మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ | PM Modi begins two day visit to Malaysia | Sakshi
Sakshi News home page

మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ

Feb 7 2026 10:28 AM | Updated on Feb 7 2026 10:35 AM

PM Modi begins two day visit to Malaysia

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) తన  రెండు రోజుల మలేషియా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ కానున్నారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై  ఇరువురు నేతలు చర్చించనున్నారు.
 

ఈ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ  ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రక్షణ, భద్రతా సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవడమే మా లక్ష్యం. ఆర్థిక, ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, నూతన రంగాలలో మా సహకారాన్ని విస్తరిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ఆధునిక అంశాల్లో కూడా మలేషియాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని  ఆ ప్రకటనలో తెలిపారు.

మలేషియా అభివృద్ధిలో అక్కడి భారతీయ సంతతి పోషిస్తున్న పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. మలేషియాలోని భారతీయులను కలుసుకోనున్నానని తెలిపారు. మలేషియా పురోగతికి వారి అపారమైన కృషి ఉందన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఒక సజీవ వంతెనలా వారు పోషిస్తున్న పాత్ర, చారిత్రక స్నేహానికి బలమైన పునాదిని అందిస్తోందని మోదీ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: ‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement