హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియాలోనూ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూలై 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇండియన్ బాక్సాపీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.
ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా స్పైడర్ మ్యాన్ నిలిచింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లేటెస్ట్ చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండయా ప్రధాన పాత్రలు చేశారు. ఇండియాలో తొలి వీకెండ్ ముగిసేసరికి రూ.309 కోట్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది.
A historic 500 Cr milestone, made possible by you ❤️🕷️#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio! pic.twitter.com/ihXdQFB2po
— Sony Pictures India (@SonyPicsIndia) August 10, 2026


