వడ్డీ రాయితీని వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వం వడ్డీరాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం వెంటనే వడ్డీ రాయితీ బకాయిలను విడుదలచేసి రైతులను ఆదుకోవాలి.
– బంటుపల్లి వెంకటేశ్వర్లు, రైతు, మెరకముడిదాం


