ఓం బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధం  | Prime Minister Narendra Modi hid behind Lok Sabha Speaker | Sakshi
Sakshi News home page

ఓం బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధం 

Feb 6 2026 2:23 AM | Updated on Feb 6 2026 2:23 AM

Prime Minister Narendra Modi hid behind Lok Sabha Speaker

స్పీకర్‌ వెనుక మోదీ దాక్కున్నారు

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపాటు 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సభకు రాకుండా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెనుక దాక్కున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ధ్వజమెత్తారు. మోదీ సభకు వస్తే కాంగ్రెస్‌ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, అందుకే రావొద్దని చెప్పానంటూ బిర్లా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. గురువారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. సభకు వచ్చి విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదన్నారు. అందుకే స్పీకర్‌తో అబద్ధాలు చెప్పిస్తున్నారని విమర్శించారు. 

సభలో మోదీపై దాడి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదని స్పష్టంచేశారు. మోదీపై చేతులెత్తే ప్రసక్తే లేదన్నారు. లేని ఆలోచన ఉన్నట్లు కల్పించవద్దని సూచించారు. బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి స్థానం వద్ద ముగ్గురు మహిళా ఎంపీలు నిల్చున్నారని, అంతకు మించి ఏమీ జరగలేదని ప్రియాంక గాంధీ తేలి్చచెప్పారు. సభలో ఏదైనా మాట్లాడేందుకు అధికారపక్ష ఎంపీలకు స్పీకర్‌ అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. తమను మాత్రం మాట్లాడనివ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలను ఎందుకు మాట్లానివ్వడం లేదో మోదీని, అమిత్‌ షాను అడగాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీని సైతం అనుమతించడం లేదని ఆమె ఆక్షేపించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement