'నా తొమ్మిదేళ్ల కష్టం.. ఆయన వల్లే సాధ్యమైంది'.. కామాక్షి ఎమోషనల్ | Kamakshi Bhaskarla Emotional at Agadha Movie pre release event | Sakshi
Sakshi News home page

Kamakshi Bhaskarla: 'నా తొమ్మిదేళ్ల కష్టం.. ఇదంతా ఆయన వల్లే'.. కామాక్షి ఎమోషనల్

Aug 10 2026 9:42 PM | Updated on Aug 10 2026 9:50 PM

Kamakshi Bhaskarla Emotional at Agadha Movie pre release event

టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి పరిచయం అక్కర్లేదు. పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించింది. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్‌ రాజు డైరెక్షన్‌లో వస్తోన్న అగధ మూవీలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన కామాక్షి తన కెరీర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. నా తొమ్మిదేళ్ల కష్టమని కామాక్షి తెలిపింది. నా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే ఇంతవరకు వచ్చానని ఎమోషనలైంది. నా కెరీర్‌కి పునాది రాయి వేసింది మాత్రం ఎంఎస్‌ రాజుగారు మాత్రమేనని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే కష్టమని ఏడ్చేసింది. అలాంటిది నన్ను సినిమాలో లీడ్ రోల్‌లో తీసుకున్నారని తెలిపింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ మారుతోందని.. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది కామాక్షి.

నన్ను స్క్రీన్‌పై చూసింది చాలా తక్కువ.. నేను చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను అలాంటివే చేస్తుందని అనుకుంటారు.. కానీ నా తొమ్మిదేళ్ల కష్టం వాళ్లకు మాత్రమే తెలుసన్నారు. ఈ రోజు ఇక్కడ నేను నిలబడేందుకు నా ఫ్యామిలీ ఎంతో త్యాగాలు చేయాల్సి వచ్చిందని కామాక్షి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మా అన్న, అమ్మ, పిన్ని నాకోసం ఇక్కడికి వచ్చారంటూ ఏడుస్తూ మాట్లాడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement