
రామ్ చరణ్, ఉపాసన ముద్దల కూతురు క్లీంకార ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటికీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆమె ముఖం కనిపించకుండా తీసిన ఫొటోల్ని ఇన్‌స్టాలో ఉపాసన పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైన పండుగ లేదా ఇంట్లో శుభకార్యం ఉంటే ఆ విశేషాలతో పాటు తమ కూతురి ఫోటోలను అభిమానులతో ఉపాసన షేర్ చేస్తారు. ఈసారి క్లీంకార తీసుకునే ఆహారం గురించి ఉపాసన చెప్పారు. రోజూ తన డైట్‌లో ఒక పదార్థం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.
క్లీంకార రోజూ తీసుకునే డైట్‌లో 'రాగులు' తప్పకుండా ఉంటాయని ఉపాసన ఇలా చెప్పారు.' రాగులతో తయారు అయిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నప్పట్నుంచి నాకు చాలా ఇష్టమైన ఆహారం కూడా ఇదే. దీంతో క్లీంకారకు కూడా దీనినే అలవాటు చేశాను. సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా నాతో ఒకసారి మాట్లాడుతూ.. క్లీంకారకు రోజూ రాగుల్ని ఏదో రూపంలో అందించమని సూచించారు. ఆయన కూతరు రాధే జగ్గీ కూడా ఇదే మాట చెప్పింది. తను కూడా చిన్నప్పట్నుంచీ రాగి జావ తాగేదానినని పేర్కొంది. అందికే వారిద్దరూ ఫిట్‌గా ఉన్నారు.
భవిష్యత్‌లో నా కూతురు కూడా హెల్దీగా ఉండాలని తన రోజువారి డైట్‌లో రాగుల్ని చేర్చాను' అంటూ ఆమె చెప్పారు. అయితే, వైద్యుల సలహాలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మోతాదుకు మించకుండా ఉపయోగించాలని లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయిని తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకున్నాకే రాగుల్ని అలవాటు చేయడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు.