‘దురద ఒకడికి అయితే, గోకుడు ఇంకొకడికా?’ అనేది ఒక వ్యంగ్య సామెత. అంటే ఎవరి సమస్యను వారి తీర్చుకోవాలి అని అర్థం. కానీ చిన్నపుడు దురద పుట్టే మన వీపును అమ్మమ్మనో, తాతయ్యనో మృదువుగా అలా గోకుతుంటూ ఆహా..అనిపించిన అనుభవం గుర్తుందా? ఈ ఫీలింగ్ ఆధారంగా చేసుకునే గంటకు రూ. 4,200 వసూలు చేస్తున్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది థాయ్ మసాజ్‌లు, ఆయిల్ మసాజ్‌ల గురించి విన్నాం గానీ, ఈ 'ఇచ్-స్క్రాచింగ్' బిజినెస్ ఏంటీ అనుకుంటున్నారా.. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
షెన్‌జెన్‌కు చెందిన 32 ఏళ్ల జాంగు షియావోకియావో అనే చైనీస్ వ్యాపారవేత్త శరీర దురదను గోకే (itch-scratching) వినూత్న సేవలను ఒక వ్యాపారంగా మార్చి, రెండు అవుట్‌లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షలు (1,00,000 యువాన్లు) ఆర్జిస్తున్నాడు. సుమా (Suma) అనే బ్రాండ్ నేమ్‌తో షెన్‌జెన్‌లోని బావోవాన్, ఫుటియాన్ జిల్లాల్లో రెండు స్టోర్లు నడుస్తున్నాయి. అంతేకాదు తన ఈ వ్యాపారాన్ని చైనా వ్యాప్తంగా 100 అవుట్‌లెట్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఇదీ చదవండి: నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా
వినియోగదారులు హాయిగా విశ్రాంతి పొంది, బాగా నిద్రపోవడానికి సహాయపడే ఈ సేవ కోసం గంటకు సుమారు 300 యువాన్లు చెల్లిస్తారు. తన కస్టమర్లలో 70 శాతం మంది పురుషులేనని ఝాంగ్ చెబుతున్నారు. 30 శాతం మహిళా వినియోగ దారులుంటారని చెప్పాడు. మసాజ్ కంటే కూడా ఇది ఎక్కువ విశ్రాంతినిస్తుందని కొంతమంది కస్టమర్లు చెప్పానీ ఫలితంగా దీనివల్ల తమకు రిపీటెడ్ క్లయింట్లు ఎక్కవని కూడా చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు

ఎలా ఉంటుందీ సర్వీస్
వినియోగదారులు మసాజ్ సెంటర్లలో లాగా బెడ్‌పై పడుకుంటారు. ప్రత్యేకంగా రూపొందించిన పదునైన గోళ్లతో అక్కడున్న సిబ్బంది శరీర భాగాలను సున్నితంగా గోకుతారు. ఇది కస్టమర్ల మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టడానికి సహాయ పడుతుందని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక మహిళ తన భర్త వెన్ను గోకుతున్న వీడియో , చిన్నతనంలో తన తండ్రి తనకు గోకిన అనుభూతిని గుర్తుచేసుకుని ఝాంగ్ ఈ వ్యాపార ఆలోచనను ప్రారంభించారు.


