breaking news
lodha committe
-
అనురాగ్ ఠాకూర్‌కు ఊరట
న్యూఢిల్లీ: బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భారత క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చంటూ 2017లో ఇన ఆదేశాలను సవరించింది. అప్పటి ఆదేశాలను సవరించాలంటూ ఠాకూర్ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేసు నేపథ్యమిదీ.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం సహా బోర్డు పనితీరులో పారదర్శకత తెచ్చేందుకు అవసరమైన సంస్కరణలను చేపట్టాలంటూ అప్పట్లో బీసీసీఐ చైర్మన్‌గా ఉన్న అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం నియమించిన లోథా కమిటీ కొన్ని సూచనలతో బోర్డుకు నివేదిక అందించింది. వీటిని బోర్డు అమలు చేయలేదు. పైపెచ్చు, తమది స్వతంత్ర సంస్థగా ప్రకటించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్పర్సన్ శశాంక్ మనోహర్‌కు బీసీసీఐ చైర్మన్‌గా ఉన్న ఠాకూర్ ఓ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. అనంతరం దీనిపై, సుప్రీంకోర్టుకు బీసీసీఐ చైర్మన్ ఠాకూర్ తప్పుడు అఫిడవిట్ సమరి్పంచారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. తమ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచారంటూ, ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. అయితే, ఠాకూర్ స్వయంగా న్యాయస్థానానికి హాజరై, బేషరతు క్షమాపణలు చెప్పడంతో శాంతించింది. అయితే, బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పదవి నుంచి తక్షణమే వైదొలగాలంటూ ఠాకూర్‌కు 2017 జనవరిలో ఆదేశాలింది. ఠాకూర్ వాదన ఇదే.. కోర్టు ఆదేశాల మేరకు బోర్డు పదవికి, కార్యకలాపాలకు దూరంగా ఉండబట్టి 9 ఏళ్లు గడిచాయని గుర్తు చేశారు. తనపై విధించిన నిషేధాన్ని ఇకనైనా ఎత్తివేయాలని కోరారు. జీవితకాలం నిషేధంగా అప్పటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొనలేదని తెలిపారు. బోర్డు చైర్మన్ హోదాలో అప్పట్లో చోటుచేసుకున్న అన్ని పరిణామాలకు తానే బాధ్యత వహించాల్సి వందని పేర్కొన్నారు. నేరానికి తగిన శిక్ష.. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో ప్రపోర్షనాలిటీ సిద్ధాంతాన్ని వర్తింపజేయడం సరైందని భావిస్తున్నామంది. ‘వాస్తవానికి న్యాయస్థానం ఠాకూర్‌పై జీవితకాల నిషేధాన్ని విధించాలని అనుకోలేదు. కేసులోని వాస్తవాలు, పరిస్థితులను బట్టి కఠినమైన నిషేధం విధించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. పరిపాలనాపరమైన లోపానికి జీవితకాలం పాటు పదవులకు దూరం చేయడం అతి అవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. 2017లో ఇచి్చన ఆదేశాలు ఆ సమయానికి అవసరమైనవే తప్ప, శాశ్వతం కాదన్న ధర్మాసనం.. ఠాకూర్ తిరిగి బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. -
లోధా డెవలపర్స్ రూ.5,500 కోట్ల ఐపీఓ!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం లోధా డెవలపర్స్ త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి గురువారం సమర్పించిందని సమాచారం. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.5,500 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.3,750 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రమోటర్లకు చెందిన 1.8 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)విధానంలో జారీ చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రి–ఐపీఓ ప్లేస్మెంట్ విధానంలో 95 లక్షల షేర్ల జారీ ద్వారా రూ.750 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయని ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నాటికి రూ.18,000 కోట్ల రుణభారం ఈ కంపెనీకి ఉంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులతో రూ.3,300 కోట్ల మేర రుణ భారం తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. అయితే ఐపీఓ వార్తలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి నిరాకరించారు. 2007లో వచ్చిన రూ.9,000 కోట్ల డీఎల్ఎఫ్ ఐపీఓ తర్వాత లోధా డెవలపర్స్ కంపెనీ ఐపీఓయే రియల్టీ రంగంలో అతి పెద్ద ఐపీఓ కానున్నది. 2010లో ఆమోదం పొందినా... ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను 2009, సెప్టెంబర్‌లో సెబీకి సమర్పించింది. 2010, జనవరిలో సెబీ నుంచి ఆమోదం పొందింది. అయితే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా స్టాక్ మార్కెట్లో అస్తవ్యస్త వాతావరణం నెలకొనడంతో ఐపీఓ ప్రణాళికను అటకెక్కించింది. ఐపీఓ ప్రణాళికను పునరుజ్జీవింపచేయనున్నామని కంపెనీఎమ్డీ అభిషేక్ లోధా గతేడాది జూలైలో చెప్పారు. 2018లో లిస్టింగ్‌కు రానున్నామని అప్పుడు ఆయన వెల్లడించారు. ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, పుణే, బెంగళూరులతో పాటు లండన్‌లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
బీసీసీఐ, లోధా కేసు విచారణ మరోసారి వాయిదా
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో ఆఫీస్ బేరర్లందరినీ తొలగించి బోర్డు పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన లోధా ప్యానెల్ కమిటీ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. చివరిసారిగా ఈ కేసును అక్టోబర్ 21న విచారించిన కోర్టు గడిచిన సోమవారం తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. దానిలో భాగంగానే శుక్రవారానికి కేసును ధర్మాసనం వాయిదా వేసింది. అయితే బెంచ్ ముందు పలు కేసులు పెండింగ్‌లో ఉన్న క్రమంలో ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. ప్రపాదనల అమలు విషయంలో బీసీసీఐకి, లోధా ప్యానెల్‌కు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. 70 ఏళ్ల గరిష్ట వయస్సు, రెండు పదవుల మధ్య మూడేళ్ల విరామం, ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి అంశాలను బోర్డు గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయడానికి బోర్డు వెనుకడుగు వేస్తోంది.. దాంతో బోర్డులోని ఆఫీస్ బేరర్లు అందర్నీ తొలగించాలని లోధా ప్యానల్ పిటిషన్ దాఖలు చేసింది. హోంశాఖ మాజీ కార్యదర్శి జికే పిళ్లైను బోర్డు పరిశీలకుడిగా నియమించాలంటూ లోధా ప్యానల్ ఆ పిటిషన్లో కోరింది.


