Harsh Roshan
-
ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
'కోర్ట్' సినిమాతో గతేడాది అద్భుతమైన హిట్ కొట్టిన రోషన్-శ్రీదేవి జంట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరిని పెట్టి తీసిన మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పుడిది నెలలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా)రోషన్-శ్రీదేవి నటించిన టీనేజీ ప్రేమకథా సినిమా 'బ్యాండుమేళం'. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో బావామరదళ్ల మధ్య జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రమోషన్లతో చాలా హడావుడి చేశారు గానీ థియేటర్లలో తేలిపోయింది. ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.'బ్యాండు మేళం' విషయానికొస్తే.. గిరి(హర్ష్ రోషన్) స్కూల్లో పెద్దగా చదవడు. దీంతో ఫెయిల్ అవుతాడు. ఇతడి మరదలు రాజి(శ్రీదేవి) మాత్రం టాప్ ర్యాంకర్. గిరికి ఈమెంటే ప్రాణం. అలానే పాటలు కంపోజ్ చేయడం, పాడటం అన్నాసరే ఇష్టం. ఓ సొంత బ్యాండ్ ట్రూప్‌తో ఊరిలో జరిగే పెళ్లిళ్లల్లో పాటలు అవీ పాడుతుంటాడు. ఎప్పటికైనా రహమాన్ అంత పెద్ద సంగీత దర్శకుడు కావాలనేది ఇతడి కల. ఇదలా ఉంటే ఇతడి మరదలు రాజి.. ఇంజనీరింగ్ కాలేజీమేట్తో లేచిపోతుంది. అతడు మోసం చేశాడని తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆమెని గిరి ఒప్పుకొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
‘బ్యాండు మేళం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
‘కోర్ట్’ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండు మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 13నే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషం వాయిదా వేసి.. నేడు(మార్చి 26)న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ‘బ్యాండు మేళం’పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది? కోర్ట్ మాదిరే హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మరో హిట్ దక్కిందా? లేదా? రివ్యూ(Band Melam Review)లో చూద్దాం.కథేంటంటే.. తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యాదగిరి అలియాస్ గిరి(హర్ష్ రోషన్), రాజీ(శ్రీదేవి) బావమరదళ్లు. చిన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లు కూడా పెద్దయ్యాక ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ వీరిద్దరు పెద్దయ్యే సరికి పరిస్థితులు తారుమారు అవుతాయి. గిరి వాళ్ల నాన్న సుందరయ్య(గోపరాజు విజయ్) దానధర్మాలు చేసి అప్పుల పాలవుతాడు. గిరి ఏమో పదోతరగతి ఫెయిల్ అయి స్నేహితులతో బ్యాండు మేళం నడుపుతుంటాడు. మరోవైపు రాజీ వాళ్ల నాన్న సాయన్న(సాయి కుమార్) బావ సుందరయ్య చేసే సాయంతో కోటీశ్వరుడు అవుతాడు. రాజీ టెన్త్ టాపర్‌గా నిలిచి..ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్‌లో జాయిన్ అవుతుంది. ప్రేమ, పెళ్లి అంటూ బావ గిరి వెంటపడుతున్నా పట్టించుకోదు. సాయన్న కూడా తన కూతురుని గిరికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడు. ఓ గొప్పింటి అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి రోజు రాత్రే రాజీ.. తన క్లాస్మేట్ రాజేశ్‌తో కలిసి లేచిపోతుంది. ప్రాణంగా ప్రేమించిన మరదలు.. వేరే వ్యక్తితో లేచిపోయిన విషయం తెలిసిన తర్వాత గిరి ఏం చేశాడు? లేచిపోయిన రాజీ తిరిగి గిరి ఇంటికి ఎందుకు వచ్చింది? గిరి మ్యూజిక్ లో సక్సెస్ అయ్యాడా? ఈ బావమరదళ్లు మళ్లీ ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ రచయితల్లో కోన వెంకటేశ్‌కు ఉన్న క్రేజీ గురించి తెలిసిందే. కామెడీ ఫ్యామిలీ డ్రామా కథలను రాయడంతో ఆయన సిద్ధహస్తుడు. అయితే ఈ మధ్య ఆయన కథలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తనకు బలమైన కామెడీ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే ‘బ్యాండు మేళం’ కథను రాసుకొని.. సొంతంగా నిర్మించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ ఈవెంట్లలో ఆయన మాటలు విని .. ఈ సారి కొత్త కామెడీతో నవ్విస్తాడని అంతా భావించారు. కానీ కోన మాత్రం మళ్లీ పాత కథతోనే నవ్వించే ప్రయత్నం చేశాడు. కథ మాత్రమే కాదు కథనం కూడా పాతగానే ఉంటుంది. కొత్తదనం అనేది మచ్చుకైనా కనిపించదు. రొటీన్ కామెడీ స్టోరీకి తెలంగాణ బ్యాక్‌డ్రాప్ యాడ్ చేశారంతే. హీరో జులాయి.. హీరోయిన్ రిచ్ కిడ్.. వారి ప్రేమకు ఆస్తిపాస్తులు అడ్డురావడం.. చివరకు ఒక్కటవ్వడం.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ కథలను చూస్తూ వస్తున్నాం. అలాంటి కథతో సతీష్ జవ్వాజీ తెరకెక్కిన చిత్రమే ఈ బ్యాండు మేళం. బావమరదళ్ల లవ్‌స్టోరీలో అయినా కొత్తదనం ఉంటుందా అంటే అదీ ఉండడు. ఇక కథకు కీలకమైన ట్విస్టులు కూడా ఊహకందేలా ఉండడంతో కథనం ఎక్కడ రక్తి కట్టించదు. కోన గారి రెగ్యులర్ కథల్లానే ఈ సినిమా కథ కూడా చైల్డ్‌వుడ్ ఎపిసోడ్‌తో మొదలవుతుంది. హీరోహీరోయిన్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని చూపించి.. అసలు కథను ప్రారంభించారు. ఫస్టాఫ్‌లో బ్యాండు మేళం బ్యాచ్‌తో హీరో చేసే అల్లరి కొంతమేర నవ్విస్తుంది. స్టూడియో కట్టేందుకు హీరో గ్యాంగ్ చేసే పని సిల్లీగా అనిపించినా.. ఎంటర్టైన్ అవుతారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఎంతకూ ముందుకు కదలదు. ఒకే పాయింట్ చుట్టూ కథను తిప్పారు. క్లైమాక్స్‌లో రాజీ పాత్ర ఇచ్చే ట్విస్టు కూడా ఊహించేలా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. గిరి పాత్రలో హర్ష్ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. రాజీగా శ్రీదేవి కూడా బాగా నటించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ తండ్రి సాయన్నగా సాయికుమార్ రెగ్యులర్ పాత్రలో కనిపించి, మెప్పించాడు. హీరోగ్యాంగ్గా కనిపించినవారంతా కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. ముఖ్యంగా ఆ గ్యాంగ్‌లోని అమ్మాయి పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ బుల్గానిక్ నేపథ్య సంగీతం బాగుంది. ‘తిప్పుకుంటున్నవావే..’ అంటూ సాగే ఫోక్ సాంగ్ తెరపై మరింత ఆకట్టుకునేలా ఉంది. మిగతా పాటలు ఒకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో కోన వెంకట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
కోర్ట్ తర్వాత సినిమాలు వద్దని చెప్పా.. నా మాట వినలేదు!
కోర్ట్ సినిమాతో హర్ష్ రోషన్, శ్రీదేవి వెండితెరపై హీరోహీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాకే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడ్డారు. గతేడాది కోర్ట్ మూవీతో పలకరించిన ఈ జంట ఈ ఏడాది బ్యాండ్‌మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్లో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలు మర్చిపోండిఆయన మాట్లాడుతూ.. చందు-జాబిలి(కోర్ట్ మూవీలో ప్రధాన పాత్రల పేర్లు).. వీళ్లనెప్పటికీ ఇదే పేర్లతో పిలుస్తుంటాను. కోర్ట్ తర్వాత వీళ్లు ఏం చేస్తారు? ఏమైపోతారనుకున్నాను. నేనైతే.. కోర్ట్ అయిపోగానే మీరు కనపడొద్దని చెప్పాను. సినిమాలు మర్చిపోండి, మూడునాలుగేళ్లు కనిపించకూడదు. మంచి కాలేజీలో చేరి చదువుకోమని చెప్పాను. పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు కానీ కాలేజీకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కాలేజీ డేస్ మిస్ మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్లండి, కళాశాల జీవితాన్ని మిస్ అవొద్దని చెప్పాను. ఈ వయసులో యాక్టింగ్‌లో బిజీ అయితే జీవితంలో ముఖ్యమైన కాలేజీ డేస్ మిస్ అవుతారన్నాను. కానీ నా మాట వినలేదు. వినుంటే బ్యాండ్ మేళం వచ్చేది కాదు.. విననందుకు థాంక్స్ అన్నాడు. బ్యాండ్‌మేళం విషయానికి వస్తే.. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీని కోన వెంకట్ నిర్మించారు.చదవండి: ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్ -
ఘనంగా 'బ్యాండ్ మేళం' ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
బ్యాండ్ మేళం: రామ్ మిరియాల పాడిన బ్రేకప్ సాంగ్ రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.బ్రేకప్ సాంగ్'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్ సాంగ్ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ చేకూర్చగా రామ్ మిరియాల ఆలపించాడు.సినిమాబ్యాండ్ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
శ్రీరామ నవమికి...
శ్రీరామ నవమికి ప్రేక్షకులకు బ్యాండ్ మేళం వినిపించ నుంది. ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే... శ్రీరామ నవమి సందర్భంగా 26కి విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు మేకర్స్. ‘‘బ్యాండ్ మేళం’ నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అలాగే ‘తిప్పూ కుంటున్నావ్...’ అనే మాస్ పెప్పీ సాంగ్, ‘పల్లెలోని సందల్లన్ని మీవే...’ అనే మెలోడీ సాంగ్ కూడా సినిమా పట్ల అంచనాల్ని పెంచాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్. -
ప్రకృతి నాకేదో సిగ్నల్స్ ఇస్తోంది.. ఫన్నీగా 'బ్యాండ్ మేళం' టీజర్
గతేడాది రిలీజైన 'కోర్ట్' సినిమాతో ఆకట్టుకున్న రోషన్-శ్రీదేవి.. మరోసారి జంటగా నటించిన మూవీ 'బ్యాండ్ మేళం'. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో దీన్ని తెరకెక్కించారు. సతీష్ జవ్వాజీ దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. మార్చి 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఎంటర్టైనింగ్గా ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)'బ్యాండ్ మేళం' సినిమా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ. బావమరదలు అయిన హీరోహీరోయిన్ మధ్య గిల్లికజ్జాలు, ప్రేమ, బ్రేకప్ లాంటివి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రధారులైన రోషన్, శ్రీదేవి చూడటానికి బాగానే ఉన్నారు. మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) -
బ్యాండ్ మేళం: తిప్పుకుంటాన్నవ్ పాట రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీరు బావామరదళ్లుగా నటిస్తున్నారు. ఇటీవలే వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో హీరో హీరోయిన్‌కు బ్రేకప్ అయినట్లు చూపించారు.సాంగ్ రిలీజ్తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వదిలారు. 'బెల్లం చుట్టూ ఈగలెక్క.. మంచం చుట్టూ దోమ లెక్క.. గుడి సుట్టూ భక్తుని లెక్క.. బారు సుట్టూ తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్' అంటూ ఈ పాట కొనసాగుతుంది. హుషారుగా సాగే ఈ సాంగ్‌లో శ్రీదేవి- రోషన్ ఎనర్జిటిక్ స్టెప్పులేశారు.సినిమాబిగ్బాస్ ఫేమ్ రాము రాథోడ్ ఈ పాట పాడటంతో పాటు రోషన్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు వెంకటేశ్ కాపు కొరియోగ్రఫీ అందించాడు. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చాడు. రాము రాథోడ్, అదితి భావరాజు ఆలపించారు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ బ్యాండ్‌మేళం మూవీ మార్చి 13న విడుదల కానుంది. చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: ఆర్.మాధవన్ -
చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నారా!
'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్‌లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్‌కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది. -
భావోద్వేగాల ప్రేమకథ
‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్ష రోషన్, శ్రీదేవి అపల్ల జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘బ్యాండ్ మేళం’. ‘ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్ ’ అనేది ఉప శీర్షిక. సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సతీష్ జవ్వాజీ రచన, దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ బీట్ (టైటిల్ గ్లింప్స్)ని రిలీజ్ చేశారు మేకర్స్.‘‘అందమైన గ్రామీణ ప్రేమకథగా రూ పొందుతోన్న చిత్రం ‘బ్యాండ్ మేళం’. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు సతీష్ జవ్వాజి. యాదగిరి (హర్ష రోషన్ ), రాజమ్మ (శ్రీదేవి అపల్ల) ప్రేమకథని అందంగా తెరపై చూపించనున్నారాయన’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సహ నిర్మాత: శివరాజు ప్రణవ్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: సతీష్ ముత్యాల. -
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
'కోర్ట్' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్‌మేళం (Band Melam Movie). సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్ వినిపించాడు. మాస్ డైలాగ్స్అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. సినిమాఅరవింద సమేత, వెంకీ మామ, సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్, సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్ మీడియాలో ఆమె రీల్స్ చూసి తనను కోర్ట్ మూవీకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్‌తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది. చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు -
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
వాహనానికి కూడా జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలో నుంచి పుట్టిందే టుక్ టుక్ మూవీ (Tuk Tuk Movie). హర్ష రోషన్ (Harsh Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి, తెలుగమ్మాయి శాన్వీ మేఘన (Saanve Megghana) ప్రధాన పాత్రల్లో నటించారు. పూరీ జగన్నాథ్ దగ్గర రచయితగా పని చేసిన సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించారు. గత నెలలో థియేటర్లలో.. ఇప్పుడు ఓటీటీలోమార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్ష రోషన్ హీరోగా నటించిన కోర్ట్ ఘన విజయం సాధించడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై కూడా ఉంటుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం రాబట్టుకోలేకపోయింది. అయితే నటీనటుల పర్ఫామెన్స్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీ (OTT)లోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.కథేంటంటే? ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు (హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బు కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. వినాయక నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఓ పాత స్కూటర్‌ను తెచ్చుకుని ముగ్గురూ కూర్చునే టుక్ టుక్ బండిలా తయారు చేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లవారు నుంచి ఆ బండి దానంతటదే ఆన్ అవుతుంది. తిరుగుతుంది. దీంతో ఆ స్కూటర్లో దేవుడు ఉన్నాడని భావిస్తారు. మరి నిజంగానే అందులోకి దేవుడు ప్రవేశించాడా? లేక ఆత్మనా? అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్‌ను ఏం చేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. -
Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
మన తెలుగమ్మాయి శాన్వి మేఘన, ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి.. ముఖ్య పాత్రల్లో ఈ టుక్ టుక్ సినిమా తెరకెక్కింది. మూడు చక్రాల బండిని టుక్ టుక్ అంటాం. మరి ఈ సినిమాలో టుక్ టుక్ చేసిన విన్యాసాలు ఏంటి అనేది రివ్యూలో(Tuk Tuk Telugu Movie Review) చూద్దాం. కథేంటంటే..ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెహికల్ దానంతట అదే ఆపరేట్ అవ్వడం, భయపెట్టడం, నవ్వించడం గతంలో తెలుగులో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ టుక్ టుక్ కూడా అలాంటిదే. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించారు. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం సీన్స్ అన్ని కాస్త నవ్విస్తూనే ఆసక్తిగా ఉంటాయి.ఆ బండిలో ఆత్మ ఉందని తెలిసాక వాళ్ళు భయపడటం, అది వీళ్ళను పరిగెత్తించడం బానే నవ్విస్తాయి. స్కూటర్ మాట్లాడలేదు కానీ అది పిల్లలు అడిగే ప్రశ్నలకు ఇండికేషన్స్ ఇస్తూ సమాధానాలు చెప్పడం కొత్తగా ఉంటుంది. అయితే ఆ ఆత్మ కథేంటి అని ఫ్లాష్ బ్యాక్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఆత్మ అందులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నారు. అలాగే సినిమాలో ఓ మెసేజ్ చెప్పడానికి కూడా ప్రయత్నించారు. సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.ఎవరెలా చేశారంటే..మన తెలుగమ్మాయి శాన్వి మేఘన తన క్యూట్ అందంతో మెప్పిస్తునే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూనే బాగా నటించారు. నిహాల్ కోదాటి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పచ్చని లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీ విజువల్స్ తో మరింత అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. టుక్ టుక్ బండిని బాగా డిజైన్ చేసారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని టుక్ టుక్ (Tuk Tuk Movie Review)బండితో నవ్విస్తూ చెప్పాడు. నిర్మాణవిలువలు చిన్న సినిమా అయినా ఉన్నతంగా ఉన్నాయి.నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. తదితరులునిర్మాత: రాహుల్ రెడ్డి దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణసంగీతం: సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్ ఎడిటర్: అశ్వత్ శివకుమార్ విడుదల తేది: మార్చి 21, 2025 -
ఆ యాడ్‌తో టుక్ టుక్ ఆలోచన వచ్చింది: డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ
‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్ టుక్’ సినిమా చేశాను. మ్యాజికల్ పవర్స్ ఉన్న ‘టుక్ టుక్’ అనే వెహికల్ హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ చెప్పారు. హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టుక్ టుక్’. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు. పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను. ‘టుక్ టుక్’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. క్రికెట్ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్ టుక్’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ‘టుక్ టుక్’ ఫ్రాంచైజీ ప్లాన్ ఉంది’’ అన్నారు. టుక్ టుక్‌పై ‘కోర్ట్’ ప్రభావం చూపుతుందిఇక ప్రీరిలీజ్ వేడుకల్లో సుప్రీత్ మాట్లాడుతూ.. 'టీజర్‌కు, ట్రైలర్‌కు, ఏఐ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మార్చి 21న అందరూ ఓ కొత్త తెలుగు సినిమా చూడబోతున్నారు. ఓ కమర్షియల్ ప్యాకేజీలో ఇలాంటి సినిమా చేయడం గొప్పగా అనిపించింది.రోషన్ నటించిన కోర్టు మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా రోషన్ ఓ మంచి పాత్రను చేశాడు. తప్పకుండా కోర్టు సక్సెస్ మా సినిమాపై కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ' అన్నారు.శాన్వీ మేఘన మాట్లాడుతూ '' రీసెంట్గా కుడుంబస్తాన్ అనే తమిళ సినిమా చేశాను. ఆ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. అందరూ మంచి ప్రేమ ఇచ్చారు. ఓటీటీలో కూడా తెలుగులో ఆ సినిమా విడుదలైంది. తెలుగు వాళ్లకు కూడా ఆ సినిమా నచ్చింది. కుడుంబస్తాన్ను ఆదరించినట్లే తెలుగు ప్రేక్షకులు మా టుక్‌టుక్‌ను ఆదిరించి, ఈ తెలుగమ్మాయికి ఆశ్వీరదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాను దర్శకుడు ఎంత అందంగా నేరేట్ చేశాడో, సినిమాను కూడా అంతే అందంగా తెరకెక్కించాడు. ఈ ఫాంటసీ సినిమాను అందరూ ఫ్యామిలీతో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మా టీమ్ అందరికి మంచి విజయం అందిస్తుందనే హోప్ ఉంది ' అన్నారు.ఈ వేడుకలో వాణిశాలిని, మధు, మౌనిక తదితరులు పాల్గొన్నారు.


