కు అనుగుణంగాపరిహారం ఇస్తే తప్పితే తమ భవనాలను కూల్చే ప్రసక్తే లేదని బాధితులు ససేమిరా అనడంతో చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. నష్టపరిహారం చెల్లింపు విషయంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మీనమేషాలు లెక్కించింది.అయితే రెవెన్యూ అధికారులు మళ్లీ రంగంలోకి దిగా రాజీయత్నం చేశారు.ఎట్టకేలకు రోడ్డు పక్కన ఉన్న 159 మంది ఇళ్లకు రూ.5.54 కోట్లు పరిహారం విడుదల చేసింది. కోల్పోతున్న ఇంటి అంచనాను బట్టి పలువురు బాధితులకు లక్షల్లో, మరి కొంత మంది బాధితులకు రూ.వేలల్లో పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు తహసీల్దార్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఖాతాలకు పరిహారం జమచేసేందుకు బ్యాంకు ఖాతాలు తదితర వివరాలను సేకరించారు. వైఎస్సార్సీపీ హయాంలో కొట్టక్కి నుంచి గజపతినగరం వరకు 26వ నంబరు జాతీయ రహదారిపై టూ లేన్ నిర్మాణం రూ.221.40 కోట్లతో చేపట్టిన రహదారి పనులు రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతామని అడ్డుపడిన తారాపురం వాసులు అర్ధాంతరంగా ఆగిన జాతీయ రహదారి విస్తరణ బాధితులతో పలుమార్లు చర్చలు జరిపిన రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు చర్చలు సఫలం 159 మంది నిర్వాసితులకు పరిహారం రూ.5.54 కోట్లు విడుదల -
● జగన్‌ను కలిసిన బెల్లాన
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ మంగళవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బెల్లాన చంద్రశేఖర్ తన కుమారుడు చీపురుపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, కోడలు పావనితో కలిసి తాడేపల్లి వెళ్లి జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. – చీపురుపల్లి -
ఔరా..! ఇదేమి పెత్తనం!
● తహసీల్దార్ కుర్చీలో కూర్చుని సమీక్షించిన ఎమ్మెల్యే కుమారుడు ● ఎమ్మెల్యే వస్తారని చెప్పడంతో అధికారుల హాజరు చీపురుపల్లి: నియోజకవర్గ స్థాయిలో సమస్యలు, అత్యవసర పరిస్థితులపై ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షించడం సర్వసాధారణం. కానీ చీపురుపల్లిలో పరిస్థితులు అందుకు భిన్నం. ఎలాంటి పదవులు లేని, ప్రోటోకాల్ ఉండని వారు సైతం ఇక్కడ అధికారులతో సమీక్ష చేస్తుంటారు. ఇక్కడ అధికారులతో సమీక్షించడానికి ప్రజాప్రతినిధి కానక్కర్లేదు... టీడీపీలో పదవి ఉంటే చాలన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తుఫాన్‌పై జరిగిన సమీక్ష సమావేశం ఓ మచ్చుతునక. తుఫాన్ అప్రమత్తత చర్యల కోసం గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమీక్ష ఉందని అధికారుల గ్రూపులో సమాచారం పంపించారు. దీంతో మండల స్థాయి అధికారులంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశం ప్రారంభమయ్యే సరికి ఎమ్మెల్యే లేరు సరికదా.. ఆయన కుమారుడు రామ్‌మల్లిక్‌నాయుడు హాజరై ఏకంగా తహసీల్దార్ బంగార్రాజు కుర్చీలోనే ఆసీనులై సమీక్ష ప్రారంభించారు. పక్క కుర్చీలో తహసీల్దార్ కూర్చున్నారు. దీంతో హాజరైన అధికారులు నివ్వెరపోయారు. ఇదేమి పెత్తనమంటూ అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ఎంత అధికారం ఉంటే మాత్రం ఇలా... ఒక మండల మెజిస్ట్రేట్ కుర్చీలో కూర్చుని అధికారం చెలాయించడం తీవ్ర చర్చగా మారింది. ఇది సరికాదంటూ... పలువురు గుసగుసలాడుకున్నారు. -
అంగన్వాడీ లబ్ధిదారులకు నిలిచిన సార్టెక్స్ బియ్యం
● గతంలో ప్రత్యేక ప్యాకింగ్‌తో బియ్యం ● రెండు నెలలుగా సాధారణ బియ్యమే సరఫరా ● జిల్లాలో 71,991 మంది లబ్ధిదారులు విజయనగరం ఫోర్ట్: సీ్త్ర, శిశు సంక్షేమానికి కోట్లాది రుపాయిలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెబుతుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఉండేందుకు వారికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని కూటమి సర్కార్ చెబుతుంది. ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండడం లేదు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు అందించే సార్టెక్స్ బియ్యం సరఫరా నిలిచిపోవడమే ఆరోపణలకు ఊతమిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల పరిఽఽధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలకు విటమిన్స్, మినరల్స్‌తో కలిపిన సార్టెక్స్ బియ్యం అందించేవారు. గత రెండు నెలలుగా షార్ట్ ఎక్స్ బియ్యం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావడం లేదు. సాధారణ బియ్యమే లబ్ధిదారులకు అందిస్తున్నారు. జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మిని అంగన్వాడీ కేంద్రాలు 292,. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2207 కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 71,991 మంది లబ్ధిదారులు ఉన్నారు. గర్భిణులు 7300 మంది, బాలింతలు 7077 మంది ఉన్నారు. 6నెలలు లోపు పిల్లలు 6509 మంది, 7 నెలలు నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 35,208 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 15,897 మంది ఉన్నారు. టేక్‌హోం రేషన్ గర్భిణులు, బాలింతలకు నెలకు సరిపడ బియ్యం అందిస్తారు. ఒక లబ్ధిదారునికి నెలకు 3 కేజీలు బియ్యం, 5 లీటర్లు పాలు, 25 గుడ్లు, రెండు కేజీలు రాగి పిండి, పావు కేజీ చెక్కీలు, పావు కేజీ బెల్లం, కేజీ అటుకులు, అర లీటరు నూనె లబ్ధిదారులకు అందిస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు ప్రతీ రోజు 75 గ్రాములు బియ్యం, 15 గ్రాములు పప్పు, 5 గ్రాములు నూనె చొప్పన వండి అంగన్వాడీ కేంద్రంలోనే పెడతారు. గర్భిణులకు 3కేజీలు బియ్యం చొప్పున నెలకు 219 క్వింటాళ్లు అవసరం అవుతాయి. బాలింతలకు 212.31 క్వింటాళ్లు బియ్యం అవసరం పడతాయి. 15,897 మంది పిల్లలకు నెలకు 357.6 క్వింటాళ్లు బియ్యం అవసరం పడతాయి. సాధారణ బియ్యమా..! అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు ప్రత్యేక ప్యాకింగ్‌తో కూడిన షార్ట్ ఎక్స్ బియ్యం అందించే వారు. ప్రస్తుతం లూజ్ బియ్యం అందిస్తున్నారు. అయితే వీటిని షార్ట్ ఎక్స్ బియ్యం అనుకుంటున్నాం. సాధారణ బియ్యం అని తెలియదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – కేవీ బాలమణి, పీడీ, ఐసీడీఎస్ -
● తీరప్రాంతంలో తస్మాత్..
పూసపాటిరేగ: తీరప్రాంత గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలలో కార్యకర్తలు వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తతతో వ్యవహరించాలని ఐసీడీఎస్ పీడీ కేవీ బాలమణి సూచించారు. భోగాపురం మండలంలోని తీరప్రాంత గ్రామాలైన ముక్కాం–1, 2, 3, తోటపల్లి, ముంజేరు – 1 అంగన్వాడీ కేంద్రాలను ముందస్తు చర్యలలో భాగంగా మంగళవారం ఆమె సందర్శించారు. కార్యకర్తలకు తుఫాన్ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తీరప్రాంతాలలో అంగన్వాడీ కేంద్రాలలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పీఓ లావణ్యను ఆదేశించారు. ఆమెతో భోగాపురం ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ హేమ తదితరులు వున్నారు. -
సాధారణ బియ్యమే..
గర్భిణులు, బాలింతలకు షార్ట్ ఎక్స్ బియ్యం అందించాలి. ఇప్పుడు సాధారణ ప్రజలకు అందించే బియ్యమే అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్నారు. గతంలో షార్ట్ ఎక్స్ ప్రత్యేక బియ్యం అందించేవారు. గత రెండు నెలలుగా ప్రత్యేక ప్యాకింగ్‌తో ఇచ్చే షార్ట్ ఎక్స్ బియ్యం ప్యాకెట్లు సరఫరా నిలిచిపోయింది. రేషన్ కార్డు లబ్ధిదారులకు అందించే విధంగా గర్భిణులు, బాలింతలకు కూడా లూజ్ తూకం వేసి బియ్యం అందిస్తున్నారు. దీంతో వారికి సాధారణ బియ్యమే దిక్కువుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ నగరంలోని ఓ అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వం సరఫరా చేసిన రేషన్ బియ్యం -
‘సర్’లో ఫారంలపై కలెక్టర్ సూపర్ చెక్
విజయనగరం గంటస్తంభం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సేకరించిన ఫారం – 6, 7, 8లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఫారంలోని వివరాలు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో సిహెచ్.సత్తిబాబు, పర్యవేక్షకులు ప్రసాద్ పాల్గొన్నారు. రీసర్వే పనుల వేగం పెంచాలి : జేసీ విజయనగరం గంటస్తంభం: జిల్లాలో చేపట్టిన భూ రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, 22 ఎ దరఖాస్తుల పరిష్కారం తదితర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) జి.జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రికార్డుల డిజిటలైజేషన్, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ తదితర అంశాల పురోగతిపై ఈ సందర్భంగా సమగ్ర సమీక్ష సాగింది. అనంతరం జేసీ రెవెన్యూ అధికారులతో సమీక్షిస్తూ.. రీసర్వేకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. 22 ఎ కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించి ప్రజలకు సంతృప్తికరమైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. సీబీడీసీతో సురక్షితమైన లావాదేవీలు విజయనగరం ఫోర్ట్: ప్రజా పంపిణీ వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా సురక్షితమైన తక్షణ ట్రేసబుల్ డిజిటల్ లావాదేవీలకు అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అన్నారు. పౌర సరఫరాల అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రేషన్ షాపుల డీలర్ల వివరాల ధ్రువీకరణ, ఈకేవైసీ పూర్తి, బ్యాంకు ఖాతాల సిద్ధత, డీలర్లను సీబీడీసీ ఫ్లాట్‌ఫారంలో నమోదు, మర్చంట్ వాలెట్ల ఏర్పాటు తదితర ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలోడీఎస్ఓ జి.మురిళీనాధ్ పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు వాటా మొత్తం వాపస్ విజయనగరం అర్బన్: టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారుల వాటాగా గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు 543 మంది లబ్ధిదారులకు రూ.93.98 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2017, 2018 సంవత్సరాల్లో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని లబ్ధిదారుల వాటా చెల్లించినప్పటికీ ఇళ్లు కేటాయించని వారి మొత్తాలను తిరిగి చెల్లించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి 543 మంది లబ్ధిదారులకు రూ.93.98 లక్షలు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఈఈ ప్రసాద్, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
● పంటలు ధ్వంసం చేశారు..
సాలూరు, రామభద్రపురం మండలాల పరిధిలోని సుమారు 60 ఆదివాసీ కుటుంబాలు గత నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న జీడి, మామిడి, పత్తి తోటలను అధికారులు పొక్లెయిన్లతో ధ్వంసం చేశారంటూ బాధితులు కలెక్టరేట్ ఎదుట రోదించారు. 2009లో తమకు అటవీ హక్కుల పట్టాలు ఇచ్చారని, అయితే ఈ నెల 9వ తేదీన అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పంటలను నాశనం చేసి అడ్డువచ్చిన వారిని పోలీసులతో అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. ఈ ఘటనపై విచారణ జరిపి పంట నష్టపరిహారంతో పాటు తమ భూములు తమకు దక్కేలా చూడాలని విన్నవించారు. -
తుఫాన్‌పై అప్రమత్తతే ప్రధానం
● ప్రాణ, పశునష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి ● కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08922–236947 ఏర్పాటు ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం గంటస్తంభం: భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు తుఫాన్ పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి, శ్రీకాకుళం, విజయనగరం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తుఫాన్ జాగ్రత్తలను వివరించారు. గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, గెడ్డలు, చెరువులు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 08922–236947 కు సమాచారం అందించాలన్నారు. అవసరమైన చోట్ల జేసీబీలు, ఇతర యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశమున్నందున విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైన పునరావాస కేంద్రాలు, తుఫాను షెల్టర్లు, పాఠశాల భవనాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. -
వైఎస్సార్సీపీలో 50 కుటుంబాల చేరిక
● మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ తీర్థంజియ్యమ్మవలస రూరల్: గుమ్మలక్ష్మీపురం మండలం దిగువమండ పంచాయతీ మాజీ సర్పంచ్ మోటిక లక్ష్మయ్య ఆధ్వర్యంలో 50 గిరిజన కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వారందరికీ చినమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సోమవారం వైఎస్సార్సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కుంభరూక గ్రామానికి చెందిన నీలమ్మ, కిల్లక శాంతమ్మ, ఆరిక రమేష్, తోయక సురేష్, ఆరిక సూర్యారావు, గణపతి, హిమరక వినోద్, మూటక గురునాథం, ఆర్థిక సుహాసిని, టిక్కబాయి గ్రామం నుంచి బిడ్డిక మానస, మందంగి సుక్కు శివ,సుందర్రావు, తదితరులు కాగా మల్లుగూడ గ్రామం నుంచి మండంగి నాగేశ్వరరావు ఆరిక భూషణరావు మండంగి చిరంజీవి తదితరుల కుటుంబాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ ఫలాలను అందించినప్పటికీ గత ఎన్నికల్లో కూటమి నాయకులు అమలు కానీ హామీలు ఇవ్వడంతో వారి మాటలు విని మోసపోయమని తెలిపారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు మా గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తిరిగి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరక తప్పదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దీనమయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మేయర్ రిజర్వేషన్ మళ్లీ బీసీకేనా?
ఎవరి లెక్కలు వారివే! విజయనగరం అర్బన్: విజయనగర నగర పాలక సంస్థ ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ.. మేయర్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా 62 వార్డులు.. 2,23,050 మంది ఓటర్లు... వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల కేటగిరీల వారీగా గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇప్పుడు మేయర్ పీఠం ఏ సామాజిక వర్గానికి దక్కుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. తాజా కులాల వారీ ఓటర్ల లెక్కల్లో బీసీల సంఖ్య 50,786గా ఉంది. ఎస్సీలు 21,980 ఎస్టీలు 986 మంది కాగా, ఇతరుల కేటగిరీలో 1,49,298 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో బీసీల వాటా నుమారు 22.77 శాతం. అయితే, నగరంలోని ఈ గణాంకాల ఆధారంగానే మేయర్ రిజర్వేషన్ ఖరారయ్యే పరిస్థితి లేదు. మేయర్ పదవుల రిజర్వేషన్ రాష్ట్రంలోని కార్పొరేషన్లను యూనిట్‌గా తీసుకుని రొటేషన్ పద్ధతిలో నిర్ణయించనున్నారు. ● తొలి పీఠం బీసీ మహిళకే.. విజయనగరం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. 2021లో వైఎస్సార్సీపీకి చెందిన వెంపడాపు విజయలక్ష్మి తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో 50వార్డుల్లో 48 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు 50 వార్డుల స్థానంలో 62 వార్డులు వచ్చాయి. మేయర్‌ను కూడా ఈసారి కార్పొరేటర్లు కాకుండా నగర ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో రిజర్వేషన్ ఖరారైతే.. అది కేవలం కార్పొరేటర్ల సమీకరణాలకే కాకుండా నగరవ్యాప్తంగా జరిగే మేయర్ ఎన్నికకు కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అయితే, బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంతో మేయర్ పదవి బీసీకే వస్తుందని చెప్పలేం. గతంలో బీసీ మహిళకు కేటాయించిన రిజర్వేషన్ ఈసారి కొనసాగుతుందా? లేక రొటేషన్‌లో మరో కేటగిరీకి అవకాశం వస్తుందా? అన్నది ప్రభుత్వం జారీ చేసే తుది రిజర్వేషన్ నోటిఫికేషన్‌తోనే తేలనుంది. నగరంలో 2.23 లక్షల మంది ఓటర్లలో బీసీలు 50,786 రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయింపు 62 వార్డుల కులాల జాబితాతో పెరిగిన రాజకీయ లెక్కలు వార్డుల పునర్విభజన పూర్తయి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు తనదైన సామాజిక లెక్కలు వేసుకుంటోంది. బీసీ రిజర్వేషన్ వస్తే ఎవరిని తెరపైకి తేవాలి? మహిళా రిజర్వేషన్ అయితే ఏ కుటుంబానికి అవకాశం ఇవ్వాలి? జనరల్ కేటగిరీ అయితే ప్రధాన పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం దక్కాలి? అనే చర్చలు మొదలయ్యాయి. మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక కావడంతో రిజర్వేషన్ ప్రకటించకముందే ఆశావహుల సంఖ్య పెరిగింది. ఎవరికి వారే సన్నాహాలు చేసుకుంటున్నారు. -
బదిలీ అయినా విధులు ఇక్కడే!
విజయనగరం ఫోర్ట్: సీ్త్ర,శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సమగ్రశిశు అభివృద్ధి పథక అధికారులకు (సీడీపీఓలకు) బదిలీ అయింది. ఈ మేరకు సీ్త్ర,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు కార్యాలయానికి, సీడీపీఓలకు ఉత్తర్వులు అందాయి. విజయనగరం సీడీపీఓకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు, భోగాపురం సీడీపీఓకు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరికి, రాజాం ఏసీడీపీఓ(ఎఫ్ఏసీ)కు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు బదిలీ అయింది. రాజాం సీడీపీఓకు పార్వతీపురం మన్యం జిల్లాకు పీడీగా బదిలీ అయితే ఆమె అక్కడ విధుల్లో చేరారు. అల్లూరి సీతారామరాజుజిల్లాకు బదిలీ అయిన ముగ్గురుకు బదిలీ ఉత్తర్వులు వచ్చి ఐదు రోజులైనా ఇంకా ఇక్కడే కొనసాగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 317 అంగన్వాడీ కేంద్రాలు, రాజాం ప్రాజెక్టు పరిధిలో 339, భోగాపురం ప్రాజెక్టు పరిధిలో 272 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. కొందరు అధికారులు బదిలీలను నిలుపుదల చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బదిలీ ఉత్తర్వులు వచ్చాయి సీడీపీఓల బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఇంకా రిలీవ్ చేయలేదు. ప్రస్తుతానికి వారు ఇక్కడే ఉన్నారు. పై నుంచి వచ్చే ఆదేశాల మేరకు రిలీవ్ చేస్తాం. – కె.వి.బాలామణి, పీడీ, ఐసీడీఎస్ -
● గురజాడ స్వగృహంలో 164వ జయంతి వేడుకలకు జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం ● కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు
విజయనగరం క్రైమ్: నవయుగ వైతాళికుడు, మహా కవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు విజయనగరం పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గురజాడ స్వగృహం, గురజాడ కాంస్య విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ, సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురజాడ స్వగృహానికి చేరుకుని, గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్వగృహంలోని గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత గురజాడ స్వగృహం నుంచి గురజాడ కాంస్య విగ్రహం వరకు నిర్వహించిన గురజాడ గీతాలాపన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. గురజాడ సాహిత్య, సామాజిక సంస్కరణల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. అనంతరం గురజాడ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహాకవి గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ, సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురజాడ రచనలు సమాజంలో మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ అందించిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు గురజాడ చేసిన కృషి సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. గురజాడ ఆశయాలను భావిత -
సదరం లెక్కలతో నిత్య నరకం
ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన లోపాలతో కూడిన ధ్రువీకరణలు ఇద్దరు నిస్సహాయుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. గుంకలాం గ్రామానికి చెందిన కాకినాడ నరసింగరావు గత మూడేళ్లుగా మంచానికే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ, సదరం సర్టిఫికెట్లో వైకల్యాన్ని తాత్కాలికంగా పేర్కొనడంతో పింఛన్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ధర్మపురి వాసి ఒలిపిల్లి వెంకటరమణ పక్షవాతంతో చేతులు, కాళ్లు చచ్చుబడి ఊతకర్రతో మాత్రమే నడవగలుగుతున్నా, అధికారులు కేవలం 40 శాతం వైకల్యంగా మాత్రమే నమోదు చేయడంతో పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సరైన ధ్రువీకరణలు జారీ చేసి పింఛన్లు అందేలా చూడాలని చేతులెత్తి అధికారులను వేడుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్నా తాత్కాలిక వైకల్యం అని రాశారని కలెక్టరేట్‌కు వచ్చిన కాకినాడ నరసింగరావు -
చేదెక్కిన చక్కెర
మెరకముడిదాం: పండగలు వేళ ఇంట్లో తీపి తిందామంటే ధరలు చేదు అనుభూతిని మిగుల్చుతున్నాయి. వంటింట్లో నిత్యావసరమైన పంచదార ధర పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం పండగలు, వ్రతాలు, శుభకార్యాల సీజన్ కావడంతో వాటి వినియోగం పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ మార్కెట్లో జూలై నెలాఖరు నాటికి కిలో పంచదార 45 రూపాయలు ఉండగా..ప్రస్తుతం ఈ ధర రూ.75కు చేరింది. ఈనెల ప్రారంభం నుంచి ధరలు మరింత పెరుగుతున్నాయి. 22 రోజుల్లోనే కిలోకు 30 రూపాయలు వరకూ పెరగడం, షాక్‌కు గురిచేస్తోంది. ఒక కుటుంబం సగటున నెలకు 5 కిలోల పంచదారను వినియోగిస్తే సుమారు రూ.150 అదనపు భారం కానుంది. జిల్లాలో చక్కెర వినియోగంలో 35 శాతం వరకూ మాత్రమే ఇళ్లలో ఉండగా , మిగిలిన 65 శాతం హోటళ్లు, బేకరీలు, స్వీట్‌షాపులు, కేటరింగ్ వ్యాపారాలు, డ్రింక్స్, ఫాస్ట్‌పుడ్ తయారీ యూనిట్లలో వినియోగిస్తున్నారు. ధర మరింత పెరిగే అవకాశం ఆగస్టు నుంచి నవంబరు వరకు పండగల సీజన్ కావడంతో పంచదారకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ధరలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. దీశీయ మార్కెట్లో సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 లక్షలు టన్నుల ముడిచక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అది సత్ఫలితాలను ఇస్తే ధరలు అదుపులోకి రావొచ్చని అంటున్నారు. అదేబాటలో బెల్లం పంచదార ధరల పెరుగుదల బాటలో బెల్లం కూడా పయనిస్తోంది. ప్రస్తుతం రూ.70 నుంచి రూ.100 వరకు నాణ్యతను బట్టి బెల్లం ధర ఉంది. ఆర్గానిక్, ప్యూర్ చెరకు, ప్రముఖ బ్రాండ్ల బెల్లం ధరలు మరింత భగ్గుమంటున్నాయి. నాణ్యమైన ఆర్గానిక్ బెల్లం కిలో రూ.100కు పైగా ఉంది. పంచదార, బెల్లంతో పాటూ బియ్యం, నూనెలు, ధనియాలు, పప్పులు, ఉల్లిపాయలు తదితర నిత్యావసర ధరలు పెరుగుతుండడం సామాన్యుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యావసర ధరలు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం వెంటనే వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ౖపైపెకి ఎగబాకుతున్న ధరలు నెలరోజుల్లో కిలోకు రూ.30 వరకూ పెరుగుదల రానున్నరోజుల్లో మరింత పెరిగే అవకాశం అదేబాటలో బెల్లంధరలు టీషాపులు, స్వీట్స్షాపులు, బేకరీలు, హోటళ్ల వ్యాపారంపై ప్రభావం -
నాయీబ్రాహ్మణుల వినూత్న నిరసన
వృత్తి నిర్వహణలో నిరంతరం నిలబడి పనిచేయడం వల్ల 50 ఏళ్లకే నాయీబ్రాహ్మణులు కంటి జబ్బులు, కాళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులతో వృత్తికి దూరమవుతున్నారని, గతంలో ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట బ్యాండ్ మేళాలతో వినూత్న నిరసన చేపట్టారు. డీజేల ప్రభావంతో వాయిద్య కళాకారులకు పనులు దొరకడం లేదని, డప్పు కళాకారుల తరహాలోనే ఆదుకోవాలని సంఘ నేతలు టి.వి.దుర్గారావు, దిమిలి పైడిరాజు కోరారు. అనంతరం జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. -
ప్రతి ఒక్కరు భక్తిభావాన్ని అనుసరించాలి
రేగిడి: ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అనుసరిస్తే మానసిక ప్రశాంతతకు ఎంతో తోడ్పాటునందిస్తుందని గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన శ్రీనివాసరామానుజన్ దాస్ అన్నారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని మండల పరిధిలోని రేగిడి గ్రామంలో సోమవారం ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది ఒక్క ఆధ్యాత్మిక చింతనతోనే సాధ్యమన్నారు. మానవసేవే మాధవసేవగా, సమాజసేవయే పరమాత్ముని సేవగా భావించి ప్రతి ఒక్కరు దైనందిన జీవితాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో కిమిడి సూరపునాయుడు, కిమిడి రవిబాబు, భక్తులు పాల్గొన్నారు. -
అర్జీ వస్తే.. పరిష్కారం కావాల్సిందే..
● జేసీ సేతుమాధవన్ ● పీజీఆర్ఎస్లో 263 వినతులు ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించేలా చూడడంతో పాటు, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ సర్వే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్థితిగతులపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొనగా, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఆన్‌న్‌లైన్ ద్వారా హాజరయ్యారు. న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి విజయనగరం టౌన్: ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యా యం చేయాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా 45 ఫిర్యాదులను స్వీకరించగా వాటిలో భూతగాదాలకు సంబంధించి 18, కుటుంబ కలహాలకు సంబంధించి నాలుగు, మోసాలకు పాల్పడినట్లు నాలుగు, ఇతర అంశాలకు సంబంధించినవి 19 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలపై చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యం అని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహంచిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి 263 వినతులు స్వీకరించారు. వాటిలో 150 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రజలు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాలు, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఫిర్యాదుదారుతో మాట్లాడిన అనంతరం మాత్రమే నివేదిక సమర్పించాలని జేసీ స్పష్టం చేశారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. పరిష్కరించిన వివరాలను ఫిర్యాదుదారులకు తెలియాజేయాలని సూచించారు. 1100 టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీలకు పయనం
గుమ్మలక్ష్మీపురం: జమ్మూ కశ్మీర్లో ఈ నెల 22 నుంచి జరగనున్న అండర్ 10– బాలబాలికల జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిమ్మల దేశిఖ్ రామ్ సోమవారం పయనమయ్యాడు. ఈ మేరకు దేశిక్ రామ్ విజయనగరంలో గల కస్పా స్కూల్స్ వేదికగా ఈ నెల 4వ తేదీన జరిగిన అండర్–10, అండర్–12 ఫెన్సింగ్ ఇండివిడ్యువల్ బాల, బాలికల రాష్ట్ర స్థాయి సెలక్షన్ ట్రయల్స్ ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై , ఇదే నెలలో 5, 6 తేదీల్లో విజయవాడలో గల అలపతి రామారావు అనుమోలు లక్ష్మణరావు ఫంక్షన్ హాల్, (హనుమాన్ పేట)లో జరిగిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ వ్యక్తిగత క్రీడా విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం గెలుపొంది, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యడు. -
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
రజకులను తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల కోసం ప్రతి జిల్లాలో రజక ఆశ్రమ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, మహిళా సంఘాలకు ఉన్నతి పథకం కింద వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. కులవృత్తిదారులపై దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తేవడంతో పాటు దోబీఘాట్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. జనాభా ప్రకారం రాజకీయ పదవులు ఇవ్వాలని, టీటీడీతో పాటు ప్రముఖ దేవాలయాల్లో పారిశుధ్య, నిర్వహణ పోస్టులను రజకులకే కేటాయించేలా పాత జీఓలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రజలకు అండగా పీజీఆర్ఎస్
● పెండింగ్ లేకుండా గడువులోగా అర్జీలు పరిష్కరించాలి ● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: పోలీసు–ప్రజల మధ్య పరస్పర విశ్వాసం బలోపేతం చేయడంతో పాటు, సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆస్తి తగాదాలు, భూవివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, వేధింపులు తదితర సమస్యలపై ఈ కార్యక్రమంలో మొత్తం 14 వినతులు అందాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ఠాణాల అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై చట్టనిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, అర్హులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 31 వినతులు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 31 వినతులు వచ్చాయి. మండలంలోని అడ్డంగి నుంచి అబలాసింగి వరకు రహదారి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు కోరారు. కుసుమూరుకు చెందిన దేవి తనకు ఆశ వర్కర్ పోస్ట్ ఇప్పించాలని కోరింది, ఆంపూర్కు చెందిన గిరిజనులు ఫవర్ వీడర్ తమ గ్రామానికి ఇప్పించాలని విన్నవించారు.తమ భూమికి పొజిషన్ సర్టిపికెట్ ఇప్పించాలని నారాయణగూడకు చెందిన గణేష్ వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.పార్వతీపురం: పీజీఆర్ఎస్ ద్వారా అందే ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతగా స్పందించి, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. అర్జీ స్వీకరణ నుంచి సమస్య పరిష్కారం వరకు జిల్లా యంత్రాంగం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజలనుంచి కలెక్టర్ 132 దరఖాస్తులు స్వీరించారు. ఇందులో 97 సాధారణ దరఖాస్తులు కాగా, 35 రెవెన్యూకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన చేపట్టి, నిబంధనల మేరకు సాధ్యమైనంతవరకు త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీని పరిష్కరించినట్లు కేవలం ఆన్లైన్లో నమోదు చేయడం కాకుండా, అర్జీదారు సమస్యకు వాస్తవికంగా పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీ పురోగతిని అధికారులు నిరంతంర పర్యవేక్షించాలని, ప్రజలకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మెరుగైన సేవలు అందించాలన్నారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం -
23లోగా పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలి
● జేసీ సేతుమాధవన్ విజయనగరం ఫోర్ట్: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఈనెల 23 లోగా పరిశీలన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేతుమాధవన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలన్నారు. అలాగే, ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలందరితో ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలన్నారు. అక్టోబర్ 5న మాపప్ కార్యక్రమం కింద మిగిలిపోయిన వారందరితో మాత్రలు మింగించాలన్నారు. ఈనెల 24 వరకు కుష్ఠువ్యాధిగ్రస్తులను గుర్తించే ఇంటింటి సర్వే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై రూపొందించిన అవగాహన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో పీహెచ్.సత్తిబాబు, డీఎంహెచ్ఓ జీవనరాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ పద్మజ, డీఎల్ఓ కె.రాణి, తదితరులు పాల్గొన్నారు. గిరిజన వర్సిటీని సందర్శించిన జర్నలిస్టుల బృందం విజయనగరం రూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించే లక్ష్యంతో కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యటిస్తున్న పంజాబ్ జర్నలిస్టుల బృందం ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సోమవారం సందర్శించింది. వర్సిటీ వీసీ టి.శ్రీనివాసన్, రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా, ఫైనాన్స్ అధికారి ఎం.శరత్చంద్రబాబు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందంతో పాత్రికేయుల బృందం ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి చర్చ నిర్వహించారు. వర్సిటీ పనితీరు, విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యావకాశాలు, ప్రాంతీయ ప్రజల అభ్యున్నతికి సంస్థ చేపడుతున్న విద్యా, పరిశోధనా పురోగతిని అధ్యాపక బృందం జర్నలిస్టులకు సమగ్రంగా వివరించింది. కార్యక్రమాన్ని వర్సిటీ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ ఇప్పిలి తారకేశ్వరరావు సమన్వయం చేశారు. సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ విజయనగరం టౌన్: కన్యాశుల్కం రచనతో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాకవి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని మూఢ నమ్మకాలు, అసమానతలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో సంస్కరణ భావాలను పెంపొందించడంలో ఆయన రచనలు కీలకపాత్ర పోషించాయన్నారు. విజయనగరం జిల్లా పేరును ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేయవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలపై పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్‌తో ఫీడ్ బ్యాక్ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను కూడా తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు సిద్ధమయ్యాయి. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర శివారుల్లో గల విజ్జి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–14,16,18,20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన ఎంపికల్లో రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 130 మంది క్రీడాకారులకు అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు టీ షర్టులు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్, కోశాధికారి ఆనందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2న సత్యాగ్రహ దీక్ష● కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ విజయనగరం గంటస్తంభం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైమ్, డైలీవేజ్, కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమానం వేతనం, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎన్పీఆర్ భవన్లో సత్యాగ్రహ దీక్ష వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగ భద్రత, 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు, మెడికల్, చైల్డ్‌కేర్ సెలవులు తదితర హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని కోరారు. పిడుగు పడి ఆవు మృతి బొండపల్లి: మండలంలోని గెద్దపేట గ్రామంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇల్లాపు శ్రీనుకు చెందిన ఆవును పొలాల్లోకి తీసుకువెళ్లగా అది మేత మేస్తుండగా పిడుగు పడడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. ఈ విషయాన్ని బొండపల్లి పశువైద్యాధికారికి బాధిత రైతు కుటుంబసభ్యులు తెలియచేసి వివరాలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య బొండపల్లి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని కనిమెరక రైల్వే పట్టాల వద్ద వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మరువాడ గ్రామానికి చెందిన భీమవరపు శ్రీనివాసరావు (50) కొద్ది నెలలుగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో గజపతినగరం నుంచి విజయనగరంవె వెళ్తున్న బొకారో రైలుకు ఎదురుగా నిలబడడంతో వేగంగా వస్తున్న రైలు ధాటికి శ్రీనివాస రావు శరీరం మొత్తం నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు,పెళ్లిళ్లు అయిన కూతురు సంధ్య, కుమారుడు ప్రదీప్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి రైల్వే పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
కకావికలమవుతున్న కాపురాలు..!
పార్వతీపురం రూరల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో పక్కదారి పడుతున్న బంధాలతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సెల్ఫోన్ల దుర్వినియోగం, సోషల్ మీడియా మోజులో పడి అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో కట్టుకున్న వారినే కడతేర్చే సంస్కృతి పెరిగిపోతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలతో కుటుంబాలు వీధిన పడుతుండగా, కన్నవారి అఘాయిత్యాల వల్ల ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. గత ఏడాది (2025)లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 30 హత్యలు జరగ్గా, వాటిలో విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. అడ్డుతొలగించుకునేందుకు దారుణం పాలకొండ మండలం బర్నసీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) జూన్ 2026లో హత్యకు గురైంది. మాజీ వలంటీర్ రెడ్డి భువనేశ్వర్, ఆమెతో ప్రేమాయణం నడుపుతూనే, అదే సమయంలో తీగల కృపారాణి అనే వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో, ప్రియురాలితో కలిసి పకడ్బందీగా పథకం పన్నాడు. జూన్ 6న కారులో తీసుకెళ్లి, కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహం బయటపడకుండా కాళ్లు, చేతులు కట్టేసి, బరువైన రాయి కట్టి తుమరాడ వద్దనున్న చెరువులో పడేశారు. పరువు పోతుందనే భయంతో.. కురుపాం మండలానికి చెందిన ఇద్దరు పిల్లలున్న వివాహిత (30), సీతంపేట మండలానికి చెందిన మరో వివాహితుడు (34) మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరు గ్రామం విడిచి హైదరాబాద్ పారిపోగా, కుటుంబసభ్యులు పట్టుకుని తిరిగి సొంతూరికి తీసుకొస్తున్నారు. అయితే గ్రామంలో అడుగుపెడితే తమ భాగోతం తెలిసిపోయి బంధువుల ఎదుట పరువు పోతుందనే భయంతో మార్గమధ్యంలో కారు దిగి పురుగు మందు తాగేశారు (జూలై 2024). ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ఉరివేసి..ఆత్మహత్యగా చిత్రీకరించి.. దత్తివలసకు చెందిన వివాహితుడు పెరుమాళ్ల రాంబాబు, నడిమివలసకు చెందిన 19 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడంతో, ఏప్రిల్ 2025లో గొంతు నులిమి చంపేశాడు. స్నేహితుల సాయంతో మృతదేహాన్ని బైక్‌పై దాదాపు 150 కిలోమీటర్లు తీసుకెళ్లి, సాలూరు మండలంలోని గాదెపల్లెవలస వద్ద చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అనుమానపు కాటు..మద్యానికి బలి.. జూలై 8న జామి మండలం అలమండలో ఒడిశాకు చెందిన సంజయ్ బెహరా తన భార్యను అనుమానంతో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీంతో వారి ఏకై క కుమారుడు అనాథ అయ్యాడు. అలాగే, ఆగస్టు 2025లో సాలూరులో తాపీ మేసీ్త్రగా పనిచేసే రామకృష్ణ.. మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్య త్రివేణి మెడకు మిక్సీ వైరు బిగించి దారుణంగా హత్య చేశాడు. జూలై 15న పూసపాటిరేగ మండలం పెద్దనడిపల్లిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వివాహితను హతమార్చడంతో ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమయ్యారు. మాయమాటల మత్తులో.. మంటగలుస్తున్న మానవత్వం ప్రియుల మోజులో పడి..కట్టుకున్న వారినే కడతేర్చి ఆవేశంలో అఘాయిత్యం..అంధకారంలో చిన్నారుల భవిష్యత్తు ఆధునికత ముసుగులో..అంతరిస్తున్న విలువలుక్షణికావేశం వద్దు.. కుటుంబ భవిష్యత్తే ముఖ్యం..వివాహేతర సంబంధాల మోజులో పడి, విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడడం అత్యంత బాధాకరం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని కాపురాలు కూలిపోవడమే కాకుండా, అభంశుభం తెలియని చిన్నారులు అనాథలవుతున్నారు. ఏదైనా దారుణానికి ఒడిగట్టే ముందు ఒక్కసారి కుటుంబం, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. తప్పు చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న భయం ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భరోసా నింపుతూ, నేరాల నియంత్రణపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. కుటుంబంలో కలహాలు, అనుమానాలు వస్తే పెద్దల సమక్షంలో లేదా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేకానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రశాంత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలి. బి.వెంకట్రావు, సీఐ, పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్


