'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్ | Trisha posts cryptic messages on drama after Udhayanidhi row | Sakshi
Sakshi News home page

Trisha: 'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష కౌంటర్

Aug 11 2026 8:02 PM | Updated on Aug 11 2026 9:05 PM

Trisha posts cryptic messages on drama after Udhayanidhi row

ప్రస్తుతం కోలీవుడ్‌లో త్రిష పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోయింది. ఇటీవల మరోసారి త్రిష పేరు తెరమీదకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్‌.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో ఉదయనిధిని అరెస్ట్‌ చేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

ఈ వివాద జరిగిన దాదాపు వారం రోజులవుతోంది. తాజాగా ఈ కాంట్రవర్సీపై హీరోయిన్ త్రిష తనదైన శైలిలో కౌంటరిచ్చింది. నేరుగా ఉదయనిధి పేరు ప్రస్తావించకుండానే గట్టిగానే ఇచ్చిపడేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటు. వెళ్లి కొంత డబ్బు సంపాదించు, మనశ్శాంతిని పొందు' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది.  అయితే మరోవైపు ఈ పోస్ట్‌ విజయ్ భార్య సంగీతను ఉద్దేశించి పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే సంగీత విడాకుల కేసు వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే త్రిష ఆమెను ఉద్దేశించి పోస్ట్ చేశారని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఓకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు ఉదయనిధికి.. ఇటు సంగీతకు కౌంటరిచ్చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. 

అసలేం జరిగిందంటే..

నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్‌ "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్‌ చేసి ఆయనను విచారించిన తర్వాత పోలీసులు విడుదల చేశారు. తంజావూరుకు తీసుకెళ్లి గంటకుపైగా పోలీసులు విచారించారు. అంతకుముందు మద్రాస్ హైకోర్టు.. దర్యాప్తునకు అవసరమైనప్పుడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. విచారణ పూర్తైన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులకు సూచించింది.

t
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement