నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా | Actress Purna Remembers Her Father Latest | Sakshi
Sakshi News home page

Purna: తండ్రి చనిపోయి తొమ్మిదేళ్లు.. పూర్ణ ఎమోషనల్

Aug 7 2026 3:15 PM | Updated on Aug 7 2026 3:18 PM

Actress Purna Remembers Her Father Latest

తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన పూర్ణ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తన తండ్రి చనిపోయి తొమ్మిదేళ్లు అయిన సందర్భంగా ఆయనని మరోసారి గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. ఆయనని ఎప్పటికీ మర్చిపోలేమని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా)

'ప్రియమైన ఉప్పా(నాన్న) ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి తొమ్మిదేళ్లు గడిచినా, ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యుల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించకపోయినా, ఆయన ప్రేమ, దయ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారీ ఆయనని ఒకసారి అయినా కలిసుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది'

నా రెండో బిడ్డ కళ్లలో ఆయన ప్రతిబింబాన్ని చూస్తున్నా. అల్లా మా కుటుంబానికి ఆయన జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా ఈ బిడ్డని ప్రసాదించాడనిపిస్తోంది. ఆయన ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఉప్పా(నాన్న) అల్లా దగ్గరకు చేరి తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఉమ్మాకు(‍అమ్మ) మాత్రం అది నిన్న జరిగినట్లే అనిపిస్తోంది. కాలం గడిచినా ఆయన లేని లోటు, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆయనని తలుచుకుంటూనే ఉన్నాం. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎప్పటికీ మరచిపోలేము' అని పూర్ణ ఎమోషనల్ అయింది.

పూర్ణ ఫ్యామిలీ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఈమె దుబాయిలో ఉండే షనీద్ అసిఫ్ అలీ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా ఈమె గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది.

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement