రైతన్నపై వడ్డీ ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

రైతన్నపై వడ్డీ ఒత్తిడి

Feb 7 2026 3:08 PM | Updated on Feb 7 2026 3:08 PM

రైతన్నపై వడ్డీ ఒత్తిడి

రైతన్నపై వడ్డీ ఒత్తిడి

మెరకముడిదాం:

రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... సాగును బంగారు మయం చేస్తామన్నారు.. పెట్టుబడి సాయం ఠంచన్‌గా ఇస్తామంటూ హామీ ఇచ్చారు... తీరా అధికారంలోకి వచ్చాక రైతన్న నడ్డి విరిచేలా పంట రుణాలు తీసుకున్న రైతులపై వడ్డీ భారం మోపుతున్నారు. 19 నెలలుగా సున్నా వడ్డీ రాయితీని వర్తింపజేయకుండా ఆవేదనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పంటలకు అవసరమైన యూరియా అందకుండా రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా అడ్డంకులు అధిగమించాల్సిన దుస్థితి. ఏడాదిన్నరగా సున్నావడ్డీ రాయితీని అందజేయకుండా జిల్లాలోని లక్షలాది మంది రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.

రైతులపై వడ్డీ భారం...

విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 24 బ్రాంచ్‌లు ఉండగా, వారి పరిధిలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార సరసతి సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. వీటి పరిధిలో లక్ష మంది వరకూ సభ్యులున్నారు. ప్రస్తుతం వీరికి ఏటా రూ.320 కోట్లు వరకూ బ్యాంకు అధికారులు పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. డీసీసీబీతో పాటు పలు వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకూ పంట రుణాలను ఇస్తున్నాయి. లక్ష రూపాయలు రుణం తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడంతో వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి అసలుతో పాటు మొత్తం వడ్డీని రైతులే చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3వేలు చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన 4శాతం వడ్డీ రాయితీని గత 19 నెలలుగా ఇవ్వడం లేదు. జిల్లాలో సుమారు రూ.120 కోట్లు మేర వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రతిరైతు ఏటా దాదాపు రూ.8వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది.

పంట రుణాలపై ప్రభుత్వం 19 నెలలుగా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో ఆ భారం రైతులపైనే పడుతోంది. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ, వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీలు కూడా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. రుణం చెల్లింపులో ఏడాదిలో ఒక్కరోజు దాటినా 13 శాతం వడ్డీతో వసూలు చేస్తున్నాయి. వడ్డీల భారం భరించలేక రైతులు తల్లడిల్లుతున్నారు.

రైతన్నకు సున్నం.. సర్కారుకు వడ్డీ లాభం

సున్నావడ్డీ రుణాలకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు!

తీసుకున్న రుణాలు సకాలంలో

చెల్లించినా సున్నావడ్డీని అందించని వైనం

సమయానికి సున్నావడ్డీ వాటాను

చెల్లిస్తున్న కేంద్రప్రభుత్వం

19 నెలలు కావస్తున్నా సున్నావడ్డీ ఊసెత్తని చంద్రబాబు సర్కారు

ఏటా రూ.120 కోట ్లవరకు వడ్డీభారం

ఆవేదనలో రైతాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement