breaking news
	
		
	
  Upasana
- 
      
                   
                                                     
                   
            ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన
అల్లు అరవింద్ కుమారుడు, హీరో అల్లు శిరీష్ (Allu Sirish) ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి శిరీష్-నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. తమ్ముడి ఎంగేజ్మెంట్ అల్లు అర్జున్ స్టైలిష్‌గా కనిపించాడు. బన్నీ భార్య స్నేహ అల్ట్రా స్టైలిష్‌గా ముస్తాబైంది. వీరి గారాలపట్టి అర్హ ట్రెడిషనల్ డ్రెస్‌లో ఫుల్ క్యూట్‌గా ఉంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చిరంజీవి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్పెషల్ అట్రాక్షన్‌గా మెగా ఫ్యామిలీభార్య సురేఖ, కొడుకు రామ్‌చరణ్ (Ram Charan), కోడలు ఉపాసన (Upasana Kamineni Konidela), కూతుర్లు శ్రీజ, సుష్మితతో కలిసి వచ్చారు. చిరంజీవి సోదరుడు నాగబాబు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. బాబు పుట్టాక లావణ్య త్రిపాఠి ఇలా బయటకు రావడం ఇదే తొలిసారి! అలాగే ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత ఉపాసన కూడా బయట కనిపించడం ఇదే మొదటిసారి! వీళ్లిద్దరూ జిగేల్మనే రంగురంగుల డ్రెస్‌ల జోలికి వెళ్లకుండా సింపుల్‌గా కనిపించే హాఫ్ వైట్ దుస్తుల్లో మెరిశారు.రెట్టింపు సంతోషంలో ఉపాసనఇక ఉపాసన ముఖం ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామ్‌చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకున్నారు. జీవితంలో బాగా సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. అలా దాదాపు పదేళ్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. ఇక 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార పుట్టింది. ఇటీవల దీపావళి సందర్భంగా ఉపాసన తన సీమంతం వీడియో షేర్ చేస్తూ త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. చదవండి: భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. నేనే వినలేదు: ఛత్రపతి శేఖర్ - 
  
    
                
      ఉపాసన గుడ్ న్యూస్.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
 - 
            
                                     
                                                                                                       
                                   
                'ఉపాసన' సీమంతం.. సందడిగా మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
 - 
      
                   
                                                     
                   
            ఉపాసన గుడ్‌న్యూస్.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దీపావళి తనకు డబుల్ సంతోషాన్ని తెచ్చిందని ఒక వీడియోను పోస్ట్ చేశారు. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెసింగ్స్ అంటూ పేర్కొనడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. కుటుంబ సభ్యులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో మెగా వారసుడు రాబోతున్నాడంటూ ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన మొదటిసారి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వారి ఇంట్లో ఇలాగే ఒక వేడుకలా చేశారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో ఇరు కుటుంబ సభ్యులు అందరూ చేరి ఆమెకు కొత్త దుస్తులు అందించడం చూడొచ్చు. ఆపై ఆమెకు పూలు, పండ్లు, కానుకలు అందించిన పెద్దలు ఆశీర్వదించారు. మెగా కుటుంబంతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అందరూ అక్కడ సందడిగా కనిపించారు.మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఉపాసన ఈ శుభవార్త చెప్పగానే 'సింబా' వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
            
                                     
                                                                                                       
                                   
                అత్తమ్మతో కలిసి పూజ చేసిన ఉపాసన (ఫోటోలు)
 - 
      
                   
                                                     
                   
            ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించా.. నాకు పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు!
'వారసత్వం వల్లో, నేను ఒకరిని పెళ్లి చేసుకోవడం వల్లో ఈ స్థాయికి రాలేదు, నా స్వశక్తితో ఎదిగాను' అంటోంది రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Kamineni Konidela). 'ద ఖాస్ ఆద్మీ' పార్టీ పేరిట తన ఆలోచనలను సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. సంపద, హోదా, విజయం, పాపులారిటీ.. ఏది మనల్ని గొప్పవారిని చేస్తుంది? అంతర్గత లక్షణాలైన భావోద్వేగాలపై స్పష్టత, ఇతరులకు సాయం చేసే గుణం గొప్పవారిని చేస్తాయా? దీనికి ఎక్కడా సరైన సమాధానం ఉండదు. ఎవరికి వారే తమలోనే సమాధానం వెతుక్కోవాలి. నిన్ను నువ్వు నమ్మడం, నిన్ను నువ్వు ప్రేమించి, నీకంటూ విలువ ఇచ్చుకోవడం అన్నింటికన్నా ముఖ్యం అని నా అభిప్రాయం.సమాజం ప్రోత్సహించదుసమాజం ఎప్పుడూ ఆడవారిని వినయంతో మసులుకోమనే చెప్తుంది. ఏదైనా సరే.. మనవంతు వచ్చేవరకు ఆగమంటుంది. నిస్వార్థంగా ఉండటమే మంచిదని చెప్తుంది. పెద్ద కలలు కనేందుకు ఎంకరేజ్ చేయదు. మనం ఎదగడానికి ప్రోత్సహించదు. అయినా నేను మంచి స్థాయిలో నిలబడ్డాను. దీనికి నా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం కారణం కాదు. అలాగే రామ్‌చరణ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ నిలబడలేదు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించాను.కిందపడ్డ ప్రతిసారి లేచా..ఎలాగైనా సరే, జీవితంలో ఎదగాలని తాపత్రయపడ్డాను, పాటుపడ్డాను. కొన్నిసార్లు నాపై నాకే అనుమానం వేసేది. కిందపడ్డ ప్రతిసారి మళ్లీ లేచి నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంది. దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదు. అహంకారం గుర్తింపును కోరుతుంది. కానీ ఆత్మగౌరవం.. నిశ్శబ్ధంగా గుర్తింపును సృష్టిస్తుంది అని ఉపాసన రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ - 
      
                   
                                                     
                   
            నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన ముద్దల కూతురు క్లీంకార ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటికీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆమె ముఖం కనిపించకుండా తీసిన ఫొటోల్ని ఇన్‌స్టాలో ఉపాసన పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైన పండుగ లేదా ఇంట్లో శుభకార్యం ఉంటే ఆ విశేషాలతో పాటు తమ కూతురి ఫోటోలను అభిమానులతో ఉపాసన షేర్ చేస్తారు. ఈసారి క్లీంకార తీసుకునే ఆహారం గురించి ఉపాసన చెప్పారు. రోజూ తన డైట్లో ఒక పదార్థం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.క్లీంకార రోజూ తీసుకునే డైట్లో 'రాగులు' తప్పకుండా ఉంటాయని ఉపాసన ఇలా చెప్పారు.' రాగులతో తయారు అయిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నప్పట్నుంచి నాకు చాలా ఇష్టమైన ఆహారం కూడా ఇదే. దీంతో క్లీంకారకు కూడా దీనినే అలవాటు చేశాను. సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా నాతో ఒకసారి మాట్లాడుతూ.. క్లీంకారకు రోజూ రాగుల్ని ఏదో రూపంలో అందించమని సూచించారు. ఆయన కూతరు రాధే జగ్గీ కూడా ఇదే మాట చెప్పింది. తను కూడా చిన్నప్పట్నుంచీ రాగి జావ తాగేదానినని పేర్కొంది. అందికే వారిద్దరూ ఫిట్‌గా ఉన్నారు. భవిష్యత్‌లో నా కూతురు కూడా హెల్దీగా ఉండాలని తన రోజువారి డైట్లో రాగుల్ని చేర్చాను' అంటూ ఆమె చెప్పారు. అయితే, వైద్యుల సలహాలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మోతాదుకు మించకుండా ఉపయోగించాలని లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయిని తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకున్నాకే రాగుల్ని అలవాటు చేయడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. - 
            
                                     
                                                                                                       
                                   
                బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన రామ్ చరణ్ - ఉపాసన (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
 - 
      
                   
                                                     
                   
            మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్
మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో తన పేరుతో ఉన్న పులిపిల్లని క్లీంకార తొలిసారి కలిసింది. ఈ విషయాన్ని ఉపాసన పోస్ట్ పెట్టి మరీ తన ఆనందాన్ని పంచుకుంది. గతంలో పులిపిల్లని చరణ్-ఉపాసన దంపతులు దత్తత తీసుకోగా.. ఇప్పుడు దానికి వీళ్ల కూతురి పేరు పెట్టడం విశేషం.2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం. తర్వాత కెరీర్ పరంగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ 20న ఉపాసనకు కూతురు పుట్టింది. పాపకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు చాలాసార్లు పాపతో తీసుకున్న ఫొటోలని పోస్ట్ చేశారు కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)గతంలో చరణ్ దంపతులు.. నెహ్రూ జూలోని పులిని దత్తత తీసుకున్నారు. ఇలా చేసినందుకుగానూ హైదరాబాద్ జూ అధికారులు.. మెగా డాటర్ గౌరవార్థం ఓ పులికి క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు దాన్ని క్లీంకార ప్రత్యక్షంగా చూసింది. 'ఏడాది క్రితం ఈ పులిపిల్ల ఓ పసికూన. ఇప్పుడు శివంగిలా మారి క్లీంకార కలిసి పేరుని పంచుకుంది. ఈ విషయంలో హైదరాబాద్ జూ నిర్వహకులకు థ్యాంక్యూ. క్రూరమృగాలు అడవిలో ఉండాలి. కానీ అవి కూడా గౌరవంతో బతకాలి' అని ఉపాసన రాసుకొచ్చింది. ఇది ఇప్పుడు మెగా అభిమానులకు నచ్చేస్తోంది.చరణ్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గేమ్ ఛేంజర్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైంది. కానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మూడు నెలల క్రితం రిలీజైన గ్లింప్స్ వీడియో ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. (ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
            
                                     
                                                                                                       
                                   
                బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులో ఉపాసన కొణిదెల (ఫొటోలు)
 - 
      
                   
                                                     
                   
            సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో తెరకెక్కించనున్న మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ను అధికారికంగా అనౌన్స్ చేశారు. యానిమల్తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీనే ప్రభాస్‌కు జోడీగా తీసుకొస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ యానిమల్ చిత్రంలో తన గ్లామర్‌తో అభిమానులను కట్టిపడేసింది. ఇక ప్రభాస్ సరసన స్పిరిట్లోనూ తన అందాలతో టాలీవుడ్ ప్రియులను అలరించనుంది.అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా హీరో రామ్ చరణ్ దంపతులు పంపిన సర్ప్రైజ్ గిఫ్ట్‌ను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సందీప్ రెడ్డికి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడిని జాడీలో పంపించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా వైరల్ కావడంతో వావ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) - 
            
                                     
                                                                                                       
                                   
                రామ్ చరణ్ మదర్ ఆవకాయ పచ్చడి.. మరో స్పెషల్ అంటూ మెగా కోడలు ఉపాసన పోస్ట్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                రామ్ చరణ్ తో పెళ్లి బంధం సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన.. వారంలో ఒక రోజు తప్పనిసరి! (ఫోటోలు)
 - 
      
                   
                                                     
                   
            నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఉపాసన కొణిదెల (Upasana Konidela).. రామ్‌చరణ్ సతీమణిగా ఇంటిని చక్కదిద్దడమే కాకుండా అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలోనే రామ్‌చరణ్, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తను నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాడు. నేనేదైనా చేయాలనుకుంటే అందుకు సహకరిస్తాడు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా నా వెంటే ఉన్నాడు.మా బంధం బలంగా ఉండటానికి అదే కారణంఅలాగే తను కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను తనవైపు నిల్చున్నాను. మా బంధం ధృడంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అలాగే మా ఇరు కుటుంబాలు కూడా మా వెన్నంటే ఉన్నాయి. వైవాహిక బంధంలో.. ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం తప్పనిసరి. వారానికి ఒకసారైనా డేట్ నైట్‌కు వెళ్లమని అమ్మ చెప్తూ ఉండేది. మాకు వీలైనంతవరకు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. వారంలో ఒకరోజుకాకపోతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ రోజంతా గడుపుతాం. ఆ రోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటాం. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకోగలిగేది. పెళ్లిళ్లు వర్కవుట్ కావాలంటే ఇవన్నీ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు రిలేషన్‌ను బలపర్చుకుంటూ ఉండాలి. మావల్ల కాదని వదిలేస్తే కష్టం అని పేర్కొంది.ఉపాసన కచ్చితంగా వాళ్ల మధ్యే పెరగాలికుటుంబ విలువల గురించి మాట్లాడుతూ.. మా అమ్మ నా బెస్ట్‌ఫ్రెండ్. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాను. నా కూతురు కూడా నాలాగే నానమ్మ-తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నాను. గ్రాండ్ పేరెంట్స్ చేతుల్లో పెరగడమనేది అందమైన అనుభవం. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. నాకు మాత్రం మా అత్త-మామలతో కలిసి ఉండటమే ఇష్టం. మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండటమే నాకు నచ్చుతుంది.అదే నా ధీమాఅప్పుడే నా కూతురు వారి దగ్గరి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటుంది. మా అత్త, మామయ్య తనను జాగ్రత్తగా పెంచుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు తను మంచి చేతుల్లోనే ఉందన్న ధీమా ఉంటుంది. మా అమ్మానాన్న కూడా అంతే ప్రేమ, కేర్ చూపిస్తారు. ఇలా నా కుటుంబసభ్యులందరూ క్లీంకార ఎదుగుదలలో భాగమవుతున్నారు అని ఉపాసన చెప్పుకొచ్చింది.చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్ - 
      
                   
                                                     
                   
            హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు - 
      
                   
                                                     
                   
            జాన్వీ కపూర్‌కు ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
దేవర సినిమాతో చుట్టమల్లే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ సినిమా విడుదలకుముందే రామ్‌చరణ్ (Ram Charan)తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ #RC16 మూవీ నుంచి జాన్వీ బర్త్‌డే రోజు స్పెషల్ పోస్టర్ కూడా వదిలారు. దక్షిణాది వంటకాలంటే ఇష్టంజాన్వీ ఉండేది ముంబైలో అయినా దక్షిణాది వంటకాలంటే తనకెంతో ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా తిరుపతికి వస్తుంది. అప్పుడు సౌత్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఉపాసన (Upasana Konidela) ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఆ బహుమతి మరేంటో కాదు.. అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను ఇచ్చింది. అసలే భోజనప్రియురాలైన జాన్వీ దాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించింది జాన్వీ.ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే..దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంటిభోజనాన్ని మిస్ అవకూడదన్న ఆలోచనలో నుంచి పుట్టిందే అత్తమ్మాస్ కిచెన్. అప్పటికప్పుడు ఈజీగా ఇంటి భోజనం తయారయ్యేలా ఇన్స్టంట్ మిక్స్‌లు రెడీ చేసి అమ్ముతున్నారు. ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడకుండా వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఉప్మా, పులిహోర, రసం, పొంగల్.. ఇలా పలురకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) చదవండి: ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే - 
            
                                     
                                                                                                       
                                   
                Valentine's Day Special: టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడీ రామ్‌చరణ్- ఉపాసన (ఫోటోలు)
 - 
      
                   
                                                     
                   
            క్లీంకారతో రామ్ చరణ్.. ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ సంక్రాంతి సెలబ్రేషన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగను సినీతారలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకున్నారు. ఈ పండుగ వేళ రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకారతో దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. హ్యాపీ సంక్రాంతి అంటూ షేర్ చేసింది.మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సంక్రాతి సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బన్నీతో కలిసి పిల్లలు అయాన్, అర్హతో పండుగ రోజు దిగిన ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ సంక్రాంతి-2025 అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.సంక్రాంతి సినిమాల సందడి..గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్..రామ్ చరణ్-శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు.డాకు మహారాజ్‌కు పాజిటివ్ రెస్పాన్స్..నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌కు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది డాకు మహారాజ్. ఈ మూవీ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం..అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన మరో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దిల్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                                                     
                   
            'ఇది మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం'.. ఉపాసన ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిదని పోస్ట్ చేశారు.ఆయన మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని(అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్) ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లో సేవలందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామజన్మ భూమిలో సేవ చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024 - 
      
                   
                                                     
                   
            క్లీంకార ఫోటో షేర్ చేసిన ఉపాసన.. బాల్యం గుర్తొస్తోందంటూ..
రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.. తమ గారాలపట్టి క్లీంకార ఫోటో షేర్ చేసింది. ముత్తాత (ఉపాసన తాతయ్య), తాతయ్య (ఉపాసన తండ్రి)తో కలిసి అపోలో ఆస్పత్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరిగిన పవిత్రోత్సవాల్లో చిన్నారి పాల్గొందని తెలిపింది. ఉపాసన ఎమోషనల్తాత చంకనెక్కిన క్లీంకారను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయంది. అలాగే ఈ గుడి తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. అలాగే ఈ ఆనందకర క్షణాలను వెలకట్టలేనని పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లీంకార ముఖం స్పష్టంగా కనిపించకూడదని కాస్త బ్లర్ చేసింది.ఇంత పెద్దగా అయిపోయిందా?ఇది చూసిన అభిమానులు.. ఈ చిట్టితల్లిని ఇంకెప్పుడు చూస్తామో అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో క్లీంకార అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కూతురు పుట్టింది. 2023 జూన్‌లో జన్మించిన తన ముద్దుల మనవరాలికి చిరంజీవి క్లీంకార అని నామకరణం చేశారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కడుపులో బిడ్డకు గ్యారెంటీ ఇవ్వమన్నారు: స్టెల్లా ఎమోషనల్ - 
      
                   
                                                     
                   
            రామ్ చరణ్ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. గేమ్ ఛేంజర్‌లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది. What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024 - 
      
                   
                                                     
                   
            శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి శ్రీకృష్ణుని పూజలో పాల్గొన్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. క్లీంకారతో పాటు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా పూజల్లో పాల్గొన్నారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఆ తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పనిచేయనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన జాన్వీకపూర్ నటించనుంది. Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami 🙏❤️ pic.twitter.com/68LEYJISdy— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024 - 
            
                                     
                                                                                                       
                                   
                మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
 - 
      
                   
                                                     
                   
            ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇండిపెండెన్స్ డే ఎలా?.. ఉపాసన ఆవేదన
ఇండిపెండెన్స్ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ వైరలవుతోంది. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. ఇంతటి అనాగరిక సమాజంలో మనం బతుకున్నామా? అని నిలదీసింది. మెడికల్ ప్రొఫెషన్‌లపై ఇంత దారుణం జరుగుతుంటే ఇక మనుషుల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా మనం ఇప్పటికీ అనాగరిక సమాజంలో బతుకుతున్నామంటే ఏమని స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామని ఉపాసన ప్రశ్నించింది. ఇది ఎప్పటికీ మానవత్వం అనిపించుకోదని తెలిపింది. మహిళలే దేశానికి వెన్నెముక లాంటివారని.. ఇప్పటికే దాదాపు 50శాతం మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో మహిళల కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంలోకి ఎక్కువమంది మహిళలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి మహిళ భద్రత, గౌరవం కాపాడేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. - 
            
                                     
                                                                                                       
                                   
                పారిస్ ఒలింపిక్స్ 2024: ఫ్యామిలీతో రామ్‌చరణ్ సందడి (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                పారిస్ వీధుల్లో మనవరాలు క్లీంకారతో చిరంజీవి సందడి (ఫోటోలు)
 - 
  
    
                
      ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్..
 - 
      
                   
                                                     
                   
            ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా చెర్రీ భార్యగా, వ్యాపారవేత్తగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ నెల 20న తన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్పెషల్‌గా విష్ చేశారు. 'క్లీంకార మమ్మీ' అంటూ కొత్త పేరుతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.అయితే తాజాగా నటుడు, కమెడియన్ భద్రం.. ఉపాసనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కొరకు లాఫ్టెడ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఓ సెషన్ నిర్వహించమని అడిగినప్పుడు మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, కేరింగ్ అర్థమైందన్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి పట్ల అంతే కేరింగ్‌గా ఉంటూ.. వారు కూడా బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భద్రం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. Happy Happy Birthday @upasanakonidela Ma'am pic.twitter.com/2jQksINIpx— భద్రం (@BhadramDr) July 20, 2024 - 
      
                   
                                                     
                   
            రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ల వివాహానికి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి భారీగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఇప్పుడా వీడియో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.టాలీవుడ్ టాప్ హీరోల వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ గ్యారేజీలో మెర్సిడేజ్, రోల్స్ రాయిస్ ఫాంథమ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ దంపతులు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహానికి వెళ్లేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టార్‌ను డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. దీని ధర దాదాపు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఇండియాలో రెండోది కావడం విశేషం. సౌత్ ఇండియాలో మొదటి కారు కావడం గమనార్హం.రోల్స్ రాయిస్ కారుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా తక్కువ మంది వద్దే ఈ కెంపెనీకి చెందిన కార్లు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ లేటెస్ట్ వర్షన్ రోల్స్ రాయిస్ కారును కొన్నారు. జనవరి 2024లో ఈ మోడల్ లాంఛ్ అయింది. ఈ కారు అందుకున్న రెండో వ్యక్తిగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.Charan Babu Off to Mumbai 👍👍👍New Rolls Royce Spectre Car (Second Car in India its cost around 7.5 Cr)#RamCharan pic.twitter.com/eqkjiAJUEa— Praveen (@AlwaysPraveen7) July 11, 2024Screen presence &Royality @AlwaysRamCharan 🦁Present Generation lo #RamCharan offline styling 👌🔥Eh dress ayna easy ga set ayipodi aha body ki pic.twitter.com/m4AikXYzDj— vijay (@vijay_mbfan) July 11, 2024 - 
      
                   
                                                     
                   
            ముంబయికి గ్లోబల్ స్టార్ దంపతులు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి సతీసమేతంగా హాజరు కానున్నారు. తాజాగా ఆయన భార్య ఉపాసన, ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన గేమ్ ఛేంజర్ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. #RamCharan brings his A Swag to the airport as he departs for Mumbai with #KlinKaara & @upasanakonidela for Anant Ambani & Radhika Merchant's Wedding !The Debonair @AlwaysRamCharan 🦁 pic.twitter.com/SVlrMZVbE4— Trends RamCharan ™ (@TweetRamCharan) July 11, 2024 - 
            
                                     
                                                                                                       
                                   
                Klin Kaara Photos: గ్రాండ్‌గా క్లీంకార ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Klin Kaara Photos: మెగా మనవరాలు క్లీంకార ఫస్ట్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు
 - 
      
                   
                                                     
                   
            12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు ఉపాసన మరో క్యూట్ ఫొటోతో వచ్చేసింది. రామ్ చరణ్‌తో పెళ్లి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ సింపుల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టింది. అయితే థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లీంకాక లేటెస్ట్ ఫొటోని కూడా ఇందులో జోడించింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)2012లో రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపించాయి. కానీ రానురాను మెగా ఫ్యామిలీలోనే చరణ్-ఉపాసన.. వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అయిపోయారు. వీళ్లకు గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఈ బుజ్జాయికి క్లీంకార అని పేరు పెట్టుకున్నారు.పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయటపెట్టట్లేదు. ఇప్పుడు కూడా తను, చరణ్.. కూతురిని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అంటే మెగా మనవరాలు బుడిబుడి అడుగులు వేసేస్తుందని ఈ పోస్ట్‌తో ఉపాసన చెప్పకనే చెప్పేసింది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                                                     
                   
            వన్యప్రాణుల సంరక్షణ నేషనల్ అంబాసిడర్‌గా ఉపాసన
కొణిదెల... కామినేని కుటుంబాల్లో ఉపాసన చాలా ప్రత్యేకం.. మెగా ఇంటికి కోడలిగా ఆమె అడుగుపెట్టిన సమయం నుంచి ఆమె పేరు మరింత పాపులర్ అయింది. గ్లోబల్‌స్టార్ హీరో రాంచరణ్ సతీమణిగా బెస్ట్ కపుల్స్ అనిపించుకున్న ఉపాసన టాలీవుడ్‌తో పాటు వ్యాపార ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసింది.అపోలో హాస్పిటల్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోసిస్తున్న ఉపాసనకు మరో బాధ్యతను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్‌గా నియమితులైంది. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గోపిడి తాజాగా తెలిపారు. అపోలో ఆసుపత్రి ట్రస్ట్ యందు వైస్ చైర్‌పర్సన్‌గా ఆమె విధులు నిర్వహిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనుంది.ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో గాయపడిన పులులు, ఏనుగులు వంటి ప్రాణులకు వైద్యం అందించడమే కాకుండా.. అటవీశాఖ సిబ్బందికి కూడా అపోలో ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందించనున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                                                     
                   
            ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్
సలార్‌తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్.. కల్కి 2898 ఏడీ చిత్రంతో మరోసారి రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఉపాసన ఇంటికి బుజ్జిఅయితే సినిమా రిలీజ్‌కు ముందే బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ సిరీస్ లాంచ్ చేశారు. ఇందులో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బుజ్జి ఉపాసన ఇంటికి చేరింది. అదెలాగంటారా? కల్కి 2898 ఏడీ చిత్రయూనిట్ బుజ్జిని పోలి ఉన్న చిన్న బొమ్మను, పాత్రల స్టిక్కర్స్‌ను రామ్‌చరణ్- ఉపాసనల కూతురు క్లీంకారకు బహుమతిగా ఇచ్చింది. చిత్రయూనిట్‌కు థ్యాంక్స్వాటితో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోను ఉప్సీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే కూతురు ముఖం కనిపించకుండా ఆ ఫోటో తీసింది. తనకు ఈ బహుమతి పంపినందుకు హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రింయాక దత్‌లకు కృతజ్ఞతలు తెలియజేసింది.చదవండి: Bujji And Bhairava Review: యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే.. - 
      
                   
                                                     
                   
            చరణ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్
ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడని ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఎంత వైరలయ్యాయో తెలిసిందే! ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, అండగా నిలబడితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చెప్పకనే చెప్పింది ఉపాసన. కేవలం సూక్తులు చెప్పడం కాదు దాన్ని ఆచరించి చూపిస్తున్నారీ జంట.ఉపాసన వెంటే..ఆ మధ్య చరణ్ ఆస్కార్ కోసం అమెరికాకు వెళ్తే కడుపుతో ఉన్నా సరే ఉపాసన అతడి వెంటే వెళ్లింది. ఇప్పుడు ఉప్సీ వృత్తిపరమైన వ్యవహారాల కారణంగా ఒమన్ దేశానికి వెళ్లింది. షూటింగ్స్‌తో ఎంతో బిజీగా ఉండే చరణ్ పనులన్నీ పక్కనపెట్టి భార్యతో సహా వెళ్లాడు. తమ పాప క్లీంకారను కూడా తీసుకెళ్లారు. గర్వంగా ఉంది..ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'చరణ్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నేను చేసే పనులకు సపోర్ట్‌గా నిలబడుతున్నావు. తండ్రిగానూ బాధ్యత నెరవేరుస్తున్నావు. అలాగే ఈ మీటింగ్‌ను ప్రత్యేకంగా మార్చిన మహిళామణులందరికీ థ్యాంక్స్' అంటూ మూడు ఫోటోలు షేర్ చేసింది. అందులో ఉపాసన కెమెరా వైపు పోజిస్తే చరణ్ మాత్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ వెనుదిరిగి నిల్చున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..! - 
      
                   
                                                     
                   
            'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్ కిచెన్'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్ కిచెన్' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్లైన్లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్‌గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) - 
            
                                     
                                                                                                       
                                   
                డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్‌చరణ్ (ఫోటోలు)
 - 
            
                                     
                                                           
                                   
                Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            గుండుతో క్లీంకార.. ఏనుగుతో చిల్ అవుతోన్న గ్లోబల్ స్టార్!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రంలో కియారా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా విరామం దొరకడంతో ఫుల్‌గా చిల్ అవుతున్నారు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లారు. ఈ సమ్మర్ వేకేషన్లో తన ముద్దుల కూతురు క్లీంకారతో ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన కలిసి గున్న ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. అంతే కాకుండా వారితో క్లీంకార కూడా ఫోటోలో కనిపించింది. అయితే ఇందులో క్లీంకార గుండు చేయించుకుని కనిపించింది. 'థ్యాంక్యూ నాన్న.. ఇది ఒక అద్భుతమైన అనుభవం.. ఏనుగుల సంరక్షణ క్యాంప్‌లో చాలా నేర్చుకున్నా' అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Thank you, Mr. C/Naana, for an incredible experience. Learned so much at the elephant rescue camp. ❤️🐘#bestdad @AlwaysRamCharan pic.twitter.com/eBt6JpdCX7 — Upasana Konidela (@upasanakonidela) April 7, 2024 - 
            
                                     
                                                           
                                   
                రామ్‌చరణ్ బర్త్‌డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
 - 
      
                   
                               
                   
            తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ముద్దల కూతురు ఫోటో రివీల్ అయింది. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడం జరిగింది. అది కాస్త అభిమానులకు చేరువ కావడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by TIRUMALA DEVASTANAM OFFICIAL (@anandanilayam_) - 
      
                   
                               
                   
            ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. అవమానం పడ్డ చోటే జెండా పాతాడు
మెగాస్టార్ వారసుడు నేడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. సుమారు 17 ఏళ్ల క్రితం 'చిరుత'గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'గా మారాడు. తన నటనతో 'రంగస్థలం'పై 'రచ్చ' చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'తుఫాన్' క్రియేట్ చేశాడు. అభిమానుల గుండెల్లో 'గోవిందుడు అందరివాడు' అయ్యాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ 'వినయ విధేయ రాముడు' అని అందరితో పిలిపించుకున్నాడు. 'ఎవడు' అయినా సరే తన దారికి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానంటూ 'ఆర్ఆర్ఆర్'తో గాండ్రించాడు. అలాంటి వాడు ఎవడో తెలుసా..? పాన్ ఇండియా 'మగధీరుడు' రామ్ చరణ్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1985 మార్చి 27న జన్మించిన చరణ్ నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలుగా వచ్చారు. కానీ చరణ్ చాలా ప్రత్యేకం. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తిత్వం కలిగిన హీరో. ఉపాసనతో పెళ్లికి ముందు రామ్ చరణ్ వేరు. పెళ్లి తరువాత రామ్ చరణ్ వేరు. టాలీవుడ్లో వేలు ఎత్తి చూపించుకోని విధమైన ప్రవర్తనను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్న హీరో ఎవరైనా వున్నారా అంటే అది రామ్ చరణ్ నే. మెగాస్టార్ తర్వాత చరణ్ పేరు తప్పక ఉంటుంది మెగాస్టార్ చిరు తర్వాత డ్యాన్స్ బాగా చేసే టాలీవుడ్ హీరోలు ఎవరు..? అని ఎవరినైనా అడిగితే వారు చెప్పే జాబితాలో చరణ్ గ్యారెంటీగా ఉంటుంది. చిన్నప్పుడు డ్యాన్స్‌కు దూరంగా ఉండే చరణ్ ఇప్పుడు తన టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నాడు. అయితే, తన తండ్రి చిరంజీవి మంచి డ్యాన్సర్ కాబట్టి కుమారుడు 'అదుర్స్ అనిపించేలా చేస్తే బాగుణ్ను' అని అనుకునేవారు. చరణ్ డ్యాన్స్ చేస్తాడా, లేదా? అని అభిమానులు కూడా టెన్షన్ పడేవారు. తండ్రి తన నుంచి ఏం ఆశిస్తున్నారో గ్రహించిన చెర్రీ ఎవరి ట్రైనింగ్ అవసరంలేకుండా తనంతట తానే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన డ్యాన్స్‌కు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. 'చిరుత' అలా సెట్ అయింది కానీ.. చరణ్‌ను తన వారసుడిగా దింపే సమయం చిరంజీవికి వచ్చింది. అందుకోసం అల్లుఅరవింద్‌తో చర్చలు జరిపారు. ఒక స్టార్ డైరెక్టర్ ద్వారా చరణ్‌ను ఇండిస్ట్రీకి పరిచయం చేయాలని ఆలోచించారు. దాంతో అప్పటికే స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజమౌళిని సంప్రదిస్తే.. చరణ్ నటనపై నాకు అవగాహన లేదని, మొదటి సినిమాను ఒక మంచి దర్శకుడితో తెరకెక్కించమని ఆయన సలహా ఇచ్చాడు. కానీ రెండవ సినిమా ఖచ్చితంగా నేనే చేస్తాను అని రాజమౌళి చెప్పారట. దాంతో చిరంజీవి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ని పిలిపించి అసలు విషయం చెప్పడం. ఆపై వెంటనే పూరీ రెండు మూడు కథలను వినిపించగా చివరికి చిరుత స్టోరి ఓకే అయ్యింది. భారీ అంచనాల మధ్య 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. మొదటి రోజే దాదాపు ఈ సినిమా రూ.5 కోట్ల షేర్‌ను సాధించి ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. సౌత్‌లో ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాతో తన నటనకుగాను చెర్రీ 'స్పెషల్ జ్యూరీ' విభాగంలో 'నంది' అందుకున్నాడు. కానీ కొందరు కావాలనే ఈ సినిమాలో చరణ్ లుక్స్‌పై విమర్శలు భారీగానే చేశారు. చరణ్‌కు నటన రాదని, హీరో ఫేస్ కాదని పలువురు క్రిటిక్స్ విమర్శించారు. కేవలం ఈ సినిమా పూరీ టేకింగ్, చిరంజీవి మేనియాతోనే హిట్టయిందని పలువురు అభిప్రాయపడ్డారు. అప్పుడు ఏమాత్రం చరణ్ కుంగిపోలేదు.. విమర్ళలను తీసుకున్నాడు. తనను తాను మార్చుకున్నాడు. 'మగధీర'తో సమాధానం ఇచ్చాడు ఫస్ట్ మూవీ ఓకే.. మరి నెక్ట్స్ ఏంటి? అంటూ చెర్రీ భవిష్యత్తుపై ఇంకొందరు లెక్కలు వేస్తుంటే.. 'మగధీర'తో సమాధామిచ్చాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమా సుమారు రూ.150 కోట్లు వసూళ్లు (గ్రాస్) చేసి, టాలీవుడ్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. రెండో చిత్రంతోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరిన చరణ్ మూడో ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అదే ‘ఆరెంజ్’. 'ధృవ'తో రూట్ మార్చుకున్నాడు రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ.. ఇలా మళ్లీ కమర్షియల్ ధోరణిలో సాగుతున్న అతను ‘ధృవ’తో రూటు మార్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ చరణ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. ఆ తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ ఆయన ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో చరణ్ నటనకు విమర్శకుల సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 130కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. చరణ్ తన నటన, అభినయంతో ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పించాడు. దాని తర్వాత వినయ విధేయ రామ, ఆచార్యతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు చరణ్. అవమానం జరిగిన చోటే జండా పాతాడు బాలీవుడ్లో చరణ్ డెబ్యూగా ‘జాంజీర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో తుఫాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘొర పరాజయాన్ని చవిచూసింది. అంతే కాకుండా బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్‌ను తీవ్రంగా విమర్శించారు. బిగ్ బీ అమితాబ్ నటించిన జాంజీర్ పేరును చెడగొట్టాడని, చరణ్‌ది వుడెన్ ఫేస్ అని విమర్శించారు. అలా ఎన్నో విమర్శలు ఎదర్కొని నిలబడ్డాడు. ఎళ్లు గడిచాయి.. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. పక్కా ప్లాన్‌తో బాలీవుడ్‌కు తన రేంజ్ ఎంటో ఆర్ఆర్ఆర్తో చూపించాడు. బాలీవుడ్ ఏంటీ..? ఏకంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.. టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటేలా చేశాడు. చెర్రీ.. ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని టాలీవుడ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉన్నా నటన, డ్యాన్స్ విషయంలో చరణ్ అభిమానుల్ని ఎక్కడా నిరుత్సాహపరచలేదని చెప్పొచ్చు. ఇలాంటి స్పీడ్ డ్యాన్సర్‌కు మరో స్పీడ్ డ్యాన్సర్ (ఎన్టీఆర్) తోడైతే ఎలా ఉంటుందో ‘నాటు నాటు’తో ప్రపంచానికి చూపించారు. వారిద్దరి స్టెప్పులకు ‘ఆస్కార్’ అవార్డు వరించింది. ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్టీఆర్‌ను చరణ్ కొరడా దెబ్బలు కొట్టే సన్నివేశంలో ఆయన పలికించిన భావాలకు అక్కడి క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు. అలా అవమానం జరిగిన చోటే తన సత్తా ఎంటో రుచి చూపించాడు. - 
  
    
                
      శ్రీవారి సేవలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు..
 - 
            
                                     
                                                           
                                   
                పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న రామ్ చరణ్ దంపతులు (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. పుట్టినరోజు నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉపాసనతో పాటుగా చరణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు తన కూతురు క్లిన్ కారను కూడా శ్రీనివాసుడి సన్నిధికి తీసుకుకొచ్చారు. దీంతో ఆలయం వద్ద రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. - 
            
                                     
                                                           
                                   
                తిరుమల చేరుకున్న రామ్ చరణ్ దంపతులు.. పోటోలు వైరల్!
 - 
            
                                     
                                                           
                                   
                Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్‌ని పరిచయం చేసిన రామ్‌చరణ్.. ఫొటోలు వైరల్
 - 
      
                   
                               
                   
            'అమ్మా, నాన్నతో తొలిసారి అలా'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే షూటింగ్‌కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్‌లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్‌ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            ఆమెను కలవడం ఆనందంగా ఉంది: ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవలే అయోధ్యకు వెళ్లిన ఉపాసన కుటుంబం సభ్యులతో కలిసి బాలరామున్ని దర్శించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఈరోజు అంతర్గత ప్రపంచశాంతి కోసం హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ పాల్గొనడం గౌరవంగా ఉంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లీంకారతో సహా కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా కమలేశ్ దాజీ నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను స్వీకరించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            'ఒక కల నెరవేరిన వేళ'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే అయోధ్య బలరామున్ని దర్శించుకున్నారు. తన తాతయ్య, నానమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆలయం ప్రారంభించాక ఉపాసన తొలిసారి అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!) తాజాగా తన అయోధ్య పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. తన కోరిక తీరిందని.. ఒక కల నెరవేరిందని.. ఇదొక అద్భుతమైన.. దివ్యమైన అనుభూతి అని తెలిపింది. నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణంలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని రాసుకొచ్చింది. తెల్లవారుజూమున 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
            
                                     
                                                           
                                   
                Upasana Konidela Photos: కొణిదెలవారి కోడలు ఉపాసన.. ప్రత్యేక క్షణాలు (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ!
మెగా కోడలు ఉపాసన కొణిదెల నేడు అయోధ్య బాలరామున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన తాతగారు అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె అందజేశారు. ఆపోలో హాస్పిటల్స్ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో ఆపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సెంటర్లోని అధునాతన సేవల గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెంటర్లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు,స్ట్రోక్‌తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు,పిల్లలకు 24x7 క్రిటికల్ కేర్ సపోర్ట్‌తో పాటు ICU బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు.ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రకటన ప్రకారం, శ్రీరామ్ లల్లా దర్శనానికి వచ్చే యాత్రికులకు కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అయోధ్యను సందర్శించే యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల అపోలో హాస్పిటల్స్ అచంచలమైన నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ లక్నో ఎండి, సిఇఒ డాక్టర్ మయాంక్ సోమాని అన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            అయోధ్యలో మెగా కోడలు.. బాలరామునికి ప్రత్యేక పూజలు!
మెగా కోడలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అయోధ్య బలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామునికి పూజలు చేశారు. ఆలయంలో దాదాపు 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు తన తాతయ్య, నానమ్మతో సహా కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. - 
      
                   
                               
                   
            మెగా డాటర్‌కు స్పెషల్ విషెస్.. లావణ్య త్రిపాఠి, ఉపాసన పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిగా సుస్మిత కొణిదెల అభిమానులకు తెలుసు. టాలీవుడ్లో కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు గడించింది. తాజాగా ఇవాళ చిరంజీవి పెద్దకూతురు, మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్ డే కావడంతో పలువురు ఇండస్ట్రీ తారలు విషెస్ చెబుతున్నారు. మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే విషెస్ చెబుతూ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోలు షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మెగా డాటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. - 
      
                   
                               
                   
            'రామ్ చరణ్ గారు.. ఈ రోజు ఏం చేస్తున్నారు'.. ఉపాసన వీడియో వైరల్!
మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను ఉపాసన పోస్ట్ చేసింది. ఉమెన్స్ డే స్పెషల్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఏంటి? మన చరణ్ అన్నయ్య ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో ఉపాసన మాట్లాడుతూ..' అత్తమ్మగారు.. ఈ రోజు మీ కిచెన్‌లో ఏం చేస్తున్నారు? రామ్ చరణ్ గారు మీరు ఏం వంటలు చేస్తున్నారు' అంటూ ఫన్నీగా ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే?
మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అత్తమ్మలు, అమ్మలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. This Women’s Day my mother-in-law is making her debut as an entrepreneur in her 60’s 🙌 Imagine how rich our country would be if more athammas & amma’s became entrepreneurs!! Let’s celebrate more women joining the workforce & following their passion https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/05tz4UPBfE — Upasana Konidela (@upasanakonidela) March 8, 2024 - 
      
                   
                               
                   
            International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి - 
      
                   
                               
                   
            కెరీరే కావాలి.. ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఈ పని చేయండి: ఉపాసన
రామ్‌చరణ్ నీడలో ఉండటం సంతోషంగా ఉందంటోంది ఉపాసన. తన భార్య మంచి ఇల్లాలని, తను చేసే గొప్ప పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయంటున్నాడు రామ్‌చరణ్. మార్చి 8న ఉమెన్స్ డే. ఈ సందర్భంగా చరణ్ దంపతులు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముందుగా ఉపాసన మాట్లాడుతూ.. 'మా ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు కావడంతో పెళ్లవగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. తనకు నీడగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నాను. పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఆత్మవిశ్వాసంతో పెంచారు మా తాతయ్య స్త్రీ మూర్తులను ఎక్కువగా పూజించేవారు. మా అమ్మవాళ్లను ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచారు. మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఇది స్త్రీ లోకం అని భావించే ఇంట్లో నేను పుట్టిపెరిగాను అని చెప్పుకొచ్చింది. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఉపాసన కేవలం నా భార్య కావడం వల్లే గుర్తింపు రాలేదు. తను చేసే మంచి పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. పలు రంగాల్లో తనకు ప్రావీణ్యం ఉంది. ఇంట్లో కుటుంబంతో ఉన్నా లేదా ఏదైనా ప్రాజెక్టుల ద్వారా పలువురికి సేవ చేయాలన్నా ఎంతో నిబద్ధతగా వ్యవహరిస్తుంది. వారసత్వాన్ని ఎంతో అందంగా ముందుకు తీసుకెళ్తుంది అని పేర్కొన్నాడు. ఆలోచనల్లో మార్పు రావాలి పిల్లలు పుట్టగానే చాలామంది ఉద్యోగాలు మానేస్తుంటారు? ఎందుకిలా అన్న ప్రశ్నకు ఉపాసన మాట్లాడుతూ.. ఒకసారి తల్లయ్యాక మునుపటిలా పని చేయడం కత్తిమీద సాములాగే ఉంది. ఎంత ప్రయత్నించినా పని చేయడం కష్టమవుతోంది.. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ముందు ఈ ఆలోచనా ధోరణి మారాలి. అలాగే కంపెనీల్లో కూడా మహిళలకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పుచేర్పులు చేయాలి. మెటర్నటీ లీవ్స్.. మహిళలు వారి అవసరాలకు తగ్గట్లు తీసుకునేలా అవకాశం కల్పించాలి. దీని గురించి ఇప్పటికే నేను కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాను. పిల్లలు తర్వాత అనుకునేవారు.. ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆడవాళ్లు వారి ఎగ్స్‌ను కాపాడుకోవాలి. వాటిని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. జీవితంలో సెటిలవ్వాలి, తర్వాతే పిల్లల కోసం ప్రయత్నిద్దాం అనుకునేవారు వారి ఎగ్స్(అండాలు) దాచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇప్పుడు పిల్లల్ని కనొచ్చు అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ మీకు ఉపయోగపడతాయి. ఈ విధానం మహిళలకే కాదు దేశ పురోగతికి సైతం సాయపడుతుంది. నేను కూడా నా ఎగ్స్ దాచుకున్నాను. కరెక్ట్ సమయమిదే అనిపించినప్పుడే క్లీంకారను కన్నాం' అని తెలిపింది. చదవండి: ప్రీవెడ్డింగ్.. ఖాన్స్ త్రయంతో పాటు రామ్‌చరణ్‌కు భారీగానే ముట్టిందా? - 
      
                   
                               
                   
            మా అత్తమ్మే నాకు స్ఫూర్తి : రాంచరణ్ సతీమణి ఉపాసన
రాయదుర్గం(హైదరాబాద్): మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర కీలకమని హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి..ఆమే నాకు స్ఫూర్తి’ అని చెప్పారు. ప్రధానంగా నేడు ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. ఎలికో లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ వనితా దాట్ల మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో టి–హబ్ సీఈఓ ఎంశ్రీనివాసరావు, హెచ్ఎస్బీసీ ఎండీ మమతా మాదిరెడ్డి, పూర్వవిద్యార్థుల సంఘం కో¸ûండర్ ఆదితి ఆర్య కోటక్, శిల్పారెడ్డి ప్రసంగించారు. - 
      
                   
                               
                   
            ఉపాసన కాళ్లు నొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
ప్రముఖ బిజినెస్మెన్ ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయముంది. కానీ అప్పుడే పెళ్లి వేడుకలు మొదలుపెట్టేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఆల్రెడీ మొదలైన ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, పాప్ సింగర్ రిహాన్నా సహా అనేకమంది అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. కునుకు తీసిన భార్య.. బాలీవుడ్ తారలు సైతం గుజరాత్‌లోని జామ్నగర్లోనే తిష్ట వేశారు. ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాల కోసం టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరు జామ్‌నగర్‌కు వెళ్లారు. విమానంలో ఉపాసన కునుకు తీస్తుండగా చరణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించాడు. అక్కడే ఉన్నవాళ్లు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది. అవార్డు ఇచ్చేయాల్సిందే! ఇది చూసిన జనాలు ఇంక ఆలస్యం చేయొద్దు, చరణ్‌కు బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. భార్యకు సేవ చేయడం చరణ్‌కు కొత్తేమీ కాదు. ఇంటి పనుల్లో సాయం చేయడం దగ్గరి నుంచి షాపింగ్‌కు వెళ్తే బ్యాగులు మోయడం వరకు అన్నీ చేస్తుంటాడు. ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని తు.చ తప్పకుండా పాటిస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా కించిత్తు గర్వం లేకుండా భార్యకు సేవ చేస్తున్న చరణ్‌ను పురుషులంతా ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు మహిళామణులు. 🥹❤️@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/dmGBnk7V5Q — Raees (@RaeesHere_) March 1, 2024 చదవండి: ప్రశాంత్ నీల్ ఇంట్లో జూ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం ఇదే - 
      
                   
                               
                   
            అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి ఈ ఏడాది జూలైలో పెళ్లి జరగనుంది. రాధిక మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే పెళ్లికి ఇంకా చాలా టైముంది. కానీ ముందస్తు పెళ్లి వేడుక మాత్రం అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ దీనికి వేదికగా నిలిచింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) మార్చి 1-3వ తేదీ వరకు కళ్లు చెదిరే రీతిలో జరిగే ఈ వేడుకకు మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ స్టార్స్ అందరూ దాదాపుగా హాజరు కానున్నారు. ఇకపోతే టాలీవుడ్ నుంచి మాత్రం కేవలం రామ్ చరణ్ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ఈవెంట్స్‌కు హాజరయ్యాడు. అలా ఇప్పుడు అంబానీ ఇంట జరిగే ముందస్తు పెళ్లి వేడుకలో తన భార్య ఉపాసనతో కలిసి కనిపించబోతున్నాడు. శుక్రవారం ఉదయానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఒక్కొక్కరుగా జామ్ నగర్‌కి చేరుకుంటున్నారు. చరణ్ దంపతులు కూడా ఈ సాయంత్రానికి అక్కడికి చేరుకోవచ్చు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా) - 
      
                   
                               
                   
            రెండో బిడ్డను కనడానికి రెడీగా ఉన్నా..: ఉపాసన
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. కానీ ఇప్పుడు అన్నింటినీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయినా, పిల్లలయినా ఏదో హడావుడిగా కానివ్వడం లేదు. అందుకు రామ్‌చరణ్- ఉపాసన దంపతులే ఉదాహరణ. పెళ్లయిన పదేళ్ల తర్వాతే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. పిల్లల కోసం ఎవరెంత పోరు పెడుతున్నా సరే లెక్క చేయలేదు, ఇదే కరెక్ట్ సమయం అనిపించేంతవరకు వెయిట్ చేశారు. ఆ తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు. అలా గతేడాది క్లీంకారకు జన్మనిచ్చారు. మనల్ని మనమే పట్టించుకోవాలి తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే రెండో బిడ్డను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 'మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. సెకండ్ ప్రెగ్నెన్సీకి రెడీ.. జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయం. నేను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నాను. నా పక్కనున్న మేడమ్ కూడా లేట్‌గానే పిల్లలు కావాలనుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదు. అది నా ఇష్టం. అంతేకాదు, నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పబోతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెండో రౌండ్‌కు రెడీ అంటూ ఓ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఉప్సీ. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: రకుల్ వంతైపోయింది.. నెక్స్ట్ బంగారం హీరోయిన్.. - 
      
                   
                               
                   
            మెగా కోడళ్ల నయా బిజినెస్!
మెగాస్టార్ చిరంజీవి సతీమణి పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్లొ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెష్ చెప్పారు. ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుంది. ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా "అత్తమ్మ కిచెన్" నిలుస్తుంది. సురేఖ కొణిదెల పుట్టినరోజున వారు ఈ వెంచర్‌కు ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో (athammaskitchen.com) అందుబాటులో ఉన్నాయి. ఉప్మా,పొంగల్,పులిహార,రసం వంటి ఉత్పత్తులు ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ. 1,099 ఉంది. ఆన్లైన్లో డబ్బు చెల్లించి వాటిని పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయిని వారు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం మెగాస్టార్ సతీమణి చేసిన రెసిపీని మీరు ఆస్వాదించండి. అత్తమ్మాస్ కిచెన్ గురించి ఏం చెప్పారంటే సురేఖ కొణిదెల పుట్టినరోజున ప్రారంభించారు. ఉపాసన కొణిదెల నేతృత్వంలోని "అత్తమ్మ కిచెన్" ప్రొడక్ట్స్‌లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో ఉంది. ఈ ప్రొడక్ట్స్ కోసం దిగువ లింక్‌లను అనుసరించండి: వెబ్సైట్: www.athammaskitchen.com వాట్సప్:http://api.whatsapp.com/send?phone=919866589955&text=Hi ట్విట్టర్:https://twitter.com/athammaskitchen ఇన్ స్టాగ్రాం: https://www.instagram.com/athammaskitchen ఫేస్ బుక్: https://www.facebook.com/people/Athammas-Kitchen View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            ఉపాసన.. చరణ క్లీంకారం!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. ఉపాసన-రామ్ చరణ్ లవ్ స్టోరీ.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది. వాలెంటైన్ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్‌ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది. ♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW — Upasana Konidela (@upasanakonidela) February 14, 2024 - 
  
    
                
      ట్విన్ సిస్టర్ను కలిసిన క్లీంకార.. ఉపాసన ట్వీట్ వైరల్
 - 
      
                   
                               
                   
            ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన మెగా వారసురాలు.. ఫోటో వైరల్!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. పాప జన్మించిన శుభవేళ మెగా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ దంపతులు ఈ ఫోటోకు పోజులిచ్చారు. ఇందులో ఆమె తన సిస్టర్ అనుశ్ పాల, ఆమె భర్త కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోలో అనుశ్ పాల దంపతులు తమ ట్విన్ డాటర్స్‌ను చేతుల్లో పట్టుకుని కనిపించారు. వీరంతా కలిసి ఓ ఫంక్షన్లో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ఉపాసన తన ఫోటోను పోస్ట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన ట్వీట్లో రాస్తూ..'మేము అద్భుతమైన ముగ్గురిని మీకు పరిచయం చేస్తున్నా. వీరంతా పవర్ పఫ్ గర్ల్స్. క్లీంకార తన ఇద్దరు సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసిపోయింది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగాఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. Introducing the awesome threesome - power puff girls🩷 Klinkaara Konidela is joined by her 2 sisters Ayraa Pushpa Ebrahim & Ryka Sucharita Ebrahim pic.twitter.com/ChUodsLuwN — Upasana Konidela (@upasanakonidela) February 12, 2024 - 
      
                   
                               
                   
            రాజకీయాలపై కొణిదెల ఉపాసన కామెంట్స్
తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరో విజయ్ అడుగుపెట్టిన సమయం నుంచి చాలా మంది ప్రముఖులు ఇప్పటికే వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ గురించి తాజాగా కొణిదెల ఉపాసన ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తమిళనాడులో ఒక నటుడుగా విజయ్ ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్నారని ఉపాసన అన్నారు. గతంలో కూడా ఆయన మాదిరి చాలామంది చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు ముఖ్యమంత్రులుగా కూడా సేవలు చేశారని ఆమె తెలిపారు. ప్రస్తుతం విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారంటే గొప్ప విషయమే అని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకునే లీడ్ర్ ఎవరున్నా సపోర్ట్ చేయాలనేది తన అభిప్రాయమని.. అలాంటి వారికి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వెనక్కి మాత్రం లాగకూడదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్‌లో విజయ్ మంచి రాజకీయనాయకుడు కాగలరని భావిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. కానీ తాను మాత్రం రాజకీయాల్లోకి ఎట్టిపరిస్థితిల్లో రానని ఉపాసన తేల్చి చెప్పారు. ఉపాసన ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. తన కుటుంబంలో జరిగిన శుభకార్యాలకు సంబంధించిన పలు ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు రామ్ చరణ్‌తో పాటు గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్ నుంచి కూడా ఆమె పలు ఫోటోలు షేర్ చేసుకున్నారు. - 
      
                   
                               
                   
            మా తాత బర్త్ డే నాకెంతో ప్రత్యేకం.. వేదికపై ఉపాసన ఎమోషనల్!
భారతీయ వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిన ప్రముఖ వైద్యుడు, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాంటి ప్రతాప్ సీ రెడ్డి తన అపోలో ఆస్పత్రి సేవలను దేశంవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీన ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన మనవరాలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్‌ను డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం పట్ల ఎలా అనిపిస్తుందని ఉపాసనను ప్రశ్నించారు. దీనికి ఉపాసన చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. ఉపాసన మాట్లాడుతూ.. 'మా గ్రాండ్ ఫాదర్ మాత్రమే కాదు.. ఇప్పుడు క్లీంకార గ్రాండ్ ఫాదర్ కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు. మా కుటుంబంలో ఇద్దరు ఈ పురస్కారం అందుకోవడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మా తాత జన్మదినం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజును భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలలు కనే యువ వ్యాపారవేత్తలు, మహిళలతో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వైద్య రంగంలో ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం, ఆయన కలలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తామని' ఉపాసన పేర్కొన్నారు. కాగా.. సినీ రంగంలో చేసిన సేవలకు మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అంతకుముందు 2010లో ప్రతాప్ చంద్ర రెడ్డి కూడా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. Happy 91st Birthday Thatha @DrPrathapCReddy The Apollo Story is an emotional tribute to every girl child to dream without boundaries & to every father to support their daughters as equals Thank You @amarchitrkatha @RanaDaggubati for helping us put this together@ApolloFND pic.twitter.com/mPPuUjpbdG — Upasana Konidela (@upasanakonidela) February 5, 2024 - 
      
                   
                               
                   
            ఆ విషయంలో చరణ్‌పై జెలసీ.. ఉపాసన ఇంట్రస్టింగ్ కామెంట్స్
మెగా కోడలు ఉపాసన ఫుల్ సంతోషంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణ్‌లు ఉన్నారు. చిరంజీవికి ఈ మధ్యే పద్మవిభూషణ్ రాగా ఆమె తాతయ్య, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డికి 14 ఏళ్ల క్రితమే ఈ పురస్కారం వరించింది. సోమవారం (ఫిబ్రవరి 5న) ఈయన 91వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చెన్నైలో జన్మదినోత్సవ వేడుక జరిపారు. నేనే ఎక్కువ మాట్లాడుతా ఈ సెలబ్రేషన్స్ వేడుకలో ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్‌ను డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాసన కొందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. చరణ్ వింటూ ఉంటాడు. నేను బయటకు వెళ్లినప్పుడు అతడు క్లీంకారను చూసుకుంటాడు. తను బయటకు వెళ్తే నేను చూసుకుంటాను. జెలసీగా అనిపిస్తుంది ఒక విషయం గురించైతే నాకు మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు (నవ్వుతూ). ఆడపిల్లలు నాన్నకూచి అంటుంటారు కదా.. అది నిజం. నా విషయంలోనూ అదే జరిగింది. చరణ్‌ను చూడగానే క్లీంకార ముఖం వెలిగిపోతుంది. సంతోషంతో కనురెప్పలు ఆడిస్తుంది. అది చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. అయితే చరణ్ తనను చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అతడు నాకు భర్త మాత్రమే కాదు స్నేహితుడు కూడా! అన్ని విషయాలు నాతో పంచుకుంటాడు. నాతోనే కెమిస్ట్రీ బాగుంటుంది కొన్నిసార్లు అతడి సినిమాల్లో హీరోయిన్‌తో కలిసి చేసిన సీన్లు చూసినప్పుడు ఏంటిదని అడిగేదాన్ని. ఇది నా వృత్తి. అర్థం చేసుకో.. దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే! అని చెప్పేవాడు. సరేలే అని వదిలేసేదాన్ని. ఏదో సరదాగా అడుగుతా కానీ, అతడు ఏ హీరోయిన్‌తో నటించినా పట్టించుకోను. హీరోయిన్స్ కన్నా నాతోనే తన కెమిస్ట్రీ బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా చరణ్- ఉపాసనల పెళ్లి 2012లో జరిగింది. గతేడాది వీరు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లలితా సహస్రనామాల్లో ఒకటైన క్లీంకార అనే పేరును కూతురికి నామకరణం చేశారు. చదవండి: సారాంశ్.. రియల్ లైఫ్ స్టోరీ.. ఒక్కగానొక్క కొడుకు మరణం.. పీక్కుతిన్నారు! - 
  
    
                
      క్లింకార కేర్ టేకర్ ఎవరో తెలుసా ?
 - 
      
                   
                               
                   
            అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన
మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఈమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుంటాయి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువని చెప్పొచ్చు. అలాంటిది తాజాగా ఓ బుక్ లాంచ్ సందర్భంగా ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులోనే చరణ్‌తో బాండింగ్, కూతురు క్లీంకార గురించి పలు సంగతుల్ని చెప్పుకొచ్చింది. అందుకే ఇన్నాళ్లకు.. పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా, ఎలా ఫీలవుతున్నారు? అని అడగ్గా.. 'అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి మాటలు నా వరకు వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేం అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది' అని ఉపాసన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) చరణ్‌కి నాకు బౌండ్రీస్ ఇక భర్త చరణ్‌తో బాండింగ్ గురించి అడగ్గా.. 'రామ్ ఎప్పుడూ కూడా 'ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం' అని అంటుంటాడు. అలానే మేం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం, మా ఇద్దరి మధ్య హద్దులు(బౌండరీస్) కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోం. కానీ వ్యక్తిగత జీవితం విషయానికొచ్చేసరికి మాత్రం ఒక్కటిగా ఉంటాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది. 2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో వీళ్ల జంటపై ట్రోల్స్ వచ్చాయి. కానీ రానురాను ఉపాసన.. మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలైపోయింది. ఇప్పడు చరణ్ ని ఎంత అభిమానిస్తారో.. ఉపాసనని కూడా మెగా అభిమానులు అంతే అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చెప్పిన మాటలు ఫ్యాన్స్ మధ్య డిస్కషన్‌కి కారణమయ్యాయి. (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!) - 
  
    
                
      రామ్ చరణ్ కూతురు కేర్ టేకర్..సావిత్రికి జీవితం ఎంతో తెలిస్తే షాక్..!
 - 
      
                   
                               
                   
            క్లీంకారకు కేర్ టేకర్‌గా సావిత్రి.. ఆమె జీతం ఎంతో తెలిస్తే..
రామ్ చరణ్- ఉపాసనల గారాల పట్టి క్లీంకార జన్మించిన సమయం నుంచి మెగాఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అందరూ చెబుతున్న మాట. రామ్ చరణ్ RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కితే తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబంలో ఎప్పుడూ సందడిగానే ఉంది. దీంతో వారి ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతుంటారు. తాజాగా మెగా వారసురాలు అయిన క్లీంకారను చూసుకునేందుకు నానీ (కేర్ టేకర్ లేదా ఆయా)ను నియిమించుకున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె పేరు సావిత్రి కాగా, గతంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు అయిన తైమూర్‌కు సావిత్రి కేర్ టేకర్‌గా పనిచేసింది. ఆపై షాహిద్ కపూర్ ఇంట్లో కూడా ఆమె కేర్ టేకర్‌గా కొనసాగింది. ఇప్పుడు మెగా ప్రిన్సెస్ అయిన క్లీంకార ఆలనా పాలనా చూసుకునేందుకు సావిత్రిని వారు నియిమించుకున్నారట. చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ సొంత ఇంటిని నిర్మించుకుని షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్‌తో పాటు పలు ప్రాజెక్ట్‌ల వల్ల ఎప్పుడూ షూటింగ్ బిజీలో ఉంటారు. ఉపాసన కూడా ఆపోలో ఆస్పత్రిలో తన బాధ్యతలను నిర్వర్తించడంలో నిత్యం బిజీగానే ఉంటారు. ఆ సమయంలో క్లీంకార కూడా ఎప్పుడూ ఉపాసన వెంటే ఉంటుంది. దీంతో పాపను చూసుకునేందుకు సావిత్రి అయితే బాగుంటుందని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కూతురి కోసం లక్షలు లక్షలు వెచ్చించి ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారు ఉపాసన. చిన్నపిల్లలను సరిగ్గా అర్థం చేసుకుంటూ వారి ఆలనా పాలనను చూసుకునే సామర్థ్యం సావిత్రిలో ఉందని గతంలో కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. ప్రస్తుతం క్లీంకారకు కేర్‌టేకర్‌గా ఉన్న సావిత్రికి నెలకు లక్షన్నర జీతం ఇస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఒక ఆలయానికి రామ్‌చరణ్ దంపతులు వెళ్లారు. అప్పుడు ఓ పర్సనల్ పని మీద ముంబై వచ్చారని చరణ్ టీమ్ మెంబర్ ఒకరు తెలిపారు. అప్పుడు సావిత్రి కూడా వారితో ఉండటం గమనించవచ్చు. మరొక కార్యక్రమంలో కూడా క్లీంకారతో ఆమె కనిపించడంతో మెగా వారసురాలికి కేర్ టేకర్‌గా సావిత్రి ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై రామ్ చరణ్ దంపతులు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) - 
      
                   
                               
                   
            గవర్నర్‌ను కలిసిన మెగా కోడలు ఉపాసన.. ఎందుకంటే?
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలను ఉపాసన కొనియాడారు. వారి అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్ చేస్తున్న పనులు నా హృదయాన్ని కదిలించాయని అన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ.. ఉపాసన తన ట్విటర్ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Met with the Honorable Tamilisai Soundararajan Garu, the esteemed Governor of Telangana. Getting a deeper understanding of what she is doing for tribal welfare has really touched my heart.❤️ Kudos to u Ma’am, for your remarkable work. 🙏🏼✨@DrTamilisaiGuv #tribalwelfare pic.twitter.com/dUAXqZ5Zi4 — Upasana Konidela (@upasanakonidela) February 1, 2024 - 
      
                   
                               
                   
            చిరంజీవికి పద్మవిభూషణ్.. రేర్ ఫోటో షేర్ చేసిన ఉపాసన
టాలీవుడ్ మెగాస్టార్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. ఇప్పటికే ఆయనకు 2006లో పద్మ భూషణ్ అవార్డు వరించింది. తాజాగా ఆయనకు పద్మవిభూషణ్ రావడంతో మెగాస్టార్ కుటుంబ సభ్యులతో పాటు తెలుగు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. తాజాగా ఆయన కోడలు ఉపాసన ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేస్తూ మరోసారి మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవితో పాటు ఐదుగురు మనవరాళ్లుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. అందులో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పిల్లలు సమారా, సంహితతో పాటుగా శ్రీజ పిల్లలు నివ్రితి, నివిష్క ఉన్నారు. కానీ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార ఫోటోను మాత్రం రివీల్ చేయలేదు. మొఖం స్పష్టంగా కనిపించకుండా బ్లర్ చేసి ఉంచారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. తన మామయ్య చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఉపాసన ఇలా తెలిపారు. చిరంజీవి అంటే కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. దాతృత్వంలోనూ ఆయన ముందుంటాడు. జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మాకు స్ఫూర్తిని ఇచ్చాడు. చిరంజీవికి అభినందనలు. చిరుత, పద్మవిభూషణ్‌తో సత్కరించారని ఉపాసన తెలిపింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            Chiranjeevi: మెగాస్టార్‌కు పద్మ విభూషణ్.. ఉపాసన ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్డౌన్లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. (ఇది చదవండి: మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి) తాజాగా మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌కు అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్ చేసింది.ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. Congratulations dearest Mamaya ❤️❤️❤️❤️ @KChiruTweets pic.twitter.com/4AtL1e7mJf — Upasana Konidela (@upasanakonidela) January 25, 2024 - 
      
                   
                               
                   
            క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?
రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్లకు బుజ్జాయి పుట్టింది. గతేడాది జూన్‌లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు! లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెనుక సీక్రెట్ బయటపెట్టాడు. ఇక క్లీంకార పుట్టినప్పటినుంచి మెగా ఫ్యామిలీ ప్రతి పండగను మరింత వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సంక్రాంతిని ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నారు.హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో వేడుకలు జరుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఇదిలా ఉంటే క్లీంకార గురించి ఓ పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్. దీన్ని సంక్రాంతి కానుకగా ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహవీర్ ఎల్లందర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు తగ్గట్లుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశాడు. దీన్ని ధనంజయ్ అద్భుతంగా ఆలపించాడు. చదవండి: పెళ్లి తర్వాత భర్తతో హీరోయిన్ సంక్రాంతి వేడుకలు - 
      
                   
                               
                   
            మెగా హీరో బర్త్‌డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!
గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!) తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్ తేజ్ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్ తేజ్‌తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. A heart-warming glimpse of lovely couple Mega Power star @AlwaysRamCharan & @upasanakonidela with #VaisshnavTej from his birthday celebrations 😍#RamCharan #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/yyjBwe52JS — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 - 
      
                   
                               
                   
            క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్
మెగా ఫ్యామిలీ అంతా ఈసారి సంక్రాంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నారు. చరణ్ కూతురికి ఇదే తొలి పండగ కావడంతో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్‌లో కాకుండా మరో చోట జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ) గతేడాది జూన్‌లో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. ఈ పాపకు ఇప్పుడు జరగబోయే సంక్రాంతి ఫస్ట్ టైమ్. కాబట్టి ఈసారి బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే చరణ్ దంపతులు, అకీరా నందన్ తదితరులు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షెడ్యూల్ జరుగుతోంది. సంక్రాంతి కాబట్టి చిన్న విరామం తీసుకున్నారు. పండగ ముగిసిన తర్వాత మళ్లీ షూటింగ్ బిజీలో పడిపోతాడు. మరోవైపు చిరు కూడా తన కొత్త మూవీ బిజీలో ఉన్నారు. ఇకపోతే ఈసారి బెంగళూరులో జరిగే సంక్రాంతి వేడుకలకు దాదాపు మెగా హీరోలందరూ కూడా హాజరుకానున్నారని సమాచారం. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) Man Of Masses #RamCharan off 🛫 for Sankranti Occasion with Family ❤️ Visuals from Hyderabad Airport. pic.twitter.com/n0EWvUOFgK — Ujjwal Reddy (@MEHumanTsunaME) January 13, 2024 - 
      
                   
                               
                   
            రామ్‌చరణ్ దంపతులకు ఆయోధ్య ఆహ్వానం
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, కళాకారులు, సాధువులు హాజరు కానున్నారు. జనవరి 22న జరగబోయే ఈ విశేష కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, ధనుష్.. తదితరులకు ఆహ్వానాలు అందాయి. మొన్న తండ్రికి, ఇప్పుడు తనయుడికి పిలుపు తాజాగా రామ్‌చరణ్ దంపతులకు అయోధ్య వేడుకకు రమ్మని పిలుపు అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్.. హైదరాబాద్‌లోని రామ్‌చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. మరోవైపు హనుమాన్ చిత్రయూనిట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. ఎవరూ ఆకలితో వెళ్లకుండా కాగా అయోధ్యలో జరగనున్న శ్రీరాముని పవిత్రోత్సవానికి వచ్చేవారు ఆకలితో వెనుదిరగకుండా ఉత్సవ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 45 ప్రాంతాల్లో భోజనశాలలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు వివిధ రాష్ట్రాల వంటకాలను అందుబాటులో ఉంచననున్నారు. శ్రీరాముడి కోసం 2.5 కిలోల బంగారు విల్లును సిద్ధం చేస్తున్నారు. విల్లు, బాణాలను రాములవారి విగ్రహానికి అలంకరించనున్నారు. #RamCharan Received the Official Invitation at his Residence for Ram Mandir 🙏🛕pran pratishtha ceremony on Jan 22nd. Jai Shri Ram 🚩@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/U73wamMfMD — Trends RamCharan ™ (@TweetRamCharan) January 12, 2024 చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? - 
      
                   
                               
                   
            చరణ్ వెనుక నేను కాదు, నా విజయం వెనుక..
టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో రామ్‌చరణ్-ఉపాసన ఒకరు. ఉపాసన షాపింగ్ చేసుకుంటే చరణ్ బ్యాగులు మోయడం.. భర్తకు అవార్డు వస్తుందంటే గర్భంతో ఉన్నా సరే ఉపాసన విదేశాల్లో వాలిపోవడం.. ఇలాంటివి చూసిన జనాలు భార్యాభర్తలంటే ఇలా ఉండాలని అనుకోవడం చాలా మామూలు విషయం. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి ఎంతో విలువిస్తాడు చరణ్. కూతురు పుట్టాక అయితే వీలైనంతవరకు తనతో ఆడుకోవడానికే సమయం కేటాయిస్తున్నాడు. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అటు ఉపాసన సైతం కేవలం గృహిణిగా మిగిలిపోలేదు. అపోలో హాస్పిటల్స్‌లో కీలక పదవిలో ఉంది. అలాగే బి పాజిటివ్ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గానూ వ్యవహరిస్తోంది. ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె చేసే సేవా కార్యక్రమాలకైతే లెక్కే లేదు. ఇలా ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా సరే పర్సనల్ లైఫ్‌ను మాత్రం కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటున్నారు. తాజాగా ఉప్సీ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టింది. నా విజయం వెనుక.. 'ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అందరూ అంటుంటారు. నేనేమంటానంటే.. ప్రతి మహిళ విజయం వెనుక ఆమెకు అండగా, రక్షణగా నిలబడే ఒక మగవాడు ఉంటాడు' అంటూ రామ్‌చరణ్‌ను ట్యాగ్ చేసింది. దీనికి ఇండియా ఫోర్బ్స్ మ్యాగజైన్‌పై భర్తతో దిగిన ఫోటోను జత చేసింది. ఇందులో ఉప్సీ సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం, సపోర్ట్ ఇచ్చిపుచ్చుకుంటే ఇలా ఆదర్శ దంపతులుగా నిలుస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. They say, behind every successful man there is a woman. I say, behind every successful woman there is a supportive & secure man. @AlwaysRamCharan @ForbesIndia pic.twitter.com/vtEtjZiedM — Upasana Konidela (@upasanakonidela) December 28, 2023 చదవండి: వెండితెర వెలుగుల రాణి.. సంచలన విషయాన్ని బయటపెట్టింది - 
      
                   
                               
                   
            క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌చరణ్ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్‌ను స్పెషల్‌గా జరుపుకుంటుంది. రీసెంట్గా మెగా ఫ్యామిలి క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఆ డ్రెస్ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.గూసీ బ్రాండ్‌కు చెందిన రెడ్ కలర్ స్కర్ట్‌లో తళుక్కున మెరిసింది ఉపాసన. చూడటానికి సింపుల్‌గా కనిపించిన ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్‌కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్‌లో ఉపాసన చాలా క్లాసీ లుక్‌లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            రామ్ చరణ్‌పై ఉపాసన ప్రశంసలు.. పోస్ట్ వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జోడిగా కనిపించనుంది. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ ఫ్యామిలీ ఫుల్ టైమ్ గడిపేస్తున్నారు. ఇటీవలే ముంబై వెళ్లిన చెర్రీ దంపతులు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారిగా తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతేకాకుండా మహారాష్ట్ర సీఎంను కలిసి రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: మనోజ్-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా..) అయితే ప్రస్తుతం సినీతారలంతా క్రిస్మస్ ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నారు. ఇప్పటికే మెగా కుటుంబసభ్యులంతా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన- రామ్ చరణ్ సైతం తమ గారాలపట్టి క్లీంకారతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంతో కలిసి పండుగ జరుపకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. Merry Christmas ❤️❤️❤️@AlwaysRamCharan Best dad 🤗 pic.twitter.com/fKnkZIVQ6z — Upasana Konidela (@upasanakonidela) December 26, 2023 - 
      
                   
                               
                   
            ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. ఈ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లారు. నగరంలోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లారు. ఈ ఏడాది జూన్ నెలలో ఈ జంటకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే?) అయితే ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చెర్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రజల అతిథ్యం, అప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. Dear Honorable Chief Minister Garu, Shrikanth Shinde Garu, and the Vibrant People of Maharashtra, We express our heartfelt gratitude for your exceptional hospitality and warmth.🙏 @CMOMaharashtra pic.twitter.com/8uqTZgpGmM — Upasana Konidela (@upasanakonidela) December 22, 2023 View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) - 
            
                                     
                                                           
                                   
                క్లీంకార పుట్టి 6 నెలలు.. ముంబైలో మహాలక్ష్మి గుడికి వెళ్లిన చరణ్ దంపతులు (ఫోటోలు)
 - 
      
                   
                               
                   
            బిడ్డతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ దంపతులు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తొలిసారి బిడ్డతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. తమ కుమార్తె క్లీంకారతో కలిసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (ఇది చదవండి: పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!) ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మెగా దంపతులకు ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. (ఇది చదవండి: బిగ్‌బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?) - 
            
                                     
                                                           
                                   
                Ram Charan Diwali Bash: రామ్‌చరణ్-ఉపాసన ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
 - 
      
                   
                               
                   
            మెగాస్టార్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్.. స్టార్ హీరోలంతా ఇక్కడే!
వెలుగులు విరజిమ్మే దీపావళి పండగను మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. కేవలం కుటుంబసభ్యుల మధ్యే కాకుండా ఇండస్ట్రీలోని అత్యంత దగ్గరి స్నేహితులను కూడా పార్టీకి పిలిచారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేశ్ తమ కుటుంబంతో పార్టీకి విచ్చేసి సందడి చేశారు. క్లీంకార పుట్టాక తొలి దీపావళి క్లీంకార పుట్టిన తర్వాత రామ్‌చరణ్- ఉపాసన దంపతులు జరుపుకుంటున్న తొలి దీపావళి కావడంతో ఈసారి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఇంట్లో ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీనికోసం స్టార్ హీరోలు కుటుంబసమేతంగా రావడం విశేషం. ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో, మహేశ్ బాబు.. నమ్రతతో కలిసి హాజరయ్యారు. పార్టీలో ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. నలుగురు హీరోలు ఒకేచోట ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నలుగురు హీరోలు ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ పార్టీకి మంచు లక్ష్మి సైతం హాజరైంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే మహేవ్బాబు గుంటూరు కారం, రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. వెంకటేశ్ సైంధవ్ , ఎన్టీఆర్ దేవర సినిమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్.. ఏ సినిమాకో తెలుసా? - 
      
                   
                               
                   
            ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. నమ్రత కూడా..
వెలుతురు పోయాక చీకటి వస్తుంది.. చీకటి పోయాక వెలుతురు వస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగేదే! కానీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేందుకు వచ్చేదే దీపావళి పండగ. ఈరోజు పూజలు, పునస్కారాలతో పాటు స్వీట్లు, సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు రోడ్లపై పటాకులు పేలుస్తూ నానా రచ్చ చేస్తుంటారు. అమ్మాయిలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. తర్వాత అందంగా ముస్తాబై దీపావళి వేడుకలు షురూ చేస్తారు. సెలబ్రిటీలైతే మరింత ఘనంగా పండగ జరుపుకుంటారు. మరి ఈ పండగ రోజు(నవంబర్ 12న) తారలు సోషల్ మీడియాలో ఏమేం ఫోటోలు షేర్ చేశారో చూద్దాం.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Krésha (@kreshabajaj) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: కన్నుమూసిన సీనియర్ హీరో.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే.. - 
      
                   
                               
                   
            లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు - 
      
                   
                               
                   
            ఇటలీలో వాలిపోయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార విషయంలో పెద్ద పొరపాటు!
మెగా హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ జంట మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సైతం ఇటలీ చేరుకున్నారు. (ఇది చదవండి: కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!) తాజాగా మెగాస్టార్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్-ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామీలితో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. కొణిదెల- కామినేని ఫ్యామిలీ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్లీంకార ఫేస్ రివీల్! అయితే ఈ ఫోటోలో నెటిజన్స్ మెగా మనవరాలు క్లీంకార వైపే ఆసక్తి చూపారు. ఆ ఫోటోకు ఓ స్విమ్మింగ్ ఫూల్ ముందు పోజులివ్వడంతో నీటిలో రివర్స్‌లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్‌ను ఉపాసన కవర్ చేయలేదు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్‌ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారను చూసినంత ఆనందంలో మునిగిపోయారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            కూతురితో బతుకమ్మ ఆడిన ఉపాసన, వీడియో వైరల్
తీరొక్క పూలతో చేసే బతుకమ్మ పండగ అంటే ఆడబిడ్డలకు చెప్పలేనంత సంబరం. ఆడపిల్లలకే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండగను వేడుకగా చేసుకుంటారు. నిన్న(అక్టోబర్ 22) సద్దుల బతుకమ్మ.. ఆ రోజు అంతా పెద్ద బతుకమ్మలు చేసి, దాని చుట్టూ చేరి ఆడిన త్వాత వచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా అని సాగనంపారు. బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో మెగా ఫ్యామిలీ సామాన్యులేనా సెలబ్రిటీలు సైతం బతుకమ్మను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ పండగను రెట్టింపు సంతోషంగా జరుపుకుంది. క్లీంకార పుట్టిన తర్వాత ఇదే తొలి బతుకమ్మ పండగ కావడం విశేషం. సేవ సమాజ్ బాలికా నిలయంలో చిన్నారులతో కలిసి వేడుక చేసుకున్నాఉ. ఉపాసన కూడా వారితో కలిసి బతుకమ్మ ఆడటమే కాకుండా క్లీంకారను ఎత్తుకుని వారితో కలిసి డ్యాన్స్ చేసింది. కుటుంబం బలాన్నిస్తుందంటూ పోస్ట్ 'జనాలు నాకు శక్తినిస్తే, కుటుంబం బలాన్నిస్తుంది. ఎంతో ప్రత్యేకమైన దసరా పండగ రోజు అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన శక్తిని మనలో నింపుకుందాం.. సానుకూల దృక్పథాన్ని పెంచుదాం. మా అమ్మమ్మ ఆచరించే సాంప్రదాయాలను దసరా సజీవంగా ఉంచుతోంది. బాలికా నిలయంలో దసరా వేడుక చేసుకుని సంతోషాన్ని పంచుకున్నాం' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: అడివి శేష్ నా ముఖం మీదే అడిగాడు: రానా దగ్గుబాటి - 
      
                   
                               
                   
            బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్‌కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్‌ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 - 
            
                                     
                                                           
                                   
                Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            మాల్దీవుల్లో పూజాహెగ్డే.. చెల్లితో ఉపాసన.. బర్త్‌డే సెలబ్రేషన్స్!
మాల్దీవుల్లో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ గ్లామర్ టెంపరేచర్ పెంచేస్తున్న మౌనీ రాయ్ బ్లాక్ డ్రస్‌లో కేక పుట్టిస్తున్న కృతిశెట్టి జిగేలు వెలుగుల్లో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ చీరలో మెరిసిపోతున్న రాధిక అలియాస్ నేహాశెట్టి జిమ్ వర్కౌట్‌తో హీరోయిన్ కీర్తి సురేశ్ చాలా బిజీ చెల్లి పుట్టినరోజు.. రేర్ పిక్స్ పోస్ట్ చేసిన ఉపాసన View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) - 
  
    
                
      నేను తెలంగాణ బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటాను: ఉపాసన
 - 
  
    
                
      చరణ్ ఆ పని చేస్తే అస్సలు తట్టుకోలేను.. ఉపాసన షాకింగ్ కామెంట్స్
 - 
  
    
                
      ఇలాంటి మగవారు ఎన్ని పూజలు చేసినా పుణ్యం రాదు
 - 
  
    
                
      కొంతమంది కామెంట్స్ చూస్తుంటే.. ఉపాసన స్ట్రాంగ్ కౌంటర్
 - 
  
    
                
      అయ్యో నాకు తెలుగు చాలా బాగా వచ్చు..!
 - 
      
                   
                               
                   
            మెగా ఇంట్లో సందడి.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది వినాయకచవితి మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా మెగా వారసురాలితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులకు బేబీ పుట్టింది. అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మినిచ్చింది. మెగా వారసురాలు అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్‌తో పాటు కుటుంబసభ్యులు సైతం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. (ఇది చదవండి: వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!) తన మనవరాలి పేరును మెగాస్టార్ దంపతులు రివీల్ చేశారు. కొణిదెల క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా క్లీంకారతో కలిసి ఈ ఏడాది వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం తాము అభిమానించే ఫ్యామిలీకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏 ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊 Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd — Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023 (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) రామ్ చరణ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) - 
      
                   
                               
                   
            స్టైలిష్ లుక్‌లో ఉపాసన.. డ్రెస్ ధరెంతో తెలుసా?
క్లీంకార రాకతో రామ్‌చరణ్- ఉపాసనల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కూతురు పుట్టినప్పటి నుంచి చరణ్ సినిమాలు-పర్సనల్ లైఫ్‌ను మరింత బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. మరోవైపు ఉపాసన.. తన పూర్తి సమయాన్ని కూతురికే వెచ్చిస్తోంది. ఈ మధ్య చరణ్- ఉపాసన వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా! ఓ పెళ్లి కోసం వీరు పారిస్ వెళ్లారు. ఈ క్రమంలో వీరు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కారు దిగి నడుచుకుంటూ వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సమయంలో ఎంతో కూల్‌గా డిఫరెంట్ ఫ్యాషన్ లుక్‌లో కనిపించింది ఉప్సీ. లైట్ పింక్ డ్రెస్‌లో ఎంబ్రాయిడరీ జాకెట్‌తో మెరిసింది. అయితే ఈ డ్రెస్.. హేలీ మెన్జీస్ డిజైనర్‌కు సంబంధించిన పాంథర్ కాటన్ జాక్వర్డ్ అని తెలుస్తోంది. దీని ధర రూ.42 వేల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతడు గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) చదవండి: డ్రగ్స్‌కు బానిసయ్యా, మా నాన్నను నోటికొచ్చింది తిట్టా.. ఇంట్లో నుంచి గెంటేశాడు: జైలర్ హీరో - 
  
    
                
      రామ్ చరణ్ ఉపాసన పారిస్ టూర్ పోస్ట్ వైరల్..పొరపాటు పడ్డ ఆడియోన్స్
 - 
      
                   
                               
                   
            పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో
మెగా కోడలు ఉపాసన.. జూన్‌లో కూతురికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ముద్దులొలికే ఆ పాపతో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అలానే కుమార్తె క్లీంకార పుట్టిన తర్వాత పెద్దగా బయట కనిపించని ఉపాసన.. తాజాగా వెకేషన్‌కి వెళ్లింది. అయితే ఓ పెళ్లి కోసమే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం? రామ్ చరణ్-ఉపాసన ప్రస్తుతం తల్లిదండ్రులుగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 2012లో వీళ్లు పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ మధ్యనే పేరెంట్స్ అయ్యారు. పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. గతంలో టూర్స్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత పారిస్ టూర్ వేశారు. అయితే అది ఓ పెళ్లి కోసమే అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?) తాజాగా పారిస్‌లో ల్యాండ్ అయిన ఉపాసన.. తమకు అందిన ఇన్విటేషన్కి సంబంధించిన ఓ ఫొటో తీసి ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. అయితే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసిన చాలామంది నెటిజన్స్.. వరుణ్‌తేజ్-లావణ్య పెళ్లి పనుల కోసమేమోనని పొరబడ్డారు. కానీ ఇది వేరే ఎవరిదో పెళ్లి అని తెలుస్తోంది. బహుశా ఇది ఫ్రెండ్స్ లేదా బంధువుల మ్యారేజ్ అయ్యిండొచ్చు అనిపిస్తుంది. ఇకపోతే జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న మెగా కపుల్ వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠి.. ఈ ఏడాది నవంబరులో పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నాగబాబు ఫ్యామిలీ కూడా కెన్యా వెకేషన్లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్') - 
      
                   
                               
                   
            ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత
సూపర్ స్టార్ రజనీకాంత్ ఖాతాలో చాలా కాలం తర్వాత ‘జైలర్’తో ఓ హిట్ పడింది. అది ఆషామాషీ హిట్ కాదు.. ఇటీవల కాలంలో తమిళ్లో ఇలాంటి విజయం సాధించిన సినిమానే లేదు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టి..సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన చిత్రమిది. వాస్తవానికి ఈ స్థాయి విజయాన్ని ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఊహించలేదు. ప్రిరిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా వసూళ్లు వచ్చాయట. అందుకే చిత్ర నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. లాభాల్లోని కొంత భాగాన్ని హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్‌కి పంచేశారు. అంతటితో ఆగకుండా ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా అందించారు. జైలర్ విజయంలో కీలక పాత్ర వహించింది ఈ ముగ్గురే కాబట్టి..వారికి లాభాల్లోని కొంత మొత్తం ఇవ్వాల్సిందేనని నిర్మాత ఇలా చేశారట. కేవలం చిత్రబృందానికే కాకుండా లాభాల్లోని కొంత డబ్బును సామాజిక సేవ చేయడానికి ఉపయోగించాలని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు రూ.కోటి చెక్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ తరఫున నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి.. మంగళవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్, ఉపాసన కొణిదెల తాతయ్య డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ అందజేశారు. 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల కోసం ఆ డబ్బును అందించారట. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్ ద్వారా తెలియజేసింది. సన్ పిక్చర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లో వచ్చిన లాభాలను ఇలాంటి మంచి పనులకు ఉపయోగించడం గొప్ప విషయమని కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని హిట్ చిత్రాలను నిర్మించి, లాభాల్లో కొంత మొత్తాన్ని ఇలా సామాజిక సేవకు ఉపయోగించాలని కోరుకుంటున్నారు. On behalf of Sun Pictures, Mrs. Kavery Kalanithi handed over a cheque for Rs.1 Crore to Dr. Prathap Reddy, Chairman, Apollo Hospitals, towards heart surgery for 100 under privileged children. #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/o5mgDe1IWU — Sun Pictures (@sunpictures) September 5, 2023 - 
      
                   
                               
                   
            పూజలో పాల్గొన్న మెగా వారసురాలు.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు మెగాస్టార్ రివీల్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టడంతో పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం తన బిడ్డతో కలిసి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. (ఇది చదవండి: గిఫ్ట్‌గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన్ని తలపిస్తున్న షారుక్ సౌధం! ) తాజాగా తన ముద్దుల కూతరు క్లీంకారతో కలిసి తొలిసారిగా వరలక్ష్మీ పూజలో పాల్గొన్న ఫోటోను షేర్ చేసింది. ఇంతకు మించి మరేది అడగలేను.. క్లీంకారతో మొదటి వరలక్ష్మీ వ్రతం పూజ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో క్లీంకార ఫేస్ కనపడకుండా కవర్ చేసింది ఉపాసన. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మా చిట్టి తల్లి కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరికొందరేమో క్లీంకార ఫేస్ చూడాలని ఆసక్తిగా ఉందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా.. ఇటీవలే ఒంటరి మహిళల కోసం అపోలో ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉచిత సేవలందిస్తున్నట్లు ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్! ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            బన్నీకి ఉపాసన,చరణ్ స్పెషల్ గిఫ్ట్.. టచ్ చేశారంటూ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించిన వెంటనే టాలీవుడ్ స్టార్స్ అందరూ శుభాకాంక్షలు చెప్పారు. వారిలో ప్రథమంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే 'నీకు ఈ అవార్డులు, విజయం వచ్చి తీరాల్సిందే బావా' అని ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ కూడా 'హృదయపూర్వకంగా(జెన్యూన్‌గా) శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్ బావా' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆపై ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి 'పుష్ప.. తగ్గేదేలే' అంటూ సినిమా స్టైల్లో కంగ్రాట్స్ చెప్పాడు. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?) ఇలా చాలామంది సినీ సెలబ్రిటీలు చెబుతుండగా రామ్ చరణ్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా విషెస్ చెప్పాడు. అందుకు బన్నీ కూడా ఒక్క ముక్కలో థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దర మధ్య ఏమైంది అంటూ పలువురు ఫ్యాన్స్ కూడా నెట్టింట కామెంట్లు కూడా చేశారు. తాజాగా అల్లు అర్జున్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్‌గా ఒక గిఫ్ట్‌గా ఒక పూల బొకేను పంపారు. దానితో పాటు ఓ స్పెషల్ నోట్‌ను కూడా బన్నీ గురించి ఇలా రాసుకొచ్చారు. 'డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. ఇలాంటివి ఇంకా ఎన్నో నిన్ను వరిస్తాయి. అందుకు నీవు అర్హునివి కూడా..' అని ఉపాసన రాసుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్ కూడా కొంతమేరకు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. థాంక్యూ సో మచ్ అంటూనే.. టచ్ చేశారని బన్నీ కూడా తెలిపాడు. ఇదంతా తన ఇన్ స్టా స్టోరీలో అల్లు అర్జున్ షేర్ చేశాడు. ఈ ఘటనతో అయినా రామ్ చరణ్,బన్నీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఈ విషయాన్ని గ్రహించాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు. దీంతో ఇకనైనా ఈ రూమర్స్‌కు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) - 
      
                   
                               
                   
            రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!
ఈ ఏడాది మెగా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే దాదాపు రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వారసురాలు జన్మించింది. జూన్ 20న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెలలోనే నామకరణం ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. తన మనవరాలి పేరును మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. క్లీంకారగా రామ్,ఉప్సీల బిడ్డకు పేరు పెట్టారు. అయితే క్లీంకార పుట్టాక మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన తల్లిదండ్రులు సైతం మనవరాలితో టైం స్పెండ్ చేస్తున్నారు. క్లీంకార పుట్టాక తొలిసారిగా ఇండిపెండెన్స్ డే వేడుకలను తాత, అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోల్లో మెగా వారసురాలు ఫోటో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజే తమ బిడ్డ రూపాన్ని మెగా అభిమానులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాకుండా క్లీంకార భారత జెండాను ఆవిష్కరిస్తూ తొలి ఇండిపెండెన్స్ డే రోజే అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇది అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ప్రిన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా అన్నయ్య రామ్ చరణ్ ఫేస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !
ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) అయితే సామాజిక ఉపాసన సేవలోనూ ఎప్పుడు ముందుంటుంది. తన సేవలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్ పేరిట జూబ్లీహిల్స్‌లోని ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలను పరిచయం చేయడం గర్వకారణం. ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్‌కు కాల్ చేసి మీ స్లాట్‌ను బుక్ చేసుకోండి. ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటాయి. సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. (ఇది చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
ఈ ఏడాది మెగా ఇంట్లో పెద్ద పండగే జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. జూన్ నెలలో రామ్ చరణ్ భార్య ఉపాసనకు బేబీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు. గతనెలలో నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే మెగా వారసురాలికి వచ్చిన గిఫ్ట్‌లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బిడ్డకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ పంపినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మెగా వారసురాలికి మెగాస్టార్ ఏ గిఫ్ట్ ఇచ్చారనే విషయంపై ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ తన మనవరాలికి చిరంజీవి దంపతులు ఓ చిరు కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ దంపతులు తమ మనవరాలు క్లీంకారకు ఆంజనేయస్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్‌ను అందమైన డిజైన్‌తో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన వెల్లడించింది. మెగా ఫ్యామిలీ హనుమాన్ భక్తులు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే తన మనవరాలికి ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఉయలను గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది..!! కాగా.. ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!) ప్రెగ్నెన్సీ జర్నీపై ఉపాసన మాట్లాడుతూ.. 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' అని అన్నారు. - 
      
                   
                               
                   
            తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రెగ్నెన్సీ జర్నీ 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) నాకు బాధేసింది 'నా వరకు పర్లేదు కానీ కొందరు మహిళలకు ఇలాంటి అండ దొరకదు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ ఉండదు. కాబట్టి వీకెండ్స్ లో నా ఆస్పత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ చికిత్స అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నా వంతు సహాయం అందించడానికి రెడీగా ఉన్నాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా' అని ఉపాసన చెప్పుకొచ్చింది. క్లీంకార రాకతో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2012లో పెళ్లయింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో అభిమానుల దగ్గర మిగతా వాళ్ల వరకు చాలా కామెంట్స్ చేశారు. వాటన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ గతేడాది డిసెంబరులో ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ జూన్ లో పాపకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతోపాటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం అందరూ పాపతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) - 
      
                   
                               
                   
            మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే?
వారసురాలి రాకతో మెగా కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది. భార్య ఉపాసన గర్భంతో ఉన్నప్పుడే క్లీంకార ఎన్నో సంతోషాలను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోయాడు రామ్‌చరణ్. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావడం, ప్రపంచవ్యాప్తంగా తన నటనకు ప్రశంసలు దక్కడం, ఈ శుభసూచకాలన్నీ తన కూతురు వల్లే జరిగాయని మురిసిపోయాడు. క్లీంకార పుట్టిన తర్వాత వారి సంతోషం రెట్టింపయింది. ఇకపోతే చిరంజీవికి కోకాపేటలో ఉన్న ఆస్తుల రేట్లు పెరగడాన్ని కూడా క్లీంకారతో ముడిపెడుతున్నారు మెగా అభిమానులు. క్లీంకార అడుగుపెట్టిన వేళావిశేషం.. చిరు కుటుంబానికి అన్నీ కలిసొస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరలవుతోంది. ఈ క్రమంలో ఉపాసన తల్లి శోభన మనవరాలి కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిందట! తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందు పనివాళ్లతో దిష్టి తీయించిందట! అంతేకాదు, దిష్టి తీసిన పనివాళ్లకు ఏకంగా రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఓ వార్త వైరలవుతోంది. తర్వాత కూతురిని ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె మనవరాలితో ఆడుకుందట! అయినా దిష్టి తీసినందుకు వందలు, వేలు ఇస్తారు, అంతేకానీ ఇలా లక్షల్లో డబ్బు ఇవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు మాత్రం.. తన మనవరాలు తొలిసారి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో పనివాళ్లకు బహుమతి ఇచ్చిందనుకోవచ్చుగా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మెగా మనవరాలు క్లీంకార మాత్రం అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది! చదవండి: రూ.2 లక్షలిస్తా.. కమిట్మెంట్ ఇస్తావా? అని అడిగాడు: హీరోయిన్ లలిత్ మోదీతో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చేసిన సుష్మితా సేన్ - 
      
                   
                               
                   
            క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు
హైదరాబాద్ చరిత్రలోనే కోకాపేట భూముల ధరలు రికార్డ్ బద్దలవుతున్నాయి. కోకాపేట నియోపోలీస్ భూములు వేలంలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ప్లాట్ నెం.10లో 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అక్కడ ఎకరాకు అత్యధికంగా రూ.100 కోట్లకుపైనే వేలం పలికింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా కోకాపేట వైపు చూసింది. ఈ వేలం అనంతరం మెగాస్టార్ చిరంజీవి పేరు ఒక విషయంలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు.. ఏడ్చేసిన ధనరాజ్) చిరంజీవికి కోకాపేటలో ల్యాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉందనే విషయం మాత్రం అధికారికంగా తెలియదు. గతంలో రాఖీ పండగ కానుకగా తన చెల్లెలు ఇద్దరికీ కోకాపేట భూములను రాసి ఇచ్చేలా సురేఖ చేసిందని ఆయన చెప్పారు. చిరంజీవి కొన్ని ఏళ్ల క్రితం వ్యవసాయం చేయడం కోసం అక్కడ కొంత భూమిని కొన్నారు. ఐతే అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకపోవడంతో ఆ భూములను అలాగే వదిలేశారు. అయితే ఆ భూమిలోని కొంత మొత్తాన్ని తన ఆడబడుచులకు ఇద్దామని సురేఖ సలహా ఇచ్చారని ఆయన గతంలో తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో సురేఖానే భూమి రిజిస్ట్రేషన్ పనులు చేయించారని ఆయన చెప్పారు. చిరంజీవికి రాఖీ కట్టిన సమయంలో గిఫ్ట్‌గా ఆ భూమి తాలూకా ఆస్థి పత్రాలను చెల్లెళ్లకు సురేఖ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవినే మహిళా దినోత్సవం రోజున వెల్లడించారు. చెల్లెళ్లకు గిఫ్ట్‌గా ఇచ్చిన సమయంలో అక్కడ ఎకరం భూమి సుమారు రూ. 30 కోట్లుగా ఉండేది. ఇదే నిజం అయితే.. కోకాపేటలో చిరంజీవికి సుమారు 20 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగేది. ఆయన కొన్న సమయానికి ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి లేదు. అలాంటి సమయంలో వ్యవసాయం చేసేందుకు కొంత భూమిని ఆయన కొన్నారు. ఇప్పుడు నగరం విస్తరిస్తుంది. దీంతో సిటీకి అందుబాటులో ఉన్న అన్ని ఏరియాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అలా కోకాపేటలోని చిరంజీవికి చెందిన భూమలు ఇప్పుడు భారీ ధరనే పలకనున్నాయి. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు చిరంజీవికి అక్కడ 20 ఎకరాల భూమి ఉంటే దాని విలువ రూ. 1500 కోట్ల పైమాటే. ఇదంతా రామ్ చరణ్ తనయ క్లీంకార వచ్చిన వేళా విశేషం అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి కూడా క్లీంకార జాతకం చాలా బాగుందని, తను ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి వృద్ధి చెందుతుందని చెప్పిన విషయం తెలిసిందే. - 
  
    
                
      రామ్ చరణ్ భార్య చాలా హెల్ప్ చేసింది
 - 
  
    
                
      తమన్నాకి ఉపాసన రెండు కోట్ల డైమండ్ గిఫ్ట్
 - 
      
                   
                               
                   
            ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!
హీరోయిన్ తమన్నా మంచి ఊపు మీదుంది. ఎందుకంటే ఈమె కెరీర్ ఇక అయిపోయిందని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీల్లో 'లస్ట్ స్టోరీస్ 2', 'జీ కర్దా' వెబ్ సిరీసులు చేసింది. అయితే ఇప్పటివరకు మడి కట్టుకుని కూర్చొన్న తమన్నా.. ఓటీటీల్లో సిరీస్‌లు అనేసరికి ఎందుకో ఓపెన్ అయిపోయింది. కిస్, శృంగార సీన్లలో రెచ్చిపోయింది. కొన్నాళ్ల ముందు ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికీ ఆ విషయం మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) తమన్నా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో 'శ్రీ' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. 'హ్యాపీడేస్'తో గుర్తింపు తెచ్చుకుంది. '100% లవ్' హిట్‌తో వరసగా పెద్ద సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడి నుంచి ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'భోళా శంకర్', 'జైలర్' చిత్రాలు.. జస్ట్ ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మధ్య తమన్నా చేతికి డైమండ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయింది. దీన్ని మెగాకోడలు ఉపాసన ఆమెకి గిఫ్ట్ ఇచ్చిందని, ప్రపంచంలోనే ఇది ఐదో ఖరీదైన వజ్రం అని, దీని ఖరీదు రూ.2 కోట్లు అని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలు తమన్నా చెవిన పడ్డాయి. దీంతో ఆమెనే స్వయంగా స్పందించింది. అసలు విషయం బయటపెట్టేసింది. ఇది డైమండ్ కాదని, సోడా బాటిల్ ఓపెనర్ అని క్లారిటీ ఇచ్చింది. బాగుందని ఫొటోలకు పోజులిచ్చినట్లు చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ ఓర్ని.. ఇదా సంగతి అని మనసులో అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) - 
      
                   
                               
                   
            మెగా ప్రిన్సెస్ క్లీంకారపై సాయి తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా ప్రిన్సెస్ క్లీంకార ఎలా ఉంటుంది? తండ్రి రామ్ చరణ్‌లా ఉంటుందా? లేక తల్లి ఉపాసనలా ఉంటుందా? చిరంజీవి పోలికలు వచ్చాయా? లేవా?.. మెగా అభిమానుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్నలివి. క్లీంకార జన్మించి నెల రోజులు దాటినా.. ఇప్పటికీ ఆమె ముఖాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి చూపించలేదు. కొన్ని ఫోటోలు, వీడియోలను వదిలినా.. కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు ఉపాసన-రామ్ చరణ్. దీంతో క్లీంకార ఎలా ఉందనే క్యూరియాసిటీ మెగా ప్యాన్స్‌లో మరింత పెరిగింది. ఫోటోలను షేర్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్-ఉపాసలను వేడుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటికీ మెగా ప్రిన్సెస్ ఫోటోలు బయటకు రాలేదు. అయితే తాజాగా క్లీంకారకు ఎవరి పోలీకలు వచ్చాయో చెప్పేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. క్లీంకార ప్రస్తావన వచ్చింది. ‘క్లీంకారకు తండ్రి పోలికలు వచ్చాయి. అచ్చం రామ్ చరణ్‌లాగే ఉంటుంది. కళ్లు చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. కూతురు తండ్రి పోలీకలతో పుడితే అదృష్టం అంటారు. క్లీంకార విషయంలో అదే జరిగింది’అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. (చదవండి: టాలీవుడ్లో టాప్ వన్ హీరో, టాప్ వన్ హీరోయిన్ ఎవరంటే..?) - 
      
                   
                               
                   
            ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!
మెగాకపుల్ రామ్ చరణ్-ఉపాసన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఈ మధ్య కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. ఆమెతో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. మూడురోజుల ముందు భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా కుమార్తె క్లీంకారకి సంబంధించిన వీడియోని చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందరికీ ఆ వీడియో తెగ నచ్చేసింది. ఇదంతా పక్కనబెడితే తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్.. ఉపాసన-తనకు మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. (ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!) క్లాత్స్ విక్రయించే ఓ యాప్‌కి రామ్ చరణ్ ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిని కమెడియన్ తన్మయ్ భట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో భాగంగా తన స్టైలింగ్, ఆన్లైన్ షాపింగ్, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంటానని చరణ్ చెప్పుకొచ్చాడు. అలానే తనకు పెళ్లి అయిన కొత్తలో భార్య ఉపాసనకు ఎంతో కష్టపడి ఓ గిఫ్ట్ ఇస్తే, దాన్ని అవతల పారేసిందని అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. 'పెళ్లయిన కొత్తలో ఓసారి ఉపాసన కోసం కాస్ట్లీ గిఫ్ట్ తీసుకున్నాను. ఆ వస్తువు కొనడానికే దాదాపు ఐదు గంటలు పట్టింది. తీరా తీసుకెళ్లి ఆమెకు ఇస్తే కనీసం ఐదు సెకన్ల కూడా చూడలేదు. పక్కన పడేసింది. అందుకే ఆడవాళ్లకు సర్ప్రైజులు ఇవ్వొద్దు. వారికి కూడా అవి నచ్చవేమో. ఏదైనా వాళ్లని అడిగి కొంటే బెటర్ అని నా ఫీలింగ్' అని రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!) - 
      
                   
                               
                   
            మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!
మెగా ప్రిన్సెస్ సందడి మొదలై, అప్పుడే నెలరోజులు అయిపోయింది. ఈ రోజు(జూలై 20) ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్‌చరణ్ మాత్రం ఈ రోజుని ఇంకాస్త స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేశాడు. తన భార్య పుట్టినరోజు, కూతురు పుట్టి నెల పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ షేర్ చేసిన వీడియోలో.. చాలా అద్భుతమైన విజువల్స్‌ని చూపించారు. 2012లో చరణ్-ఉపాసన పెళ్లి వీడియో బిట్‌తో పాటు చరణ్, ఉపాసన మాట్లాడిన విజువల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 3 నిమిషాలున్న ఈ వీడియోలో ఉపాసన డెలివరీ రోజు ఆస్పత్రిలో, నామకరణం రోజు ఇంట్లో ఏం జరిగిందనేది చూపించారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి చరణ్ వెళ్లడం, కూతురిని బయటకు తీసుకురావడం.. కుటుంబ సభ్యులు అందరూ ఆ పాపని చూసి మురిసిపోవడం లాంటి వాటిని ఈ వీడియోలో బ్యూటీఫుల్‌గా క్యాప్చర్ చేశారు. చివరగా ఉపాసన పాపని ఎత్తుకున్నట్లు చూపించి ఈ వీడియోని ఎండ్ చేశారు. ఏదేమైనా 'క్లీంకార' ఫస్ట్ వీడియో మాత్రం బ్యూటీఫుల్‌గా ఉంది. రామ్‌చరణ్ మాట్లాడుతూ 'క్లీంకార పుట్టే టైంలో మా అందరిలోనూ ఏదో తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నా. పాప పుట్టిన ఆ క్షణం నా మనసుకి ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప రాకకు పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం' అని అన్నారు. ఇదే వీడియోలో ఉపాసన కొణిదెల మాట్లాడుతూ.. 'మా పాప ద్రవిడ సంస్కృతిలో భాగం కావాలని కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులు ఇవ్వొద్దు. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలనేది నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో కీలకం. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి' అని చెప్పారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) - 
  
    
                
      Klin Kaara Konidela First Video: ఉపాసన డెలీవరీ వీడియో రిలీజ్ చేసిన రామ్‌చరణ్
 - 
            
                                     
                                                           
                                   
                తల్లయ్యాక ఉపాసనకు ఫస్ట్ బర్త్‌డే.. చాలా స్పెషల్ (ఫోటోలు)
 - 
      
                   
                               
                   
            చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్
రామ్ చరణ్-తారక్ వీరిద్దరూ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. RRR సినిమా కంటే ముందు నుంచే వారిద్దరి మధ్య సోదర బంధం ఉంది. ఇద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే.. ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి.. ఇద్దరం బయటికి చెక్కేస్తామని కూడా వారు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందే.. మొదట ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెర్రీ చెప్పాడు. అంతలా వారి మధ్య స్నేహం ఉంది కాబట్టే జక్కన్న RRR సినిమా చేయగలిగాడని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?) రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లైన 10ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే ఆ పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గారాల పట్టీకి బహుమతులు భారీగానే అందాయి. అందులో భాగంగగానే జూ. ఎన్టీఆర్ కూడా క్లీంకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట. ఆ గిఫ్ట్ కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తోంది. చరణ్,ఉపాసన,క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే చరణ్-తారక్ స్నేహ బంధం అలాంటిది. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) - 
      
                   
                               
                   
            మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. ఎంత బాగుందో..
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు క్లీంకార అనే నామకరణం చేశారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో తొలి నుంచి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. డెలీవరీ సమయంలో కూడా రామ్ చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా పక్కనే ఉన్నారు. బారసాల కార్యక్రమాన్ని కూడా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ ఇంట ఇప్పటికీ ఆ పండుగ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తన ముద్దుల తనయ విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కుమార్తె చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఇంటీరియర్ సిద్ధం చేయించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో క్లీంకార కోసం ఓ స్పెషల్ రూమ్‌ని డిజైన్ చేయించారు. అమ్రాబాద్ ఫారెస్ట్, వేదిక్ హీలింగ్ అంశాలను ప్రేరణగా తీసుకొని అత్యుత్తమ వాతావరణంలో చిన్నారి పెరిగేలా ఈ ఇంటీరియర్‌ను సిద్దం చేయించినట్లు ఉపాసన పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోని ట్వీటర్లో షేర్ చేస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో తన కూతురిని పెంచడానికి ఎంతో ఆనందిస్తున్నానని రాసుకొచ్చింది. Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing. Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL — Upasana Konidela (@upasanakonidela) July 14, 2023 - 
  
    
                
      అప్పుడే కైంకారా కోసం ఇంత అద్భుతమైన ఇల్లా..?
 - 
      
                   
                               
                   
            ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను.. వీడియో షేర్ చేసిన ఉపాసన
ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో ఉపాసన- రామ్ చరణ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డకు క్లీంకార అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే ఉపాసన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆస్పత్రిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్‌ను తలపించేలా డిజైనర్స్ దీనిని తయారు చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్) ఉపాసన ట్వీట్లో రాస్తూ..'అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను జన్మనివ్వడం. నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. ధన్యవాదములు పవిత్రా రాజారామ్.' అంటూ పోస్ట్ చేసింది. Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing. Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL — Upasana Konidela (@upasanakonidela) July 14, 2023 - 
  
    
                
      నేను చరణ్ ని చాలా ప్రేమిస్తున్నా..
 - 
      
                   
                               
                   
            హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!
ఉపాసన- రామ్ చరణ్ ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో చేరిన మెగా కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తమ ముద్దుల కూతురి పేరును క్లీంకారగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో వారసురాలు అడుగు పెట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా ) అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన వేడుకలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. అయితే ఇవాళ సంగీత దర్శకుడు కీరవాణి బర్త్‌డే సందర్భంగా ఉపాసన వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫోటోను పంచుకున్నారు. నాటు నాటు పాట స్టెప్పులకు వింబుల్డన్‌లో టెన్నిస్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆస్కార్ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. (ఇది చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) - 
  
    
                
      అంబానీ పంపించిన కోటి రూపాయల ఉయ్యాలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
 - 
      
                   
                               
                   
            మెగా ఇంట్లో బారసాల వేడుక.. వారికి గిఫ్ట్‌గా ఏమిచ్చారంటే?
మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. రామ్ చరణ్-ఉపాసనకు తొలిసారి బిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు వారి కుటుంబసభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. జూన్ 20న ఉపాసన పాపకు జన్మనివ్వగా.. జూన్ 30న బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును వెల్లడించారు. క్లీంకార కొణిదెల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఖరీదైన గిఫ్ట్! అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఎలాంటి బహుమతులు ఇచ్చారనే విషయంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెగా ఇంట్లో ఈ వేడుకను ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా బారసాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా అలకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న వారికి మెగా ఫ్యామిలీ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తన మనవరాలి పేరును రివీల్ చేస్తూ అర్థాన్ని కూడా వివరించారు. రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) - 
  
    
                
      మెగా ప్రిన్సెస్ పేరుకి ఉన్న అర్ధం ఏంటంటే..
 - 
      
                   
                               
                   
            రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?
మెగా ఇంట్లో ఈ ఏడాది పండగ వాతావరణం నెలకొంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టింది. జూన్ 20న రామ్ చరణ్ భార్య ఉపాసన పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. తాజాగా మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) ఈ వేడుకలో తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డ పేరును క్లీంకార అంటూ రివీల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాసన తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే మెగా వారసురాలి పేరుపై ఉపాసన మదర్ శోభన కామినేని ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఉపాసన బిడ్డ పేరును ప్రస్తావిస్తూ ఫోటోలను షేర్ చేసింది. మొదట ఉపాసన పుట్టినప్పుడు ఈ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఉపాసన బిడ్డకు ఈ పేరు పెట్టడంతో చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది. ఉపాసన రిప్లై ఈ పోస్ట్ చూసిన ఉపాసన కూడా స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తన తల్లి శోభన పోస్ట్‌ను షేర్ చేసింది. లవ్ యూ మామ్ అంటూ మదర్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) View this post on Instagram A post shared by Shobana Kamineni (@shobanakamineni) - 
            
                                     
                                                           
                                   
                చెర్రీ-ఉపాసనల మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!
ఈ ఏడాది మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు మెగాస్టార్ ఇంట్లో మనవరాలు అడుగుపెట్టింది. దీంతో మెగాఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా జూన్ 30న తన మనవరాలికి బారసాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన బిడ్డకు ప్రముఖ బిజినెస్మెన్ ముకేశ్ అంబానీ దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు ఊయలను బహుమతిని ఇచ్చారని నెట్టింట చర్చ మొదలైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) అయితే ఈ వార్తలపై రామ్ చరణ్ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలనే ఈ వేడుకల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఉపాసనకు ప్రజ్వల ఫౌండేషన్ చెక్కతో తయారు చేసిన ఊయలను అందించింది. ఈ విషయాన్ని ఉపాసన తన ఇన్‌స్టాలో కూడా పంచుకుంది. దీంతో అంబానీ ఖరీదైన బహుమతి ఇచ్చారన్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఇవాళ జరగిన బారసాల కార్యక్రమంలో మెగాస్టార్ మనవరాలితి క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ఇది చదవండి: హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) - 
      
                   
                               
                   
            రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు పుట్టిన పాపాయికి పేరు పెట్టేశారు. 'క్లీంకార కొణిదెల' అని నామకరణం చేశారు. అలానే బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిన తర్వాత పాపాయి ఊయల్లో ఉన్న ఫొటోని తాత అయిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తన మనవరాలి పేరు వెనక సీక్రెట్ కూడా ఆయనే బయటపెట్టేశారు. పేరు వెనక సీక్రెట్ రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాప డీటైల్స్ ఇవే రామ్ చరణ్- ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన 11 ఏళ్లకు అంటే గతేడాది ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా ఉపాసన బేబీ బంప్ తో చాలాసార్లు బయట కనిపించింది. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసనకు డెలివరీ అయింది. ఇప్పుడు పుట్టిన పాపకు పేరు పెట్టారు. దీంతో మెగాఫ్యాన్స్ ఈ పేరుని వైరల్ చేస్తున్నారు. And the baby’s name is ‘Klin Kaara Konidela ‘.. Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it .. All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!) - 
      
                   
                               
                   
            రామ్ చరణ్ - ఉపాసన బిడ్డ పేరు ఇదే.. మెగాస్టార్ ట్వీట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో మెగా ఇంట నేటివరకు కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. పాప పుట్టినరోజు నుంచి ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా మనవరాలి పేరును చిరంజీవి ట్వీట్ చేశారు. మా ఇంటి మహాలక్ష్మి పేరు 'క్లీంకార కొణిదెల'(Klin Kara Konidela) అంటూ పోస్ట్ చేశారు. ఈ మేరకు ఓ ఫోటోను మెగాస్టార్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ మనవరాలి పేరును వెల్లడించారు. ఆ ఫోటోలో చిరంజీవి దంపతులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది. Klin Kaara Konidela 😍@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/8emWJoJcra — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023 And the baby’s name is ‘Klin Kaara Konidela ‘.. Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it .. All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023 - 
      
                   
                               
                   
            మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్
దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసింది. మంగళవారం మెగా కుటుంబానికి సెంటిమెంట్.. అదేరోజు వారి ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టడంతో సంబురాలు చేసుకున్నారు. దీంతో లక్ష్మీ దేవిలా వారి కుటుంబంలో సందడి తెచ్చిందని బావించారు. ఆమె రాకతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ సైతం సంతోషంతో సంబురాలు చేసుకున్నారు. ఇక పాప జాతకం కూడా చాలా బాగుందని చిరంజీవి కూడా అన్నారు. పలువురు జ్యోతిష్యులు కూడా పాప జాతకం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు కూడా. (ఇదీ చదవండి: రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు) తాజాగా మెగా ప్రిన్సెస్‌కు నేడు (జూన్ 30)న పేరు పెట్టబోతున్నట్లు ఉపాసన తెలిపింది. దీంతో మెగా వారసురాలి బారసాల కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్- ఉపాసన దంపతులకు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ నుంచి ఒక కానుక వచ్చిందని ప్రచారం జరుగుతుంది. బంగారంతో తయారు చేసిన ఊయలను పాప కోసం అంబానీ పంపారట. అందుకోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎవరూ ప్రకటన చేయలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా, ఎక్కడంటే?) - 
      
                   
                               
                   
            రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో మెగా ఇంట నేటివరకు కూడా సంబురాలు జరుగుతూనే ఉన్నాయి. పాప పుట్టినరోజు నుంచి ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పనిచేస్తుందా?) తాజాగా ఇదే విషయంపై ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. నేడు (జూన్ 30)న తన డార్లింగ్‌కు పేరు పెట్టబోతున్నట్లు తెలిపింది. దీంతో మెగా వారసురాలి బారసాల కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది. మెగా ప్రిన్సెస్ బారసాల కార్యక్రమంలో మెగా కుటుంబంతో పాటు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అంతే కాకుండా మెగా కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉన్నవారికి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే మెగా ప్రిన్సెస్ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కానీ పూజా కార్యక్రమంలో మాత్రమే పేరు రివీల్ చేయాలని చిరు సూచించారట. (ఇదీ చదవండి: బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?) - 
  
    
                
      అత్యంత సంతోషకరమైన క్షణాలివే..ఉపాసన
 - 
      
                   
                               
                   
            డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!
మెగా కుటుంబం, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధుర క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న మంగళవారం మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భం కోసం మెగా ఫ్యామిలీతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ప్రత్యేకమైన సందర్భానికి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ వేదికైంది. (ఇది చదవండి: మెగాప్రిన్సెస్‌కు ఘనస్వాగతం, ఫోటో షేర్ చేసిన ఉపాసన) కాగా.. డెలివరీ కోసం ఒకరోజు ముందుగానే మెగా కుటుంబం అపోలో ఆస్పత్రికి చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలో వీల్ చైర్‌పై వెళ్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. 'అంతేకాకుండా ఐదు రోజుల క్రితం జరిగిన అత్యంత మధురమైన క్షణమిదే. మీ అందరికీ ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోతో పాటు మై లిటిల్ ప్రిన్సెస్ రావడానికి ముందు అంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..) Moments before the #MegaPrincess arrived ❤️ Love this emotion video of #UpasanaKonidela. We spot #RamCharan𓃵 at the end too! 😍🫶🏼pic.twitter.com/1FYOijRvtS — ᴠᴇɴᴋᴀ𝟽ᴋᴜᴍᴀʀᴍsᴅɪᴀɴ (@venkysayzzz) June 25, 2023 - 
      
                   
                               
                   
            మెగాప్రిన్సెస్‌కు ఘనస్వాగతం, ఫోటో షేర్ చేసిన ఉపాసన
మెగాప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. దశాబ్ద కాలం ఎదురుచూపులకు తెరదించుతూ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో జూన్ 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చిన్నారి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందంటే సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందేగా! చిరంజీవి ఇంటిని పువ్వులు, బెలూన్లతో అలంకరించారు. వెల్కమ్ హోమ్ బేబీ అంటూ పాపాయికి ఘన స్వాగతం పలికారు. తాజాగా తన బుజ్జి పాపాయిని ఎత్తుకున్న ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఉపాసన తన కూతురిని ఎత్తుకోగా చరణ్ తన పెంపుడు కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. మా చిట్టితల్లికి లభించిన ఘనస్వాగతం మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. మాపై ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: పెళ్లిపీటలెక్కిన జిల్ విలన్, ఫోటోలు వైరల్ - 
  
    
                
      మెగా ప్రిన్సెస్ పై నిహారిక షాకింగ్ కామెంట్స్
 - 
            
                                     
                                                           
                                   
                ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. కూతురితో రామ్‌చరణ్, ఉపాసన (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం, మాటలు రావడం లేదు: చరణ్
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రామ్‌చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. జూన్ 20వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీకి ఒకరోజు ముందు నుంచి ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నారు. ఉపాసనతో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ఇదివరకే వెల్లడించారు. దీంతో శుక్రవారం(జూన్ 23న) ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'జూన్ 20న ఉదయం పాప పుట్టింది. ఈరోజు పాప, ఉపాసనను తీసుకుని ఇంటికి వెళుతున్నాం. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులు చేసిన ప్రార్థనలు కూడా మర్చిపోలేను. మీ ఆశీస్సులు పాపకు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకర సందర్భంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికే ఉపాసన, నేను ఓ పేరు అనుకున్నాం. సాంప్రదాయం ప్రకారం 13వ రోజు లేదా 21వ రోజున ఆ పేరు వెల్లడిస్తాం. చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. అనుకున్న సమయంలో భగవంతుడు మాకు పాపను ప్రసాదించాడు' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: రూ.200 కోట్ల దర్శకుడితో మెగాస్టార్ సినిమా? - 
  
    
                
      Live: రామ్ చరణ్, ఉపాసన ప్రెస్ మీట్
 - 
      
                   
                               
                   
            ఈ రోజే ఉపాసన డిశ్చార్జ్.. అందరికీ ఉన్న ఆ సందేహం రివీల్ చేస్తారా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. జూన్ 20వ తేదీ, మంగళవారం పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి అపోలో ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్సెస్‌తో ఆమె ఈరోజు జూన్ 23న డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కోలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు?) ఉపాసనతో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపడంతో ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మెగా అభిమానులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొందరికి ఓ సందేహం ఉంది. ఉపాసనకు నార్మల్ డెలివరీనా..? సిజేరియన్ చేశారా? అని! దీంతో నేడు ఈ దంపతులిద్దరూ సమాధానం చెప్పే అవకాశం ఉంది! ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ముందు రామ్ చరణ్- ఉపాసన దంపతులు అపోలో ఆస్పత్రి వదద మీడియాతో మాట్లాడనున్నారు. మెగా ప్రిన్సెస్ రాకతో శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ తెలపనున్నారు. ఇదే సమయంలో బేబీకి చెందిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో రియాక్ట్ అయిన మెగా ఫ్యామిలీ అవన్నీ ఫేక్ అని తెలిపింది. మరీ ఈరోజు బేబీ ఫోటో రివీల్ చేస్తారేమోనని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) - 
      
                   
                               
                   
            మెగా ప్రిన్సెస్ రాక.. నిహారిక రియాక్షన్ చూశారా?
రామ్‌చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. గత సంవత్సరం చివర్లో శుభవార్త అందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని నిహారిక కొణిదెల మొదటిసారి ఇలా స్పందించింది. (ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) 'ఈ సంతోషం కోసం మా కుటుంబం మొత్తం ఎంతగానో నిరీక్షించింది. పాప పుట్టిన శుభవార్తతో మా ఆనందానికి అవధులు లేవు. ఆ సమయంలో పాపను చూడడానికి ఎక్కువసేపు వేచి ఉండలేకపోయాను. మా అందరి ఆనందాన్ని పాప రెట్టింపు చేసింది. దీంతో మా అన్నయ్య కుటుంబం సంపూర్ణంగా అనిపిస్తుంది. నాకు గుర్తున్నంత వరకు చరణ్ అన్న మా కజిన్స్ గ్రూప్‌కి పేరెంట్. అతను ఎప్పుడూ మా అందరికి రక్షణగా ఉంటాడు, అందుకే నేను అతనిని 'బాపూజీ' అని పిలుస్తాను. ఉపాసన వదిన ఒక శక్తివంతమైన మహిళ కాబట్టి వారిద్దరి సంరక్షణలో పాప మంచి ఉన్నతస్ధాయికి చేరుకుంటుంది.' అని నిహారిక తెలిపింది. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) - 
      
                   
                               
                   
            మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. చిరంజీవికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?) మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబానికి బాగా కలిసి వస్తుందని పలు జ్యోతిష్యులు చెప్పారని చిరు తెలిపారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని ఇండస్ట్రీలోని తన స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు వారందరికీ ఒక మెగాపార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం. మరో వైపు మెగా ప్రిన్సెస్‌కు ఎలాంటి పేరు సెలక్ట్ చేస్తారని సోషల్‌మీడియాలో ఆరాతీస్తున్నారు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుళ్ళకు చెరో ఇద్దరు అమ్మాయిలు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్‌కు కూడా కుమార్తె జన్మించింది. ప్రస్తుతం చిరుకి ఐదుగురు మనవరాళ్లు అయ్యారు. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) - 
      
                   
                               
                   
            చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ప్రపంచమంతటా అభిమానులను సంపాదించుకున్నాడు. నాటునాటుకు ఆస్కార్ రావడంతో సినిమా యూనిట్‌కు మరింత గుర్తింపు లభించింది. అయితే ఈ పేరు, ప్రతిష్టలు రావడానికి కారణం ఉపాసన కడుపులో పెరుగుతున్న బిడ్డేనని మురిసిపోయాడు. ఆ బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ముద్దాడే సమయం కోసం వేయి కళ్లతో ఎదురుచూశాడు. ఒక్క చరణ్ మాత్రమేనా? మెగా ఫ్యామిలీ అంతా పుట్టబోయే బిడ్డకోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. సెంటిమెంట్ రోజే పాప జననం చివరకు వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ మెగా కుటుంబం సెంటిమెంట్ రోజైన మంగళవారం నాడే (జూన్ 20న) ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. స్వయంగా మహాలక్ష్మి దేవియే మా కుటుంబంలోకి వచ్చిందని కుటుంబమంతా సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో అసలు ఉపాసన ఏం చదివింది? తనకు ఎంత ఆస్తి ఉంది? అన్న వివరాలు ఆరా తీస్తున్నారు. కావున.. ఉపాసన ఆస్తి వివరాలు ఓసారి చూసేద్దాం.. 100 బిలియనీర్స్‌లో ఉపాసన తాతయ్య రామ్‌చరణ్-ఉపాసనల ఆస్తి విలువ రూ.2500 కోట్లు. ఇందులో ఒక్క ఉపాసన ఆస్తే రూ.1130 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన బడా వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన మహిళ. ఉపాసన బిజినెస్ టైకూన్ సి.ప్రతాప్ రెడ్డి మనవరాలు. ఆయన అపోలో హాస్పిటల్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ రూ.21,000 కోట్లు. భారత్‌లోని టాప్ 100 బిలియనీర్స్‌లో ఆయన ఒకరు. ప్రస్తుత అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ.70,000 కోట్లుగా ఉంది. అపోలో హాస్పిటల్స్‌కు ఉపాసన వైస్ ప్రెసిడెంట్‌గా, ఆమె తల్లి శోభన ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. తాతయ్య ప్రతాప్ రెడ్డి దంపతులతో ఉపాసన జంట పట్టా చేతికి రాగానే.. ఉపాసన చదువు విషయానికి వస్తే.. ఆమె ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పట్టా చేతికి రాగానే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అపోలో ఆస్పత్రిలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తోంది. కుటుంబ ఆరోగ్య బీమాకు సంబంధించిన టీపీఏ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గానూ ఉంది. ఉపాసన తండ్రి కెఈఐ అనే కంపెనీని స్థాపించాడు. వ్యాపారంలోనే కాదు సేవలోనూ ముందంజలో ఇకపోతే ఉపాసనకు ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశగా ఉండేది. ఏమైందో ఏమో కానీ తన నిర్ణయం మార్చుకుని ఫ్యామిలీ బిజినెస్ చూసేందుకే మొగ్గు చూపింది. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జనరల్ మేనేజర్‌గా చేరి ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. వ్యాపారాన్ని సమర్థవంతంగా చూసుకునే ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటుంది. చదవండి: వేరొక మహిళతో ఎఫైర్? డబ్బులిచ్చి మరీ కమెడియన్ కాళ్లు విరగ్గొట్టించిన భార్య! రామ్‌చరణ్.. బాల్యంలో నా చేతులతో నిన్ను హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి: మంత్రి రోజా 


