అక్కకు పూర్తిగా పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా | Dushara Vijayan Gets Emotional And Recalls Her Sister Situation And Bonding, Says I Miss Her Every Day | Sakshi
Sakshi News home page

Dushara Vijayan: దేవుడిని ప్రార్థించను.. ప్రతిసారీ అక్క ఫొటో చూసి

Aug 11 2026 10:15 AM | Updated on Aug 11 2026 10:47 AM

Dushara Vijayan Shares Her Sister Situation And Bonding

తమిళ ప్రముఖ హీరోయిన్ దుషారా విజయన్.. తన జీవితంలో చెరిగిపోని విషాదాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది. అక్క మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈమె నటించిన లేటెస్ట్ సినిమా 'జీడీఎన్'. దీని ప్రమోషన్లలో భాగంగా చాలా విషయాలు మాట్లాడిన దుషార.. అక్కడతో తన అనుబంధం, పుట్టుకతోనే ఆమెకొచ్చిన పక్షవాతం గురించి చెప్పింది.

(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)

దుషారా విజయన్‌కు ఇద్దరు అక్కలు ఉండగా వారిలో రెండో అక్క దుర్గా దాదాపు పదేళ్ల క్రితం కన్నుమూసింది. ఈమెకు పుట్టుకతోనే మ్యోపతి అనే వ్యాధి ఉంది. దీని కారణంగా ఆమె మెడ కింది భాగం పూర్తిగా పక్షవాతానికి గురైందని దుషార చెప్పుకొచ్చింది.

'మెడ పైభాగం వరకు ఆమెకు ఎలాంటి సమస్య లేదు. మెడ కింది భాగం మాత్రం పూర్తిగా పక్షవాతానికి గురైంది. అందుకే రోజువారీ పనులన్నింటికీ మేమే సహాయం చేయాల్సి వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి ఏర్పడటానికి అక్కే కారణం. నేను డ్యాన్స్ చేస్తుంటే వీల్‌ఛైర్‌లో కూర్చుని ఇలా చెయ్ అలా చెయ్ అని సూచించేది. నేను ఆమెని చాలా మిస్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్లినా నేను దేవుడిని మొక్కను. నా అక్క ఫొటో చూసి ప్రార్థిస్తాను' అని దుషారా చెప్పింది.

తమ్ముడితో అనుబంధం గురించి మాట్లాడిన దుషారా.. దాదాపు ఏడేళ్ల పాటు తమ్ముడితో కలిసి చెన్నైలో నివసించాను. టెక్నికల్‌గా చెప్పాలంటే నేను వాడికి తల్లిలాంటిదాన్ని. వాడు నాకు నా బిడ్డ లాంటివాడు అని పేర్కొంది. సార్పట్ట పరంపరై, నచ్చతిరం నగర్‌గిరదు, రాయన్, వేట్టయాన్ తదితర సినిమాల్లో నటించింది. ఈ శుక్రవారం ఈమె ఓ హీరోయిన్‌గా చేసిన 'మకుటం' రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా':దుషారా విజయన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement