'విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ.. సెట్స్‌లో రియల్ చిరుతపులి ఎంట్రీ' | Venky Atluri Shares Vishwanath and sons Shoot Experience in Ooty | Sakshi
Sakshi News home page

Vishwanath & Sons: 'విశ్వనాథ్ అండ్ సన్స్.. గడ్డ కట్టే చలిలో 11 రోజులు'

Aug 11 2026 4:12 PM | Updated on Aug 11 2026 4:17 PM

Venky Atluri Shares Vishwanath and sons Shoot Experience in Ooty

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్‌గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్‌ టైమ్‌లో ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ఊటీలో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు సెట్స్‌లోకి చిరుతపులి వచ్చిందని తెలిపారు. అది తమ కళ్ల ముందు నుంచే వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా గడ్డ కట్టే చలిలో 102-103 ఫీవర్‌తో సూర్య, మమిత బైజు దాదాపు 11 రోజుల పాటు ఊటీలోనే షూట్‌లో పాల్గొన్నారని వెంకీ తెలిపారు. కాగా..ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement