బిగ్‌బాస్‌ సీజన్-10.. ఈ సారి దశవతారమే..! | Nagarjuna Akkineni Bigg Boss Promotion Video Goes Viral | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ సీజన్-10.. ఈ సారి దశవతారమే..!

Aug 16 2026 8:38 AM | Updated on Aug 16 2026 8:38 AM

Nagarjuna Akkineni Bigg Boss Promotion Video Goes Viral

తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్‌ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి సరికొత్తగా.. సవాల్‌గా ఉండనుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్‌ మరో ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విభిన్నంగా కనిపించారు. మీరు ఎంతైనా ఆశించండి. 'బిగ్‌బాస్‌ సీజన్‌-10 నెక్ట్స్‌ లెవల్‌, వెరైటీ, సర్‌ప్రైజ్‌, డ్రామా, ఛాలెంజ్‌ పదింతలు..వారం వారం సరికొత్త అవతారం.. ఈ సారి దశవతారం' అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆటలో సవాల్‌ కాదు.. ఆటే సవాల్‌ అంటూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి క్రియేట్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement