హర్ష్ రోషన్ , నక్షత్ర జంటగా నటించిన సినిమా ‘తెల్లకాగితం’.
నందు సవిరిగాన కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు.
కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.


