బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్‌లెట్‌ని ముంబైలోని ఈరోస్, చర్చ్‌గేట్‌లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్‌తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్‌స్టాలో ప్రకటించింది.మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.
ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU
— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026

రామేశ్వరం కేఫ్
రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్‌ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్‌కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు.


