వారణాసి, ఫౌజీ మేకర్స్‌తో కాలేదు.. రాకాతోనైనా అవుతుందా? | Allu Arjun Raaka team Gives Surprise To Fans This August | Sakshi
Sakshi News home page

Raaka Movie: వారణాసి, ఫౌజీతో కాలేదు.. రాకాతోనైనా అవుతుందా?

Aug 16 2026 7:35 AM | Updated on Aug 16 2026 7:40 AM

Allu Arjun Raaka team Gives Surprise To Fans This August

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటేడ్ మూవీస్‌లో ముందు వరుసలో ఉన్నవి ప్రభాస్ ఫౌజీ, మహేశ్ బాబు వారణాసి, అల్లు అర్జున్‌ రాకా. ఈ మూడు చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాల అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌ బిగ్‌ అప్‌డేట్ ఆశించారు. కానీ జక్కన్న కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సరిపెట్టుకున్నారు. 

అలాగే ఆగస్టు 15న ప్రభాస్-హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తోన్న ఫౌజీ అప్‌డేట్ ఇచ్చారు. వీళ్లు కూడా కేవలం ఒక్క పోస్టర్‌తోనే సరిపెట్టారు. దీంతో వీడియో గ్లింప్స్ కానీ, టీజర్స్ కానీ వస్తాయని భావించినప్పటీ అలా జరగలేదు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ రిలీజ్‌ తేదీని ముందే ప్రకటించినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అందువల్లే టీజర్‌ కానీ.. గ్లింప్స్ రాలేదని అర్థమవుతోంది.

మిగిలింది రాకా ఒక్కటే..

టాలీవుడ్‌లో మరో భారీ మూవీ రాకా. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్నారు. మహేశ్ బాబు, ప్రభాస్ చిత్రాల అప్‌డేట్స్‌తో నిరాశ చెందిన సినీ ప్రియులు రాకా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే రాకాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ నెలలోనే  రాకా ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వీడియో గ్లింప్స్, టీజర్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో రాకాపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. వారణాసి, ఫౌజీ మేకర్స్ ఇవ్వలేకపోయినా.. బిగ్‌ అప్‌డేట్‌ను రాకా మేకర్స్ ఇస్తాడేమో వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement