సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' వచ్చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి పండుగ పరీక్షలో డిస్టింక్షన్ కొట్టేశారు. కామెడీతో పాటు భారీ యాక్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. నిర్మాతలను కమర్షియల్‌గా కూడా గట్టెక్కించే సినిమా అని చెప్పాలి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రీమియర్స్‌లో దుమ్మురేపింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే, ఒక విషయంలో మాత్రం చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
'మన శంకర వర ప్రసాద్ గారి' గురించి ఎక్కడ చూసిన సానుకూల స్పందన కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించినప్పటికీ, సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మూవీలో ఈ పాటను చాలాసార్లు ఉపయోగించారు. ప్రధానంగా చిరంజీవి, నయనతార కనిపించిన ప్రధాన సీన్స్‌లలో ఈ సాంగ్ ఉంటుంది.
ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను సినిమాలో చేర్చారా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతలను క్లియర్ చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపీరైట్ విషయాలపై ఇళయరాజా దృఢమైన వైఖరిని తీసుకుంటారని తెలిసిందే. ఇప్పటికే తమిళ హీరోల సినిమాలపై కూడా ఆయన కేసులు వేశారు. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ వియషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ పాట కారణం వల్ల థియేటర్ల ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో చిరు అభిమానులు స్పష్టతను కోరుకుంటున్నారు. నిర్మాతల నుండి ఏదైనా ఒక ప్రకటన వస్తే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది.


