సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు అన్యాయమే జరిగిందని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. తమ కుమార్తెకు న్యాయం జరగక తొమ్మిదేళ్లు గడిచిపోయాయని, ఇప్పటికీ న్యాయం కోసం పోరాడాల్సి వస్తోందని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా సుగాలి పార్వతి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. మాకు జరిగిన అన్యాయం కోసమే పోరాటం చేస్తున్నాం. మా బిడ్డను కోల్పోయి 9 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదు. అందుకే వీల్‌చైర్ యాత్ర చేయబోతున్నాను. మా పోరాటానికి మద్దతు కావాలి. అందుకే వైఎస్ జగన్‌ను కలవడానికి వచ్చాను. చంద్రబాబు, పవన్ మహిళల పట్ల ఇదేనా మీ భద్రత అని ప్రశ్నించారు.


