అనురాగ్‌ ఠాకూర్‌కు ఊరట  | Supreme Court Lifts Ban On Anurag Thakur To Hold BCCI | Sakshi
Sakshi News home page

అనురాగ్‌ ఠాకూర్‌కు ఊరట 

Feb 6 2026 1:11 AM | Updated on Feb 6 2026 1:11 AM

Supreme Court Lifts Ban On Anurag Thakur To Hold BCCI

బీసీసీఐ వ్యవహారాల్లో మళ్లీ పాల్గొనవచ్చు

2017నాటి ఉత్తర్వులను సవరిస్తూ సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: బీసీసీఐ (బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భారత క్రికెట్‌ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చంటూ 2017లో ఇన ఆదేశాలను సవరించింది. అప్పటి ఆదేశాలను సవరించాలంటూ ఠాకూర్‌ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 

కేసు నేపథ్యమిదీ.. 
ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డుకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం సహా బోర్డు పనితీరులో పారదర్శకత తెచ్చేందుకు అవసరమైన సంస్కరణలను చేపట్టాలంటూ అప్పట్లో బీసీసీఐ చైర్మన్‌గా ఉన్న అనురాగ్‌ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం నియమించిన లోథా కమిటీ కొన్ని సూచనలతో బోర్డుకు నివేదిక అందించింది. వీటిని బోర్డు అమలు చేయలేదు. పైపెచ్చు, తమది స్వతంత్ర సంస్థగా ప్రకటించాలంటూ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) చైర్‌పర్సన్‌ శశాంక్‌ మనోహర్‌కు బీసీసీఐ చైర్మన్‌గా ఉన్న ఠాకూర్‌ ఓ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. 

అనంతరం దీనిపై, సుప్రీంకోర్టుకు బీసీసీఐ చైర్మన్‌ ఠాకూర్‌ తప్పుడు అఫిడవిట్‌ సమరి్పంచారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. తమ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచారంటూ, ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. అయితే, ఠాకూర్‌ స్వయంగా న్యాయస్థానానికి హాజరై, బేషరతు క్షమాపణలు చెప్పడంతో శాంతించింది. అయితే, బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పదవి నుంచి తక్షణమే వైదొలగాలంటూ ఠాకూర్‌కు 2017 జనవరిలో ఆదేశాలింది.  

ఠాకూర్‌ వాదన ఇదే.. 
కోర్టు ఆదేశాల మేరకు బోర్డు పదవికి, కార్యకలాపాలకు దూరంగా ఉండబట్టి 9 ఏళ్లు గడిచాయని గుర్తు చేశారు. తనపై విధించిన నిషేధాన్ని ఇకనైనా ఎత్తివేయాలని కోరారు. జీవితకాలం నిషేధంగా అప్పటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొనలేదని తెలిపారు. బోర్డు చైర్మన్‌ హోదాలో అప్పట్లో చోటుచేసుకున్న అన్ని పరిణామాలకు తానే బాధ్యత వహించాల్సి వందని పేర్కొన్నారు. 

నేరానికి తగిన శిక్ష.. 
వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో ప్రపోర్షనాలిటీ సిద్ధాంతాన్ని వర్తింపజేయడం సరైందని భావిస్తున్నామంది. ‘వాస్తవానికి న్యాయస్థానం ఠాకూర్‌పై జీవితకాల నిషేధాన్ని విధించాలని అనుకోలేదు. కేసులోని వాస్తవాలు, పరిస్థితులను బట్టి కఠినమైన నిషేధం విధించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. పరిపాలనాపరమైన లోపానికి జీవితకాలం పాటు పదవులకు దూరం చేయడం అతి అవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. 2017లో ఇచి్చన ఆదేశాలు ఆ సమయానికి అవసరమైనవే తప్ప, శాశ్వతం కాదన్న ధర్మాసనం.. ఠాకూర్‌ తిరిగి బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనవచ్చని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement