సన్నీ లియోన్‌పై కేసు.. కొట్టేసిన కోర్టు | Court Rejects Criminal Case Against Sunny Leone And Husband Daniel Weber Over ₹70 Lakh Commission Dispute | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌పై కేసు.. కొట్టేసిన కోర్టు

Aug 27 2026 11:24 AM | Updated on Aug 27 2026 11:49 AM

Sunny Leone Cleared in Rs 70L Commission Dispute Case

సినీ నటి సన్నీ లియోన్‌, ఆమె భర్త డేనియల్‌ వెబర్‌, మేనేజర్‌ సన్నీ రాజనీపై 2024లో దాఖలైన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను సెషన్స్‌ కోర్టు కొట్టేసింది. తెలుగు సినిమా విషయంలో రూ.70 లక్షలకు పైగా కమీషన్‌ బకాయి పెట్టారంటూ ఓం ప్రకాశ్‌ జైన్‌ చేసిన ఆరోపణలపై ఈ పిటిషన్‌ దాఖలైంది. తన వల్లే సన్నీ లియోన్‌కు ఓ సినిమాలో అవకాశం వచ్చిందని, ఒప్పందం ప్రకారం రూ.1.75 కోట్ల పారితోషికానికి సంబంధించి 10 శాతం ఇన్సెంటివ్‌గా తనకు చెల్లించాల్సి ఉందని జైన్‌ అందులో పేర్కొన్నారు. అయితే కొంత మొత్తం మాత్రమే చెల్లించి, మిగిలిన కమీషన్‌ను ఇవ్వలేదని ఆరోపించారు.

2024లో ఫిర్యాదు..
ఈ వ్యవహారంలో మోసం, నమ్మకద్రోహం, క్రిమినల్‌ బెదిరింపులకు పాల్పడ్డారంటూ జైన్‌ ఫిర్యాదు చేశారు. 2024లో మేజిస్ట్రేట్‌ కోర్టు ఆ ఫిర్యాదును తిరస్కరించడంతో ఆయన సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారం వాణిజ్య లావాదేవీకి సంబంధించినదేనని అదనపు సెషన్స్‌ జడ్జి పి.ఏ.సానే తెలిపారు. రికార్డుల్లో టాక్స్‌ ఇన్వాయిస్‌, రెండు ఫామ్‌ 16-ఏ కాపీలు, ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ ధ్రువపత్రాలు జైన్‌కు అనుకూలంగా ఉన్నట్లు కోర్టు గుర్తించింది.

ఇలా నిర్ధారించలేం..
అయితే కేవలం చెల్లింపులు జరగకపోవడం వల్లే మోసం లేదా నమ్మకద్రోహం నేరాలు నిర్ధారించలేమని స్పష్టం చేసింది. మొదటి నుంచే మోసం చేసినట్లు ఆధారాలు ఉంటేనే వాణిజ్య వివాదం.. క్రిమినల్‌ నేరంగా పరిగణించవచ్చని పేర్కొంటూ జైన్‌ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

ఇదీ చదవండి: నాకు యాక్టింగ్‌ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement