లోకేశ్‌ హీరోగా 'డీసీ'.. వాలంటైన్స్‌ స్పెషల్‌ గ్లింప్స్‌ | Lokesh Kanagaraj DC Movie Valentines Glimpse Released | Sakshi
Sakshi News home page

DC Movie: ప్రేమికుల రోజు రక్తపాతం చూపించిన లోకేశ్‌

Feb 14 2026 12:03 PM | Updated on Feb 14 2026 12:11 PM

Lokesh Kanagaraj DC Movie Valentines Glimpse Released

దర్శకులందరూ హీరోలవుతున్నారు. అలా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కూడా 'డీసీ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా.. బ్లడీ వాలంటైన్‌ అంటూ డీసీ గ్లింప్స్‌ వదిలారు. అందులో ప్రేమ కన్నా రక్తపాతమే ఎక్కువ చూపించారు. లోకేశ్‌ పీకలు కోస్తూ కనిపించాడు. చివర్లో కారుపై కూడా రక్తమే కనిపిస్తోంది. చిన్న వీడియోలోనే ఇంత వయొలెన్స్‌ ఉంటే సినిమాలో ఎంతుంటుందో చూడాలి!

డీసీ విషయానికి వస్తే.. లోకేశ్‌ దేవదాస్‌గా, వామిక గబ్బి.. చంద్ర పాత్రలో కనిపించనున్నారు. వీరి పేర్ల కలయిక ఆధారంగానే డీసీ (దేవదాస్‌ + చంద్ర) అని టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకతత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్‌ చేయనున్నారు. కాగా ఖైదీ, విక్రమ్‌, కూలీ సినిమాలతో దర్శకుడిగా క్రేజ్‌ అందుకున్న లోకేశ్‌ హీరోగా ఎలాంటి సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి!

 

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివ జ్యోతి

Advertisement
 
Advertisement
Advertisement