‘వాంగ్‌చుక్‌కు ఏమైనా జరిగితే..’.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక | Congress MP Vivek Tankha Declares He Wont Remain an MP if Sonam Wangchuk Comes to Harm | Sakshi
Sakshi News home page

‘వాంగ్‌చుక్‌కు ఏమైనా జరిగితే..’.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక

Jul 21 2026 1:06 PM | Updated on Jul 21 2026 1:11 PM

Congress MP Vivek Tankha Declares He Wont Remain an MP if Sonam Wangchuk Comes to Harm

న్యూఢిల్లీ: ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ కార్యకర్త సొనమ్ వాంగ్చుక్ విషయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్ఖా సంచలన ప్రకటన చేశారు. వాంగ్‌చుక్‌కు ఎలాంటి హాని జరిగినా తాను ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. వాంగ్‌చుక్‌ నిరసన దీక్షను ముగిసేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలపై ఉందని పేర్కొన్నారు. ఆయనకు ఏ చిన్న నష్టం జరిగినా అది మన అందరి వైఫల్యమే అవుతుందని, ఒకవేళ అదే జరిగితే తాను ఎంపీగా ఉండలేనని తేల్చిచెప్పారు.
 

గత 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సొనమ్ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ న్యాయవాది అయిన వివేక్ తన్ఖా చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement