విజ‌య్, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతంటే..? | Vijay Deverakonda and Rashmika Mandanna wedding budget | Sakshi
Sakshi News home page

విజ‌య్, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతంటే..?

Mar 5 2026 6:26 PM | Updated on Mar 5 2026 6:49 PM

Vijay Deverakonda and Rashmika Mandanna wedding budget

టాలీవుడ్‌ కొత్తజంట విజ‌య్ దేవ‌ర‌కొండ-ర‌ష్మికల పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారనేది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన ఈ  జంట దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినప్పటికీ ఖర్చు భారీగానే అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జరిగిన వీరి వివాహం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగింది.

ఉదయ్‌పూర్‌లోనే అత్యధికంగా వారిద్దరూ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విజయ్‌ సొంతూరులో సత్యనారాయణ వ్రతంతో పాటు గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు ఏర్పాట్లు.. సంగీత్‌ కార్యక్రమం, అభిమానులకు విందు, దేశవ్యాప్తంగా స్వీట్స్‌ పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం, చివరిగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో భారీగానే ఖర్చు అయినట్లు టాక్‌.

విజయ్‌, రష్మికల పెళ్లి కోసం సుమారు రూ. 15 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే ప్రముఖ  ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారికి పెళ్లి బాధ్యతను అప్పజెప్పారట. అయితే ఏ కార్యక్రమం ఎలా జరగాలనేది విజయ్‌ పక్కా ప్లాన్‌తో వారికి వివరించారట. అయితే, ఈ ఖర్చును కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి భరించారని తెలుస్తోంది. పెళ్లి కోసం సుమారు 3కేజీల బంగారం వారు కొనుగోలు చేసినట్లు టాక్‌ ఉంది. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారం చేయనుంది. అందుకోసం వీరిద్దరికి ఆ ఓటీటీ సంస్థ సుమారు రూ. 60కోట్లు చెల్లించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రకంగా వారికి రూ. 45కోట్ల వరకు లాభం వచ్చినట్లు అవుతుంది. పెళ్లితో ఎవరికైనా ఖర్చు అవుతుంది. కానీ, ఈ జోడీ మాత్రం తమ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను పెంచుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement