హరిద్వార్: హరిద్వార్‌లో జరుగుతున్న కన్వర్ యాత్రకు సంబంధించి ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌కు ఏకంగా 500 హారన్‌లను అమర్చుకుని హరిద్వార్‌కు చేరుకున్నాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా భారీ మార్పులు చేసిన ఈ వినూత్న బైక్ పోలీసుల దృష్టిలో పడటంతో వారు దానిని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.
Kanwar Yatra: Police in Haridwar are strictly seizing modified bikes used by Kanwariyas arriving to collect Ganga water. This year, Haridwar Police are taking strict action against unruly Kanwariyas. pic.twitter.com/uxGrrQHA8R
— Insight News India (@InsightNIndia) August 7, 2026
కన్వర్ యాత్ర సమయంలో గంగాజలం సేకరించేందుకు లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమ వాహనాలను వినూత్న రీతిలో అలంకరించుకుంటారు. అయితే, ఫరీదాబాద్‌కు చెందిన అమన్ అనే వ్యక్తి తన బైక్ చుట్టూ సుమారు 500 హారన్‌లను బిగించి ప్రయాణించాడు. శంకరాచార్య చౌక్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల కంట ఈ బైక్ పడింది. వాహనంలో చేసిన ఈ భారీ మార్పులు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పోలీసులు వెంటనే స్పందించారు.
కన్ఖల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఎస్‌ఐ అనుజ్ కుమార్ మాట్లాడుతూ, ఆగస్టు 7న శంకరాచార్య చౌక్ వద్ద ఈ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు బైక్‌ను సీజ్ చేసి, చలానా విధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ భారీ హారన్ల బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా ప్రచారం అయ్యాయి. యాత్ర సమయంలో భక్తులు నిబంధనలు పాటించాలని, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: గర్భస్థ పిండం నోటిలో మరో పిండం.. షాక్‌లో వైద్యులు!


