విడుదల తేదీ ఖరారు | Salman Khan and Sanjay Dutt 7 Dogs Gets India Release Date | Sakshi
Sakshi News home page

విడుదల తేదీ ఖరారు

Aug 11 2026 12:01 AM | Updated on Aug 11 2026 12:01 AM

Salman Khan and Sanjay Dutt 7 Dogs Gets India Release Date

బాలీవుడ్‌ హీరోలు సల్మాన్ ఖాన్ , సంజయ్‌దత్‌ నటించిన అంతర్జాతీయ చిత్రం ‘7 డాగ్స్‌’ ఇండియాలో రిలీజ్‌ కానుంది. ఈజిప్ట్‌ సూపర్‌స్టార్స్‌ అహ్మద్‌ ఎజ్, కరీమ్‌ అబ్దెల్‌ అజీజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటర్‌నేషనల్‌ మూవీ ‘7 డాగ్స్‌’. ‘బ్యాడ్‌ బాయ్స్‌ ఫర్‌ లైఫ్‌’, ‘బ్యాడ్‌ బాయ్స్‌: రైడ్‌   ఆర్‌ డై’ చిత్రాల ఫేమ్‌ దర్శక–ద్వయం ఆదిల్‌ ఎల్‌ అర్బీ, బిలాల్‌ ఫల్లా తెరకెక్కించారు. ఇటాలియన్  నటి మోనికా బెల్లూసి, అమెరికన్  యాక్టర్‌ గియాన్  కర్లో అలెశ్శాండ్రో కీలక పాత్రల్లో నటించారు. 

సెలా స్టూడియోస్, జనరల్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ అథారిటీ, రియాద్‌ సీజన్‌ నిర్మించిన ఈ చిత్రం మిడిల్‌ ఈస్ట్‌లో ఈ ఏడాది మే 27న అరబిక్, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదలై హిట్‌గా    నిలిచింది. తాజాగా ఈ సినిమాను ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ నెల 21న భారత్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు సోమవారం ప్రకటించి, ఓ వీడియో విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement