ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి | Madanapalle Love Marriage Couple Seeks Protection from District SP After Death Threats | Sakshi
Sakshi News home page

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

Aug 13 2026 12:28 PM | Updated on Aug 13 2026 12:30 PM

Love Marriage Couple Seeks Protection

మదనపల్లె టౌన్‌ : తాము ఇద్దరము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. దగ్గరి బంధువులు అయినప్పటికీ, తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నాం. తాము పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేక ఆరు నెలల కూడా తిరగకనే హత మారుస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నట్లు ఓ ప్రేమ జంట బుధవారం మదనపల్లె జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీని రక్షణ కొరింది.

 వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పీటీఎం మండలం, కాట్నగల్లు కు చెందిన వెంకటరమణ కుమార్తె పి ఐశ్వర్య (19) అదే ఊరికి చెందిన మురళిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని తమ తల్లిదండ్రులు వెంకటరమణ, విజయమ్మ, సంధ్యలు తాము ఎక్కడికి వెళ్లి వస్తున్నా వెంటాడుతూ చంపడానికి ప్రయత్నిస్తున్నారు కన్నీటిపర్వంతమయ్యారు.  

తమకు ప్రాణ రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించి న్యాయం కోసం అభ్యర్థించారు. జిల్లా ఎస్పీ స్పందించి పేటీఎం పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అప్పటికే పీటీఎంలో పంచాయతీలు కూడా జరిగాయని, పోలీసుల ను కూడా తమ పెద్దలు ఎదురిస్తున్నారని, ఎస్పీ  జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement