రామ్‌చరణ్‌ కవలల బారసాల.. ఏం పేర్లు పెట్టారంటే? | Ram Charan and Upasana Konidela name their Twins | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌-ఉపాసన కవలల పేర్ల వెనక అర్థం ఇదే!

Feb 13 2026 8:06 AM | Updated on Feb 13 2026 8:58 AM

Ram Charan and Upasana Konidela name their Twins

మెగా హీరో రామ్‌చరణ్‌ దంపతులు ఇటీవలే (జనవరి 31న) కవల పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా వారికి నామకరణం చేశారు. మొదటి కూతురికి క్లీంకార అని నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టింది. కొడుక్కి శివరామ్‌, కూతురికి అన్వీరా దేవి అని నామకరణం చేశారు.

కవలలకు నామకరణం
ఈ బారసాల ఫంక్షన్‌ గురించి రామ్‌చరణ్‌ వెరైటీ ఇండియాతో మాట్లాడుతూ.. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఆచారం. ఏ పేరు పెట్టాలని ఉపాసన, నేను ఎంతగానో ఆలోచించాం. ఈ జర్నీలో మా తల్లిదండ్రులు, వారి ఆశీర్వాదాలున్నాయి. నా పిల్లల విషయానికి వస్తే.. కొడుకు పేరు శివరామ్‌ అని పెట్టాం. శివుడు, రాముడి బలం, నీతి నిజాయితీల ప్రతిబింబానికి నిదర్శనమే ఈ పేరు. అలాగే ఇది నా తండ్రి జన్మపేరు శివ శంకర వరప్రసాద్‌ను సూచిస్తుంది.

పేరు వెనక కథ
కూతురి పేరు అన్వీరా దేవి.. ఇది అపరిమిత ధైర్యం, స్త్రీ శక్తిని సూచిస్తుంది. వీర అంటే ధైర్యం, అన్‌ అంటే అపరిమితం అని అర్థం. దేవి అనేది ఉద్దేశపూర్వకంగా పెట్టాం. బలం, ధైర్యం రెండింటి కలయికే అన్వీరా దేవి. ఈ పేర్లు కేవలం గుర్తింపు కోసం కాదు, బలం, ప్రేమ, ధైర్యానికి ప్రతీకలు అని చెప్పుకొచ్చాడు.

చదవండి: చికిరి చికిరి హుక్‌ స్టెప్‌ సాంగ్‌ కంపోజ్‌ చేసింది రామ్‌చరణా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement