లవర్‌ని కత్తితో పొడిచి చంపి, విషం తాగిన ప్రియుడు | Woman assassinated By Lover At Delhi Hotel Accused drinks poison | Sakshi
Sakshi News home page

లవర్‌ని కత్తితో పొడిచి చంపి, విషం తాగిన ప్రియుడు

Sep 3 2026 1:21 PM | Updated on Sep 3 2026 1:31 PM

Woman assassinated  By Lover At Delhi Hotel Accused drinks poison

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని లహోరీ గేట్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో నిన్న రాత్రి ఒక మహిళ రక్తపు మడుగులో  పడి శవమై కనిపించిన ఘటన పోలీసులకు ఉలిక్కిపడేలా చేసింది. తన ప్రియుడి చేతిలోకత్తిపోట్లకు గురై మరణించిందని, ఆ తర్వాత నిందితుడు విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు గురువారం తెలిపారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  రాజస్థాన్‌కు చెందిన నిందితుడు బిహార్‌కు చెందిన ఆ మహిళ బుధవారం సాయంత్రం 'హోటల్ ప్రిన్స్'లో బస చేశారు. ఏం జరిగిందో తెలియదుగానీ, రాత్రి ఆ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఆ తర్వాత తన ప్రాణాలను తీసుకోవాలనే ఉద్దేశంతో అతను విషం సేవించాడు. హోటల్ సిబ్బంది  ఆ గదిలో రక్తపు మడుగులో  మహిళ పడి ఉండటాన్ని గమనించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement