ఓ సినిమాకు సీక్వెల్ తీయాలా వద్దా అనేది మొదటి భాగం సక్సెస్ బట్టి ఉంటుంది. అలాంటి రీసెంట్ టైంలో వచ్చిన సీక్వెల్ సినిమా 'గట్ట కుస్తీ 2'. చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వీటిని తెరకెక్కించారు. రెండో పార్ట్ అద్భుతమైన హిట్ అయ్యేసరికి కొనసాగింపుగా మూడో భాగం ఉంటుందా అనే ప్రశ్న వచ్చింది. దీనికి దర్శకుడు సెల్లా అయ్యావు బదిలిస్తూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే దానికి సీక్వెల్ తీయడానికి కారణం అని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)
సాధారణంగా పార్ట్ 2 తీస్తున్నప్పుడు దానిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఇదే విషయాన్ని విష్ణు విశాల్‌తో చెప్పాను. అయితే పేరు కోసం పార్ట్ చేయొద్దని, మంచి కథ కుదిరితేనే చేద్దామని చెప్పారు. దీంతో ఆరు నెలల పాటు కష్టపడి కథ సిద్ధం చేసుకుని అది అందరికీ నచ్చిన తర్వాతే గట్ట కుస్తీ 2 ప్రారంభించాను. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువగా ఆదరణ పొందటం సంతోషం. తదుపరి చిత్రాలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయిన చిత్రాల పేర్లతో మాత్రమే చేయకూడదని భావించాను. అలానే కథకు కొనసాగింపు ఉండాలని భావించాను. అలాంటి కథ సెట్ అయ్యేసరికి గట్ట కుస్తీ చిత్రాన్ని రెండు భాగాలు రూపొందించినట్లు చెప్పారు.
మంచి కథ కుదిరితే గట్ట కుస్తీ 3 తీస్తానని దర్శకుడు చెల్లా అయ్యావు చెప్పారు. ప్రస్తుతం కెన్ కరుణాస్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇది ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 'గట్ట కుస్తీ 2' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు)


