కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 26న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మరింత బోల్డ్ అండ్ వయొలెంట్‌గా చూపించారు. ఈ మూవీ కేవలం పెద్దలకు మాత్రమేనని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో రన్‌టైమ్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ రన్‌టైమ్ దాదాపు 3 గంటల 11 నిమిషాలని ప్రచారం జరుగుతోంది. ఈ రన్‌టైమ్ చూస్తుంటే కాస్తా తక్కువగానే ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో అధికంగా వయొలెన్స్, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో కనిపించాయి. అందువల్లే గీతూ మోహన్ దాస్ ఇదే నిడివితో సెన్సార్‌కు పంపినట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ సినిమాను ప్రైమ్ బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఐమాక్స్‌లో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫార్మాట్‌లో రిలీజవుతోన్న రెండో కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు.


