బర్త్‌ డే ట్రీట్‌ షురూ | Nagarjuna led King100 first glimpse to be released on actor birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌ డే ట్రీట్‌ షురూ

Aug 27 2026 4:50 AM | Updated on Aug 27 2026 4:51 AM

Nagarjuna led King100 first glimpse to be released on actor birthday

అభిమాన హీరో పుట్టినరోజుకి ఆ హీరో నటించే చిత్రాల అప్‌డేట్స్‌ని అభిమానులు ఆశిస్తారు. హీరోలు కూడా ఫ్యాన్స్‌కి ఆ ట్రీట్‌ ఇవ్వాలనుకుంటారు. నాగార్జున నుంచి అలాంటి ట్రీట్‌ షురూ అయింది. ఈ నెల 29న ఈ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగ్‌ మైల్‌స్టోన్‌ మూవీ ‘కింగ్‌ 100’ (వర్కింగ్‌ టైటిల్‌) నుంచి  టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ రానుంది. రా కార్తీక్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

 ఈ చిత్రానికి ‘కింగ్‌ 100, కింగ్‌ 100 నాటౌట్, లాటరీ కింగ్‌’ వంటి టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారనే వార్త కొంత కాలంగా ప్రచారంలో ఉంది. మరి... వీటిలో ఏదో ఒకటి ఫిక్స్‌ చేస్తారా? లేదా వేరే టైటిల్‌ పెడతారా? అనేది ఈ 29న తెలిసిపోతుంది. ఇక ‘నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నాగార్జున్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న టబు ఈ సినిమాలో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. శనివారం విడుదల చేయనున్న టైటిల్‌ గ్లింప్స్‌తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement