నాకు యాక్టింగ్‌ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్‌ | Dhanush Praises Irumudi Child Actor Baby Nakshatra For Her Impressive Performance, Video Call Conversation Goes Viral | Sakshi
Sakshi News home page

నాకు యాక్టింగ్‌ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్‌

Aug 27 2026 9:20 AM | Updated on Aug 27 2026 11:10 AM

Dhanush Praises Irumudi Actor Baby Nakshatra Through Video Call

నటీనటుల ప్రతిభకు స్టార్‌డమ్‌తో సంబంధం ఉండదు. మంచి నటన ఎక్కడ కనిపంచినా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బాలనటి నక్షత్ర విషయంలో కూడా అదే జరిగింది. ‘ఇరుముడి’ చిత్రంలోని ఆమె నటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. ప్రముఖ తమిళ నటుడు ధనుష్‌ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోకాల్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియో కాల్‌ చేసి ప్రశంసలు..
నక్షత్ర నటనను చూసిన ధనుష్‌ స్వయంగా ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారిని అభినందించడంతోపాటు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పుడైనా మనం కలిసినప్పుడు నీ దగ్గర నటన నేర్చుకోవాలని ఉంది. చాలా అద్భుతంగా, అందగా నటించావు. నీ నటన నాకు చాలా నచ్చింది. ఎప్పుడైనా మనం కలుద్దాం. గ్రేట్‌ జాబ్‌ కన్నా.. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి’. అంటూ వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఈ సమయంలో ఆ చిన్నారి ఇచ్చిన అమాయకరమైన, ఉత్సాహభరితమైన స్పందన కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.

 


 ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement