మలయాళ నటి మమితా బైజు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ‘డ్యూడ్’, ‘జన నాయకన్’ వంటి చిత్రాలతో బిజీగా మారారు. త్వరలో స్టార్ హీరో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.
‘సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. నా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను వ్యక్తిగతంగా కాకుండా పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తా’ అని స్పష్టం చేశారు. తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్‌కు వీరాభిమానినని మమితా తెలిపారు. ఆయన నటించిన సినిమాల్లో ‘ఇద్దరమ్మాయిలు’ సినిమా ఇష్టమన్నారు. ఆ సినిమాలో ఉపయోగించిన వాచ్, ధరించిన టీషర్ట్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. తాను కూడా ఆ స్టైల్‌ను కాపీ చేసేదాన్నని చెబుతూ నవ్వులు పూయించారు.


