మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi Movie) బాక్సాఫీస్ వద్ద కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
రవితేజ తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి.
తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు.


