సినిమా ఇండస్ట్రీలో డేటింగ్, పెళ్లి, విడాకులు అనే మాటలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అందుకు తగ్గట్లే సెలబ్రిటీలు ఒకటికి మించి వివాహాలు చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అదే టైంలో సడన్‌గా విడిపోయి షాకులిస్తుంటారు. ఇప్పుడు అలానే ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్‌షా.. పెళ్లయిన ఐదు నెలలకే రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని ఇద్దరూ ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు..విడాకులకు కారణం నేనే: 'జైలర్' విలన్)
ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా అలియాస్ బాద్‌షా స్వతహాగా పంజాబీ. హిందీ, పంజాబీ భాషల్లో ఎక్కువగా పాటలు పాడుతుంటాడు. సొంత ఆల్బమ్ సాంగ్స్‌తో పాటు సినిమాల్లోనూ పాటలు పాడుతుంటాడు. ప్రభాస్ 'సాహో'లో బ్యాడ్ బాయ్, అజిత్ 'వేదాళం'లో అలుమా డోలుమా గీతాల్ని ఆలపించి దక్షిణాది ప్రేక్షకులకు ఇతడు సుపరిచతమే.
అసలు విషయానికొస్తే గతంలో జాస్మిన్ మాసి అనే మహిళని 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. కానీ 2020లో ఈమె నుంచి విడిపోయాడు. తర్వాత సింగిల్‌గానే ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో పంజాబీ నటి ఇషా రిఖీని పెళ్లి చేసుకున్నాడు. ఈ తంతు రహస్యంగా జరిగింది. కానీ వివాహం విషయాన్ని జూన్‌లో ఇషా ధ్రువీకరించింది. మరి ఏమైందో ఏమో గత నెలరోజులుగా వీరిద్దరూ విడిపోనున్నారనే రూమర్స్ వినిపించాయి. వాటిని నిజం చేస్తూ బాద్‌షా-ఇషా సంయుక్తంగా ఇప్పుడు విడాకులు ప్రకటించారు. సోమవారం రాత్రి ఇన్‌స్టా ఖాతాల్లో స్టోరీలు పోస్ట్ చేశారు.
'నేను, ఇషా రిఖీ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా జీవితాలు వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఇది పరస్పర గౌరవంతో తీసుకున్నదే. ఈ టైంలో మా ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుతున్నాం. మా బంధం గురించి ఇకపై ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చేయొద్దని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే మా ప్రకటన' అని బాద్‌షా పేర్కొన్నాడు.
(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో:జీవీ ప్రకాశ్)




