కలలో శివుడు.. ఇది సాధారణంగా అనిపించలేదు: పూరీ కూతురు | Pavithra Puri Draw Kedarnath Temple Picture | Sakshi
Sakshi News home page

Pavithra Puri: ఆనందపడినా బాధొచ్చినా మాట్లాడేది ఆయనతోనే

Aug 11 2026 11:46 AM | Updated on Aug 11 2026 11:50 AM

Pavithra Puri Draw Kedarnath Temple Picture

దర్శకుడు పూరీ జగన్నాథ్ దేవుడిని పెద్దగా నమ్మడు! ఇదే విషయాన్ని మ్యూజింగ్స్, పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఈయన కూతురు పవిత్ర మాత్రం శివుడిపై భక్తిభావన పెంచుకుంటోంది. అందుకు తగ్గట్లే తనకు కలలో శివుడు కనిపించాడని, ఇది సాధారణంగా అనిపించలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)

'కొన్నేళ్ల క్రితం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పెన్‌తో మండల చిత్రాలు గీయడం ప్రారంభించాను. ఇది నేర్చుకున్న నైపుణ్యం కాదు. సహజంగా పుట్టుకొచ్చిన ఓ అభిరుచి. కాలక్రమేణా ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ భాగమైంది. శివుడు నా జీవితంలో దేవుడు మాత్రమే కాదు. నా బలం, నా ఓదార్పు. నా మనసు ఆనందంతో నిండినప్పుడు, బాధపడినప్పుడు నేను మాట్లాడుకునేది ఆయనతోనే. గతేడాది కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన ఓ అందమైన కల వచ్చింది. అది సాధారణమైన కలలా అనిపించలేదు. శివుడే నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. తర్వాతి రోజే కేదార్‌నాథ్ ఆలయాన్ని మండల ఆర్ట్ శైలిలో గీయడం ప్రారంభించాను'

'దాదాపు వారం రోజుల పాటు ప్రతి గీతలోనూ ఓ ప్రార్థన, ప్రతి ఆకృతిలోనూ ఓ భావాన్ని, ప్రతి రంగులోనూ నా భక్తిని నింపుతూ ఆ చిత్రాన్ని గీయడం పూర్తి చేశాను. దీనిని ఒక వారం పాటు గీసినప్పటికీ చాలా కాలంగా గీస్తున్నట్టుగా అనిపించింది. ఇది పూర్తయిన తర్వాత నాలో ఓ ప్రశాంతత నెలకొంది. దీనిని మొదట నా కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకున్నా. కానీ ఇప్పుడు కృతజ్ఞతతో ఆ చిత్రాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. హర హర మహాదేవ్' అని పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'ఇరుముడి' సినిమాకు శబరిమలతో సంబంధం లేదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement