79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్? | 79th or 80th Independence Day 2026: Decoding Indias Milestone | Sakshi
Sakshi News home page

79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?

Aug 10 2026 12:47 PM | Updated on Aug 10 2026 1:03 PM

79th or 80th Independence Day 2026: Decoding Indias Milestone

న్యూఢిల్లీ: రాబోయే ఆగస్టు 15(2026)న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.  1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అయితే, ఈ ఏడాది అంటే 2026లో దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోందా లేక 80వదా అనే అంశంపై ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది.

ఈ గందరగోళానికి ప్రధాన కారణం లెక్కింపు విధానమే. చాలామంది స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయనే కోణంలో లెక్కిస్తున్నారు. దీని ప్రకారం, 2026 నుండి 1947ని తీసివేయగా 79 సంవత్సరాలు వస్తుంది. అంటే ఆగస్టు 15, 2026 నాటికి భారత్ స్వాతంత్ర్యం పొంది 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు మనం జరుపుకున్న మొత్తం స్వాతంత్ర్య దినోత్సవాల సంఖ్యను లెక్కిస్తే వేరే లెక్క వస్తుంది.

1947లో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం జరుగగా, 1948లో రెండవది, ఇలా ప్రతి ఏటా కలుపుకుంటూ వస్తే 2026 నాటికి ఇది 80వ స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. దీనిని లెక్కించేందుకు 2026 - 1947 + 1 సూత్రాన్ని ఉపయోగిస్తారు. దీనిని బట్టి స్పష్టత ఏమిటంటే, ఆగస్టు 15, 2026న మనం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే భారత్ స్వాతంత్య్రం సాధించి, 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదన్నమాట.

ఇది కూడా చదవండి: గర్భస్థ పిండం నోటిలో మరో పిండం.. షాక్‌లో వైద్యులు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement