breaking news
DC
-
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
రెండో వీకెండ్ అయిపోయినా సరే ఇంకా 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గతవారం రిలీజైన 'టాక్సిక్' మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇక ఈ వారం చాలానే మూవీస్ రాబోతున్నాయి. వాటిలో అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక', సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 'రోమాంచకం' చిత్రాలు ఉన్నంతలో కాస్త బజ్‌తో విడుదలవుతున్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్', మమిత బైజు 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్', మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి మూవీస్ కూడా బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 18 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ అయిన డిసి, కొరియన్ కనకరాజు, ఉన్మాదం లాంటి చిత్రాలు ఉన్నాయి. అలానే 'జగమే సంగీతం' అనే సిరీస్ కూడా చూడాలనే ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 06 వరకు)సన్ నెక్స్ట్డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04అమెజాన్ ప్రైమ్జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04హాట్స్టార్ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04సోనీ లివ్క్రైమ్ పాట్రోల్ (హిందీ సిరీస్) - ఆగస్టు 31ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04నెట్ఫ్లిక్స్అన్టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 01జారెడ్ ఫ్రైడ్ (ఇంగ్లీష్ కామెడీ షో) - సెప్టెంబరు 011000 ఎల్బీ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లవ్ సిక్ (మెక్సికన్ సిరీస్) - సెప్టెంబరు 02టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 02ఫిటో పాయెజ్: ద వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 03గాంధారి (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ద జెంటిల్మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 03ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04ఆపిల్ టీవీ ప్లస్మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి ‘డిసి’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపింది. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రం మరోసారి ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సన్ నెక్ట్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి అలరించనుందని తెలిపింది. (చదవండి: సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..? రిప్లై అదిరింది..!)కథేంటంటే.. గ్యాంగ్‌స్టర్ సర్కార్ టీమ్‌లో కీలకంగా పని చేస్తే వ్యక్తి దేవదాస్ అలియాస్ దాసు(లోకేశ్ కనకరాజ్). పోలీసు ఆయుధాలు దొంగిలించడం వీళ్ల పని. అలా ఓ సారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలు దొంగిలిస్తారు. అదే ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తి తన కొడుకు చదవుకు కోసం పొలం అమ్మి రూ. 7లక్షలు తీసుకెళ్తుంటాడు. ఈ డబ్బులను ఓ పోలీసు అధికారి తీసుకొని, అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని భార్య దేవదాస్ బృందాన్ని ఆశ్రయిస్తుంది.విషయం తెలుసుకున్న దాసు.. ఆ పోలీసు అధికారిని హత్య చేస్తాడు. దీంతో బోగరాజు నేతృత్వంతోని ఓ ప్రత్యేక పోలీసు బృందం.. దాసు గ్యాంగ్ కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో దాసు..తన బృందంతో కలిసి విజయవాడలోని ఓ బార్లో తలదాచుకుంటారు. అక్కడ బార్ సింగర్ పార్వతిని (సంజనా కృష్ణమూర్తి) చూసి దేవదాస్ ప్రేమలో పడతాడు. అయితే పోలీసుల దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర(వామికా గబ్బి)కు విముక్తి కలిపిస్తాడు దేవదాస్. దీంతో ఆమె కూడా దాస్ వెంటనే వస్తుంది. వీరి జర్నీ ఎలా కొనసాగింది? అసలు చంద్ర ఎందుకు వేశ్యగా మారింది? దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాసు చేసిన పోరాటం ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా అసలు కథ. ఇదీ చదవండి: క్రేజీ న్యూస్.. 'డిసి' సీక్వెల్? -
DC MOVIE: ‘డీసీ’ విజయం వెనుక.. ఇంత కఠోర శ్రమనా!
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీసీ’. రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నటుడిగానూ ఆరంగేట్రం చేశారు. అయితే సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.50 రోజుల పాటు..లోకేశ్ బాడీని ఫిట్‌గా మార్చుకునేందుకు ఏకంగా 50 రోజుల పాటు కఠినమైన వర్కౌట్ రొటీన్‌ను ఫాలో అయ్యారట. ఆయన ట్రైనర్ తాజాగా షేర్ చేసిన వీడియోలో జిమ్‌లో లోకేశ్ కసరత్తులు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు అప్పర్, లోయర్ బాడీ వర్కౌట్స్ చేస్తూ బైసెప్స్, కండరాలను టోన్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. దర్శకుడి నుంచి కథానాయకుడిగా మారే క్రమంలో లోకేశ్ చూపించిన అంకితభావాన్ని ట్రైనర్ ప్రశంసించారు.అరుణ్ మాథేశ్వరన్కు నాలుగో చిత్రం‘డీసీ’ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘రాకీ’ (2021), ‘సాని కాయిదమ్’ (2022), ‘కెప్టెన్ మిల్లర్’ (2024) చిత్రాలను ఆయన తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ అందించగా.. జీకే ప్రసన్న ఎడిటింగ్, పీసీ స్టంట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కథానాయికలుగా నటించారు. ఆడుకలం నరేన్, తలైవాసల్ విజయ్, కస్తూరి రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదీ చదవండి: షూటింగ్లో అస్వస్థత..! డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్ -
రెండో వారంలోనూ జోరు కొనసాగిస్తున్న సినిమా
లోకేశ్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం డీసీ. తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలై 10 రోజులు పూర్తయినా ఈ సినిమా వసూళ్ల జోరులో ఏ మాత్రం తగ్గడంలేదు. మొదటి వారంలో..మొదటి వారంలో ఈ చిత్రం ఇండియాలో బాక్సాఫీస్ వద్ద రూ.41.9 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. రెండో వారంలో కూడా ఆదివారం ఒక్కరోజే రూ.4.5 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే తొలి ఆదివారం వచ్చిన రూ.9.55 కోట్లతో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా తగ్గింది. రెండో వారంలో మొత్తం రూ.12.86 కోట్లను వసూలు చేసిన 'డీసీ'.. మొత్తం నెట్ కలెక్షన్లు రూ.54.76 కోట్లకు చేరుకున్నాయి. గ్రాస్ వసూళ్లు సుమారు రూ.64.62 కోట్లుగా నమోదయ్యాయి.ఈ వసూళ్లతో 'పరాశక్తి', 'యూత్', 'బ్లాస్ట్' చిత్రాలను అధిగమించిన 'డీసీ'.. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం రూ.62.46 కోట్లతో ఉన్న 'తాయ్ కిళవి' చిత్రానికి చేరువలో ఉంది. ఇదే జోరు కొనసాగితే రెండో వారం ముగిసే నాటికి ఆ చిత్రాన్ని కూడా అధిగమించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘డీసీ’ని రామ్‌గోపాల్‌వర్మ సినిమాతో పోల్చిన దర్శకుడు!
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం డీసీ. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబెడుతోంది. అయితే ఈ చిత్రం చూసిన మలయాళ దర్శకుడు రంజిత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’చూసినప్పుడు ఎలా అనిపించిందో ఈ సినిమా చూసినప్పుడూ అదే అనుభూతి కలిగిందని పేర్కొన్నారు.సినిమా చూసి ఇలా అనుకున్నా..‘దాదాపు 30 ఏళ్ల క్రితం తిరువనంతపురంలోని కృపా థియేటర్లో‘’ సినిమాను చూశాను. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఈ మాధ్యమాన్ని చూపించగలనా? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇప్పుడు డీసీ చూసికూడా దాదాపు ఇదే అనుభూతి కలిగింది’ అని శంకర్ పేర్కొన్నాడు.‘సత్య’ ఎలా ఉంటుందంటే..1998 జూలై 03న విడుదలైన ‘సత్య’ సినిమాని రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించారు. మనోజ్ బాజ్పేయీ, జేడీ చక్రవర్తి, ఊర్మిళా మటోండ్కర్, సౌరభ్ శుక్లా, షెఫాలీ షా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ భరద్వాజ్ సంగీతం అందించగా, సందీప్ చౌతా నేపథ్య సంగీతం సమకూర్చారు. ముంబయి అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామాలో.. సత్య అనే యువకుడు పరిస్థితుల కారణంగా గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం, అక్కడి స్నేహాలు, ప్రేమ, నేరాలు, సంఘర్షణలే ప్రధాన కథగా తెరకెక్కించారు. సహజమైన పాత్రలు, వాస్తవికమైన టేకింగ్‌తో ‘సత్య’ భారతీయ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది.డీసీ ఎలా ఉంటుందంటే..డీసీ.. కూడా గ్యాంగ్‌స్టార్ స్టోరీనే కానీ..అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతోపాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు. భావోద్వేగాలకూ పెద్దపీట వేయడంతో ఓ డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. -
లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ కలెక్షన్స్ ఎన్ని కోట్లు?
దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తీసిన ‘డీసీ’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు చేసిన ఈ యాక్షన్ డ్రామా తొలి వీకెండ్ ముగిసే సరికి మంచి వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం మూడో రోజైన ఆదివారం మన దేశంలో రూ.9.55 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిందని, శనివారం రూ.7కోట్లు వచ్చాయని టాక్. దీంతో మూడు రోజులకు కలిపి ఇండియాలో రూ. 20.95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. గ్రాస్ రూ.24.11 కోట్లు అని తెలుస్తోంది.ఎక్కడెక్కడ ఎంత సాధించిందంటే..డీసీ తమిళంలో ఎక్కువ వసూలు చేసింది. ఆదివారం తమిళంలో రూ.6.60 కోట్లు నెట్.. తెలుగులో రూ. 2.30 కోట్లు, హిందీలో రూ. 65 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఓవర్సీస్లో రూ.2.25 కోట్లు రాబట్టిందని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ గ్రాస్ రూ.7.75 కోట్లకు చేరింది. ఇండియా, ఓవర్సీస్ కలిపి ‘డీసీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలక్షన్ రూ. 31.86 కోట్లుగా నమోదైంది.లోకేశ్ నటనకు ప్రశంసలు..డీసీలో దేవదాస్ పాత్రలో మెరిసిన లోకేశ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే దర్శకుడిగా మంచి స్టార్డమ్ సంపాదించిన లోకేశ్.. హీరోగానూ తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. దీంతో లోకేశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వామికా గబ్బి పోషించిన చంద్రపాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. వీళ్లిద్దరితో పాటు సంజనా కృష్ణమూర్తి.. పార్వతి పాత్రలో నటించారు. -
లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ
ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు నచ్చలేదని అంటున్నారు. దీనితో పాటే 'డిసి' అనే తమిళ డబ్బింగ్ బొమ్మ కూడా రిలీజైంది. ఇందులో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ హీరోగా నటించగా.. అనిరుధ్ సంగీతమందించాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టోరీతో దీన్ని తీశారు. దీనికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సింది. ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)'తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ నా దగ్గరకు ఓ ఆసక్తికరమైన కథతో వచ్చాడు. నాకు చెప్పాడు. అదే టైంలో నేను చేస్తున్న ఓ సినిమా స్టోరీ.. దీనికి పోలినట్లు ఉండటంతో నేను అది ఓకే చేయలేకపోయాను' అని స్వయంగా విజయ్ దేవరకొండ చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ వీడియో బట్టి చూస్తే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా చేస్తున్న టైంలో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ 'డిసి' కథతో విజయ్‌ని కలిశాడు. కానీ సెట్ కాలేదు. దీంతో హీరోగా లోకేశ్ కనగరాజ్‌ని తీసుకున్నారు. అలా రౌడీ హీరో చేయాల్సిన మూవీతో దర్శకుడు లోకేశ్ హీరోగా మారాడు. నటుడిగా తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నాడు. ఒకవేళ విజయ్ దేవరకొండ 'డిసి' చేసుంటే ఎలా ఉండేదో?ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలతో బిజీగా ఉండగా.. లోకేశ్ కనగరాజ్, అల్లు అర్జున్‌తో తాను తీయాల్సిన #AA23 ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) DC VDK pic.twitter.com/mD6vEUCMEQ— Telugu Chitraalu ² (@TC_Backup) August 8, 2026 -
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
పక్కా మాస్ కమర్షియల్ కథాచిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్. మానగరం చిత్రం ద్వారా దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తొలి చిత్రంతోనే కమర్షియల్‌గా హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కార్తీ హీరోగా ఖైదీ, విజయ్ కథానాయకుడిగా మాస్టర్, లియో, కమలహాసన్ హీరోగా విక్రమ్, రజనీకాంత్ హీరోగా కూలి వంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలను తెరకెక్కించి.. ఇది తన బాణి అని తెలియజేశారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా పాన్ ఇండియా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.(చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కథానాయకుడిగా అవతారం ఎత్తి నటించిన చిత్రం డీసీ. ఈ చిత్రం కూడా ఆయన గత చిత్రాల స్థాయిలోనే పగ, ప్రతీకారం వంటి అంశాలతో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది. ఇందులో లోకేశ్ కనకరాజ్ ఒక గ్యాంగ్ స్టర్‌గా నటించారు. ఈయన పోలీసులకే పెద్ద సవాల్‌గా మారతాడు. అసలు ఈయన ఎందుకు తుపాకీ, కత్తులను చేతపట్టాల్సి వచ్చింది? పోలీసులపై ఎందుకు కక్ష కట్టాల్సి వచ్చింది? ఈయన తన తండ్రి తనకు కొడుకే లేడు అన్నంతగా నైరాశ్యానికి ఎందుకు గురయ్యాడు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం డీసీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రానికి అరుణ్ మదేశ్వరన్ దర్శకత్వం వహించారు. నటి వామిక గబ్బి, సంజన హీరోయిన్లుగా నటించిన ఇందులో దర్శకుడు కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్, క్రిష్ దయాళ్, అవినాష్దేవన్,, జవహర్ శక్తి, శరత్ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్ సంగీతాన్ని, ముఖేష్ ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఖైదీ, విక్రమ్, లియో, కూలీ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజు. ఆయన హీరోగా చేసిన తొలి సినిమా డీసీ(DC). అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ నేడు(ఆగస్ట్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. గ్యాంగ్‌స్టర్ సర్కార్ టీమ్‌లో కీలకంగా పని చేస్తే వ్యక్తి దేవదాస్ అలియాస్ దాసు(లోకేశ్ కనకరాజ్). పోలీసు ఆయుధాలు దొంగిలించడం వీళ్ల పని. అలా ఓ సారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలు దొంగిలిస్తారు. అదే ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తి తన కొడుకు చదవుకు కోసం పొలం అమ్మి రూ. 7లక్షలు తీసుకెళ్తుంటాడు. ఈ డబ్బులను ఓ పోలీసు అధికారి తీసుకొని, అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని భార్య దేవదాస్ బృందాన్ని ఆశ్రయిస్తుంది. విషయం తెలుసుకున్న దాసు.. ఆ పోలీసు అధికారిని హత్య చేస్తాడు. దీంతో బోగరాజు నేతృత్వంతోని ఓ ప్రత్యేక పోలీసు బృందం.. దాసు గ్యాంగ్ కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో దాసు..తన బృందంతో కలిసి విజయవాడలోని ఓ బార్లో తలదాచుకుంటారు. అక్కడ బార్ సింగర్ పార్వతిని (సంజనా కృష్ణమూర్తి) చూసి దేవదాస్ ప్రేమలో పడతాడు. అయితే పోలీసుల దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర(వామికా గబ్బి)కు విముక్తి కలిపిస్తాడు దేవదాస్. దీంతో ఆమె కూడా దాస్ వెంటనే వస్తుంది. వీరి జర్నీ ఎలా కొనసాగింది? అసలు చంద్ర ఎందుకు వేశ్యగా మారింది? దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాసు చేసిన పోరాటం ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా అసలు కథ. ఎలా ఉందంటే.. డీసీ.. కొత్త కథేమి కాదు. రొటీన్ గ్యాంగ్‌స్టర్ స్టోరీనే కానీ..అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతోపాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు. ఇంత రా అండ్ రస్టిక్ కథలో కూడా భావోద్వేగాలను పెద్దపీట వేయడంతో ఓ డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ పేదవాడు తన కొడుకును గొప్పగా చదివించాలని ఆశ పడడం.. పోలీసు అధికారి అత్యాశతో పోయి అతన్ని చంపేయడం..ఇలా కథ ప్రారంభమే ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు, గ్యాంగ్‌స్టర్ మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దేవదాస్ గ్యాంగ్ విజయవాడకు వెళ్లడం..అక్కడ పార్వతి పరిచయంతో కథ మరో మలుపు తీరుగుతుంది. పార్వతి ఎపిసోడ్ మొత్తం హృదయాలకు హత్తుకునేలా సాగుతుంది. ఇక చంద్ర ఎంట్రీ.. ఆమె ప్లాష్‌బ్యాక్ మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. రొటీన్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ అయినప్పటికీ.. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దాన్ని కొత్తగా మార్చేసింది. కొన్ని చోట్ల అనిరుధ్ ఇచ్చిన బీజీఎంకి థియేటర్ అంతా ఊగిపోతుంది. సెకండాఫ్‌లో కూడా కథనం పరుగులు పెడుతుంది. చంద్ర కూడా దాస్ టీమ్‌తో కలిసి ప్రయాణం చేయడం.. పోలీసులు వీరి కోసం వెతకడం..తప్పించుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు.. అన్నీ అదిరిపోతాయి. డబ్బుల కోసం చంద్ర వేసిన ప్లాన్ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినా.. అనిరుధ్ బీజీఎంతో బోర్ కొట్టకుండా చేశాడు. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. అయితే లోకేశ్ మినహా మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులను అంతగా తెలియకపోవడంతో ఆ పాత్రలతో పెద్దగా కనెక్ట్ కాలేకపోతాం. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ కూడా పెద్ద ఉండవు. కథ మొత్తం ఒకే లైన్ మీద సాగుతుంది. అలాగే మితిమీరిన హింస కూడా ఓ వర్గం ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఇనాళ్లు తెర వెనుక ఉన్న లోకేశ్.. తొలిసారి తెరపై కనిపించి, ఆకట్టుకున్నాడు. దేవదాస్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు లేకుండా కేవలం తన కళ్ళతో, హావభావాలతోనే చెప్పాల్సిన విషయం అర్థమయ్యేలా చెప్పేశాడు. వేశ్య చంద్ర పాత్రకి వామికా గబ్బి వందశాతం న్యాయం చేసింది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర అది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇక సంజన.. తెరపై కనిపించేది కాసేపే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. పోలీసులు అధికారితో పాటు దాస్ గ్యాంగ్ మెంబర్స్ కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో రొటీన్ గ్యాంగ్‌స్టర్ కథను తెరపై డిఫరెంట్‌గా కనబడేలా చేశాడు. ఓ యాక్షన్ సీన్‌కి పెళ్లి బరాత్ బీజీఎం ఇవ్వడం హైలెట్. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
దేవదాస్... పార్వతిల ప్రయాణం
‘‘ఒక పార్టీలో లోకేష్ కనగరాజ్గారిని కలిశాను. మనిద్దరం కలిసి పని చేస్తే బాగుంటుందని చెప్పాను. ‘డీసీ’ చిత్రకథ ఆయనకు చాలా నచ్చడంతో హీరోగా నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు. భారతీరాజా, సెల్వరాఘవన్, ధనుష్... వంటి వార్లను నేను డైరెక్ట్ చేశాను. దర్శకులతో పని చేయడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ విజన్‌ని త్వరగా అర్థం చేసుకుంటారు’’ అని అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అరుణ్ మాథేశ్వరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డీసీ’ ఒక వైల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ. దేవదాస్ తన ప్రయాణంలో చంద్ర, పార్వతిని కలుస్తాడు.ఆ తర్వాత వీరి జర్నీ ఎలా సాగుతుంది? అనేది ఈ సినిమా. దేవదాస్ అంటే అందరికీ క్లాసిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అదే పాత్రలను గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రూపొందించాను. లోకేష్ కనగరాజ్ అద్భుతంగా నటించారు. వామికా గబ్బి సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తారు. దేవదాస్‌ను కలిశాక ఆమె జీవితం ఎలా మారుతుంది? అనేదే ఆమె పాత్ర ప్రయాణం. ఇళయరాజాగారి బయోపిక్ భవిష్యత్తులో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
హీరోగా లోకేశ్ కనగరాజ్.. డీసీ తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా వస్తోన్న చిత్రం డీసీ. ఈ సినిమారు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లోకేశ్ సరసన వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే అంతా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓ యువతితో పాటు హీరో కూడా వ్యవస్థంపై పోరాటం చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నువ్వు పోలీసులను చంపుతావా? అదేమో డాక్టర్లను చంపుతోంది అంటూ చెప్పే డైలాగ్ వింటే కథంటో అర్థమవుతోంది. డీసీ అంటే డాక్టర్స్ అండ్ కాప్స్ అనే ఉద్దేశంతో టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. విజువల్స్‌తో పాటు, అనిరుధ్ బీజీఎంతో ట్రైలర్‌తోనే మరింత హైప్ తీసుకొచ్చింది. -
వర్ష సూచన.. సన్‌రైజర్స్-ఢిల్లీ మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 21) సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ పోరు హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు.అయితే ఆసక్తికరంగా ఇక్కడ పేసర్లు అధికంగా ప్రభావం చూపుతున్నారు. సుమారు 72 శాతం వికెట్లు వీరే తీశారు. ప్రారంభ ఓవర్లలో స్వల్ప స్వింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.ప్రారంభ ఒత్తిడిని ఎదుర్కొని బ్యాటర్లు సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు.వాతావరణ నివేదికఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. వాతావరణం మేఘావృతంగా ఉంటే మాత్రం పేసర్ల అధిక సహకారం లభిస్తుంది. మొత్తంగా మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతంగా మాత్రమే ఉంది. -
లోకేశ్ హీరోగా 'డీసీ'.. వాలంటైన్స్ స్పెషల్ గ్లింప్స్
దర్శకులందరూ హీరోలవుతున్నారు. అలా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా 'డీసీ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా.. బ్లడీ వాలంటైన్ అంటూ డీసీ గ్లింప్స్ వదిలారు. అందులో ప్రేమ కన్నా రక్తపాతమే ఎక్కువ చూపించారు. లోకేశ్ పీకలు కోస్తూ కనిపించాడు. చివర్లో కారుపై కూడా రక్తమే కనిపిస్తోంది. చిన్న వీడియోలోనే ఇంత వయొలెన్స్ ఉంటే సినిమాలో ఎంతుంటుందో చూడాలి!డీసీ విషయానికి వస్తే.. లోకేశ్ దేవదాస్‌గా, వామిక గబ్బి.. చంద్ర పాత్రలో కనిపించనున్నారు. వీరి పేర్ల కలయిక ఆధారంగానే డీసీ (దేవదాస్ + చంద్ర) అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకతత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. కాగా ఖైదీ, విక్రమ్, కూలీ సినిమాలతో దర్శకుడిగా క్రేజ్ అందుకున్న లోకేశ్ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివ జ్యోతి -
ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ
-
సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ.. ఈసారి!
-
లక్నో జోరుకు బ్రేక్.. ఢిల్లీకి రెండో విజయం
-
చెన్నైపై ఢిల్లీ విజయం
-
ఖండాంతరాలు దాటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు (ఫొటోలు)
-
ఐపీఏల్ లో అట్టర్ ఫ్లాప్.. పార్టీలకు మాత్రం ఫుల్ ఫామ్ నువ్వు మాములోడివి కాదు సామీ...
-
బాణా సంచాతో బుగ్గనకు స్వాగతం పలికిన వైయస్ అభిమానులు
-
ధోని చేతిలో మరో వజ్రాయుధం అతడు మరో బ్రావో...
-
ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన ఇంపాక్ట్ ప్లేయర్...
-
కలిసిపోయిన దాదా, కోహ్లీ.. ఢిల్లీ టీమ్‌కి విరాట్..?
-
SRH పై వార్నర్ పాజిటివ్ ట్వీట్..కావ్య మారన్ పై ఫ్యాన్స్ ఫైర్
-
కావ్య మారన్ కి.. డేవిడ్ వార్నర్ రిటర్న్ గిఫ్ట్.. సూపర్..!


