అంబానీ ఫ్యామిలీ అంటేనే అన్నీ కళ్లు చెదిరే లగ్జరీయస్‌తో కూడిన బడా విలువ చేసే నగలు, గాడ్జెట్లనే ఉపయోగిస్తారనేది తెలిసిందే. కానీ వాళ్లు ధరించే జ్యువెలరీ, కాస్ట్యూమ్ ఇలా ప్రతి ఒక్కటి విలక్షణమైనవి, పైగా భారతీయతను చాటే హస్తకళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈసారి ఆ కుటుంబానికి చెందిన చిన్న కోడలు రాధికా మర్చంట్ మరోసారి తన లగ్జరీయస్ ఫ్యాషన్‌తో అందర్నీ ఆకట్టుకుంది. చాలా సింపుల్ డ్రెస్ లుక్‌తో ఆకట్టుకునే ఆమె ప్రతి జ్యువెలరీ, వాచ్‌లు అత్యంత విలక్షణంగా ఉంటాయి.
ఈసారి ఆభరణంలాంటి వైట్ గోల్డ్ వాచ్‌తో అందర్నీ ఆకట్టుకుందామె. ముంబైలో జరిగిన అబు జానీ సందీప్ ఖోస్లో 40వ వార్షికోత్సవ వేడుకలో అబానీ కుటుంబం మొత్తం హాజరైంది. ఈ వేడుకులో రాధికా ఇలా తన విభిన్నమైన ఫ్యాషన్ లుక్‌తో ఆకర్షించింది. దుస్తుల పరంగానే కాకుండా జ్యువెలరీ పరంగా కూడా విలక్షణతో కూడిన ప్రత్యేకతను చాటింది. ముఖ్యంగా చేతికి ధరించిన వైట్ గోల్డ్ వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదొక గాడ్జెట్‌లా కాకుండా ఒక జ్యువెలరీలా మెరిసి..అందరి చూపులను ఆకర్షించింది. మరి ఆ వాచ్ విశేషాల గురించి సవివరంగా చూద్దామా.
ఈ వాచ్‌ని 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో రూపొందదించారట. ఇది సుమారు 24mm వెడల్పు, 27.8mm పొడవు ఉంటుంది. దీని డయల్ పూర్తిగా వజ్రాలు, పచ్చలతో పొదగబడి ఉంది. అలాగే ఫ్యూయిల్ శైలి ముల్లులు, 12, 6 గంటల వద్ద ఉన్న రోమన్ అంకెలు ప్రధాన ఆకర్ణగా కనిపిస్తాయి. ఈ వాచ్‌లో ప్రధాన ఆకర్షణ మాత్రం మిరుమిట్లుగొలిపే అసంఖ్యాక వజ్రాలు, పచ్చలే. దీనిలో సుమారు 33.64 క్యారెట్ల బరువున్న 1700కు పైగా వజ్రాలు, 33.64 క్యారెట్ల బరువున్న 289 పచ్చలు పొందుపర్చారు. దీని బరువు మొత్తం 38 క్యారెట్లకు పైగా ఉంటుందట.
మరి ఇంత విలాసవంతంగా తీర్చిదిద్దిన తెల్ల బంగారం వాచ్ ధర ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవడం ఖాయం. ఇది అక్షరాలు రూ. 1.51 కోట్లు పైనే పలుకుతుందట. మరో ప్రత్యేకత ఏంటంటే సంప్రదాయ వాచ్‌ల మాదిరిగా కాకుండా ఒక ఆభరణంలా ధరించేలా రూపొందించడం విశేషం. ఆ వాచ్‌కి అనుగుణంగా స్ట్రక్చర్డ్ జాకెట్, ప్రింటెడ్ స్కర్ట్‌తో ఆధునిక డిజైనర్‌వేర్ ధరించింది. పచ్చల నెక్లెస్, స్టేమెంట్ చెవిపోగులు, వేలికి వజ్రపు ఉంగరంతో తన ఆహార్యాన్ని పూర్తి చేసి అత్యంత హుందాగా, స్టైలిష్‌గా తళుక్కుమంది రాధికా.
(చదవండి: Nita Ambani: అద్భుతమైన క్రిమ్సన్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!)


