బాలీవుడ్ ముద్దగుమ్మ అనన్య పాండే తన విలక్షణమైన నటనతోనే కాదు ఫ్యాషన్‌తో కూడా కట్టిపడేస్తుందామె. విలావంతమైన డిజైనర్ వేర్‌లతో సదా ఆకట్టుకుంటూ తనదైన్ స్టైలిష్ లుక్‌లో అలరిస్తుంటుందామె. ఈసారి అలాగే ఓ ఈవెంట్‌లో అత్యంత స్టైలిష్‌గా మెరిసింది. ఆధునిక గ్లామర్‌తో ఆకట్టుకుంది. విలాసవంతమైన యాక్సెసరీలతో చక్కటి ఆకృతినిచ్చే గౌను కౌచర్‌లో అద్భుతంగా కనిపించింది. పియాజెట్ ఈవెంట్‌లో రాహుల్ మిశ్రా 'దేవి'కలెక్షన్‌కి సంబంధించిన గౌనులో మెరిసింది.
శరీరానికి హత్తుకునిపోయేలా.. నేల వరకు ఉండే ముదురు బ్రౌన్ రంగు గౌనులో మెరిసిందామె. గౌను ఆకృతి మొత్తం గీతలో ప్రారంభమై, నడుమ వద్ద ముడిలాంటి డిజైన్ గౌను లుక్‌ని మరింత హైలట్‌గా కనిపించేలా చేసింది. ఈ డ్రెస్‌కి అనుగుణంగా పియాజెట్ లైమ్‌లైట్ గాలా ప్రెషియస్ రెయిన్‌బో వాచ్ ధరించిందామె. దీన్ని నీలమణిలు, కెంపులతో రూపొందించారు.
ఇక లైట్ మేకప్‌తో కనుబొమ్మలు చక్కగా కనిపించేలా తీర్చిదిద్దారు. హెయిర్‌ని కూడా పాపిడి తీసి వదులుగా వదిలేసింది. ఈ విలాసవంతమైన గౌను కౌచర్‌కి దలీలా యానిమలియర్ హిల్స్‌ని ఎంచుకుంది. ఇవి అచ్చం చిరుతపులి ప్రింట్స్‌లా డిజైన్ చేశారు. దీనిలో సన్నని మెరిసే క్రిస్టల్స్‌తో కప్పబడిన పట్టీలు మంచి హుందాతానిచ్చే స్టైలిష్‌గా ఉంది. ఈ హిల్స్ ధర తెలిస్తే కచ్చితంగా విస్తుపోతారు. అక్షరాల రూ. 1.5 లక్షలట.
(చదవండి: Miss World 2026: మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్ అద్భుత నృత్యం..!)


