దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తీసిన ‘డీసీ’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు చేసిన ఈ యాక్షన్ డ్రామా తొలి వీకెండ్ ముగిసే సరికి మంచి వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం మూడో రోజైన ఆదివారం మన దేశంలో రూ.9.55 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిందని, శనివారం రూ.7కోట్లు వచ్చాయని టాక్. దీంతో మూడు రోజులకు కలిపి ఇండియాలో రూ. 20.95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. గ్రాస్ రూ.24.11 కోట్లు అని తెలుస్తోంది.
ఎక్కడెక్కడ ఎంత సాధించిందంటే..
డీసీ తమిళంలో ఎక్కువ వసూలు చేసింది. ఆదివారం తమిళంలో రూ.6.60 కోట్లు నెట్.. తెలుగులో రూ. 2.30 కోట్లు, హిందీలో రూ. 65 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఓవర్సీస్‌లో రూ.2.25 కోట్లు రాబట్టిందని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ గ్రాస్ రూ.7.75 కోట్లకు చేరింది. ఇండియా, ఓవర్సీస్ కలిపి ‘డీసీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలక్షన్ రూ. 31.86 కోట్లుగా నమోదైంది.
లోకేశ్ నటనకు ప్రశంసలు..
డీసీలో దేవదాస్ పాత్రలో మెరిసిన లోకేశ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే దర్శకుడిగా మంచి స్టార్‌డమ్ సంపాదించిన లోకేశ్.. హీరోగానూ తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. దీంతో లోకేశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వామికా గబ్బి పోషించిన చంద్రపాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. వీళ్లిద్దరితో పాటు సంజనా కృష్ణమూర్తి.. పార్వతి పాత్రలో నటించారు.


