నీ వల్ల నా జీవితం నాశనమైంది: నవదీప్‌పై ఉప్పల్ బాలు ఆరోపణలు | Uppal Balu Made Sensational Allegations On Actor Navdeep about His Bigg Boss Agni Pariksha Opportunity, Read Story Inside | Sakshi
Sakshi News home page

Uppal Balu: 'నన్ను అవమానించావ్.. నా జీవితం నాశనం చేశావ్'

Aug 16 2026 6:55 AM | Updated on Aug 16 2026 11:09 AM

Uppal Balu allegations on Hero Navdeep about Bigg Boss Agni Pariksha

ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ల సెలెక్షన్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు పరీక్ష పెట్టారు. ఈ అగ్నిపరీక్ష ఫైనల్‌కు 15 మందిని ఎంపిక చేశారు. ఈ సెలెక్షన్‌లో ఉప్పల్‌ బాలు కూడా పాల్గొన్నారు. అయితే అతను ఈ ఫైనల్‌ లిస్ట్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఈ అగ్నిపరీక్షకు అభిజీత్, నవదీప్‌, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే తనను బిగ్‌బాస్‌ వెళ్లనివ్వకుండా నవదీప్‌ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు. తనవి వల్గర్ వీడియోలంటూ అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. స్టేజ్‌పైకి పిలిచి కనీసం టాస్క్ ఇవ్వకుండా.. పాట పాడనివ్వకుండా అవమానించారని ఉప్పల్ బాలు విమర్శలు చేస్తున్నారు. అభిజీత్ తనకు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుంటే.. నవదీప్ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు.నన్ను ఎంతగానో అవమానించావు.. నీ వల్ల నాకు వచ్చే అవకాశం కూడా పోయి నా జీవితం నాశనమైంది అంటూ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశాడు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని..మాపై నీకెందుకంత కుళ్లు అంటూ ప్రశ్నించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement