200 భారత వెబ్‌సైట్లను సీజ్‌ చేసిన అమెరికా | DEA seizes over 200 illegal India-linked pharmacy websites | Sakshi
Sakshi News home page

200 భారత వెబ్‌సైట్లను సీజ్‌ చేసిన అమెరికా

Feb 6 2026 1:33 AM | Updated on Feb 6 2026 1:33 AM

DEA seizes over 200 illegal India-linked pharmacy websites

న్యూయార్క్‌: అనుమతి లేని, ప్రమాదకరమైన ఔషధాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న భారత్‌కు చెందిన 200కు పైగా వెబ్‌సైట్‌లను స్తంభింప జేసినట్లు అమెరికా ఫెడరల్‌ అధికారులు తెలిపారు. ఇవన్నీ భారత్‌ కేంద్రంగా పనిచేసే ఓ నేర సంస్థకు చెందినవని చెప్పారు. ఈ సంస్థ సరఫరా చేసిన ఔషధాలను వినియోగించి ఆరుగురు చనిపోగా, నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు.

 ఆన్‌లైన్‌లో అదేవిధంగా, యూఎస్‌ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మిని్రస్టేషన్‌(డీఈఏ) బృందాలు ‘ఆపరేషన్‌ మెల్ట్‌డౌన్‌’లో భాగంగా దేశవ్యాప్తంగా సోదాలు జరిపి నలుగురిని అరెస్ట్‌ చేశాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌ ముఠాలతో చేతులు కలిపిన ఆన్‌లైన్‌ ఫార్మసీ వెబ్‌సైట్లు సరైన ప్రిస్రి్కప్షన్లు లేకుండానే ప్రమాదకరమైన ఫెంటానిల్‌ వంటి వాటితో కూడిన కల్తీ మందులను అంటగడుతున్నాయన్నారు. ఈ వెబ్‌సైట్లు అమెరికాకు చెందినవిగా కనిపించేందుకు తప్పుడు చిరునామాలను ఇస్తున్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement