ఇంద్రకీలాద్రి : ఆషాఢ మాసం, శుక్రవారం, సారె ఉత్సవాలు ఒకేసారి కలిసి రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది.
అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శ్రీ కనకదుర్గమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో మహిళలు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి.


