భార్య గుట్టు రట్టు చేసిన రోబో వాక్యూమ్.. భర్తకు తప్పని జైలు! | Secret Camera Catches Wifes Affair Man Wins Divorce Case but Lands in Jail | Sakshi
Sakshi News home page

భార్య గుట్టు రట్టు చేసిన రోబో వాక్యూమ్.. భర్తకు తప్పని జైలు!

Sep 3 2026 8:04 AM | Updated on Sep 3 2026 8:04 AM

Secret Camera Catches Wifes Affair Man Wins Divorce Case but Lands in Jail

తైపి: రోబో వాక్యూమ్ క్లీనర్ కెమెరా ద్వారా భార్య వివాహేతర సంబంధాన్ని రహస్యంగా రికార్డు చేసి, విడాకుల కేసులో విజయం సాధించిన ఓ తైవాన్ వ్యక్తి.. చివరకు భార్య గోప్యతను ఉల్లంఘించిన నేరానికి  జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తైవాన్‌కు చెందిన ఈ దంపతులకు 2021లో వివాహం జరిగింది. వారు తమ తల్లిదండ్రులతో కలసి ఉంటూనే, మరో హాలిడే హోమ్‌లోనూ సమయం గడిపేవారు.

2023లో ఆ విల్లాలో ఉన్నప్పుడు బాత్‌రూమ్‌లో వాడిన మరో టూత్‌బ్రష్ కనిపించడంతో భర్తకు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అనంతరం పార్కింగ్ గ్యారేజ్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, మరో వ్యక్తి తన భార్యను కారులో డ్రాప్ చేయడం గమనించి ఆమె మోసం చేస్తోందని నిర్ధారించుకున్నాడు. మూడు నెలల తర్వాత ఇంట్లోని స్మార్ట్ రోబో వాక్యూమ్ యాప్‌ను తెరిచాడు. దానిలో లైవ్ వీడియో స్ట్రీమ్‌ను చూశాడు. అందులో భార్య తన ప్రియుడితో ఉన్న దృశ్యాలు కనిపించాయి.

ఆమె దుస్తులు మార్చుకోవడం, ప్రియుడితో పడకపైకి వెళ్లడం వంటి  దృశ్యాలను అతను రికార్డు చేశాడు. తైవాన్ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధం నేరం కానప్పటికీ, దాంపత్య హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీంతో భర్త దాఖలు చేసిన సివిల్ దావాలో ఆ ఫుటేజీని సమర్పించగా, న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పునిచ్చి భార్య నుంచి దాదాపు 5 లక్షల తైవాన్ డాలర్ల (సుమారు రూ. 13 లక్షలు) నష్టపరిహారం ఇప్పించింది.

అయితే అనుమతి లేకుండా తనను రహస్యంగా చిత్రీకరించాడంటూ భార్య ఎదురు దావా వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దాంపత్య బాధ్యతల కంటే వ్యక్తిగత గోప్యతా హక్కులే ముఖ్యమని స్పష్టం చేసింది. ఆమె అనుమతి లేకుండా తీసిన వీడియో కావడంతో అది చట్టవిరుద్ధమని పేర్కొంటూ, భర్త వాదనను తోసిపుచ్చింది. ఫలితంగా భర్తకు ఐదు నెలల జైలు శిక్షతో పాటు 1,50,000 తైవాన్ డాలర్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి తెర: బిహార్, జార్ఖండ్‌ల కీలక ఒప్పందం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement