పైల్స్‌ నివారణకు అశ్విని ముద్ర | Health Tips: Benefits of Ashwini Mudra and How to Do it By | Sakshi
Sakshi News home page

పైల్స్‌ నివారణకు అశ్విని ముద్ర

Aug 15 2026 3:52 PM | Updated on Aug 15 2026 4:01 PM

Health Tips: Benefits of Ashwini Mudra and How to Do it By

అశ్విని ముద్ర అనేది యోగాలో పెల్విక్‌ ఫ్లోర్‌/మలద్వార ప్రాంతంలోని కండరాలను సంకోచించి–వదిలే సాధన. ‘‘అశ్విని’’ అంటే గుర్రం. గుర్రం మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని సంకోచించి, సడలించే కదలికను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.

చేసే విధానం

ముందుగా మలాసనంలో కూర్చోవాలి.

కళ్లను మూసుకుని శ్వాసను సహజంగా తీసుకోవాలి.

మలవిసర్జన ఆపుతున్నట్లుగా మలద్వార/పెల్విక్‌ ఫ్లోర్‌ కండరాలను మెల్లగా బిగించండి.

2–3 సెకన్లు హోల్డ్‌  చేసి,  పూర్తిగా రిలాక్స్‌ చేయండి.

ఇలా 15–20 సార్లు చేయవచ్చు.

చివర్లో కొన్ని క్షణాలు పూర్తిగా రిలాక్స్‌ అవ్వండి.
ముఖ్యంగా: పొట్ట, తొడలు, పిరుదులు బిగించకుండా పెల్విక్‌ ఫ్లోర్‌ కండరాలనే కదిలించేలా ప్రయత్నించాలి. శ్వాసను బిగపట్టకండి.

ప్రయోజనాలు

కటి ప్రాంతంలోని కండరాలను దృఢంగా మారుస్తుంది.

మలబద్ధకం, అజీర్ణం వంటి పొట్ట సమస్యలను తగ్గిస్తుంది.

ఆసన ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచి మొలలు తగ్గడానికి సహాయపడుతుంది.

మూత్రం లీకయ్యే సమస్యను అరికట్టి బ్లాడర్‌ నియంత్రణను మెరుగుపరుస్తుంది.

జాగ్రత్తలు

నొప్పి వస్తే వెంటనే ఆపాలి.

పైల్స్, ఆనల్‌ ఫిషర్, రీసెంట్‌ రెక్టల్‌ సర్జరీ, తీవ్రమైన పెల్విక్‌ పెయిన్‌ ఉన్నవారు వైద్యుడి సలహాతోనే చేయాలి.

మలవిసర్జన సమయంలో బలవంతంగా ఈ ముద్ర చేయకండి.

ఎక్కువసేపు కండరాలను బిగించి ఉంచొద్దు.

గర్భిణీలు లేదా ప్రసవం తర్వాత ఉన్నవారు వ్యక్తిగత పరిస్థితిని బట్టి యోగా ప్రొఫెషనల్‌ /డాక్టర్‌ గైడెన్స్‌ తో చేయాలి.

– అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌  

(చదవండి: వర్షాకాలంలోనే పంటి సమస్యలు ఎందుకంటే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement